సంపాదకీయం

‘సౌర’ కూటమికి శ్రీకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ‘సౌర’ సంఘటన- ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్’-ఐఎస్‌ఏ- ఏర్పడడం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరుగుతున్న పర్యావరణ సదస్సులో సంభవించిన కీలక పరిణామం. ఈ సౌర సంఘటనను ఏర్పాటు చేయాలన్న మన ప్రభుత్వ ప్రతిపాదనకు అతర్జాతీయ సమాజం అనుకూలంగా స్పందించడం మనకు లభించిన ప్రాకృతిక విజయం. ఈ సౌరశక్తి దేశాల సంఘటన మరో ప్రధాన అంతర్జాతీయ వేదికగా అవతరించనున్నది. కర్బన కాలుష్యాలను తగ్గించడానికి జరుగుతున్న అంతర్జాతీయ చర్చలు ఒక కొలిక్కి వస్తాయా అన్నది ఇప్పటికీ అనుమానమే. కాలుష్యం పెంచి ప్రపంచానికి పంచిపెట్టిన అమెరికా, చైనా వంటి సంపన్న దేశాలకూ, ప్రవర్థమాన దేశాలకూ మధ్య ‘కర్బన్ కాలుష్య’ నియంత్రణపై ఏకాభిప్రాయం ఇప్పటికీ కుదరకపోవడం పారిస్ సదస్సునకు నేపథ్యం. కాలుష్య వాయువులను అత్యధికంగా విడుదల చేస్తున్న చైనా అమెరికా దేశాల అధ్యక్షులు పారిస్ సదస్సు తొలి రోజున సోమవారం, తమ ప్రసంగాలలో కాలుష్య వాయువుల నియంత్రణకోసం కృషి చేస్తామని ప్రతిజ్ఞలు చేసినప్పటికీ, సదస్సునకు హాజరవుతున్న నూట తొంబయి ఐదు దేశాల ప్రతినిధుల మధ్య ఏకాభిప్రాయం కుదరడం కష్టమన్న అభిప్రాయాలు ప్రచారమవుతున్నాయి. ఈ రెండు దేశాలూ ప్రస్తుతం కొనసాగుతున్న కాలుష్యం స్థాయిని ముప్పయి ఐదు శాతానికి పైగా తగ్గించగలమన్న నిబద్ధతను ఇదివరకే ఆవిష్కరించి ఉన్నాయి. కానీ ఇదే స్థాయిలో నిర్ణీత గడువులోపల అన్ని దేశాల వారు కర్బన కాలుష్యాలను, వాయు కాష్యాలను తగ్గించుకోవాలని సంపన్న దేశాలవారు పట్టుబడుతుండడం ఏకాభిప్రాయ రాహిత్యానికి ప్రధాన కారణం. పారిశ్రామిక ప్రగతి పరాకాష్ఠకు చేరిన సంపన్న దేశాలలో పెట్రోలియం, బొగ్గు, విష రసాయనాలు, ఇతరేతర కాలుష్యాలు ప్రకృతిని ఊపిరాడకుండా చేశాయి. ఈ సంపన్న కాలుష్యం వల్లనే సముద్రాలు వేడెక్కిపోయి అనేక చిన్న ద్వీపాలు నీట మునిగి పోవడానికి సిద్ధంగా ఉన్నాయి. అణుశక్తి ఉత్పాదకత పెరగడం కూడ వాతావరణం వేడెక్కిపోవడానికి కారణం. కానీ పారిశ్రామిక ప్రగతి పెద్దగా జరగని చిన్న దేశాలలోను, వర్ధమాన దేశాలలోను ప్రకృతిని వికృత పరుస్తున్న కాలుష్య ఉద్గారాల శాతం తక్కువ. అందువల్ల సంపన్న దేశాలతో సమానస్థాయిలో కాలుష్యాన్ని తగ్గించాలన్న, కోర్కెలను వర్ధమాన దేశాలు తిరస్కరిస్తుండడం విభేదాలకు కారణం. చైనా రాజధాని బీజింగ్ నగరాన్ని భయంకర కాలుష్య వాయుమండలం కప్పి ఉండడం పారిస్ సదస్సునకు నేపథ్య వైపరీత్యం. నవంబర్ 28న బీజింగ్ నగర కాలుష్యం కనీవినీ ఎరుగని తారస్థాయికి చేరిందట. హిమాలయ పర్వతాలు కరిగిపోయి శిలామయ పర్వతాలు ఏర్పడుతుండడానికి ప్రధానంగా చైనా దశాబ్దుల పాటు పెంచిన కాలుష్యం కారణం..ఇలా బొగ్గు, పెట్రోలియం, అణుశక్తి కాలుష్య తాపాన్ని పెంచుతున్న సమయంలో మన ప్రభుత్వం సౌరశక్తి ఉత్పాతక దేశాల కూటమిని ఏర్పాటు చేయడం మన సనాతన విశ్వహిత స్వభావానికి నిదర్శనం. సౌరశక్తి స్వచ్ఛమైనది. కాలుష్య నిర్మూలకు దోహదకరమైనది.
సౌరశక్తి నుండి విద్యుచ్ఛక్తిని ఉత్పత్తి చేయడం అణు విద్యుత్, కర్బన విద్యుత్, జల విద్యుత్‌లను ఉత్పత్తి చేయడం కంటె తక్కువ ఖర్చుతో సాధ్యం అయినప్పటికీ సౌరశక్తి వినియోగం గురించి ఇప్పటికీ అవగాహన పెరగకపోవడం విచిత్రమైన స్థితి. అమెరికా, రష్యా, చైనా, జపాన్, దక్షిణ కొరియా వంటి ఆర్థిక అగ్రదేశాలు సౌర క్షేత్రానికి వెలుపల ఉండడం సౌరవిద్యుత్ ఉత్పత్తి గురించి అంతర్జాతీయ శ్రద్ధ లేకపోవడానికి కారణం. ఐరోపా ఖండం కూడ ఈ సౌర క్షేత్రానికి వెలుపల ఉన్నది. భూమండలంపై సున్న అక్షాంశం భూమధ్యరేఖ, భూమధ్యరేఖకు దక్షిణంగా దక్షిణార్ధగోళం, ఉత్తరంగా ఉత్తరార్ధగోళం విస్తరించి ఉన్నాయి. భూమధ్య రేఖ నుంచి దక్షిణంగా ఇరవై మూడున్నర డిగ్రీలపై మకర రేఖ నెలకొని ఉంది. భూమధ్యరేఖకు ఉత్తరంగా ఇరవైమూడున్నర డిగ్రీల అక్షాంశం కర్కాటక రేఖ. మకర, కర్కాటక రేఖల మధ్య ఉన్న ప్రపంచం సౌర క్షేత్రం. ఈ ప్రాంతంలోని దేశాలలో మాత్రమే సూర్యుడు నిరంతరం - పనె్నండు నెలలపాటు- వెలుగును వేడిని వెదజల్లుతున్నాడు. ఇది ఖగోళస్థితి. మకర రేఖకు దక్షిణంగా పోయినకొద్దీ సూర్యుని వెలుగు సక్రమంగా చల్లబడిపోయింది. కర్కాటక రేఖకు ఉత్తరంగా వెళ్లిపోయిన కొద్దీ కూడా ఇదే స్థితి. అందువల్ల ఈ చలి దేశాలలో సౌరశక్తి ఉత్పత్తి కావడం కష్ట్భూయిష్టం. ధ్రువ మండల ప్రాంతంలోను, దానికి అనుకొని ఉన్న దేశాలలోను సౌరశక్తి ఉత్పత్తి దాదాపు అసాధ్యం. అందువల్లనే సౌరమండలం వెలుపలనున్న అమెరికా రష్యా వంటి దేశాలు సౌరశక్తి ఉత్పాదన పట్ల అశ్రద్ధ వహించాయి. చైనా దక్షిణ భాగం సౌరక్షేత్రాన్ని తాకుతున్నప్పటికీ అత్యధిక భాగం సూర్యుని వేడికి దూరంగానే ఉంది.
అందువల్ల అంతర్జాతీయ సౌరశక్తి దేశాల కూటమికి మన ప్రభుత్వం నాయకత్వం వహించడం అతి సహజం. ఆసియా ఖండంలోని అత్యధిక దేశాలు, ఆఫ్రికా ఖండం, ఆస్ట్రేలియా, దక్షిణ అమెరికాలోని ఉత్తర దేశాలు, ఉత్తర అమెరికాలోని మెక్సికో వంటి దేశాలు, ఈ సౌరక్షేత్రంలో విస్తరించి ఉన్నాయి. ఈ సౌరశక్తి దేశాల కూటమి భవిష్యత్తులో ఒక అంతర్జాతీయ ఆర్థిక శక్తిగా ఎదగడానికి వీలుంది. అందువల్ల ఈ సౌరకూటమి ఏర్పడడం మన దేశానికి వ్యూహాత్మక విజయం. బొగ్గు, పెట్రోలియం, యురేనియం, థోరియం వంటి నిక్షేపాలు క్రమంగా తగ్గిపోతాయి. కానీ సూర్యుని కాంతి మాత్రం తరగని సంపద. సౌరశక్తి కూటమి-ఐఎస్‌ఏ- ప్రధాన కార్యాలయం మనదేశంలోనే నెలకొని ఉంటుందట. ఐదేళ్లపాటు ఈ వ్యవస్థ నిర్వహణకయ్యే మొత్తం ఖర్చును మన ప్రభుత్వమే భరిస్తుంది. మన ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ సదస్సుకు హాజరవుతున్నారు. సదస్సు మొదటి రోజుననే ఇలా ‘సౌరశక్తి సంఘటన’ ఏర్పటినట్టు మన ప్రధాని ప్రకటించడం శుభారంభం. ఈ కూటమి ఏర్పడడం సభ్య దేశాలు సమష్టిగా పరిశోధన జరపడానికి, విద్యుచ్ఛక్తి ఉత్పత్తిని వౌలిక అవసరాలైన సౌర పటల-సోలార్ ప్లేట్స్- తక్కువ ఖర్చుతో రూపొందించడానికి వీలవుతుంది. సౌర విద్యుత్‌ను స్యూకాంతి తగినంతలేని దేశాలకు సైతం సరఫరా చేయాలన్న మన ప్రభుత్వ దీర్ఘకాల లక్ష్యం వసుధైక కుటుంబ భావానికి అనుగుణం.
కాలుష్య ఉద్గారాలను 2005 నాటి స్థాయికంటె 2030 నాటికి ముప్పయి ఐదు శాతం తగ్గించాలన్న లక్ష్యంతో ప్రస్తుతం పారిస్‌లో ఈ కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-సభ్యదేశాల సమావేశం- జరుగుతున్నది. అగ్రరాజ్యాల నిర్బంధ నిబంధనలను నిరసించినప్పటికీ దాదాపు సంపన్న దేశాలు తగ్గించే స్థాయిలోనే కాలుష్యాలను తగ్గించనున్నట్టు మన ప్రభుత్వం స్వచ్ఛందంగా ప్రకటించి ఉంది. సౌరశక్తి ఉపయోగం పెరిగి కర్బన ఇంధన వాయు కాలుష్యాలు తగ్గడం వల్ల ఇది సాధ్యం. సూర్యుడు జగత్తునకు ఆత్మ అన్నది వేదం గుర్తించిన సత్యం. సౌరశక్తి జగతికి ఆధారం..ఆహారం, ప్రాణం..