మిర్చిమసాలా

విదేశాంగ విధానం మారాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన భారతీయులు దిక్కుమాలిన వారివలే పొట్టచేతపట్టుకుని గల్ఫ్, తదితర దేశాలకు వెళ్ళి అక్కడున్న కఠినమైన చట్టాలు, పరిస్థితులు కారణంగా అనేక విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఆర్థికంగా, మానసికంగా శారీరకంగా దిగజారుతున్నారు. ఇందులో అత్యధికులు బి.సి, ఎస్.సి, ఎస్.టి.లు మరియు స్ర్తిలే. ఈ పరిస్థితులు ఇలా ఉంటే, భారత్, నేపాల్ దేశాల మధ్య ఉన్న సులభమైన విదేశాంగ విధానంతో నేపాల్ దేశీయులు మన దేశంలో వివిధ రాష్ట్రాలలో సులభంగా ప్రవేశించి, హోటల్, సెక్యూరిటీ, తదితర సులభమైన వృత్తులలో ప్రవేశిస్తూ మన యువతకు, ప్రజలకు సవాల్ విసురుతున్నారు. మనవారు చేష్టలుడిగి చూస్తున్నారు. ఇంతేకాదు భారత, నేపాల్ సరిహద్దులు, విదేశాంగ విధానం- సంఘ వ్యతిరేక శక్తులకు, ఉగ్రవాదులకు రాచమార్గంగా మారినట్లు ప్రజలు భావిస్తున్నారు. ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణం భారత్, నేపాల్ దేశాల మధ్య ఉన్న విదేశాంగ విధానాన్ని మార్చి ఇరు దేశాల పౌరులు రాకపోకలకు కఠినమైన విధానాన్ని ప్రవేశపెట్టాలి. నేపాల్ పౌరులను, ఇతర దేశాల నుంచి వచ్చిన వారిని బలవంతంగా వెనక్కు పంపాలి. భారతీయుల ఉపాధి, తదితర హక్కులను కాపాడాలి.
- కొసనా మధుసూదనరావు, రోళ్ళపాలెం
వేడి వాడి
1) వేడి, వాడి బంచి వేదన జేకూర్చ
లాభమేమి సూర్య లోభమేల?
నీడ బంచు చెట్లు- నిలలోన నుంచక
కొట్టి వేయచేటు కోరుకొనుటి!
2) నీరు తక్కువాయె! నీ శక్తి బెంచకు
భానుడన్న మాకు- కాలుష్యమే బెంచ
వర్షధార లెట్లు వసుధ కందు?
3) చల్లదనము తరిగె! జగమందు యేలనో?
అడవులందు చెట్లు అంతరించె!
స్వార్థ చింత బెరుగ సామాన్యుడేవౌను?
4) నదుల ఇసుకదరిగె!నాగరికంబన
నీటి నిలువలెట్లు నిలువగలవు?
కలిమి బలిమి వోలె కాలుష్యమే బెరుగ
లోక తీరు వారి శోక మొసగు!
- కె.ఈశ్వరప్ప, ఆలూరు
కోట్ల రూపాయల ఖర్చు వృథా
ఐ.ఎఫ్.ఆర్. సందర్భంగా విశాఖ నగరంలో ఫుట్‌పాత్‌లను ఖాళీ చేయించి ఆధునీకరించారు. కోట్లు ఖర్చుపెట్టి రోడ్లు బాగుచేసి, లక్షలాది మొక్కలను నాటారు. అతి ప్రతిష్టాత్మకంగా విశాఖ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దినందుకు నగర పాలక సంస్థకు అవార్డు కూడా లభించింది. అయితే బ్యాక్‌టు స్క్వేర్ వన్ అన్న ఆంగ్ల సామెత చందంగా పరిస్థితి మళ్ళీ మొదటికొచ్చింది. కేబుల్స్, నీటిపైపుల రిపేరు అంటూ రోడ్ల తవ్వకం ప్రారంభించారు. ఫుట్‌పాత్‌లపై చిరు వ్యాపారుల తమ దందా ప్రారంభించారు. మొక్కలకు నీళ్లు పోయడం మానేయడం వలన ఎండిపోవడం ప్రారంభించాయి. చెత్త ఎక్కడబడితే అక్కడే పడేస్తున్నారు. కోట్లు ఖర్చుపెట్టి చేసిన ఆధునీకరణ శాశ్వతంగా నిలవాలంటే వాటిని కాపాడుకునేందుకు ప్రణాళికా బద్ధంగా కార్యక్రమాలు చేపట్టాలి. లేకపోతే ఖర్చుపెట్టిన కోట్లు గంగపాలైనట్లే! కానీ ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే దీన్ని ఎవరూ పట్టించుకుంటున్నట్టు కనిపించడం లేదు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఎంత ఆశ్చర్యం!
అంతర్జాతీయ అవినీతి ఎంతగా వ్రేళ్ళూనికొనిపోయి అనేకమంది ప్రముఖులు తెల్లముసుగులో నల్లధనాన్ని మూటకట్టుకున్నారో పనామా పత్రాలు వెల్లడించి మానవాళినే ఆశ్చర్యచకితులను చేసాయి. అనేక మొదటి తరగతి సుఖాలు, సదుపాయాలు అనుభవిస్తున్న రాజకీయ నాయకులు, బంగారు జీవితాలను అతి గౌరవ ప్రదంగా గడుపుతున్న వెండితెర నటులు కూడా ఈ అవినీతి భాగోతంలో భాగం కావడం విచిత్రం. ఈ కూడబెట్టిన నల్లధనం ప్రజల సంక్షేమానికి సంక్షోభం కలిగిస్తుందని తెలియని అమాయకులు కాదెవరు. అధర్మం పెచ్చుపెరిగిపోతున్నది. రానున్న కాలమెటులుండునో ఊహిస్తే భయమేస్తున్నది. ఈ చాటుమాటు దోపిడీలు ముందు ముందు బహిరంగంగా జరిగితే ఇక బ్రతుకు అసాధ్యమే.
- ఎన్.రామలక్ష్మి, సికిందరాబాద్