సంపాదకీయం

బలపడుతున్న ‘ఆగ్నేయ’ మైత్రి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తాత్కాలిక ఉద్రిక్తతల మధ్య నిహితమై ఉన్న చారిత్రక స్నేహ బంధాలకు మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మలేసియాలో జరిపిన పర్యటన మరో ప్రతీక! మలేసియా రాజధాని కౌలాలంపూర్‌లో శనివారం జరిగిన ‘్భరత-ఆగ్నేయాసియా దేశాల కూటమి’ శిఖరాగ్ర సమావేశానికి దక్షిణ చైనా సముద్ర జలాలు కల్లోల గ్రస్తం అవుతుండడం నేపథ్యం. ఆదివారం మలేసియా రాజధానిలో పాల్గొన్న మైత్రీ సభలకు ఆ దేశంలో అప్పుడప్పుడు నిక్కి చూస్తున్న భారత వ్యతిరేకత నేపథ్యం! వియత్నాంకు తూర్పుగాను చైనాకు దక్షిణంగాను వున్న సముద్ర ప్రాంతాలలో చైనా వారి దురాక్రమణ ఆగ్నేయ ఆసియా కూటమి దేశాల-ఆసియాన్‌ను అలజడికి గురి చేస్తోంది. మలేసియాలోని అల్ప సంఖ్యాక హిందువులను అణచివేయడానికి క్రీస్తుశకం 2008, 2009 సంవత్సరాలలో జరిగిన దమనకాండ ఇప్పటికీ నిక్కి చూస్తున్న చారిత్రక అపశ్రుతి. ఈ దమనకాండ భారత, మలేసియా ద్వైపాక్షిక మైత్రీ సంబంధాలను ఇప్పటికీ నిలదీస్తున్న విపరిణామం. ఎందుకంటే వివక్షకు గురి అవుతున్న అల్ప సంఖ్యాక హిందువులు భారతీయ సంతతివారు-హిందూ హక్కుల పరిరక్షణ సంఘం-హిండ్రాఫ్-2008లో ఫ్రభుత్వ నిషేధానికి గురి కావడం అణచివేతకు పరాకాష్ఠ. ఆ తరువాత పరిస్థితిలో పరివర్తన వచ్చినప్పటికీ భారతీయసంతతి ప్రజలలో అభద్రతా భావం పూర్తిగా తొలగకపోవడం నరేంద్ర మోదీ పర్యటనకు చారిత్రక నేపథ్యం...ఆగ్నేయ ఆసియా దేశాల కూటమి- అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఆసియన్ నేషన్స్- ఆసియాన్‌తో అనేక ద్వీప సమూహాల విషయమై చైనాకున్న వివాదాలు ఉద్ధృతమవుతుండడం భారత- ఆసియాన్ ప్రభుత్వ అధినేతల సమావేశంలో ప్రస్తావనకు వచ్చింది! ఆసియాన్ దేశాలతో మన వాణిజ్య, దౌత్య వ్యూహాత్మక సంబంధాలు బలపడకుండా చైనా ప్రభుత్వం ప్రయత్నిస్తుండడం కూడా జగమెరిగిన సత్యం! దక్షిణ చైనా సముద్రంలో మన చమురు, ఇంధన వాయువు అనే్వషణ కార్యక్రమాన్ని చైనా నిరోధిస్తోంది. వియత్నాంతో కలిసి మన ప్రభుత్వం ఆర్థిక సముద్ర జల మండలం -ఎక్స్‌క్లూజివ్ ఎకనమిక్ జోన్-లో చమురును అనే్వషించరాదన్నది చైనా కొనసాగిస్తున్న వివాదం!దక్షిణ చైనా సముద్రం వియత్నాంకు తూర్పుగా ఫిలిప్పీన్స్ వరకు వ్యాపించి ఉంది! ఈ సముద్ర ప్రాంతంలోని అంతర్జాతీయ జల మార్గాలను ఉపయోగించుకొనడంలో చైనాకు అమెరికాకు మధ్య కూడ వివాదం ఉద్ధృతమవుతోంది. కౌలాలంపూర్‌లో నవంబర్ ఐదవ తేదీన జరిగిన ఆసియాన్ రక్షణ మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చాయి. పది ఆసియాన్ దేశాల రక్షణ మంత్రులతోపాటు అమెరికా, చైనా,ఆస్ట్రేలియా, జపాన్ దేశాల రక్షణ మంత్రులు సైతం పాల్గొన్న ఆ సమావేశంలో చైనా విస్తరణ వాదం పట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ కూడా ఆ సమావేశంలో పాల్గొన్నాడు! చైనాకు తూర్పుగా వున్న సముద్ర జలాలలోని అంతర్జాతీయ మార్గాలను ఉపయోగించుకొనడం అమెరికాతోను, కొరియా, జపాన్ తదితర ప్రాంతీయ దేశాలతోను చైనాకు కొనసాగుతున్న వివాదాల చిటపటలు కూడ వియత్నాం తూర్పు తీర జలాలలో ఫ్రతిధ్వనిస్తుండడం కూడా వర్తమాన వైపరీత్యం. దక్షిణ చైనా సముద్ర ప్రాంత వివాద పరిష్కారానికై వివిధ దేశాలమధ్య ఏకాభిప్రాయాన్ని సాధించడానికై కృషి జరగాలని కౌలాలంపూర్‌లో నరేంద్రమోదీ శనినారం ఇచ్చిన పిలుపునకు ఇదంతా పూర్వరంగం.
గత ఏడాది నవంబర్‌లో బర్మా-మ్యాన్‌మార్-లో జరిగిన ఆసియాన్-్భరత ప్రభుత్వాధినేతల సమావేశం తరువాత శనివారంనాడు మలేసియాలో జరిగిన సమావేశం వరకూ సాధించిన ప్రగతి ఏమిటన్నది ప్రధానం కాదు. ఆసియాన్ దేశాలతో మన భావ వినిమయం మళ్లీ పుంజుకొనడం ప్రధాన అంశం! నరేంద్ర మోదీ ప్రభుత్వం వారి యాక్ట్ ఈస్ట్-పూర్వ దిశగా కార్యాచరణ-విధానం సాధిస్తున్న ఈ భావ వినిమయం దీర్ఘకాల ప్రభావం చూపనున్నది. దశాబ్దులపాటు బర్మాకు మనకు మధ్య కొనసాగిన ‘అంటీముట్టని’ సంబంధాలో గత ఏడాది ఆ దేశంలో నరేంద్రమోదీ పర్యటన తరువాత మళ్లీ మైత్రి చిగురిస్తోంది. అలాగే ఇప్పుడు ఆసియాన్-్భరత్ సభ సందర్భంగా మలేసియాకు వెళ్లిన మోదీ ఆదివారం పాల్గొన్న కార్యక్రమాలు ద్వైపాక్షికమైనవి! భారత్ మలేసియాల మధ్య మళ్లీ నేతాజీ సుభాస్ చంద్రబోస్ జరిపిన స్వాతంత్య్ర సమరం నాటి స్ఫూర్తి వికసించడానికి ఈ ద్వైపాక్షిక భావ వినిమయం దోహదం చేస్తుంది. యాబయివేల మంది భారతీయ సంతతి ప్రజలు ప్రవాస భారతీయులు మోదీ ఆదివారం ప్రసంగించిన సభకు హాజరు కావడం ఇందుకు సంకేతం! భారతీయ సంతతికి చెందిన మలేసియా పౌరులకు మన దేశంలో పర్యటించడానికి వీలుగా శాశ్వత ప్రాతిపదికపై వీసాలను ప్రదానం చేయాలని మన ప్రధాని నిర్ణయించడం, భారతీయ సంతతి విద్యార్థులు మన దేశంలో విద్యనభ్యసించడానికి వీలుగా నిధిని ఏర్పాటు చేయడం నరేంద్ర మోదీ ఆవిష్కరించిన నిర్ణయాలు! వివేకానంద స్వామి విగ్రహాన్ని ఆవిష్కరించడం ద్వారా మోదీ మలేసియాతో మన దేశానికి సాంస్కృతిక బంధం మరింత దృఢపడడానికి దోహదం చేశాడు! బ్రిటిష్ వ్యతిరేక సమరం జరిపిన సమయంలో నేతాజీ సుభాస్ బాబుకు మలేసియాలోని ప్రవాస భారతీయులు అండగా నిలబడడడం చారిత్రక వాస్తవం. కౌలాలంపూర్‌లో ఏర్పడనున్న సాంస్కృతిక కేంద్రానికి నేతాజీ పేరు పెట్టడం ఈ వాస్తవానికి అనుగుణం. పది దేశాల ఆసియాన్ కూటమి భౌగోళికంగా, చారిత్రకంగా, సాంస్కృతికంగా మన దేశంతో ముడివడి వుంది! అందువల్ల వాణిజ్యపరంగా భద్రతాపరంగా ఈ కూటమి దేశాలతో మన సంబంధాలు పెరగవలసిన అనివార్యం ఏర్పడి ఉంది! అలా పెరగకుండా చైనా ప్రభుత్వం ఇప్పటికీ పరోక్షంగా ప్రయత్నిస్తూనే ఉంది! ఆసియాన్ మరోమూడు దేశాల సమాఖ్యలోని మరో మూడు దేశాలు చైనా, కొరియా (దక్షిణ), జపాన్...కానీ ఈ సమాఖ్య ఆసియాన్, మరో నాలుగు దేశాల-ఆసియాన్ ప్లస్ ఫోర్-సమాఖ్యగా విస్తరించకుండా చైనా ఇప్పటికీ అడ్డుకుంటూనే ఉంది. నాలుగవ మరో దేశం మన దేశం! ఆసియాన్, భారత్ శిఖర సభ కూడా వాస్తవ రూపం ధరించకుండా కూటమి దేశాలపై అనేక ఏళ్లపాటు చైనా వత్తడి పెంచింది! అయితే తమ దేశాలకు చెందిన ద్వీపాల సముదాయాలను చైనా కాజేయడానికి ప్రయత్నిస్తున్నట్టు స్పష్టమైన తరువాత, ఆసియాన్ దేశాలు క్రమంగా మన దేశానికి సాన్నిహిత్యం అవుతున్నాయి. మన దేశం భద్రతకు మాత్రమే కాక, ఆసియాన్ దేశాల ప్రాదేశిక సమగ్రతకు కూడ చైనా వారి విస్తరణ ప్రమాదకరంగా మారడం ఆసియాన్-్భరత్ శిఖర సభలు వ్యవస్థీకృతం కావడానికి ప్రధాన ప్రేరకం.
మన దేశానికీ, పది దేశాల కూటమికీ మధ్య సాలీన ఐదు లక్షల కోట్ల రూపాయల కంటె తక్కువగా వాణిజ్య వినిమయం జరుగుతోంది. భారత చైనా వాణిజ్యం విలువకంటె చైనా ఆసియాన్ వాణిజ్యం విలువ కంటె ఇది చాలా తక్కువ! 2025 నాటికి భారత ఆసియాన్ వర్తకాన్ని పదమూడు లక్షల కోట్ల రూపాయల స్థాయికి విస్తరింపచేయాలన్న కౌలాలంపూర్ సభ నిర్ణయం అందువల్ల శుభ పరిణామం! కౌలాలంపూర్ సభలలో ప్రధాని మోదీ ఉగ్రవాదం ప్రమాదం గురించి, ఉమ్మడిగా దాన్ని ఎదుర్కోవాల్సిన ఆవశ్యకత గరించి పదే పదే ప్రస్తావించడం వర్తమాన అంతర్జాతీయ వాస్తవానికి అనుగుణమైన పరిణామం! ఉగ్రవాదాన్ని అరికట్టడంలో చైనా ప్రభుత్వం కూడ మనతో కలసి వస్తుందట! ఆసియాన్ భద్రత భారత్ భద్రతతోముడివడి వుందన్న వాస్తవం మోదీ కోరిన ఉగ్రవాద వ్యతిరేక సమష్టి సంఘర్షణకు ప్రాతిపదిక.