సబ్ ఫీచర్

ఆచరించని నీతులు చెప్పేం లాభం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల పాఠశాలలో నీతి బోధనలు ప్రవేశపెట్టి నైతిక విలువలు పెంపొందించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటుచేసింది. వీరు సూచించిన విషయాలకు అనుగుణంగా పాఠ్యపుస్తకాలలో నైతిక విలువలు పెంచే పాఠాలుంటాయని భావించాలి. మంచిదే. ఈ కమిటీలో విద్య శాఖకు సంబంధించిన ముఖ్యంగా ప్రాథమిక పాఠశాలల తనిఖీలోను, ఉన్నత పాఠశాలల తనిఖీలోను విశేష అనుభవంగల వారు లేరు. భాషాభివృద్ధికి నైతిక విలువలు పెంచడానికి ప్రాథమిక వాచకాలు పునాది వంటివి. నేడు వీటిలో అనేక తప్పులున్నాయి. వాటిని ఎత్తిచూపించినా ఫలితం శూన్యం. ఇందుకు ఎవరూ బాధ్యత వహించరు. ఈ తప్పులన్నీ ఒప్పులుగా చలామణి అయిపోతున్నాయి. అది అలా ఉంచుదాం.
పాఠ్యపుస్తకాలలో అలాంటి పాఠాలు బోధించినంత మాత్రాన నైతిక విలువలు పెరుగుతాయా? పూర్వపు పుస్తకాలలో కూడా నైతిక విలువలు పెంచే పాఠాలు ఎన్నో ఉండేవి. ఇంటి వద్ద సదాచారాలు పాటించాలి. తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఆదర్శప్రాయంగా ఉండాలి. ఈ రెండు సరిపోవు. నేడు ముఖ్యంగా దృశ్యమాధ్యమాలు, వివిధ పత్రికలు సమాజాన్ని భ్రష్టుపట్టిస్తున్నాయి. కన్యాశుల్కం నాటకంలో ‘మా కులానికి అంతా బావలే’ అంటుంది మధురవాణి. అదేమాదిరిగా మన పత్రికలవారు ఆధ్యాత్మిక విషయాలూ ప్రచురిస్తారు. పనికిమాలిన కథలు ప్రకటిస్తారు. ఇంచుమించు నగ్నంగా ఉన్న సినిమాలోని స్ర్తిల చిత్రాలు ప్రకటిస్తారు. ఇలా వ్యాపార ప్రకటనలలో స్ర్తిలను ఎంత అసభ్యంగా చూపిస్తున్నారో మాటలలో చెప్పలేం. టీవీ భూతాలు ప్రతి ఇంటిలోను ప్రవేశించి హత్యలు ఎలా చేయాలో, విష ప్రయోగాలు ఎలా చేయాలో, మానభంగాలు ఎలా చేయాలో కళ్ళకు కట్టినట్లు చూపిస్తున్నాయి. చదువుకునే ఆడపిల్లలు జుట్టు విరబోసుకుని అడ్డచార్ల బనీన్లు, బిగుతు లాగులు ధరిస్తున్నారు. తమ పిల్లలు తగిన దుస్తులు ధరించాలి అని తల్లిదండ్రులు చెప్పరు. చెప్పలేరు. మా యిష్టం మా దుస్తులు అని చెప్పగల వాక్సాతంత్య్రం ఇపుడు వెల్లివిరిసిపోతున్నది.
సాహిత్యం అనే ముసుగులో చలామణి అవుతున్న కొన్ని కథలు తల్లిదండ్రుల మాటలు ఎదిరించి వివాహం చేసుకోవడం ఒక ఘనకార్యంగా చిత్రిస్తున్నాయి. ఇలాంటి ఆదర్శ దంపతుల ఫొటోలు పత్రికలవారు పోటీపడి ప్రచురిస్తారు. టీవీల వారు వీటిని ప్రసారం చేస్తారు. ఇలాంటి కథలు నేటి సినిమాలు వివాహం అనేది పెద్దలకు సంబంధం లేదనే అభిప్రాయాన్ని యువతీ యువకులకు కల్గిస్తున్నాయి. పట్టణాలకే పరిమితమైన మద్యం దుకాణాలు పల్లెలలోకి కూడా ప్రవేశించాయి. తాగుబోతుల సంఖ్య తగ్గడానికి బదులు పెరుగుతున్నది. చదువుకునే పిల్లలు కూడా మద్యపానం చేస్తున్నారు. దొంగతనాలు చేస్తున్నారు. హత్యలు, దొంగతనాలు చేసేవారిని హీరోలుగా చూపిస్తూ వారిపై సినిమాలు తీస్తున్నారు. సినిమాలలో అన్ని రకాలైన అసభ్య కార్యాలు ఉంటున్నాయి. వీటిని ఎవరు కట్టడి చేయగలరు? ఇలాంటి కలుషితమైన సమాజంలో సంచరిస్తున్న పిల్లలపై నీతి బోధలు ఎంతవరకు పనిచేస్తాయి?
దేశంలో అసహనం పెరిగిపోతున్నదని ఆందోళన చెందుతున్న కుహనా మేధావులు ఈ విషయాలలో నోరు మెదపరు. ఎవరు ఏ దేవుని పూజిస్తే వీరికి ఎందుకు? వీరి ఉపదేశం సరియైనదా? ఎదుటివారి ప్రవర్తన తప్పా? నేడు విద్యా శాఖ ఎంతో భ్రష్టుపట్టిపోయిందో 10.12.15వ తేదీన ఆంధ్రభూమి దినపత్రికలో ప్రకటింపబడిన ‘విద్యాశాఖతో చెలగాటం’ అను వ్యాసం ఈ సందర్భంగా పరిశీలించాలి. వీటితో మాకు సంబంధం లేదు. పాఠ్యాంశాలలో నీతిబోధనకి అవకాశం కల్పిస్తాం అంటే చేసేది ఏమీ లేదు.

-వేదుల సత్యనారాయణ