సంపాదకీయం

‘బహుళ’ దోపిడీకి బలం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థ’ వారు బొంబాయి హైకోర్టు వారి తీర్పును సర్వోన్నత న్యాయస్థానంలో సవాలు చేయడం విచిత్రమైన పరిణామం. ఇలా సవాలు చేయడంవల్ల స్విట్జర్లాండ్‌నకు చెందిన నెజల్-నెస్లే- సంస్థవారి వాణిజ్య ప్రయోజనాలకు ఎలాంటి హాని కలగదు! కలుగకుండా ‘భారత ఆహార భద్రతా సంస్థ’-ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ-వారు మిక్కిలి జాగ్రత్త వహించినట్టు ఈ ప్రభుత్వ సంస్థ వారే స్పష్టం చేస్తున్నారు. జూన్ నెల ఐదవ తేదీన ‘ప్రమాణాల సంస్థ’ వారు నెజల్ కంపెనీవారి ‘మ్యాగీ’ సేమ్యాలను దేశవ్యాప్తంగా నిషేధించారు! ఈ నిషేధం చెల్లదని బొంబాయి-హైకోర్టు ఆగస్టు 14వ తేదీన తీర్పు ఇచ్చింది! నవంబర్ తొమ్మిదవ తేదీ నుండి నెజల్ కంపెనీ వారు విష రసాయనాలు నిండిన రుచికరమైన సేమ్యాలను మళ్లీ దేశంలో భారీ ఎత్తున అమ్ముతున్నారు. తమ నిషేధపుటుత్తరువును ముంబయి సర్వోన్నత న్యాయస్థానం వారు చెల్లదని తీర్పు చెప్పిన వెంటనే ‘ప్రమాణాల సంస్థ’ వారు సుప్రీంకోర్టులో అప్పీలు చేయలేదు. హైకోర్టు తీర్పును రద్దు చేయించడానికి ప్రయత్నించలేదు! మ్యాగీ సేమ్యాలలో సీసపు-లెడ్-పరిమాణం అనుమతించిన పరిమాణంలో కంటె ఎక్కువ వుందని, మోనో సోడియం గ్లుటమేట్-ఎమ్‌ఎస్‌జి- అన్న రసాయనం కలిసి వుందని వెల్లడైన తరువాతనే ప్రమాణాల సంస్థ జూన్‌లో మ్యాగీ సేమ్యాలను నిషేధించింది. ప్రమాణాల సంస్థ వారి ప్రయోగశాలలలో పరీక్షలు జరిగిన తీరు వలనే నెజల్ వారి సేమ్యాలలో ఇలా విష రసాయనాలు వున్నట్టు ధ్రువపడింది! ఈ విష రసాయనాలు మన నాలుకలను ప్రభావితం చేసి సేమ్యాలు మహా రుచికరంగా వున్నాయన్న భ్రాం తిని కల్పించడం అనేక ఏళ్ల వైపరీత్యం. అందువల్ల మ్యాగీ సేమ్యాలలో విష రసాయనాలు వున్నట్టు ధ్రువపరిచిన భారత ప్రమాణాల సంస్థ వారు బొంబా యి ఉన్నత న్యాయస్థానం తీర్పును ఆగస్టులోనే సుప్రీంకోర్టులో సవాలు చేసి వుండడం, అలా చేసి వుండినట్టయితే సర్వోన్నత న్యాయస్థానం నిజానిజాలను నిగ్గుతేల్చడానికి వీలుండేది. కానీ మ్యాగీ సేమ్యాలు మళ్లీ మార్కెట్లలోకి యధావిదిగా ప్రత్యక్షమయ్యే వరకు ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ చోద్యం తిలకించి ఇప్పుడు నెజల్ సంస్థ యజమానులకు భంగం కలుగని రీతిలో తాపీగా సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. భారత ఆహార ప్రమాణాల, భద్రతా వ్యవహారాల సంస్థ వారు ఇలా దేశ ప్రజల ప్రయోజనాలకు వ్యతిరేకంగా వ్యవహరించడం ప్రపంచీకరణ మాయాజాలంలో భాగం.
స్విట్జర్లాండ్‌కు చెందిన నెజల్ సంస్థ వారి ఉత్పత్తులు మన దేశపు విపణి వీధులను మళ్లీ ముంచెత్తడానికి వీలుగా ఇంత తాపీగా వ్యవహరించిన కేంద్ర ప్రభుత్వ సంస్థవారు స్వదేశీయ సంస్థల ఉత్పత్తులు మాత్రం మార్కెట్‌లోకి రాకుండా నిరోధించడానికి అమిత వేగంగా చర్యను తీసుకుంటున్నారు. పతంజలి ఆయుర్వేద సంస్థవారి అట్టా-పిండి-సేమ్యాల అమ్మకాలను అడ్డుకొనడానికి ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు ప్రయత్నించడం ఇందుకు ఒక ఉదాహరణ! తమ అట్టా సేమ్యాలను విపణి వీధులలో విక్రయించడానికి వీలుగా చట్టం ప్రకారం అన్ని నిబంధనలు పాటించినట్టు పతంజలి సంస్థవారు ప్రకటించారు. కానీ ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు మాత్రం పతంజలి సేమ్యాలను విక్రయించకుండా నిరోధించడానికి చర్యలు ప్రారంభభించారట! ప్రమాణాల సంస్థ ప్రధాన అధికారి అశీస్ బహుగుణ స్వయంగా చెప్పుకొచ్చారు. ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు ఆహార పారిశ్రామిక ఉత్పత్తులను ఆమోదించడానికి అవలంబించిన నియమావళిని సర్వోన్నత న్యాయస్థానం గత ఆగస్టులో రద్దు చేసిందట! అందువల్ల ఈ కేంద్ర ప్రభుత్వ సంస్థవారు కొత్త నిబంధనావళిని రూపొందించుకోవాలట! మూడు నెలలు గడిచినప్పటికీ కొత్త నిబబంధనావళి రూపొందలేదు. అందువల్ల కొత్త నిబంధనావళి రూపొందే వరకు కొత్తగా తయారయ్యే ఆహార పదార్ధాల ప్రమాణాల నిర్ధారణ జరగదట! నిర్ధారణ జరిగే వరకు పతంజలి వంటి సంస్థల సేమ్యాలను అమ్మడానికి వీలులేదన్నది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారి విచిత్రమైన నిర్ధారణ! ఈ వినూత్న నియమావళిని రూపొందించడంలో జాప్యం చేస్తున్నారు. నియమావళి పూర్తి అయ్యేంతవరకు పతంజలి వారికి కాని మరే సంస్థకు కాని అనుమతి ఇవ్వరాదట! అంటే కొత్త నియమావళి ఏర్పాటు కావడానికి దశాబ్దికాలం పట్టినప్పటికీ కొత్తగా సేమ్యాలను తయారుచేస్తున్న పతంజలి వంటి సంస్థలు కాచుకుని పడి ఉండాలన్నది ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారి విచిత్ర వాదం...అంతవరకు నెజల్ వంటి విదేశీయ సంస్థలు తమ విష రసాయన పూరితమైన సేమ్యాలను గంపగుత్తగా అమ్ముకోవచ్చు!
పతంజలి సంస్థవారు ఆయుర్వేద పద్ధతులలో తయారుచేస్తారు కాబట్టి వారి సేమ్యాలలో కృత్రిమ రసాయనాలు మిశ్రమం కావు. ఇలాంటి సేమ్యాలు జన ప్రియమైనట్టయితే ఇదే స్వదేశీయ సంస్థలు ఇంకా కొన్ని సంస్థలు నెజల్ వంటి విదేశీయ సంస్థలకు పోటీగా ఎదగడానికి అవకాశం ఉంది. ప్రస్తుతం దేశంలో సాలీనా నాలుగు వేల కోట్ల రూపాయల సేమ్యాలను వివిధ సంస్థలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నాయట! వీటిలో నెజల్ సంస్థవారే మూడు వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్నారు. అందువల్లనే మ్యాగీ సేమ్యాలు నిషేధానికి గురి అయిన సమయంలో కేవలం ఐదు నెలలలో నెజల్ వారికి భారీ నష్టం వాటిల్లిందని మన దేశంలోని రాజకీయ వేత్తలు, మాధ్యమాల వారు వాపోవడం..ఈ రోదనల వెనుక బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు మన దేశంలో నోరున్న వారిపైగల పట్టు ప్రస్ఫుటిస్తోంది. మ్యాగీ సేమ్యాలను ఎనబయి గ్రాములకు ఇరవై ఐదు రూపాయల చొప్పున నెజల్ కంపెనీవారు మన నోళ్లకెత్తుతున్నారట. కాగా డెబ్బయి గ్రాములను పదిహేను రూపాయలకు విక్రయిస్తున్నట్టు పతంజలి వారు ప్రకటించారు. నెజల్ వంటి విదేశీయ సంస్థలు మన దేశ ప్రజలను దశాబ్దుల తరబడి దోచేసిన తీరునకు ఇది నిదర్శనం. ఈ దోపిడీని అరికట్టగల వ్యవస్థ మన దేశంలో లేదు! విచిత్రమైన సంగతి మరొకటి ఉంది. ఇప్పుడు అనేక నెలలపాటు వౌనం వహించి సుప్రీంకోర్టులోఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ వారు దాఖలు చేసిన అప్పీలు నెజల్ కంపెనీకి వ్యతిరేకంగా కాదట! మ్యాగీ సేమ్యాల విక్రయంపై నిషేధాన్ని బొంబాయి హైకోర్టు రద్దు చేయడం పట్ల భారత ఆహార భద్రత, ప్రమాణాల సంస్థవారు పెద్దగా ఆందోళన చెందడంలేదు అని అటార్నీ జనరల్ ముకుల్ రోస్తగీ స్వయంగా ప్రకటించాడట! మరి అప్పీలు ఎందుకని దాఖలు చేసినట్టు? ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐకు అనుబంధంగా ఉన్న ప్రయోగశాలలలో జరుగుతున్న పరీక్షా విధానం సక్రమంగా లేదని హైకోర్టు వ్యాఖ్యానించిందట! తమ ప్రయోగశాలలలో జరిగే పరీక్షలు సక్రమ పద్ధతిలో వున్నట్టు ఋజువు చేసుకొనడానికి మాత్రమే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసిందట!
మ్యాగీ సేమ్యాలపై నిషేధం ఎత్తివేతను మాత్రం ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ సుప్రీంకోర్టులో వ్యతిరేకించడంలేదు! ఎందుకని? దీనికి కేంద్ర ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిషేధం రద్దును వ్యతిరేకిస్తూ అప్పీలు చేయించవలసిందిగా ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐను కేంద్రం ఎందుకని కోరడంలేదు. లేదా కేంద్రప్రభుత్వమే ఎందుకని అప్పీలు చేయలేదు? నెజల్ కంపెనీవారు కల్తీ సేమ్యాలను అమ్మినందుకు నష్టపరిహారం చెల్లించాలని కేంద్ర ప్రభుత్వం దావావేసింది. నెజల్ వారి ఉత్పత్తులు కల్తీలేనివన్న అబద్ధం నిజంగా ఇలా ధ్రువపడితే ఆ సంస్థవారు పరిహారం కూడ చెల్లించరు!