సంపాదకీయం

ఆత్మహత్యా? హత్యా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ విషాదాంత కథ మరింత విషాదకరమైన మలుపు తిరిగింది. తమ కుమారుడు ఆత్మహత్య చేసుకుని ఉండడని, ఎవరో అతనిని హత్యచేసి ఉంటారని రోహిత్ తండ్రి వేముల నాగమణి కుమార్ మంగళవారం విజయవాడలో వ్యక్తం చేసిన అనుమానం ఈ విషాదతరమైన మలుపు...నిండు నూరేళ్లు జీవించవలసి ఉండిన రోహిత్ ఇలా మొగ్గగానే రాలిపోవడం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తున్న నేపథ్యం. కన్నతండ్రి వ్యక్తం చేసిన అనుమానం గురించి విశ్వవిద్యాలయ నిర్వాహకులు, కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు తక్షణం ప్రతిస్పందించాలి! ఆత్మవిశ్వాసంతో ఉత్సహంగా ఉరకలెత్తుతుండిన రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న దుర్వార్త జనవరి 17న బయటికి పొక్కిన వెంటనే దేశవ్యాప్తంగా అనేకమంది మనస్సులలో ఇలాంటి సందేహం ఉత్పన్నమై ఉండవచ్చు! కానీ రోహిత్ అకాల మరణాన్ని ఆత్మహత్యగా నిర్ధారించిన వారు చేసిన ఆర్భాటం చూసి హడలిపోయిన వారెవ్వరూ ఈ సందేహాన్ని వ్యక్తం చేయడానికి సాహసించి ఉండకపోవచ్చు! ఇప్పుడు రోహిత్ తండ్రి స్వయంగా ఈ సందేహాన్ని వ్యక్తం చేశాడు. ఇంతవరకూ రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న నిర్ధారణ ప్రాతిపదికగా కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయకు వ్యతిరేకంగాను, విశ్వవిద్యాలయం ఉపకులపతి పి.అప్పారావుకు వ్యతిరేకంగా 18వ తేదీన అభియోగాలు నమోదయ్యాయి! ఆత్మహత్యకు విశ్వ విద్యాలయం ఉపకులపతి, కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న రాజకీయ పక్షం, దళిత వ్యతిరేకులు కారణమన్న నిర్ధారణ కూడ జరిగిపోయింది. ఈ నిర్ధారణ ప్రాతిపదికగానే ప్రతిపక్షాలు రాజకీయ వేత్తలు విమానాలెక్కి హడావుడిగా హైదరాబాద్‌కు రావడం, ఆర్భాటించడం జరిగిపోయింది! రోహిత్ ఆత్మహత్య వల్ల ఈ ఆర్భాట జీవులకు దుఃఖం కలిగిన జాడలేదు, కేవలం ఈ దుర్ఘటన ప్రాతిపదికగా రాజకీయ లబ్ధిని పొందడానికి కొందరు, సంఘ వ్యతిరేక జాతి వ్యతిరేక కలాపాల ప్రాధాన్యాన్ని భూస్థాపితం చేయడానికి మరికొందరు ఆర్భాటం జరిపినట్టు ప్రజలకు కలిగిన అభిప్రాయం. సస్పెండయిన మిగిలిన నలుగురిపై క్రమశిక్షణ చర్యలు రద్దయిపోయాయి, విశ్వవిద్యాలయం ఉపకులపతిని సెలవుపై పంపించారు. మృతుని తల్లికి నష్టపరిహారం లభించింది. మొత్తం వ్యవహారాన్ని విచారించడానికి కేంద్ర ప్రభుత్వం న్యాయ విచారణ సంఘాన్ని కూడ నియమించింది! అంటే రోహిత్‌కు జరిగిన ఘోరమైన అన్యాయానికి కారకులైన వారిని నిర్ధారించడానికి వారిని శిక్షించడానికి న్యాయ ప్రక్రియ మొదలైంది! ఇదంతా రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడన్న నిర్ధారణ ప్రాతిపదికగానే జరిగిపోయింది! అందువల్ల రోహిత్ ఆత్మహత్య చేసుకోలేదని ఒకవేళ నిర్ధారణ జరిగితే హంతకులెవరన్నది తక్షణం ఉదయించే ప్రశ్న. ఈ ప్రశ్నకు సమాధానం అనే్వషించే చర్యలను కూడ పోలీసులు, అధికారులు, ప్రభుత్వాలు తక్షణం చేపట్టాలి!
రోహిత్ తండ్రి అనుమానిస్తున్నట్టుగా ఎవరైనా రోహిత్‌ను చంపి మృతదేహానికి ఉరి వేసి ఉన్నట్టయితే అలా హత్య చేయవలసిన అవసరం, చేయగల అవకాశం ఎవరికి ఉందన్న నిర్థారణ జరగాలి! అలాంటి వారిని తక్షణం గుర్తించి వారిపై అభియోగాలు దాఖలు చేయాలి. హత్యా సిద్ధాంతం నిజమైనట్టయితే ఆత్మహత్యకు పురికొల్పినట్టు అభియోగాలకు గురి అవుతున్న వారిపై ఆరోపణలను రద్దు చేయవలసి ఉంటుంది. హత్యకు కారకులైన వారు దోషులు, హత్య చేసినవారు వారిని పురికొల్పిన వారు కూడ సమాన నేరస్థులు! హత్యా సిద్ధాంతం నిజమైనట్టయితే ఇప్పుడు ఆర్భాటం చేస్తున్న వారిపైనే అనుమానాలు కలిగే ప్రమాదం ఉంది! రోహిత్ తండ్రి ఆరోపణ నిజమైతే జాతీయ సమాజంలో కులాల ప్రాతిపదికగా చిచ్చుపెట్టడానికి దేశవ్యతిరేకులు గాని, అసాంఘిక శక్తులు కాని ఉభయులూ ఉమ్మడి కాని కుట్ర చేసి ఉండాలి! దళితుడు కాని రోహిత్‌ను దళితునిగా ప్రచారం చేస్తున్నారని కన్నతండ్రి స్వయంగా చెప్పడంవల్ల ఇలాంటి సందేహం కలుగుతోంది! రోహిత్‌ది ఆత్మహత్యకు పాల్పడే బలహీన స్వభావం కాదన్నది ఇదివరకే చాలామంది చెప్పారు, ఇప్పుడు తండ్రి స్వయంగా చెబుతున్నాడు...
నాటకీయ ఫక్కీలో చలనచిత్రాలలోను కల్పిత సాహిత్యంలో ఆత్మహత్యలు హత్యలుగా నిర్ధారణ కావడం గతం! వర్తమాన సమాజంలో వాస్తవంగానే ఇలాంటి వైపరీత్యాలు ధ్రువపడుతున్నాయి. కేంద్ర మాజీ మంత్రి శశిధరూర్ భార్య సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకుందా, ప్రమాదవశాత్తు ఔషధసేవనం వికటించిందా? లేక ఆమెను ఎవరైనా అతి తెలివిగా అంతం చేసారా అన్న ప్రశ్నల గురించి పరిశోధనలు సాగుతుండడం ఒక ఉదాహరణ మాత్రమే. అందువల్ల వాస్తవానికి న్యాయం జరిగే రీతిలో ఇప్పుడు అపరాధ పరిశోధన జరగవలసింది. రోహిత్ తండ్రి కోరుతున్నట్టు పదవిలో ఉన్న న్యాయమూర్తి అధ్యక్షతన ఈ మొత్తం వ్యవహారం గురించి విచారణ జరిపించడం మేలు! హత్య నిజంగానే జరిగి ఉండినట్టయితే హంతకులు ఇప్పటికే సాక్ష్యాధారాలను రూపుమాపి ఉండవచ్చు! రోహిత్ ఆత్మహత్య చేసుకుని ఉన్నప్పటికీ, హత్యకు గురి అయి ఉన్నప్పటికీ ఆయన వ్రాసినట్టు చెబుతున్న ఉత్తరం గురించి కూడ అనుమానాలు ప్రచారవౌతున్నాయి! హత్య జరిగి ఉండినట్టయితే రోహిత్ ఆత్మహత్యాపత్రం- సూసైడ్ నోట్- వ్రాసి ఉండే అవకాశం లేదు. అందువల్ల హంతకులు ఈ సూసైడ్‌నోట్‌ను కల్పించి-్ఫర్జరీ-ఉండాలి అలా నోట్‌ను ఫోర్జరీ చేసినవారిని పసికట్టి శిక్షించడం కష్టసాధ్యమమైన వ్యవహారం. ఇలా కల్పించడం కూడ సులభమైన వ్యవహారం కాదు. రోహిత్ వ్రాసిన ఇతర వ్రాతలలోని అక్షరాలతో సరిపోల్చినప్పుడు కానీ వాస్తవాలు వెలుగును చూడలేవు. నక్షత్రాలను సందర్శిస్తూ అనుభూతిని పొందదలచుకున్న రోహిత్, కవి కావాలని కలలు కన్న రోహిత్ ఆత్మహత్యకు ఎలా పాల్పడి ఉంటాడన్నది ప్రశ్న! ఏదో ఇతర విషయంపై రోహిత్ వ్రాసుకున్న పేజీలలోని ఇతరులెవరో ఆత్మహత్యా వ్యవహారాన్ని అతి తెలివిగా చొప్పించారా? ఏది ఏమయినప్పటికీ రోహిత్ తండ్రి తన అనుమానాన్ని 18వ తేదీన కాని మరుసటిరోజున కాని ఎందుకు వ్యక్తం చేయలేదన్నది మరో సందేహం. అలా జరిగి ఉండినట్టయితే గత పదిరోజుల పాటు జరిగిన ఆందోళనలు, ఆర్భాటాల తీరు విభిన్నంగా ఉండేదేమో!
ఒక నిండు ప్రాణం బలైపోవడం మానవీయ హృదయం కలవారందరినీ కలచివేసిన దుష్పరిణామం. కానీ ఇందు బాధ్యులెవ్వరో వారే దోషులు. అమాయకులను సంబంధంలేని వారిని అభియోగాలలో ఇరికించేందుకు ఆర్భాటాలు చేయడం గర్హనీయం! ఈ దుర్ఘటనను సాకుగా తీసుకుని దేశ విద్రోహ శక్తుల కలాపాలనుండి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నా లు కూడ గర్హనీయం...