మెయన్ ఫీచర్

ఓట్ల్లకోసం దేశాన్ని బలిపెట్టొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక సంక్షేమ పథకాలు, అంతర్జాతీయ దౌత్యాలు, అధికార లబ్దికై వ్యూహాలు, ప్రతివ్యూహాలు ఇవన్నీ సరే..అసలు దేశరక్షణ మాటేమిటి? ఉత్తరకొరియా ఈనెల 6న హైడ్రోజన్ బాంబును పరీక్షించి ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. కొరియా రెండుగా చీల్చబడిన తరువాత ఉత్తర కొరియాపై చైనా ఆధిపత్యం పెరిగింది. అణ్వస్తర్రహిత ప్రపంచ ఒప్పం దం నుండి ఉత్తరకొరియా 2009, ఏప్రిల్ 14న ముందుగా వైదొలిగేలా చేసి క్రమం గా రాకెట్ అణ్వస్త్ర ప్రయోగాలు, కిం జోన్ ఉన్ చేత చేయించింది. నిస్సందేహంగా ఈ అణ్వస్త్ర ప్రయోగం, దక్షిణ కొరియాను ఉద్దేశించినదేనని అందరికీ తెలుసు. దక్షిణ కొరియా చేసిన తప్పేమిటి? చైనా చెప్పుచేతలకు లొంగకుండా ప్రజాస్వామిక మార్గం లో బ్రతకడమేనా? ఈ సంఘటనకు పలు అగ్రరాజ్యాలు స్పందించాయి. అంతర్గత విభేదాలకు అతీతంగా అటు ఒబామా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్‌లు ఇద్దరూ ఈ ప్రయోగాన్ని నిరసించారు. ప్రస్తుతం ఉత్తర కొరియపై ఆర్థిక ఆంక్షలు విధించే అవకాశాలున్నాయి.
ఇక్కడ సగం నిలిపివేసిన సంగతి ఒకటుంది. చైనా అటు ఉత్తర కొరియాకు అణ్వస్త్ర సహకారం అందించినట్లే, ఇటు పాకిస్తాన్‌కూ సాంకేతిక సహకారం అందించింది. పాకిస్తాన్ ఆయుధాలు నిస్సందేహంగా భారత్‌ను ధ్వంసం చేయడానికేనన్నది పసిపిల్లలకు కూడ తెలిసిన సత్యం. మరి చైనా ఎందుకిలా చేస్తున్నది? అంటే ఆసియాఖండంలో తన ఏకఛత్రాధిపత్యా న్ని చాటుకోవాలని చూస్తున్నది. ఈ వ్యూహం అమెరికాకు, రష్యాకు తెలియదని మనం అనుకోకూడదు.
భారత్‌కు సంబంధించినంతవరకు చైనా ద్విముఖ వ్యూహం అనుసరిస్తోంది. ఒకటి అంతర్గత అశాంతిని ప్రేరేపించడం, రెండవది సరిహద్దు దేశాలైన పాకిస్తాన్, నేపాల్ వంటివాటిలో ఇండియాకు సత్సంబంధాలు లేకుండా చేయడం. అందులో భాగంగానే నేపాల్ నూతన రాజ్యాంగం ప్రకారం ఇకమీద నేపాల్ హిందూ దేశం కాదు అని తేల్చి చెప్పారు. పరిస్థితులు ఇంత భయంకరంగా ఉన్నా మన రాజకీయ ధృతరాష్ట్రులు ఎందుకు కళ్లు మూసుకున్నారు? బంగ్లాదేశ్ నుండి పశ్చిమ బెంగాల్‌లోకి వచ్చే వలసలలో రెండు వర్గాలున్నాయి. మొదటిది హిందూ శరణార్ధులు. రెండవది ఉగ్రవాద చొరబాటుదార్లు. అదేమి దురదృష్టమో తెలియదు కాని జ్యోతిబసు కాలం నుండి, దీదీ యుగం వరకు ఉగ్రవాదులకు బెంగాల్ ప్రభుత్వాలు వత్తాసు పలకడం ఏమిటి? ఇది నిరాధారమైన ఆరోపణ కాదు. మాల్టా జిల్లాలో 2016 నూతన సంవత్సరం ప్రారంభంలోనే అల్లర్లు చెలరేగాయి. దుర్గాదేవి దేవాలయం వంటివి ధ్వంసానికి గురయ్యాయి. ఈ పని చేసింది సిపిఎం కార్యకర్తలు. వీరు ముస్లింలు. ఈ సంఘటనపై సౌగత్‌రాయ్ యనే తృణమూల్ పార్లమెంట్ సభ్యుడు వ్యాఖ్యానిస్తూ, ‘‘దీన్ని మతకల్లోలాల కోణం నుండి చూడకూడదు. ఇవి హిందూ ముస్లిం ఘర్షణలు కావు. కేవలం రాజకీయ కక్షలే కారణం’’ అన్నారు. ఇది నిజమేనా?
చైనా వ్యూహాల ముందు భారత్ చిత్తయిపోతున్నది. ‘‘కేంద్రంలో భాజపా అధికారంలో ఉంటే మతకల్లోలాలు వస్తుంటాయి’’ అని సుశీల్ కుమార్ షిండే వ్యా ఖ్యానించారు. ఇటువంటి అసత్యాలను అంతటి సీనియర్ నాయకుడు చెప్పడం దిగ్భ్రాంతి కలుగజేసే అంశం. 1962లో చైనా, భారత్‌పై దాడి చేసి ఇండియాను చిత్తుగా ఓడించింది. అప్పుడు కేంద్రంలో ఘనత వహించిన నెహ్రూగారి ప్రభుత్వం ఉంది. హైదరాబాద్‌లో మతకల్లోలాలు జరిగినప్పుడల్లా ఆంధ్రప్రదేశ్‌లోకాంగ్రెస్ ప్రభు త్వం అధికారంలో ఉంది. ముఖ్యంగా చెన్నారెడ్డి అధికారంలో ఉన్నప్పుడు జరిగిన మతకల్లోలాలు ఆయనను గద్దె దించడంకోసం కాంగ్రెస్‌వారు ప్రేరేపించినవేనని చరిత్ర విద్యార్థులకు తెలుసు. 26/11 ముం బయి మారణకాండ జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే. పార్లమెంట్‌పై ఉగ్రవాదుల దాడి జరిగింది కూడా కాంగ్రెస్ అధికారంలో ఉన్న తరుణంలోనే.
గురుదాస్‌పూర్, పఠాన్‌కోట్‌లలో జరిగిన ఉగ్రవాద దాడుల వెనుక సైనో-పాక్ కూట మి ఉంది. భారత పార్లమెంట్‌ను స్తంభింపజేసి కీలక బిల్లులు పాస్ కాకుండా చేయడంలో కాంగ్రెస్‌ను ఈ విదేశీ శక్తులు పావులుగా వాడుకున్నాయి. సోనియాగాంధీకి తన తనయుడు ప్రధాని కాలేదన్న కక్ష పెరిగింది. దీన్ని చైనా, పాకిస్తాన్‌లు తమకు అనుగుణంగా వాడుకుంటున్నాయి. అరవింద కేజ్రీవాల్ వారణాసికి వెళ్లి అక్కడ నరేంద్ర మోదీని ఓడించాలని చేసిన ప్రసంగాలు గుర్తుకు తెచ్చుకోండి. ఆప్ పార్టీని స్థాపించకముందు, ఇప్పుడు ఏ పార్టీలో కార్డు హోల్డరుగా ఉన్నాడు? మరో సంఘటనను గమనించండి. మణిశంకర్ అయ్యర్ కరాచీ వెళ్లి అక్కడ ఒక టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో ఇలా చెప్పాడు, ‘‘్ఢల్లీలోని మోదీ ప్రభుత్వాన్ని దించాలంటే అది మావల్ల మాత్రమే కాదు. ఇండో-పాక్ శాంతి చర్చలు జరగాలంటే మోదీ ప్రభుత్వాన్ని తప్పించాలి. లేదంటే 2019 వరకు వేచి చూడాల్సిందే.’’ ఈ పఠాన్‌కోట్ సంఘటన జరగడం గమనించారా? మరి కాంగ్రెస్ పార్టీ నుండి మణిశంకర్ అయ్యర్‌ను ఎందుకు బహిష్కరించలేదు? మోదీ ప్రభు త్వం ఈయనపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఈపరిణామాలు, సంఘటనలు దేన్ని సూచిస్తున్నాయి? భారత్‌పై చైనా- పాకిస్తాన్ దేశాల ఆధిపత్యం పెరుగుతున్నదని తెలియజేస్తున్నాయి. హిందూ అనే పదం భారత్‌లో వినపడకూడదు అని ఈ శత్రువులు కంకణం కట్టుకున్నారు.
మరో సంఘటన చూడండి. బంగ్లాదేశ్ నుండి బెంగాల్‌కు వచ్చిన ముస్లింలు సరిహద్దులలో మదరసా పాఠశాలలు నడుపుతున్నారు. అందులో వారు మత శిక్షణ ఇస్తుంటారు. 2016 జనవరి మొదటి వారంలో ఒక టీచర్ విద్యార్థుల చేత జనగణమన జాతీయగీతం పాడించింది. అంతే...్ఛందసవాదులు ఆమె తల పగులగొట్టారు. అంటే ఏమిటి? బెంగాల్ ఇండియాలో భాగం కాదా? మదరసాల్లో జాతీయ గీతం పాడకూడదా? పాకిస్తాన్‌లో ఆడపిల్లలను పాఠశాలలకు తరలిస్తుంటే మలాలా అనే అమ్మాయిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ఆమె తృటిలో ప్రాణాపాయం నుండి తప్పించుకుంది. మలాలకు నోబెల్ శాంతి బహుమితిని ఇచ్చి సత్కరించారు. మరి ఈ బెంగాల్‌లోని మదరసా టీచర్‌కు పురస్కారం ఇచ్చే విషయంలో ప్రభుత్వాలు ఆలోచించాలి. కానీ మమతా బెనర్జీ ఈమెకు పురస్కారం ఇవ్వదు. కారణం.. త్వరలో బెంగాల్‌లో ఎన్నికలు జరుగబోతున్నాయి. అందులో దీదీకి ముస్లిం ఓట్ల అవసరం ఉంది. ఇవన్నీ అభూత కల్పనలు కావు. అసత్యాలు కావు. పుక్కిటి పురాణాలు అని కొట్టివేసే కాకమ్మ కథలూ కావు. ఇవన్నీ ఇప్పుడు నిన్న మొన్న జరిగిన సంఘటనలు. వీటికి భారత రాజకీయ నాయకులు ఏం సమాధానం చెబుతారు? దేశమంటే ఎన్నికలేనా? అక్రమంగా ఓట్లు సంపాదించుకోవడమేనా?
ఇంకో సంఘటన చూడండి. ఉత్తర ప్రదేశ్‌లో ఒక పండ్ల వ్యాపారం చేసుకుంటున్న యువకుడున్నాడు. అతడు జామపండ్లు సరసమైన ధరకు ఇవ్వలేదని సమాజ్‌వాదీ పార్టీకి చెందిన నాయకుడు కత్తితో పొడిచాడు. ఇతనికి అజాంఖాన్ వంటి పాకిస్తాన్ అనుకూల నాయకుల మద్దతు ఉన్నది. సోషలిజం అనే పదాన్ని హిందీలో ‘సమాజ్‌వాద్’ అంటున్నారు. వీధిలో జామకాయలు అమ్ముకుని బతికే వాడిని కత్తితో పొడవడం సమాజవాదం అవుతుందా? ప్రత్యక్షంగా ములాయం సింగ్, ఆయన కొడుకు పాకిస్తాన్ వర్గాలను బలపరచడం ఏమిటి? ఎందుకంటే యుపిలో ఎన్నికలు రాబోతున్నాయి. అక్కడ యాదవులు, ముస్లింలు కలిస్తే మళ్లీ రాజకీయాధికారం చేజిక్కించుకోవాలని పన్నాగం.
అందరికీ పాకిస్తాన్ మద్దతు కావాలి దేశభక్తి అవసరం లేదు. కాశ్మీర్‌లో షబ్నమ్ లోనీ, ఒమర్ అబ్దుల్లా వంటివారు ఐసిస్ జెండాలను సమర్ధిస్తే మనం అర్థం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్‌లోని పాతబస్తీలో ఐసిస్ రిక్రూట్‌మెట్ కేంద్రాన్ని మన నాయకత్వం సమర్ధించడం ఏమిటి? వారితో ఎన్నికల పొత్తు ఏమిటి? జనవరి 26 నాడు భారతదేశం గణతంత్ర దినోత్సవం జరుపుకునే సమయంలో దేశంలోని ఈ విచిత్ర వాతావరణాన్ని అంచనా వేయడం ప్రతి భారతీయుడి కర్తవ్యం.
సల్వీందర్ సింగ్ పేరు విన్నారా? ఇదొక డిటెక్టివ్ కథ. పఠాన్‌కోట్‌పై జైషే మహమ్మద్ ఉగ్రవాదులు దాడి జరపడానికి ముందు ఎస్‌పి సల్వీందర్ సింగ్‌ను ఎవరో కిడ్నాప్ చేశారు. అసలు విషయం ఏమంటే ఇక్కడ కిడ్నాప్ లేదు-వదిలిపెట్టనూ లేదు. రాజేంద్ర మదన్ మోహన్ వంటి సల్వీందర్ సింగ్ అనుచరుల ద్వారా సమాచార సేకరణ మొదలైంది. మరి ఈ కిడ్నాప్ డ్రామాను ఎవరు ఆడించారు?
పఠాన్‌కోట్ ప్రాంతం నుండి భారత్‌లోకి మాదక ద్రవ్యాలు భారీ ఎత్తున పాకిస్తాన్ నుండి ప్రవేశిస్తుంటాయి. ఇది చాలా కాలంగా జరుగుతున్న వ్యవహారమే. దీనిమీద వచ్చే ఆదాయంతో భారత్‌లో ఉగ్రవాద కార్యకలాపాలు నడుస్తుంటాయి. ఈ విషయం అందరికీ తెలుసు. సల్వీందర్ వంటి భారతీయుల సహకారంతోనే సైనో-పాక్ ఉగ్రవాదం భారత్‌లో ప్రవర్ధమానమవుతున్నదని తాత్పర్యం. వీరిని ఇంటి దొంగలు అంటారు. హఫీస్ మహమ్మద్ సరుూద్, దావూద్ ఇబ్రహీంలు సరిహద్దులకు ఆవతల ఉన్న శత్రువులు కాని, సల్వీందర్‌లు, మణిశంకర్ అయ్యర్‌లు అంతర్గత శతృవులు. వీరి సంఖ్య కూడా తక్కువేమీ కాదు.
పఠాన్‌కోట్‌పై జరిగిన దాడికి ఎవరూ ఆశ్చర్యపడనక్కరలేదు. ఎందుకంటే ఇది ఆకస్మింకంగా జరిగిన సంఘటన కాదు. గత వేయి సంవత్సరాల ఇస్లామిక్ దండయాత్రలకు ఇది కొనసాగింపు మాత్రమే. గజనీ, ఘోరీ , ఔరంగజేబు, మాలిక్ కాఫర్, నాదిర్షా, ముషార్రఫ్ పరంపరలోనే మనం నవాజ్ షరీఫ్ యుగాన్ని అర్థం చేసుకోవాలి. ఏక కాలంలో ఆఫ్ఘనిస్తాన్ లోని జలాలాబాదు, పఠాన్‌కోటల్లో భారతీయ స్థావరాలపై 2016 జనవరి మొదటివారంలో దాడులు జరగడం యాదృచ్ఛికం కాదు. ఇది పరంపరాగతం. పఠాన్‌కోట వ్యూహరచన పాకిస్తాన్‌లో జరిగిన మాట నిజమేకాని ఉగ్రవాద మూలాలు ఇసుక దేశంలో ఉన్నాయి. పాకిస్తాన్‌లోని ఉగ్రవాద స్థావరాలను నిర్మూలించనంతవరకు పాకిస్తాన్‌తో చర్చలు జరపేది లేదని ఇండియా తేల్చి చెప్పింది. చైనా ఆశించింది ఇదే!

చిత్రం... అంజుమన్ అహ్లె సున్నతల్ జమాత్ (ఎజెఎస్) మైనారిటీ సంస్థ జనవరి మొదటివారంలో పశ్చిమ బెంగాల్‌లోని మాల్దా జిల్లాలో నిర్వహించిన ఆందోళన సందర్భంగా అల్లరి మూకల విధ్వంసానికి సాక్ష్యాలు.

- ముదిగొండ శివప్రసాద్