సంపాదకీయం

పాకిస్తాన్‌కు ‘సమ్మానం’!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన పంజాబ్‌లోని పఠాన్‌కోట వైమానిక దళం స్థావరంపై తాను జరిపించిన దాడి గురించి పాకిస్తాన్ ప్రభుత్వం దర్యాప్తు జరుపుతుందట! ఇలా దర్యాప్తు జరపడానికి వీలుగా పాకిస్తానీ ప్రత్యేక పరిశోధక బృందం వారు మన దేశానికి వస్తారట! ఇలా రావడాన్ని మన ప్రభుత్వం స్వాగతించడం మతిమాలిన మన విదేశాంగ విధాన వైపరీత్యానికి మరో నిదర్శనం! పఠాన్‌కోటపై జిహాదీలు దాడి చేసిన తరువాత ఉభయ దేశాల మధ్య ముమ్మరంగా చర్చలు జరుగుతునే ఉన్నాయి! ఉభయ దేశాల ప్రభుత్వాల జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారులు ఎడతెగకుండా పఠాన్‌కోట అనంతర దర్యాప్తుల గురించి మంతనాలు సాగిస్తునే ఉన్నారన్నది మన విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి గురువారం సాయంత్రం వెల్లడించిన మహా విషయం! పఠాన్‌కోటపై దాడి జరిపించిన పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స విధానానికి నిరసనగా మన ప్రభుత్వం విదేశాంగ మంత్రిత్వ శాఖల కార్యదర్శుల సమావేశాన్ని రద్దు చేయలేదు. ఉభయ దేశాలు సంప్రదించుకుని పరస్పరం అంగీకారంతో ఈ సమావేశ కార్యక్రమాన్ని వాయిదా మాత్రమే వేసుకున్నారట! గురువారం మన విదేశాంగ మంత్రిత్వ ప్రతినిధి ఆవిష్కరించిన మరో మహా వార్త ఇది! మన దేశంపై పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న ప్రచ్ఛన్న యుద్ధం జిహాదీ బీభత్స కాండ! ఈ కాండను ప్రత్యక్షంగా నిర్వహించిన ముఠాలకు అనేక పేర్లు ఉన్నాయి. లష్కర్ ఎ తయ్యబా, జమాత్ ఉద్ దావా, జాయిష్‌ఏ మహమ్మద్, హిజబుల్ ముజాహిదీన్ వంటివి కొన్నిపేర్లు... ఇప్పుడు జాయిష్ ఏ మహమ్మద్ ముఠాకు చెందిన మొదటి హంతకుడు మసూద్ అజర్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం నిర్బంధించినట్టు బుధవారం ప్రచారమైంది! కానీ ఇలా నిర్బంధించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ధ్రువీకరించలేదన్నది గురువారం నాటి పరిణామం! ఈ మసూద్ ముష్కరుని నిర్బంధం గురించి పాకిస్తాన్ ప్రభుత్వం తమకు ఎలాంటి సమాచారం అందివ్వలేదన్నది గురువారం మన ప్రభుత్వం చెప్పిన మాట! ఉభయ దేశాల జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుల మధ్య నిడీ నిలకడలేని చర్చలు సంప్రదింపులు కొనసాగుతున్నప్పుడు మసూద్ అజర్ గురించి మాత్రం పాకిస్తాన్ వారు మన వారికి ఎందుకని చెప్పలేదు? మన జాతీయ భద్రతా వ్యవహారాల సలహాదారుడు అజిత్‌దోవల్ పాకిస్తాన్ ప్రభుత్వం సలహాదారుడైన నసీర్‌ఖాన్ ఝుంఝువాను మసూద్ గురించి అడిగి ఉండవచ్చు! అడగలేదా? అడిగినప్పటికీ ఝూంఝువా చెప్పలేదా? అడిగి ఉండకపోతే మనది వైఫల్యం...అడిగినప్పటికీ ఝూంఝువా చెప్పి ఉండకపోతే?
ఇలా మన ప్రభుత్వాన్ని పాకిస్తాన్ ప్రభుత్వం విశ్వశించడంలేదు, మన ప్రభుత్వం మాత్రం పాకిస్తాన్ ప్రభుత్వాన్ని విశ్వశిస్తోంది! ఉభయ దేశాల సంబంధాలలోని ఘోరమైన వాస్తవ వైచిత్రి ఇది! మసూద్ అజర్ గురించి పాకిస్తాన్ ప్రభుత్వం ఆధికారికంగా ఏమీ చెప్పకపోవడంవల్ల అతగాడిని ఇంకా నిర్బంధించలేదన్న అనుమానం తలెత్తడం సహజం! నిర్బంధించకపోయినప్పటికీ నిర్బంధించినట్టు ప్రచారం చేసిన కొందరు మాధ్యమాల ప్రతినిధులు ఇలా పాకిస్తాన్ ప్రభుత్వం వారి మంచినడవడిని ఎందుకని అత్యవసరంగా ఆవిష్కరించారు? 2008లో ఐక్యరాజ్యసమితి తీర్మానాన్ని పాటించి జమాత్ ఉద్ దావాను నిషేధించినట్టు ఆ జిహాదీ బీభత్స ముఠాలోని మొదటి హంతకుడు హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ఆధికారికంగానే ప్రకటించింది! కానీ నిజానికి జమాత్‌ను నిషేధించలేదని హఫీజ్‌ను కారాగృహానికి తరలించలేదని లాహోర్ ఉన్నత న్యాయస్థానంలో ఆ తరువాత వెల్లడైంది! ఇలా అబద్ధాలను అత్యంత ధైర్యంగా చెప్పగలగడం పాకిస్తాన్ ప్రభుత్వ స్వభావం! ఇప్పుడు జైష్ ఎ మొహమ్మద్ ముఠా మొదటి హంతకుడు అఝార్ మసూద్‌ను నిర్బంధించినట్టు అధికార ధ్రువీకరణ జరగనేలేదు! అందువల్ల మొత్తం వ్యవహారాన్ని తప్పుదారి పట్టించడానికి మాత్రమే పాకిస్తాన్ ప్రభుత్వం ఈ అనధికార ప్రచారాన్ని మొదలుపెట్టింది! పాకిస్తాన్ ప్రభుత్వం వారి మంచినడవడి గురించి బుధవారం మాట్లాడబోయిన వారు, గురువారం నాలుకలను కరచుకోవడం చారిత్రక పునరావృత్తి! ఎటొచ్చి ఇలా నాలుకలను కరచుకొనడానికి గతంలో వారాలు నెలల సమయం పట్టేది. ఇప్పుడు గంటలలోనే ఈ నాలుకలను కరచుకునే కార్యక్రమం మొదలైంది! అజర్‌ను అరెస్టు చేయకపోయి ఉండినట్టయితే పాకిస్తాన్ ప్రభుత్వం చేపట్టిన ఉగ్రవాద వ్యతిరేక చర్య ఏమిటి? పాకిస్తాన్ తీసుకోని చర్యల గురించి మన ప్రభుత్వం సంతృప్తిని వ్యక్తం చేయడం గురువారం నాటి గొప్ప పరిణామం...
పఠాన్‌కోట వైమానిక స్థావరంపై దాడి చేసిన వారు చేయించిన వారు పాకిస్తాన్‌కు చెందిన జిహాదీ హంతకులన్నది మన నిఘా వర్గాలు, పరిశోధక బృందాలు నిగ్గుతేల్చిన నిజం! కానీ పాకిస్తాన్ ప్రభుత్వం మాత్రం ఈ మన నిర్ధారణను నమ్మడంలేదు! నమ్మని పాకిస్తాన్ ఇంకా మాటలెందుకు? నమ్మకపోవడం మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రభుత్వం మన భద్రతా యంత్రాంగాన్ని బహిరంగంగా అవమానిస్తోంది! పఠాన్‌కోట బీభత్సకాండ గురించి దర్యాప్తు జరపడానికై పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశానికి ప్రత్యేక పరిశోధక బృందాన్ని పంపుతుందట! అంటే మన పరిశోధనను పాకిస్తాన్ నిర్భయంగా నిర్లజ్జగా అనుమానిస్తోంది! ఇలా అనుమానించి, అవమానిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వం విధానాన్ని మన ప్రభుత్వం స్వాగతించడమే విస్మయకరమైన వ్యవహారం...పాకిస్తాన్ దర్యాప్తు ముఠా వారు వచ్చి ఇక్కడ ఎవరిని విచారిస్తారు? వారు పఠాన్‌కోట వైమానిక ప్రాంగణంలోకి వెళ్లి జనవరి రెండవ తేదీన దాడి జరిపిన టెర్రరిస్టులు తెలుసుకోగా మిగిలిన మన రక్షణ రహస్యాలను సేకరించుకుని పోగలరు! హంతకుడు వచ్చి హతుని గృహ ప్రాంగణంలో జరిపే పరిశోధన ఏమిటి? ఇలా పాకిస్తానీ హంతకుడు ప్రత్యేక పరిశోధక బృందం-సిట్-రూపమెత్తవచ్చు గాక...వాడిని మన దేశంలోకి స్వాగతించే మన ప్రభుత్వం చర్యను మన ప్రజలు మెచ్చుకుంటారా? 2008 నవంబర్‌లో ముంబయిలో జరిగిన జిహాదీ హత్యాకాండ తరువాత పరిశోధన చేయడానికై పాకిస్తానీ దర్యాప్తు ముఠా వస్తోందన్న ప్రచారం అప్పుడు జరిగింది! కానీ దేశవ్యాప్తంగా నిరసనలు చెలరేగడంతో అప్పటి మన ప్రభుత్వం ఆ పాకిస్తానీ పరిశోధకులను రానివ్వలేదు. ఇప్పుడు మళ్లీ అదే కథ పునరావృత్తమైపోతోంది!
హంతకులను, జిహాదీలను, ఉగ్రవాదులను, బీభత్సకారులను మనదేశంపైకి ఉసిగొల్పుతున్నది నిజానికి పాకిస్తాన్ ప్రభుత్వం. ఈ వాస్తవాన్ని గతంలో పాకిస్తాన్ పాలకులుగా చెలామణి అయిన పరవేజ్ ముషారఫ్, అసఫ్ జర్దారీ స్వయంగా అంగీకరించారు! అందువల్ల నిర్బంధించి న్యాయస్థానంలో నిలబెట్టవలసింది పాకిస్తాన్ ప్రధాదిగా చెలామణి అవుతున్న నవాజ్ షరీఫ్‌ను, నవాజ్ షరీఫ్‌ను నడిపిస్తున్న పాకిస్తాన్ సైనిక నాయకులను...