ఉత్తరాయణం

శ్రీ వివేకానంద వాణి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. అల నరేంద్రుండు భువిలోన అవతరించి
యమ నియమ సాధనాల బల విమల యశుడు
అల విదేశ జనుల మధ్య విలసితముగ
అప్రతిరథుడై గర్జించె అద్భుతముగ
తే.గీ మంచి వాగ్థాటి గలవాడు-మాన్యుడితడు
మాతృదేశ భక్తుండు-సమర్థుడగుచు
రామకృష్ణుని శిష్యుండై రాజసముగ
భారత రాయబారిగ నిల్చె భవ్యమూర్తి
తే.గీ. శంఖనాదము పూరించి జంకు లేక
భారత ఖ్యాతి తెల్పిన సారమతివి
మంత్ర ముగ్ధులైరి జనులు మహిమవలన
పలుకులన్నియు మధురమై పరిమళించె
తే.గీ తాను లోకైక మతత్వ తంత్రవాది
విలయ తాండవంబాడుచు విక్రమించె
విజ్ఞులైనట్టి వారును ప్రాజ్ఞులైన
చెవులు రిక్కించి విన్నారు-విస్మయముగ
తే.గీ అభయంబిచ్చుచు నిల్చినావు వరదా! అఖ్యాత వేదాంతివై
సభలో నీవు నృసింహుడవైతివి గదా! శాస్త్ర ప్రతర్కంబునన్
నభమున్ తాకెను కీర్తిచంద్రికలగా నంభౌచు నిల్వన్ కళా
విభవంబొందుచు నీవు శిష్యహృదిలో విజ్ఞానివై వెల్గితే
తే.గీ. శుద్ధ బ్రహ్మ విచార సుశబ్దనాద!
యోగ విద్య విలక్షణ, యోగి వంద్య
భానుమండల తేజ! విభ్రాజమాన!
నభము తాకెను నీ కీర్తి-నతులు నీకు!
- మల్లాది నరసింహమూర్తి, గుంటూరు
ఏపీ ఉద్యోగుల తీరు మారాలి
ఈ విభజనను మనం కోరలేదు. ఈ విభజన చేసిన వారు న్యాయం చేయకపోగా చరిత్రలో లేని విధంగా రాజధాని లేకుండా రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారు. రాజధాని లేని ఆర్థిక లోటుతో రాష్ట్రం దివాలా తీసింది. రూ.17వేల కోట్లకు పైగా ఆర్థిక లోటు ఉన్నదని కేంద్ర ప్రభుత్వమే ప్రకటించింది. కేంద్రం జరిపించిన ఆడిట్‌లో కూడా ఆ విషయం నిర్ధారణ అయంది. ఆర్థిక దుస్థితితో దివాళా తీసినా ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం ఇచ్చిన హామీ మేరకు ఆర్థిక సహాయాన్ని అందజేయలేదు. ప్రత్యేక హోదా ఇవ్వలేదు. రాయలసీమ, ఉత్తరాంధ్ర ఏడు జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వలేదు. ఓవైపు కేంద్రం మొండి చేయ చూపుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రి తన పాలనా దక్షతతో నూతన రాజ ధాని అమరావతికి ప్రధానితో శంకుస్థాపన చేయంచారు. త్వరలో రాజధాని నిర్మాణ పనులకు ప్రభుత్వం సమా యత్తమవుతోంది. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను విజయవాడ, గుంటూరులలో ఏర్పాటు చేస్తున్నారు. అధికారులు ఉద్యోగులందరిని తరలి రావాలని ముఖ్యమంత్రి కోరినారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు చెట్లకిందైనా కూర్చొని పని చేస్తామని ప్రకటించారు. కాని నేడు కొత్త రాజధానికి తరలిరావడానికి గొంతెమ్మ కొర్కెలు కోరుతూ పిల్లల చదువులకు ఇబ్బంది అని కుంటి సాకులు చెబుతున్నారు. 13 జిల్లాల ప్రజలు తమ పిల్లలను చదివించుకోవడం లేదా. ప్రభుత్వం చెప్పిన పని చేయడం ఉద్యోగుల విధి. రాష్ట్రం ఎన్ని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్ప