సంపాదకీయం

సమర పటిమకు సముద్ర సాక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సముద్ర ప్రాంత ప్రశాంతి లక్ష్యంగా నౌకాదళ వైమానిక విభాగం జరిపిన సమర విన్యాసాలకు చైనా కొనసాగిస్తున్న వ్యూహంలో దురాక్రమణ ప్రధాన కారణం..శనివారం, ఆదివారం విశాఖపట్టణం సముద్ర తీరంలో ప్రస్ఫుటించిన మన సమర పటిమ లక్ష్యం యుద్ధాలను నిరోధించడం, దురాక్రమణ భావాన్ని నివారించడం. మనదేశపు జాతీయ జీవనంతో నిహితమై ఉన్న సనాతన లక్ష్యాన్ని విశాఖతీరంలో జరిగిన అంతర్జాతీయ నౌకాదళ విన్యాసాల సమీక్ష-ఐఎఫ్‌ఆర్- రాష్టప్రతి ప్రణవ్ ముఖర్జీ మరోసారి ఆవిష్కరించారు. ప్రధానమంత్రి మోదీ పునరుద్ఘాటించారు. మన సమర పటిమ లక్ష్యం ప్రపంచశాంతి. శాంతికి విఘాతం కలిగిస్తున్న చైనావారి వ్యూహాత్మక సైనిక విస్తరణ మనదేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల జలాలను కల్లోలితం చేస్తుండడం నడుస్తున్న చరిత్ర. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ నుండి బర్మా శ్రీలంక మాల్దీవుల మీదుగా పాకిస్తాన్‌లోని గ్వాడార్ వరకు చైనా యుద్ధనౌకల సంచారం పెరిగిపోవడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టిస్తున్న విపరిణామం. చైనావారి ఈ వ్యూహాత్మక విస్తరణను ప్రతిఘటించగల ప్రశాంత నౌకాదళ పటిమ మనకున్నదన్న వాస్తవం విశాఖ తీరంలో జరిగిన విన్యాసాల వల్ల ధ్రువపడింది. తులనాత్మకంగా నౌకాబలంలో కాని, వైమానిక, స్థల బలాలలో కాని మనదేశం వెనుకబడి ఉందన్నది బహిరంగ రహస్యం. పరిమాణం ప్రాతిపదికన చైనా త్రివిధ దళాల బలం మనకంటె చాలా ఎక్కువగా ఉంది. మన రక్షణ వ్యయం కంటె చైనావారి బహిరంగ అధికారిక రక్షణ వ్యయం దాదాపు మూడున్న రెట్లు అధికం కావడం ఇందుకు కారణం కావచ్చు. అనధికారికంగాను, రహస్యంగాను చైనా మరింత ఎక్కువగా సైనిక వ్యయం చేస్తోందన్నది పాశ్చా త్య దేశాల వారి ప్రచారం..కానీ ఎలాంటి సముద్ర ప్రాంత దురాక్రమణనైనా ప్రతిఘటించి తీరగల నౌకాబలం, సమరపటిమ మనకున్నాయన్న వాస్తవానికి విశాఖ విన్యాసాలు మరో సాక్ష్యం...హిందూ మహాసముద్ర జలాలు నలబయికి పైగా దేశాల తీరాలను స్పృజిస్తున్నాయి. మనదేశానికి పశ్చిమాసియా దేశాలకు మధ్య నెలకొని ఉన్న పడమటి సముద్రం ఓడ దొంగలకు, జిహాదీ ఉగ్రవాదులకు నిలయంగా మారి ఉండడం, ప్రధాని నరేంద్ర మోదీ గుర్తు చేసినట్టు, భద్రతను భంగపరుస్తున్న మరో వైపరీత్యం. ఆఫ్రికాలోని సోమాలియా తీరంలో స్థావరాలను ఏర్పాటు చేసుకున్న ఓడ దొంగలలో, జిహాదీ ఉగ్రవాదులు జట్టు కట్టడం పాకిస్తాన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన అనుసంధాన వ్యవస్థలో భాగం. ‘‘సముద్ర సంభవ భీభత్సకాండకు భారత్ ప్రత్యక్షంగా బలి అవుతోందన్న’’ నరేంద్ర మోదీ ప్రసంగంలో ఈ పాకిస్తానీ పన్నాగం ధ్వనించింది. ఇండొనేసియా, మలేసియాల మధ్య నెలకొని ఉన్న ఇరుకైన మలక్కా జలసంధి గుండా మన అండమాన్ ద్వీపాలకు దిగువన ఉన్న మహాస్రవంతి-గ్రేట్ చానల్-లోకి నిరంతరం చైనా యుద్ధ నౌకలు ప్రవేశిస్తున్నాయి. ఎందుకంటె ఇది అంతర్జాతీయ జలమార్గమై ఉంది.
మన లక్షద్వీపాలకు, మాల్దీవుల దేశానికి మధ్య హిందూ మహాసముద్రం గుండా మరో అంతర్జాతీయ జలమార్గం నెలకొని ఉంది. అందువల్ల మలక్కాను దాటి అండమాన్ సముద్రంలో ప్రవేశిస్తున్న వివధ దేశాల వాణిజ్య నౌకలు, యుద్ధ నౌకలు దక్షిణంగా పయనించి శ్రీలంకను చుట్టుకొని ఉత్తరంగా తిరిగి లక్షద్వీపాల సమీపంలో పయనిస్తున్నాయి. ఓడ దొంగలను అదుపు చేసే సాకుతో చైనా యుద్ధ నౌకలు శ్రీలంకలోని ఓడ రేవులలో తిష్ఠవేస్తున్నాయి. ఓడ దొంగలను అదుపు చేయడానికి యుద్ధ నౌకలు, పెద్ద నౌకలు అవసరం లేదు. గస్తీ నౌకలు, చిన్న ఓడలు చాలు. కానీ చైనావారి సర్వ సమగ్ర యుద్ధ నౌకలు సింహళ ద్వీపంలోని కొలంబో రేవులో నెలల తరబడి ఎందుకు తిష్ఠవేస్తున్నాయన్నది బహిరంగ రహస్యం. మాల్దీవులలో సైతం చైనా నౌకాదళ స్థావరాల ఏర్పాటుకు రంగం సిద్ధం కావడం విశాఖ విన్యాసాలకు మరో నేపథ్యం. చైనా నౌకాదళం బర్మాలోని రంగూన్ నుండి సింహళం మీదుగా లక్షద్వీపాలను ఇలా చుట్టింది. పాకిస్తాన్‌లోని గ్వాడార్ వరకూ సముద్రపు షికార్లు చేస్తోంది. ఇదంతా చాలదన్నట్టు మనదేశానికి సింహళ ద్వీపానికి మధ్యలో ఉన్న రామసేతువును తవ్విపారేసి అక్కడ మరో అంతర్జాతీయ సముద్ర మార్గాన్ని నిర్మించాలన్న మతిలేని విధానాన్ని మన ప్రభుత్వం గతంలో రూపొందించింది. నరేంద్ర మోదీ ప్రధానమంత్రి అయిన తరువాత ఈ మతిమాలిన విధానం రద్దయిన సూచనలు కనిపిస్తున్నాయి. విజ్ఞత, విచక్షణ వికసిస్తున్నాయన్న దానికి విశాఖ విన్యాసాలు సముద్రమంత సాక్ష్యం. చైనా నౌకలు మాత్రమే కాదు, మైత్రిని అభినయిస్తున్న అమెరికా సైతం తన ఆయుధ నౌకలను తమిళనాడు తీరానికి పంపడం ఇటీవలి విపరిణామం. అలా ఒక నౌక రెండేళ్ల క్రితం పట్టుబడింది కూడ.
ఈ చొరబాట్ల వల్ల మన నౌకాదళం అప్రమత్తం అవుతోందనడానికి విశాఖ విన్యాసాలు సాక్ష్యం. చైనావారి వ్యూహాత్మక విస్తరణకు ప్రతిఘటనను మనం ప్రభుత్వం ప్రారంభించింది. జనవరి చివరిలో మన విమానవాహక యుద్ధ నౌక విక్రమాదిత్య మరో యుద్ధనౌక మైసూరు కొలంబో ఓడరేవును సందర్శించాయి. ఈ రెండు నౌకలు కొలంబోలో కొన్ని రోజులు ఉండిన తరువాత అంతర్జాతీయ నౌకాదళ సమీక్షలో పాల్గొనేందుకై విశాఖకు వచ్చేశాయి. మన నౌకలు కొలంబోను చేరడానికి ముందు రోజు మూడు చైనా యుద్ధ నౌకలు అక్కడినుండి వెళ్లిపోయాయి. కొన్ని ఏళ్లుగా చైనా వైపునకు జరుగుతుండిన శ్రీలంకను మళ్లీ మనవైపునకు తిప్పడానికి మన ప్రభుత్వం కృషి చేస్తోంది. విక్రమాదిత్య, మైసూరు నౌకల కొలంబో సందర్శన ఈ కృషిలో భాగం కావచ్చు. అండమాన్, నికోబార్ సముద్ర జలాలలో చైనా చొరబాటుకు ప్రతిఘటన ప్రారంభం కావడం విశాఖ విన్యాసాలకు మరో నేపథ్యం. మహాస్రవంతీ సమీపంలోని మన దూరలక్ష్య వీక్షక గస్తీ విమానాలను మన ప్రభుత్వం నెలకొల్పింది. ఇతర దేశాల యుద్ధ నౌకల కలాపాలపై నిఘాను పెంచగల స్వయంచోదక గగన శకటాలను సైతం ఈ ప్రాంతంలో మన ప్రభుత్వం నెలకొల్పింది. బంగ్లాదేశ్‌లో ఒక ఓడరేవును నిర్మించడానికై చైనా గతంలో ఒప్పందం కుదుర్చుకొంది. కానీ బంగ్లాదేశ్ ఇటీవల ఈ ఒప్పందాన్ని రద్దు చేసిందట. చైనావారి భారత వ్యతిరేక వ్యూహం తాత్కాలికంగానైనా బెడిసికొట్టడం విశాఖ విన్యాసాలకు సమాంతరంగా సంభవించిన పరిణామం.
అమెరికా, బ్రిటన్, రష్యా, జపాన్ దేశాల నౌకలతో సహా వివిధ విదేశాలకు చెందిన ఇరవై నాలుగు నౌకలు, గస్తీ పడవలు విశాఖ విన్యాసాలలో పాల్గొనడం అంతర్జాతీయంగా మన సమర పటిమకు లభించిన పరిగణనకు మరో సంకేతం. చైనా నౌకలు కూడ ఈ సముద్ర సమర విన్యాసంలో పాల్గొనడం వేరే సంగతి. ఒకమహాకవి అన్నట్టు ‘‘పడిదోచు విరోధిని పట్టి కౌగిటన్ గుచ్చిన జాతిరా ఇది..’’ జల సముద్రం జన సముద్రంలో సంగమించిన వేళ..!