ఉత్తరాయణం

మాతృభాషపై తగ్గుతున్న మమకారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశాన్ని 150 ఏళ్ల పాటు పరిపాలించిన ఆంగ్లేయులు ఆంగ్ల భాష మోజును మన నరనరాల్లోకి ఎక్కించారు. అది ఎంతగా మనల్ని ప్రభావితం చేసిందంటే ఇప్పటికీ ఆంగ్లం అంటే పడి చచ్చేటంతగా! ఈ పరభాషా మోజులోనికి ఇప్పటి ఫ్రెంచ్, జర్మనీ వంటి భాషలు కూడా వచ్చాయి. తెలుగు భాషంటే మన తెలుగువారికి ఎంత చిన్నచూపు. ప్రభుత్వం కూడా మన భాషను విస్మరించి అన్యభాషలకు ప్రాధాన్యమిచ్చేలా ప్రవర్తిస్తోంది. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా షాపుల పేర్లు, హోటళ్ల పేర్లు ఇంగ్లీషులోనే దర్శనమిస్తాయి. ఇంగ్లీషు చదువుల ప్రవాహంలో కొట్టుకుపోతున్న మన పిల్లలకు తెలుగులో ఏం చెప్పినా అర్థంకాదు. పొరుగు రాష్ట్రాలవారు ప్రపంచంలో ఏమూలకు వెళ్లినా వారి మాతృభాషలోనే మాట్లాడుతారు. వారి సంప్రదాయ దుస్తులనే ధరిస్తారు. వారి పాలన అంతా మాతృభాషలోనే జరుగుతుంది. వివిధ రంగాల్లో ప్రావీణ్యం సాధించినవారు కనీసం డిగ్రీవరకు వారి మాతృభాషలోనే విద్యాభ్యాసం సాగించారు. ఇంగ్లీషు పరమావధి అనుకుని మన వారు రెంటికీ చెడ్డ రేవడిలా అవుతున్నారు. ప్రభుత్వం తెలుగుభాషను అధికార, పాలనా భాషగా అమలుచేయాలి. తెలుగుమీడియం విద్యార్థులకు ఉద్యోగాలలో అదనపు అర్హత కల్పించాలి. ప్రజలు కూడా మాతృభాష పట్ల మమకారం పెంచుకోవాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
స్వార్థపూరిత నేతలు
దరిద్ర నారాయణుల మనసులను చూరగొనడానికి వివిధ రాజకీయ పార్టీల నేతలు వివిధ ఉచిత సంక్షేమ పథకాలను పోటాపోటీగా రూపొందించడం కేవలం ఓట్ల కోసం ఆయా రాజకీయ పార్టీల నేతలు చేపడుతున్న స్వార్థపూరిత ప్రణాళికలో భాగమేకానీ నిరుపేదల పట్ల దేశాభివృద్ధి పట్ల ఆ ప్రబుద్ధుల విశాల హృదయానికి కొలబద్ధ ఏ మాత్రమూ కాదు. నిజంగా నిరుపేదల పట్ల అభిమానం ఉంటే, దేశ ప్రగతికై తహతహలాడే సహృదయమే కలిగి ఉంటే... ప్రతి పేద విద్యార్థి చదువుల తల్లి ఒడిలో హాయిగా సేదతీరి భరతమాత గర్వించతగ్గ రీతిలో లోక కళ్యాణం కొరకై పరితపించే విధంగా తీర్చిదిద్దడానికైదోహదపడే మహోన్నత విలువలు కలిగిన విద్యావిధానాన్ని ప్రభుత్వ పాఠశాలల ద్వారా సఫలీకృతమయ్యేటట్లుగా నిర్దిష్టమైన విధి విధానాన్ని విజయవంతంగా చేపట్టాలి. తద్వారా మేడిపండు చూడమేలిమైనుండు... పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న అమూల్య పద్యానికి ప్రతీకగా నిలిచి విలువైన విద్యను అందించే నెపం తో పేదల వద్దనుండి సైతం వేల లక్షల రూపాయలను నిర్దాక్షిణ్యంగా గుంజుతున్న కార్పొరేట్ రక్కసి పీచమణచాలి.
- అల్లాడి వేణుగోపాల్, బారకాసు
కళాశాలల వద్ద పార్కింగ్ సమస్య
జంట నగరాల్లో అనేక ప్రైవేటు జూనియర్, డిగ్రీ కళాశాలలు జాతీయ, ప్రధాన రహదారులను ఆనుకొని ఉన్న భవనాల్లోనే ఏర్పాటుచేస్తున్నారు. అలాంటిచోట్ల శబ్ద కాలుష్యం, వాహనాల కాలుష్యం అధికం. వాతావరణ, శబ్ద కాలుష్యాల మధ్య ఏకాగ్రతలో చదవడం సాధ్యంకాదు. ద్విచక్ర వాహనాలపై కళాశాలకు వచ్చే విద్యార్థులకు పార్కింగ్ సదుపాయాన్ని కూడా కళాశాలల యాజమాన్యాలు కల్పించలేకపోతున్నాయి. రోడ్ల ప్రక్కన స్కూటర్లు, సైకిళ్ళను ఉంచేస్తుండటంతో వాహనాల రాకపోకలకూ కళాశాల పరిసరాల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. హైదరాబాద్‌లోనే కాక జిల్లా, పాత తాలూకా కేంద్రాల్లో కూడా ప్రైవేటు కళాశాలలను ఇరుకిరుకు భవనాల్లో, రణగొణ ధ్వనుల మధ్య నిర్వహిస్తున్నారు. మారుతున్న రోజులకు అనుగుణంగా విద్యావ్యవస్థ మార్పులకు లోనవుతున్న మాట వాస్తవమే. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు, అసౌకర్యాలు కలగని రీతిలో విద్యాభ్యాసానికి ప్రైవేటు యాజమాన్యాలు వీలుకల్పించాలి. దానికి విద్యాశాఖాధికారులు పూనుకోవాలి. కళాశాల భవనాలు ప్రధాన రహదారులకు కొంత లోపల ఉండేట్లుగా చూడాలి. సంబంధిత ప్రభుత్వ శాఖలు ఈ విషయంపై దృష్టిసారించాలి.
- గోదూరు అశోక్, కరీంనగర్
ఆర్థిక నేరాలకు శిక్ష లేదా?
ఇండియాలోని చట్టాల బలహీనతలు, పోలీసు వ్యవస్థ లోపాయకారి ప్రవర్తన, కోర్టుల యొక్క కాలయాపన, రాజకీయ నాయకుల జోక్యంవల్లా దేశంలో ఆర్థిక నేరస్థులు సులభంగా తప్పించుకోగల్గుతున్నారు. ఈ వ్యవస్థల బలహీనతల వల్ల దేశంలో నేరస్తులు రెచ్చిపోతున్నారు. ఆర్థిక నేరస్తులు ఏ భయము లేకుండా ప్రజాధనానే్న గాక, ప్రభుత్వ ఆస్తులను విచ్చలవిడిగా దోచి, ఆ నిధులను దేశాన్ని దాటిస్తున్నారు.