మెయన్ ఫీచర్

పద్మాలకు ప్రమాణం ఏమిటి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పత్రికారంగాన్ని ఫోర్త్ ఎస్టేట్ అని పిలుస్తారు. ఐన్‌స్టీన్ కాలాన్ని నాల్గొవ కొ లతగా నిర్ణయించినట్లు పత్రికారంగం భారత ప్రజాస్వామ్యానికి నాల్గవ కొల మానం. ‘వార్త నణచువాడు స్వాతంత్ర హర్తరా’ అన్నారు నార్ల వెంకటేశ్వరరావుగారు. 1954లో ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడానికి నార్ల వారి కృషి ఎంతగానో దోహదపడిందనేది అందరికీ గుర్తుండే వుంటుంది. అంటే పత్రికను వారు వజ్రాయుధంగా వాడుకున్నారు. తెలుగు పత్రికా రంగానికి వనె్న తెచ్చిన అంతర్జాతీయ ప్రమాణాలు తెచ్చిపెట్టిన కోటంరాజు, చలపతిరావు, ముట్నూరి కృష్ణారావు వంటివారు ఎందరో ఉన్నారు. 2016 సంవత్సరానికి రామోజీరావుకు పద్మ విభూషణ్ పురస్కారం ఇవ్వడం పత్రికారంగాన్ని గౌరవించినట్లయింది. యుపిఎ ప్రభుత్వం హయాంలో ఫాల్కే, పద్మ వంటి పురస్కారాల విషయంలో అవినీతి చోటు చేసుకుందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. ఇవి నిరాధారమైనవని కొట్టిపారేయలేం. మహాత్మాగాంధీని అశ్లీల జంతువు అని విమర్శించిన ఋత్విక్ ఘటక్‌కు బెంగాల్ ప్రభుత్వం పద్మ పురస్కారం ఇప్పించింది. ఇక కృష్ణ, చిరంజీవి, ఎంజిఆర్ వంటి వారికి పురస్కారాలు లభించాయి. పీవీ నరసింహారావు హయాంలో తెలుగువారి ప్రతిభను గుర్తించారు. విశ్వనాథ, సీనారే, కాళోజీ, ఏఆర్ కృష్ణ వంటి ఎందరికో వారు జాతీయ స్థాయిలో గుర్తింపునిచ్చారు. బెజవాడ గోపాల రెడ్డి ఒకసారి నాతో మాట్లాడుతూ, ‘‘కేంద్ర జ్ఞానపీఠ్ కమిటీకి నేను అధ్యక్షుడిని. విశ్వనాథ వారికి పురస్కారం రాకుండా అడ్డుకున్నారు. నేను నా అధ్యక్షుని ఓటు వేసి వారికి పురస్కారం ఇప్పించాను. లేకుంటే వచ్చేది కాదు’’, అన్నారు.
తెలుగు పత్రికారంగంలో ఐ.వెంకట్రావు, పొత్తూరి వెంకటేశ్వరరావు, చలపతిరావు వంటి సీనియర్లు ఎందరో ఉన్నారు. ఇలాంటి వారికి రావలసిన జాతీయ స్థాయి గుర్తింపు రాలేదు. యామినీ కృష్ణమూర్తి సరే, ఉమా రామారావు, అలేఖ్య, ప్రహ్లాదశర్మ భాగవతుల సేతురాం, పసుమర్తి వంటి వారి మాటేమిటి? శోభా నాయుడు పద్మభూషణ్ కోసం లోగడ దరఖాస్తు పంపుకున్నారు. రంజనా గేహర్ (ఒడిస్సీ) పంపుకున్నారు. అయినా ప్రయోజనం లేకపోయింది. పురస్కారాల ప్రకటనకు చాలా ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుండి కేంద్రం సూచనలు కోరుతుంది. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని పేర్లను పంపుతుంది. వాటినుండి కొన్నింటిని కేంద్రం అంగీకరిస్తుంది. ఐతే ఈ ప్రక్రియలోని లోపాలు ఏమంటే ఒక్కొక్క రాష్ట్రం 30 పేర్లను పంపుతుంది. అంటే వివిధ రాష్ట్రాలనుంచి దాదాపు వెయ్యిపేర్లు వస్తాయి. ఇవికాక వివిధ సంస్థలు వ్యక్తులు తమ తమ అభ్యర్థులను సూచిస్తారు. అవి మరొక వెయ్యి పేర్లుంటాయి. వీటినుండి నూటపాతిక మందిని మాత్రమే ఎంపిక చేస్తారు. ఒక్కొక్కప్పుడు ఒక రాష్ట్రం పంపిన మొత్తం జాబితాను కూడా కేంద్రం బుట్టదాఖలు చేయవచ్చు. ఎవరూ సూచించని పేర్లు కూడా ఢిల్లీ స్థాయిలో కొత్తగా చేరవచ్చు. ఇందుకు స్పష్టమైన ఉదాహరణలున్నాయి. 2015-16 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రం మొత్తం వందపేర్లను పంపింది. వీటిని పరిగణలోకి తీసుకోలేదు. అంటే ఏమిటి? రాష్ట్ర ప్రభుత్వాలు ఇలా పెద్ద జాబితాను పంపకూడ దు. సాహిత్య, సంగీత, చిత్రసీమ, నాట్యం, క్రీడా రంగం, వైద్యం, పారిశుద్ధ్యం, సమాజసేవ, ఆధ్యాత్మిక రంగం ఇలా ఒక్కొక్క రంగానికి ఒక్కొక్క పేరు చొప్పున ఏడెనిమిది పేర్ల కంటె పంపకూడదు. పంపిన పేర్లను కేంద్రం గౌరవించాలి. అదీ కానప్పుడు ఫెడరల్ వ్యవస్థకు అఘాతం కలిగిందంటూ కొన్ని రాష్ట్రాలు విమర్శించేందుకు మనమే ఆస్కా రం కల్పించనట్లవుతుంది. తనకు భారతరత్న ఇవ్వాలని లోగడ గిరిజాదేవి అనే గాయకురాలు గొడవ చేశారు. అలాగే భారతరత్న కోసం ఎన్టీఆర్ పేరును ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం సూచించింది. పి.వి. నరసింహారావు పేరును తెలంగాణ ప్రభుత్వం సూచించింది. వీరెవరికీ ఆ పురస్కారాలు రాలేదు. పీవీకి భారతరత్న రాలేదని కాంగ్రెస్‌వారు కోపం తెచ్చుకున్నారు. మరి తమ హయాంలో ఏం చేశారు? ఆయన చితి కూడా సరిగ్గా రగలకుండా సోనియాగాంధీ చేసింది. పీవీ, ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజు, టంగుటూరి ప్రకావం వంటి వారికి భారత రత్న ఇవ్వవలసిందే. మరణానంతర పురస్కారాల గతి అట్లా ఉంచి, జీవించి ఉన్న కళాకారులను గౌరవించాలి కదా! జమున పద్మశ్రీ కోసం దరఖాస్తు చేసుకుంటే దాన్ని రాష్ట్ర స్థాయిలోనే తిరస్కరించారు. రావు బాలసరస్వతి (గాయ ని), మరళీమోహన్ (నటుడు), ఉషా గాయత్రి (నర్తకి) వంటి వారి పురస్కార అభ్యర్థనలు పరిగణలోకి తీసుకోలేదు. తమిళనాడులో ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రజనీకాంత్‌కు పద్మ విభూషణ్ ప్రకటించారన్న విమర్శ వచ్చింది. చాగంటి కోటేశ్వరరావు, సామవేదం షణ్ముఖశర్మ, ఎం. శ్రీనివాసరావు, విజయేశ్వరీమాత (పెంచాలకోన) వంటి వారు ఆధ్యాత్మిక రంగాలలో ఎంతగానో దశాబ్దాల తరబడి సేవలు అందిస్తున్నారు. వీరిని కేంద్ర ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. ధీరూబాయి అంబానీ గొప్ప పారిశ్రామికవేత్త. ఆయన గుజరాత్ రాష్ట్రానికి చెందినవారు. మరణానంతరం పురస్కారం లభించింది. అలాగే ఆధ్యాత్మికవేత్త దత్తానంద సరస్వతికి మరణానంతర పురస్కారం ఇచ్చారు. కందుకూరి శివానంద మూర్తిగారి పేరు ఎందుకో కేంద్రం దృష్టికి రాలేదా?
ఆశా పరేఖ్ అనే సినీతార తనకు పద్మభూషణ్ కావాలని నితీన్ గడ్కరీతో చెప్పించింది. శతృఘ్నసిన్హాతో ఒత్తిడి తెచ్చింది. ఐనా ఫలించలేదు. మంగళంపల్లి బాలమురళీకృష్ణ చాలాకాంలగా భారతరత్న ఆశిస్తున్నారు. కాని నెరవేరలేదు. రాజవౌళికి (బాహుబలి ఫేం) పద్మ పురస్కారం వచ్చిందుకు చిత్రసీమ ఆనందం వ్యక్తం చేసింది. అదే సమయంలో రుద్రమదేవి చిత్రం తీసిన గుణశేఖర్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదన్న విమర్శ వచ్చింది.
అంజలీదేవి, సావిత్రి, జి. వరలక్ష్మి, ఎస్. వరలక్ష్మి, ఎస్.వి రంగారావు వంటి దిగ్గజాలు కేంద్ర గుర్తింపు లేకుండానే కన్నుమూశారు. శ్రీశ్రీకే ఎట్టి పురస్కారాలు ఇవ్వలేదు. వచ్చిన పురస్కారాలు అందుకోకూడదు అంటూ ఆయనపై విప్లవ రచయితల సంఘాలు ఒత్తిడి తెచ్చాయి. మరి ఓల్గా, రాచపాలెం చంద్రశేఖర రెడ్డి, కాత్యాయని విద్మహే వంటి వారు పురస్కారాలు అందుకునప్పుడు ఈ బూర్జువా ప్రభుత్వాలను ఎందుకు విమర్శించలేదు?
వినోద్ రాయ్ లోగడ బొగ్గు కుంభకోణం విషయంలోధైర్యంగా నేరస్థులను వెలుగులోకి తీసుకొచ్చారు. కాబట్టి ఆయనకు కేంద్ర సత్కారం లభించింది. ఐతే సీబీఐ దాడులు జరిగిన ఒక కంపెనీ అధికారికి కూడా ఈ సంవత్సరం గుర్తింపు వచ్చింది. పురస్కార ప్రకటనకు ముందు పోలీసు నిఘా విభాగం నివేదికను పరిగణలోకి తీసుకోవాల్సి ఉం టుంది. ఇది పండిత దీన్ దయాళ్ ఉపాధ్యాయ శత జయంతి సంవత్సరం. ఆయనకు భారతరత్న ప్రకటించకపోవడం క్షమించరాని నేరం. భాజపా అధికారంలోకి వచ్చిన తర్వాత కూడ ఇలా ఉంటే ఎలా? అందువల్ల ఈ పురస్కారాలను పూర్తిగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కేంద్ర సాహిత్య, సంగీత, నాటక అకాడమీలు పారదర్శకంగా వ్యవహరించడం లేదు. అనుభవం మానవుడికి విజ్ఞానాన్ని ప్రసాదించాలి. 50 మంది సూడో సెక్యులరిస్టులు పురస్కార తిరస్కార ప్రహసనం ప్రదర్శించిన తర్వాత కూడా వివేకోదయం జరుగకపోతే ఎలా?
స్వామి తేజోమయానందకు పురస్కారాన్ని ఇచ్చినప్పుడు స్వామి సిద్ధేశ్వరానందకు ఎందుకు ఇవ్వలేదు? విశ్వయోగి విశ్వంజీ పేరు ఎందుకు ఢిల్లీ వెళ్లలేదు? కలం వీరుడు ఎంవిఆర్ శాస్ర్తీ భారతీయ ధర్మానికి చేస్తున్న సేవ తక్కువేమీ కాదు. హైదరాబాదులో మర్రి కృష్ణారెడ్డి అనే ఒకాయన ఉన్నాడు. చతుర్వేదాలు, తెలుగులోకి తీసుకొచ్చాడు. విచిత్రమేమంటే ఆయన పేరు ఎవరికీ తెలియదు. నిజానికి ఇట్టి వారికి పద్మభూషణ్ ఇవ్వాలి.
భారతదేశంలో అరక్షణ విధానం ఉంది. దీన్ని దేశవ్యాప్తంగా ఇచ్చే వివిధ పురస్కారాలకు వర్తింపజేస్తున్నారా? అనిపిస్తున్నది. రాజకీయ లబ్దికోసం కొన్ని కొన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వడం, మనం చాలా దశాబ్దాలుగా చూస్తున్నాము. ప్రతిభ పరిగణలోకి రాదు. కవిత్వమొక తీరని దాహం అన్నాడు ఒక మహాకవి. కళాకారులు కళా సృష్టి ఎందుకు చేస్తారు? అంటే అది చేయకపోతే వారు జీవించలేరు కదా! అలాంటి వారిని అనే్వషించి గౌరవించవలసిన బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. రత్నాలు, రాజులను వెతుకుతూ రావు. రాజులే రత్నాలను వెతికి సేకరించాలి. ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రుల చుట్టూ తిరిగి పైరవీలు చేసుకోగల ధనబలం కలవారు ఆదర్శ కళాకారులు కాజాలరు. భారతరత్న దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం. అది రాజకీయ ప్రయోజనాల కోసం ఇవ్వబడటం జరుగుతున్నది. భారతరత్న ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చే అత్యున్నత పురస్కారం. అది రాజకీయ ప్రయోజనాలకోసం ఇవ్వ డం జరుగుతున్నది. ప్రతిభా పాటవాలకు కాక ప్రతిభా పాటిల్‌గారి రాష్ట్రానికి వడ్డింపులు జరిగాయని లోగడ ఆమె భారత రాష్టప్రతిగా ఉన్నప్పుడు ఆరోపణలు వచ్చా యి. ఇది తగదు.
అనుభవం విజ్ఞులకు పాఠాలు, గుణపాఠాలు నేర్పుతుంది. ఎక్కడో ఓ మారుమూల గ్రామంలో స్థానికులు ఒక పశువుల దొంగను కొట్టి చంపారన్న సాకుతో యాభైమంది మేధావులు తమ పురస్కారాలను తిరస్కరించి నిరసన తెలియజేశారు. అశోక్ వాజ్ పేయ అనే రచయత దాద్రి సంఘటన నేపధ్యంలో ఒక పురస్కారాన్ని, హైదరాబాద్ కేంద్ర విశ్వవిద్యాలయం అల్లర్ల తర్వాత డాక్టరేట్‌ను తిరస్కరించాడు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగించవలసిన అంశాలు. ఐనా గుడ్డిగా పురస్కారాలు ప్రకటించడం వల్ల చేసిన తప్పునే మళ్లీ చేసినట్టయింది. పురస్కారాల ప్రకటనలు వచ్చిన 24 గంటలలోపే తమిళనాడుకు చెందిన జయమోహన్ అనే రచయిత తన పద్మ పురస్కారాన్ని తిరస్కరించి కేంద్ర ప్రభుత్వానికి షాక్ ఇచ్చాడు. ఇలా ఎందుకు జరిగింది? నరేంద్ర మోదీ ప్రభుత్వం ఆత్మ విమర్శ చేసుకోవలసిన సమయం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరపున సాంస్కృతిక విధానాన్ని పురస్కారాల ప్రక్రియను పునర్‌మూల్యాంకనం చేయసుకొని కేంద్ర సాహిత్య, సంగీత, నాటక అకాడమీలను పూర్తిగా పునాదులనుంచి ప్రక్షాళన చేయవలసిన సమయం వచ్చింది. ‘పంకం’ నుంచి పద్మాలు వికసిస్తాయి. కానీ బురద పద్మానికి అంటదు. కమలనాధులు ఇచ్చే పద్మ పురస్కారాలకు బురద అంటకూడదు కదా?

-ముదిగొండ శివప్రసాద్