సంపాదకీయం

పైశాచికత్వంపై అంకుశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నైతిక ప్రమాణాల సూచిక పాతాళ పతన స్థాయికంటె మరింత హీనమైన స్థాయికి దిగజారిపోతుండడం శిశువులపై జరుగుతున్న లైంగిక అత్యాచారాలకు కారణం. మహిళలను, యువతులను, బాలికలను, లైంగిక అత్యాచారాలకు గురిచేసే మగ పిశాచాలకు భారతీయ శిక్షాస్మృతిలో శిక్షలను నిర్దేశించారు. కానీ శిక్షాస్మృతిలో రెండేళ్ల పైబడిన పదేళ్లలోపు బాలికలపై జరుగుతున్న ఘోరమైన లైంగిక అత్యాచారాలను గురించి నిర్దిష్టంగా వివరించలేదన్నది సోమవారం సర్వోన్నత న్యాయస్థానం చేసిన నిర్ధారణ. ఇటీవలి కాలంలో దేశమంతటా ఇలా శిశువులపై లైంగిక అత్యాచారాలు జరిగిపోతుండడం సర్వోన్నత న్యాయమూర్తులు దీపక్ మిశ్రా, ఎన్‌వి రమణ వ్యక్తం చేసిన ఆందోళనకు నేపథ్య వైపరీత్యం. ఇలా ఘోరమైన లైంగిక అత్యాచారాలకు శిశువులను గురిచేస్తున్న నర రాక్షసులకు భయంకరమైన శిక్షలను విధించాలన్న వాదంతో సుప్రీం న్యాయమూర్తులు ఏకీభవించడం సహజం. కానీ భయంకర లైంగిక బీభత్సకారుకు మొగ్గల బతుకులను బుగ్గి చేస్తున్న పిశాచులకు కఠిన శిక్షలను నిర్ధారించ వలసింది పార్లమెంటు మాత్రమే! అందువల్ల చిన్నారులను లైంగిక అత్యాచారాలకు గురి చేస్తున్న వారికి శిక్షలను నిర్ధారిస్తూ పార్లమెంటు ప్రత్యేకమైన చట్టం చేయాలి. లేదా భారతీయ శిక్షా స్మృతిలో సవరణలు చేయాలి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు మంగళవారం చెప్పిన మాట ఇది. ఇలా సుప్రీంకోర్టు చెప్పవలసి రావడం శాసన నిర్మాణశాఖ-లెజిస్లేచర్-వారి వైఫల్యానికి నిదర్శనం. న్యాయస్థానాలు జోక్యం చేసుకొని అదిలించేవరకు ప్రజాప్రతినిధులైన శాసన నిర్మాతలు తమంత తాముగా సమకాలీన సమస్యలకు పరిష్కారం కనుగొనడానికి పూనుకొనడం లేదు. శిశువులపై జరిగిపోతున్న లైంగిక అత్యాచారాల సమస్య మాత్రమే కాదు, అనేకానేక సమకాలీన సమస్యల గురించి న్యాయ ప్రమేయం పెరిగిన తర్వాత మాత్రమే శాసన నిర్మాణ శాఖ చర్యకు పూనుకోవడం నడుస్తున్న చరిత్ర. నిర్భయపై అత్యాచారం జరిగిన తరువాత ఆమె బతుకు మొగ్గలోనే బలైన తరువాత బాల నేరస్థుల చట్టంలో తగిన మార్పులు తేవడానికి పార్లమెంటునకు మూడేళ్లు పట్టడం ప్రజాప్రతినిధుల క్రియామాంద్య ప్రవృత్తికి ఒక ఉదాహరణ మాత్రమే. ఈలోగా ఒక దుర్మార్గుడు ‘‘బాలుని’’ ముసుగులో జైలునుంచి తప్పించుకోగలిగాడు. భూమి సేకరణ కావచ్చు,ఆహార భద్రత కావచ్చు, ఎన్నికల అవినీతి కావచ్చు, రాజకీయ పార్టీల అంతర్గత ఆర్థిక అవినీతి కావచ్చు-ఎనె్నన్నో సమస్యల పరిష్కారం గురించి చట్టసభలు ఏళ్ల తరబడి పట్టించుకొనకపోవడం నడుస్తున్న చరిత్ర. సర్వోన్నత న్యాయ ప్రమేయంతో కాని పార్లమెంటులో కదలిక రాకపోవడం ప్రజాస్వామ్య వైపరీత్యం. ఇప్పుడు శిశువులపై జరిగిపోయిన రాక్షసమైన లైంగిక అత్యాచారాల నిరోధానికి వీలుగా దోషులను కఠినంగా శిక్షించడానికి చట్టంలో తగిన నియమావళి లేదన్నది సర్వోన్నత న్యాయ నిర్ధారణ.
చట్టాలు సామాజిక స్వభావానికి ప్రతిబింబాలు. నేరం సామాజిక సమష్టి స్వభావానికి అపవాదం-ఎక్సెప్షన్-నేరాలను నిరసించడం, నేరస్థులను దండించడం సమాజ సహజ స్వభావం. అపవాదాలు పెరుగుతుండడానికి కారణం నైతిక నిష్ఠపట్ల అవగాహన అంతరించి పోతుండడం. ఒకప్పుడు మనదేశంలో అబలలపై లైంగిక అత్యాచారం జరగడం మిక్కిలి అరుదైన వ్యవహారం. లైంగిక అత్యాచారం పైశాచిక ప్రవృత్తి అన్న భావం మన సాంస్కృతిక జీవన నిహితం కావడం ఇందుకు కారణం. మహిళలను మాతృమూర్తులుగా సమాదరించిన జాతీయ సాంస్కృతిక సంప్రదాయం మనది. ఈ సంప్రదాయాన్ని భంగపరిచిన రాక్షసుల సంఖ్య వేళ్లమీద లెక్కపెట్ట తగినంత తక్కువగా ఉండేది. అయినప్పటికీ అబలలపై అత్యాచారం జరిపిన లైంగిక బీభత్సకారులను మన సమాజం దారుణంగా శిక్షించింది. విదేశీయ దురాక్రమణ కొనసాగిన అనేక శతాబ్దుల కాలంలో మన సాంస్కృతిక జీవన విధానంలో వచ్చిన భయంకరమైన విపరీతమైన పరివర్తన లైంగిక అత్యాచారాలు పెరిగిపోవడానికి ప్రధానకారణం. అయినప్పటికీ ఇటీవలికాలం వరకు శిశువులపై లైంగిక అత్యాచారం జరిపే పైశాచిక స్వభావం మన సమాజాన్ని ఆవహించలేదు. అందువల్లనే రెండేళ్ల, నాలుగేళ్ల శిశువులపై లైంగిక అత్యాచారాలు జరిపేవారికి విధించదగిన భయంకర శిక్షల గురించి భారతీయ శిక్షాస్మృతిలో ప్రస్తావన లేదు. బాలికలను యువతులను మహిళలలో లైంగిక అత్యాచారాలకు గురిచేసే వారికి విధించదగిన శిక్షలను పేర్కొన్నారు. అందువల్ల శిశువులపై అత్యాచారం జరుపుతున్న ఆతతాయిలకు సైతం మహిళలను బలితీసుకుంటున్న నేరస్థులకు లభించే శిక్షలను విధించడం అనివార్యమైంది.
అందువల్ల శిశువులకు లైంగిక బీభత్సానికి గురిచేస్తున్న ఘోర పాతకులను భయంకరంగా శిక్షించడానికి వీలైన చట్టాన్ని పార్లమెంటు కనీసం పదేళ్లక్రితం రూపొందించి ఉండాలి. చిన్ని శిశువులపై దేశవ్యాప్తంగా అత్యాచారాలు పెరుగుతున్నట్టు ఇటీవల వెల్లడైన తరువాత నైనా ‘ప్రజా ప్రతినిధులు’ కఠోర శిక్షల గురించి ఆలోచించకపోవడం వారి వైఫల్యాలకు నిదర్శనం. మంత్రివర్గాలు రూపొందించిన బిల్లులను ప్రజాప్రతినిధులు ఆమోదించడం మన పార్లమెంటరీ సంప్రదాయమైంది. అందువల్ల శిశువులను కాటేస్తున్న భయంకర నేరస్థులకు భయంకర శిక్షలను విధించడానికై చట్టాన్ని ప్రభుత్వాలు రూపొందించి ఉండాలి. అనధికార బి ల్లుల రూపంలో సైతం ఇలాంటి ప్రస్తావన పార్లమెంటులో జరగకపోవడం ప్రతినిధుల క్రియాశీల రాహిత్యానికి నిదర్శనం. బిల్లులను మంత్రివర్గం రూపొందిస్తుంది. సభలలో ఔనని కాని, కాదని కాని తలలను ఆడించడమే తమ పని అని ప్రజాప్రతినిధులు భావిస్తుండడం ప్రజాస్వామిక వైపరీత్యం. ఈ ప్రజాస్వామ్య వైపరీత్యం కారణంగానే ప్రతినిధులు తమంత తాముగా చొరవ తీసుకొని అనధికార బిల్లులను ప్రవేశపెట్టడం లేదు. 2012లో దాదాపు ముప్పయి ఎనిమిది వేల మంది ఆడపిల్లలపై అత్యాచారాలు జరిగాయట. ఈ సంఖ్య 2014లో దాదాపు ఎనబయి తొమ్మిదివేలకు పెరగడం లైంగిక బీభత్సకారులు విస్తరించి పోతుండడానికి నిదర్శనం. సుప్రీంకోర్టు మహిళా న్యాయవాదుల సంఘం, వారు సుప్రీంకోర్టుకు నివేదించిన వివరాలివి. పోలీసులు, సైనికులు సైతం శివువులపై అత్యాచారాలకు పాలుపడుతుండడం నైతికంగా దాపురించిన దివాలాకోరుతనానికి సరికొత్త సాక్ష్యం...
శిశువులపై అత్యాచారాలు పెరిగిపోవడానికి కారణాలను విశే్లషించాలన్నది మన శాస్తవ్రేత్తలు, మానసిక వైద్యులు, చెబుతున్న మాట. మానసికమైన భయంకర వికృతులకు లోనైనవారు ఇలా శిశువులపైన, బాలికలపైన ఈ లైంగిక ఘోరాలకు పూనుకుంటున్నారట. నిజమే కావచ్చు. కానీ ఈ మానసిక వికృతికి ప్రధాన కారణాలు విదేశీయ పాలన ఫలితంగా దాపురించిన విద్యావిధానం, ప్రపంచీకరణ వల్ల మన నెత్తికెక్కిన వాణిజ్య జీవనం..ప్రపంచీకరణ మొదలైన తరువాతనే శిశువులపై అత్యాచారాలు పెరుగుతుండడానికి కారణాలు ఏమిటి? బడి పిల్లలకు లైంగిక విద్యను మప్పాలన్న మేధావులే ప్రధానంగా మానసిక రోగులు. ‘‘కన్నుదోయికి అన్యకాంతలడ్డంబైన మాతృభావము చేసి’’ మలగిన ప్రహ్లాదుని ఈ ఆధునికత కబళించింది...మానసిక రోగులు విస్తరించిపోయారు!