సబ్ ఫీచర్

విద్యపై దృష్టి కేంద్రీకరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆవులను వ్యవసాయానికి మేలుచేసే జంతుజాతిని చంపవద్దని, వాటిని కాపాడాలని రాజ్యాంగం ప్రభుత్వాలను ఆదేశిస్తున్నది. రాజ్యాంగంలోని ఆదేశిక సూత్రాలలో ఉన్న విషయాలు ప్రభుత్వాలకు మార్గదర్శకాలు. విశ్వవిద్యాలయాలు రాజ్యాంగానికి లోబడి చేయబడిన చట్టాలననుసరించి వ్యవస్థీకృతం చేయబడిన సంస్థలు. విశ్వవిద్యాలయాలెందుకు స్థాపింపచారో అవి ఏయే కర్తవ్యాలను నిర్వహించాలో విశ్వవిద్యాలయాల్లో పనిచేసే ఆచార్యుల బాధ్యత లేమిటో, చదువుకునేందుకు వచ్చిన విద్యార్థుల బాధ్యతలేమిటో చట్టబద్ధం చేశారు. ఈ స్పృహ ప్రభుత్వాలకు గాని, ఆచార్యులకు గాని, బోధనేతర సిబ్బందికి గాని, విద్యార్థులకు గాని, ఆ విద్యార్థుల తల్లిదండ్రులకు గాని ఉన్నట్లు తోచదు. ప్రజలు చెల్లిస్తున్న పన్నుల కారణంగానే విశ్వవిద్యాలయాలతో సహా ప్రభుత్వరంగ సంస్థలన్నీ నడుస్తున్నాయ నడంలో ఏమాత్రం సందేహం లేదు. మా డబ్బుతో నడుస్తున్న ఈ విశ్వవిద్యాలయం మనది, ఇది సరిగా నడుస్తున్నదా! నడవకపోతే కారణాలేంటి అని విచారించాల్సిన బాధ్యత తమపైన ఉన్నదన్న జ్ఞానం ఈ దేశ పౌరులకు ఉన్నట్లు తోచదు.
ఈ కారణంగానే చదువుల తల్లి ఒడిలా భాసిల్లవలసిన విశ్వవిద్యాలయాలు నాణ్యత లేని విద్యార్థులను ఉత్పత్తి చేసే కర్మాగారాలుగా మారాయ. నిరంతరం విద్య, పరిశోధన, నూతన ఆవిష్కరణలు, భావి మేధావులు తయారు కావలసిన విశ్వవిద్యాలయాల్లో అనవసర విషయాలు చోటు చేసుకొని విద్యా వాతావరణాన్ని కలుషితం చేస్తున్నాయ. పురాతన కాలంలో విద్యలకు తలమానికంగా ఉన్న మన దేశంలో ప్రస్తుతం కళాశాలలు, విశ్వవిద్యాలయాలు తగిన ప్రామాణికతలు కరవై, కుళ్లు రాజకీయాలు, బీఫ్ ఫెస్టివల్ వంటి అనవసర విషయాలతో కలుషితం అవుతున్నాయ. అసలు విద్య నభ్యసించేందుకు వచ్చే విద్యార్థులకు చదువు ముఖ్యమా? లేక అనవసర వివాదాలు, ఘర్షణల్లో పాలుపం చుకోవడం ముఖ్యమా? తల్లిదండ్రులు ఎంతో శ్రమకోర్చి పైచదువులకోసం పంపిస్తే అసలు లక్ష్యాన్ని వదలి మిగిలిన అనవసర విషయాలపై దృష్టి కేంద్రీకరించి, తమ జీవితాలను పాడు చేసుకోవడం ఘనమా? దీనివల్ల వారు పావుకు తినేదేంటి? తమ భవిష్యత్తును బుగ్గి చేసుకోవడంతో పాటు, తల్లిదండ్రులకు తీరని క్షోభ మిగల్చడం తప్ప?
సహజంగా విశ్వవిద్యాలయ స్థాయలో విద్యార్థులపై అనేక ప్రభావాలు పడతాయ. వాటిల్లో కొన్ని సానుకూల మైనవి కాగా మరికొన్ని ప్రతికూలమైనవి. ఇవన్నీ కలగాపుల గంగా ఉంటాయ. ప్రతికూలమైన వాటికి ఆకర్షణ ఎక్కువ. అందువల్ల విద్యార్థులు చెడు, మంచి అన్న అంశాలను, హంస.. పాలు నీళ్లను వేరు చేసిన విధంగా విడగొట్టి తమ భవిష్యత్తుపైనే దృష్టి కేంద్రీకరించాలి. తమ భవిష్యత్తుకు, అభ్యున్నతికి పనికివచ్చే సానుకూల అంశాలపట్లనే ఆకర్షణ పెంచుకోవాలి. ఫలితంగా విద్యపై ప్రధానంగా దృష్టి కేంద్రీకరించగలుగుతారు. నేర్చుకున్న విద్యే క్రమంగా విచక్షణా జ్ఞానాన్ని మరింత పెంచి వక్రమార్గంలో పయనింప జేయనీయదు.
ఇటీవలికాలంలో దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో బీఫ్ ఫెస్టివల్స్ నిర్వహణ ఎంతో వివాదాన్ని రేపాయ. దీనివల్ల క్లాసులు జరగకపోవడం, ఒకవేళ జరిగినా దీనిపైనే చర్చ జరగడం వంటివి అమూల్యమైన కాలహరణానికి కారణమ య్యాయ. ఎప్పుడైనా ఏ విషయంలో నైనా రెండు అభిప్రాయాలు ఉండటం సహజం. ఇక్కడ ఎవరిని సమర్ధిం చాం? లేదా ఎవరిని వ్యతిరేకించాం? అన్నది కాదు ప్రశ్న. ఈ అనవసర వివాదంలో చిక్కుకోవడం వల్ల మన భవిష్యత్తుకు ఏమైనా ప్రయోజనం ఉంటుందా? చదువు పూర్తయన తర్వాత ఉపాధి పొందడానికి, జీవితాన్ని సరైన మార్గంలో నడపడానికి ఇదేమైనా ఉపకరిస్తుందా? అన్ని వివేచనను విద్యార్థులు అభివృద్థి చేసుకోవాలి. జీవించడం కోసం తినాలి కాని తినడం కోసమే జీవించకూడదనే సత్యాన్ని గుర్తుంచు కోవాలి. విద్యార్థులు తమ లక్ష్యాన్ని మరువ కూడదు. దాన్ని మరచినప్పుడు మాత్రమే విశ్వవిద్యాలయాల్లో ప్రశాంత వాతావరణం దెబ్బతినిపోతుంది. విద్యా ప్రమాణాలు పడిపోతాయ. ఏవిధంగానైనా సర్టిఫికెట్ వస్తుంది. సబ్జెక్టుపై అవగాహన పెంచుకోకుండా తీసుకునే సర్టిఫికెట్ వృధా. ప్రైవేటీకరణ, ప్రపంచీకరణ కొనసాగుతున్న నేటి కాలంలో పోటీతత్వాన్ని, ఎప్పటికప్పుడు జ్ఞానాన్ని అప్పటి కాలానికి అనుగుణంగా వృద్ధి చేసుకుంటూ ప్రపంచ మార్కెట్‌లో నిలబడాల్సిన కాలంలో ఇటువంటి నిరర్ధక వివాదాల్లో పాలు పంచుకోవడం విద్యార్థులకు ఎంతవరకు సబబు? బీఫ్ ఫెస్టివల్ జరిగేది ఒక రోజు, కానీ వివాదం మాత్రం 365 రోజులు కొనసాగుతూనే ఉంటుంది. దీనివల్ల ప్రయోజనం ఏమిటి? ఇటువంటివి విద్యార్థుల విద్యాలక్ష్యాలను దెబ్బ తీస్తాయ. అందువల్లనే విశ్వ విద్యాలయాలు ఇటువంటి వివాదాస్పదమైన వాటిని అనుమతించకూడదు.
ఆసుపత్రి మంచమీద నిరంతరమూ ప్రాణాపాయ స్థితిలో పడుకొని ఉండే ప్రభుత్వాల్ని ఓట్ల ఆక్సీజన్‌తో బ్రతికిస్తుంటారు ప్రజలు. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై, రాజ్యాంగాన్ని రక్షించవలసిన ప్రభుత్వాలు రాజ్యాంగం ఆదేశించిన ప్రకారమే గోసంతతి వధను ప్రోత్సహించకూడదు. రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వంలో భాగమైన విశ్వవిద్యాలయాలు తమ ఆవరణలో గోవధను అనుమతించ కూడదు. అసలు విద్య నేర్వాల్సిన చోట్ల ఇటువంటి అనవసరపు విషయాల ప్రస్తావన ఎందుకు? విద్యార్థులు విద్యపై దృష్టి కేంద్రీకరించి తమ భవితకు మంచి పునాది వేసుకోవాలి. అంతేకాని అనవసరమైన వాటివల్ల నష్టపోవడం తప్ప మరేం ఉండదు.

- వరిగొండ కాంతారావు