ఉత్తరాయణం

సుశిక్షితులైన టీచర్లు అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నేడు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు చాలా ఉన్నాయి. అయితే వాటిల్లో పిల్లల్ని చేర్పించాలంటే చాలా కష్టం. చేతినిండా డబ్బులుండాలి. ఫీజులు, డొనేషన్లు, యూనిఫార్మ్‌లు, అవీ ఇవీ అంటూ ముక్కుపిండి మరీ వసూలు చేస్తారు. కొందరు తల్లిదండ్రులు పేదవారైనా అప్పులు చేసి మరీ ఈ బడుల్లో చేర్చి తమ ఇంటిని గుల్ల చేసుకుంటున్నారు. ప్రభుత్వాల వల్లనే ఇవన్నీ జరుగుతున్నాయి. వారు ఇంగ్లీషు మీడియం స్కూళ్లు తెరవడం లేదు. కొన్ని చోట్ల తెరచినా టీచర్లు మాత్రం సుశిక్షితులు కారు. వారం తా తెలుగు మీడియం వాళ్లు. కేవలం డిఎస్‌సిలలో ఉత్తీర్ణత, జ్ఞానానికి కొలమానం కాదని ప్రభుత్వం గుర్తించాలి. పదవీ విరమణ చేసిన ఇంగ్లీషు లెక్చెరర్లకు కూడ అవకాశం ఇవ్వాలి.
- సుధ, విశాఖపట్టణం
డ్రెస్‌కోడ్‌లో తమిళనాడు ఆదర్శం
జనవరి 1 నుంచి తమిళనాడులోని ఆలయాలకు వచ్చే భక్తులకు ఆ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను ప్రతిబింబించే విధంగా డ్రెస్ కోడ్‌ను అమలు పరచడం, మొబైల్స్, కెమెరాలు నిషేధించడం మంచి నిర్ణయం. ఆధ్యాత్మిక భావనను పెంపొందించడానికి, ఆలయాల పవిత్రతను పరిరక్షించడానికి ఇటువంటి చర్యలు ఎంతగానో ఉపయోగపడతాయి. పాశ్చాత్య సంస్కృతి ప్రభావం చేత ఫ్యాషన్ పేరిట దేవాలయాలకు ఇష్టం వచ్చినట్టు రావడం, ఇతర భక్తులకు అసౌకర్యం కలిగించే విధంగా ప్రవర్తించడం రివాజుగా మారింది. బెర్ముడాలు, షార్ట్స్, జీన్స్, టీషర్టులు, లోనెక్ టాప్స్, బిగుతుగా ఉండే లెగ్గింగ్స్ వేసుకొని రావడం పరిపాటి అయిపోయింది. ఇతర భక్తుల దృష్టి భగవంతునిపై కాక ఇటువంటి విచిత్ర వేషధారణ వేసిన వారిపైనే ఉంటుంది. ఇక కొన్ని ప్రేమ జంటలు ఒకరిపై ఒకరు పడుతూ, పిచ్చి చేష్టలు చేస్తూ ఆలయాల పవిత్రతకు తీరని భంగం కలిగిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా తమిళనాడు బాటలో నడిచి దేవాలయాలలో డ్రెస్‌కోడ్ అమలు చేయాలి.
- సి. ప్రతాప్, శ్రీకాకుళం
గ్రూప్-2 ఉద్యోగులకు పదోన్నతులివ్వాలి
తెలంగాణ ఉద్యోగులకు 40 రోజుల సాధారణ సెలవును ప్రకటించినందుకు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేసినందుకు ముఖ్యమంత్రి కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అదేవిధంగా గ్రూపు-2 పరీక్షల ద్వారా ఎన్నికైన ఉద్యోగులకు పదోన్నతులు కల్పించాలి. యువతకు ఉద్యోగాలను, అర్హులకు రుణాలను ఇప్పించాలని తెలంగాణ ముఖ్యమంత్రిని అభ్యర్థిస్తున్నాము. యువతకు ప్రాధాన్యత ఇస్తేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం.
-కొలిపాక విష్ణు శ్రీనివాసు, బెల్లంపల్లి
ఉపాధి లేకనే మతమార్పిడులు
నిరుద్యోగం, పేదరికం, హిందూ సమాజాన్ని పీడిస్తున్నాయి. అందువల్లనే మతమార్పిడులకు తేలిగ్గా అంగీకరించడం జరుగుతోంది. ముందు హిందువులకు ఉపాధి కల్పించాలి. హిందూ సంప్రదాయ్నా విదేశాలకు సైతం పరిచయం చెయ్యాలి. దేవాలయాలను పునరుద్ధరించాలి. హిందూ పాఠశాలలు, హిందూ కళాశాలలను నిర్మించాలి. గోపూజ, తులసి పూజ, లలితాదేవి కుంకుమ పూజ వంటివి తప్పనిసరి చెయ్యాలి.
- వి. సుందర రావు, విశాఖపట్టణం
రామతీర్థ ఆలయాన్ని దత్తత తీసుకోవాలి
ఉత్తరాంధ్రకే మకుటాయమానంగా విరాజిల్లుతున్న రామతీర్థం ఆలయాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి)వారు దత్తత తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కడప జిల్లాలోని ఒంటిమిట్ట ఆలయాన్ని దత్తత తీసుకొని, దీన్ని మరింతగా అభివృద్ధి పరచే నిమిత్తం రూ.100 కోట్లు టిటిడి కేటాయించిన సంగతి తెలిసిందే. భద్రాచలం తెలంగాణ పరిధిలోకి వెళ్లడంతో ఒంటిమిట్ట రామయ్య ఆలయానికి ప్రాచుర్యం లభించింది. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం పట్టు వస్త్రాలను ఒంటిమిట్ట కోదండ రామునికి సమర్పించింది. ఉత్తరాంధ్ర సాధు పరిషత్ ఉద్యమాలు చేయడంతో ఉత్తరాంధ్రలోని రామతీర్థం ఆలయంలో కూడ ప్రభుత్వం పట్టు వస్త్రాలు సమర్పించింది. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట్టకు టిటిడి తగిన ప్రాధాన్యతనిచ్చి రామతీర్థను విస్మరించారు. అందువల్ల టిటిడి వారు రామతీర్థను కూడా దత్తత తీసుకోవాలి.
- వి.కొండలరావు, పొందూరు
డ్రంకెన్ డ్రైవర్ల వల్లే ప్రమాదాలు
మద్యం సేవించి డ్రైవింగ్ చేయడం నానాటికీ పెరిగిపోతున్నది. ఎన్ని తనిఖీలు జరిగినా వీటికి అంతే లేకుండా పోయింది. ఫలితంగా ప్రమాదాలు పెరగడం అమాయకుల ప్రాణాలు అనంతవాయువుల్లో కలిసిపోవడం జరుగుతున్నది. రోడ్డుపై నడిచి వెళ్లేవారు, వాహనాలపై వెళ్లేవారు ఎంత జాగ్రత్తగా వెళ్లినా ఇలాంటి దుర్మార్గుల వల్ల యమగండం తప్పడం లేదు. మద్యం సేవించి డ్రైవింగ్ చేసే వారిపై, అతిభారీగా జరిమానా విధించాలి.
- సరికొండ శ్రీనివాస రాజు, హైదరాబాద్
బీసీ-బి సర్ట్ఫికెట్లు ఇవ్వాలి
నెల్లూరు జిల్లాలో పెరిక, బలిజ కులస్థులకు బిసీ-బి కుల ధ్రువీకరణ పత్రాన్ని అధికార్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జోక్యం చేసుకొని పై కులాలవారికి బీసీ-బి సర్ట్ఫికెట్లు జారీ చేసేలా అధికార్లను ఆదేశించాలి. గతంలో వీరికి ఈ సర్ట్ఫికెట్లు ఇచ్చారు. మరిప్పుడు నిరాకరించడం ఎందుకు? చిత్తూరు, కడప, ప్రకాశం, కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన పెరిక, బలిజ కులస్థులకు బీసీ-బి సర్ట్ఫికెట్లు జారీ చేశారు. మరి నెల్లూరు జిల్లావారికి ఎందుకు ఇవ్వరు?
- సుంకర మహేశ్ బాబ్జీ, విడవతారు, నెల్లూరు జిల్లా