ఉత్తరాయణం

ఓట్లకోసం కొంగ జపాలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎం.వి.ఆర్. శాస్ర్తీగారు రచించిన వంకర టింకర సెక్యులరిజం వ్యాసంలో ఓట్లకోసం రాజకీయ నాయకులు సర్కస్‌ఫీట్లను చక్కగా వివరించారు. కర్ణాటక ముఖ్య మంత్రే స్వయంగా గోమాంస భక్షణకై లొట్టలేస్తున్నట్టు బహిరంగ ప్రకటన చేయడం వారి దిగజారుడు తనానికి నిదర్శనం. రాబోయే కాలంలో సున్తీ చేయంచుకుంటే తప్పేంటి? ఆరోగ్యకరం కాదా? అని రాజకీయ నాయ కులు సన్నాయనొక్కులు నొక్కినా ఆశ్చర్యం లేదు. చెన్నై లోని యునైటెడ్ ఇన్సూరెన్స్ కంపెనీవారు నూతన సంవత్సరానికి గాయత్రీ మంత్రంతో గ్రీటింగ్ కార్డులు అచ్చువేయగా, ద్రావిడ కళగం, ద్రావిడ మున్నీట్ర కళగం రాజ్యాంగంలోని సెక్యులర్‌కు విరుద్ధమని తమిళనాడు హైకోర్టును ఆశ్రయంచారు. గాయత్రీ మంత్రార్థం విశ్వశాం తిని సూచిస్తుందనీ, సెక్యులర్ భావనలకు విరుద్ధం కాదని తీర్పు చెప్పింది కోర్టు. ముస్లిం రాష్ట్రీయ మంచ్ ఆధ్వర్యం లో ఢిల్లీ, లఖ్‌నవు, శ్రీనగర్ తదితర ప్రాంతాల్లో నవంబర్ 19 నుండి గోకులాష్టమి లోపు 100 గోక్షీర సేవన పార్టీల ను ఏర్పాటు చేయనున్నారు. గోమాంస భక్షకులకు ఇది కనువిప్పు కాగలదు. రాయ్‌పూర్, ఛత్తీస్‌గఢ్, మేవార్ పట్టణాల్లో ముస్లిం గోపాలక్ సమ్మేళనాలను ఏర్పాటు చేశారు. మీడియా సకారాత్మక వార్తలపై మరింత శ్రద్ధ పెంచాలి. హైదరాబాద్ లోని అరబ్ గోశాల నిర్వాహకులు ఆవుపాలు సేవిస్తే ఆరోగ్యం బాగుంటుందని ప్రచారం చేస్తున్నారు. రాజకీయ నాయకులు, రాజ‘కయ్యాలు’ మాని ఓట్లకై కొంగ జపాలు మాని వాస్తవాలు తెలుసు కోవాలి. విదేశాలలో గోమాంస భక్షణ చేసి ‘మ్యాడ్ కౌ’ రోగం పాలై అసువులు బాసిన సంఘటనలు ఎన్నో ఉన్నా య.
- దండు కృష్ణ శర్మ, గౌతంనగర్, సికిందరాబాద్
హిందువులకు హిందువులే శత్రువులు
హిందువులకు హిందువులే శత్రువులవడానికి అన్యమ తాల వారు ప్రారంభించిన ఇంగ్లీషు మీడియం పాఠశాలలే కారణమని ‘ఉన్నమాట’ చదివాక నాకు అనిపించింది. అక్కడ చదివినవారు తామే జ్ఞానులం, ఇతరులంతా మూఢులు, అంధవిశ్వాసులు అనుకుంటారు. అక్కడ నేర్పే మొదటి పాఠం హిందూ విద్వేషమే. అక్కడ నేర్చుకునేదే చరిత్ర. అక్కడ చదివిందే జ్ఞానం. అక్కడ చదివిన వాళ్లకే మంచి ఉద్యోగాలు, మంచి అవకాశాలు, అవార్డులు. తను చదివిన కానె్వంట్ శత వార్షికోత్సవంలో మాజీ మంత్రి చిదంబరం మీరే మా దేశానికి జ్ఞానబిక్ష పెట్టారని అన్యమతం వారని పొగిడాడు. మోదీ అక్కడ చదవనందువల్లే ఈ జ్ఞానులకు అతడంటే చిన్న చూపు- అని ప్రఖ్యాత రచయత చేతన్ భగత్ చెప్పింది నిజమే కదూ.
- సోనాలీ, సూర్యారావుపేట, తూ.గో.జిల్లా
ఎందుకీ పక్షపాతం?
టీవీలో చర్చల మాదిరిగా ఆంధ్రభూమిలో ఫోకస్ కూడా నిరర్ధకం అవుతోందని ప్రచురించిన ఉత్తరంలో నిజం ఉందనిపించింది. టిప్పు సుల్తాన్‌పై ఫోకస్ చూశాక, అందులో ముగ్గురు తమ వర్గ నైజాన్ని మరోసారి బయట పెట్టుకున్నారు. ఇంతకుముందే ఆంధ్రభూమిలోనే టిప్పు గురించి ఉన్నమాట, ఇతర వ్యాసాలు చదివిన మాకు అసలు చరిత్ర తెలిసింది. ఆ తెలివిడి వల్లనే ఫోకస్‌లో ఆ ముగ్గురి ఒంటికంటి చూపు, పక్షపాతం, గ్రహించగలిగాం. ఫోకస్ కన్నా ఉన్నమాట, ఇతర వ్యాసాలు అర్థవం తంగాను ఉంటున్నాయ.
- చంద్ర, కాకినాడ
రాజ్యాంగంపై స్కూళ్లలో బోధించాలి
ఎప్పటిలానే గోవధ గురించి, రాజ్యాంగం గురించి ముదిగొండవారు ఎన్నో విషయాలు విశే్లషణాత్మకంగా చెప్పారు. రాజ్యాంగం ప్రసాదించిన హక్కంటూ ఆర్భాటిస్తున్న మహా మేధావులకు రాజ్యాంగంలో ఏముం దో తెలియకపోవడం ఆశ్చర్యంగా ఉంది. లేక తెలిసి కూడా వాళ్లు అసత్యాలు వ్యాప్తి చేస్తున్నారా? గోమాంసా హారం గురించి జరుగుతున్న విష ప్రచారం చూస్తూ కూడా కనీసం భాజపా, ఆర్‌ఎస్‌ఎస్ శ్రేణులు దీటుగా స్పదించకపోవడం దిగ్భ్రాంతి కలిగిస్తున్నది. ముదిగొం డవారు చెప్పినట్టు, రాజ్యాంగం గురించి పాఠశాలల్లో బోధిం చాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
- శాండీ, కాకినాడ
వికలాంగుల వారోత్సవాలు నిర్వహించాలి
ప్రపంచ వికలాంగుల దినోత్సవమైన 2015, డిసెం బర్ 3న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తూతూ మంత్రంగా సభలు, సమావేశాలు నిర్వహించడానికే పరిమితం కాకుండా, వికలాంగుల వారోత్సవాలను డిసెంబర్ 3 నుంచి 10వరకు నిర్వహించాలి. ప్రతి రోజూ ప్రతి శాఖ నుంచి వికలాంగులకు వర్తించే సంక్షేమ పథకాలను వారికి తెలియజేయాలి. విద్య, వైద్యం, పరికరాలు, ఇళ్లు, పింఛన్లు, బ్యాంకు రుణాలు, ఉపాధి అవకాశాలను ఒక్కొక్కరోజు పరిష్కరించే విధంగా వికలాంగులనుండి దరఖాస్తులు స్వీకరించి వారికి 1995 వికలాంగుల చట్టం కింద విద్య, నియామకాల్లో మూడున్నర శాతం రిజర్వేషన్ తప్పక వర్తింప జేయాలి. సమంజసమైన అవకాశాలు కల్పించి వారు ఆర్థికంగా, సమాజికంగా అభివృద్ధి సాధించేందుకు ప్రభుత్వాలు కృషి చేయాలి.
- ఈదునూరి వెంకటేశ్వర్లు, నెక్కొండ
పేరు మార్పు అవసరమే
ఇటీవల ఒక పాఠకుడు ఉత్తరం వ్రాస్తూ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ‘రాజమండ్రి’ని ‘రాజమహేంద్రవరం’గా మార్చ డం అవసరమా? అని రాశారు. కానీ పేరు మార్పు అవస రమే. రాజమహేంద్రవరం అంటే నిజంగా ఒళ్లు పులకించి పోతుంది. ఇంగ్లీషువారికి నోరు తిరగక పేరు మారిస్తే మనం కూడా అదేవిధంగా అనాలా? పేరు మార్పు మంచి నిర్ణయం.
- మామెడ రాజేంద్ర ప్రసాద్, వౌలాలి