మిర్చిమసాలా

ఇక్కడే ఉంటా నంటే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజకీయ నాయకుల మాటలకు అర్ధాలు వేరుగా ఉంటాయి. చెప్పింది చెప్పినట్లుగా అర్ధం చేసుకుంటే పప్పులో కాలేసినట్లే. జిహెచ్‌ఎంసి ఎన్నికల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హైదరాబాద్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. హైదరాబాద్‌లోనే ఉంటా, ఇక్కడి నుంచి వెళ్లను, అందరి సమస్యలు పరిష్కరిస్తామని నొక్కి వక్కాణించారు. దీంతో ప్రజలు, అన్ని పార్టీల నేతలు ఆశ్చర్యపోయారు. ఒక వైపు ఏపి ఉద్యోగులను ఆరు నెలల్లోపు ఇక్కడి నుంచి కదలాల్సిందేనంటూ ఆదేశాలు జారీ చేసిన చంద్రబాబు ఇక్కడే ఉంటానని చెప్పడం ఏంటనుకున్నారు. రెండవ రోజు చంద్రబాబు మాట్లాడుతూ తెలుగు ప్రజల మధ్యనే ఉంటా, కబురు పెడితే చాలు అరగంటలో వస్తానన్నారు. దీనర్ధం ఏమిటో తెలియక జనం బుర్రలు గోక్కున్నారు. అందుకే రాజకీయ నేతల మాటలకు అర్ధా లే వేరయా అంటే ఇదేనేమో
- శైలేంద్ర

చికాగో స్టేట్ యూనివర్సిటీ గుర్తుందా?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడుకు డాక్టరేట్ ప్రకటించిన యూనివర్సిటీ ఇది. ఈ యూనివర్సిటీ పేరు సామాజిక మాధ్యమాల్లో మరోసారి మారుమ్రోగిపోతోంది. బాబుకు డాక్టరేట్ ప్రకటించినా ఇంకా అందజేయలేదు. కానీ యూనివర్సిటీ అప్పుడే కష్టాల్లో పడిపోయింది. ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే మూత పడే పరిస్థితి. అమెరికా మీడియాలో ఈ వార్త రాగానే సామాజిక మాధ్యమాలు దీనిపై చర్చలు మొదలు పెట్టాయి. యూనివర్సిటీని బతికించేందుకు నిధులు విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరుతూ అమెరికాలో ప్రచారం మొదలు పెట్టగా, తెలుగు నాట మాత్రం బాబు మహిమ అంటూ సామాజిక మాధ్యమాల్లో వ్యంగ్యోక్తులు విసురుతున్నారు.
- మురళి

భలే లంచ్
టి.కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు కె. జానారెడ్డికి లంచ్ చేయాలనిపించింది. అసెంబ్లీ ఆవరణలోని సిఎల్‌పి కార్యాలయంలో ఓ అటెండర్‌కు 20 రూపాయలు ఇచ్చి నాలుగు ప్లేట్ల భోజనం తెప్పించారు. అదేమిటీ 20 రూపాయలకు నాలుగు ప్లేట్లా? అని విస్తుపోతున్నారా! జిహెచ్‌ఎంసి గతంలో ప్రవేశపెట్టిన 5 రూపాయలకు భోజనం పథకంలో భాగంగా తెప్పించారు. ఒక ప్లేట్ ఆరంగించిన తర్వాత భలే లంచ్ అంటూ జానారెడ్డి మీడియా ముందు పొగిడారు. అక్కడే వచ్చి పడింది చిక్కు. గ్రేటర్ ఎన్నికల సమయంలో పొగుడుతారా? అది టిఆర్‌ఎస్‌కు మేలు చేయదా? అని కొందరు నేతలు మండిపడగా, పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి ఏకంగా పార్టీ అధిష్టానానికి లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ‘లంచ్’ చేస్తే కూడా తప్పా? అని జానా అనుచరులు భగభగమంటున్నారు. ఇదో లంచ్ రాజకీయం.
- వి. ఈశ్వర్ రెడ్డి

జానారెడ్డి థర్డ్‌పార్టీనా?
రాష్ట్రంలో టిఆర్‌ఎస్ పార్టీ అధికారంలోకి రావడంతో, కాంగ్రెస్ ప్రధాన ప్రతిపక్షంగా సెకండ్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. అయితే సెకండ్ పార్టీగా ఉండటం కంటే థర్డ్‌పార్టీగా ఉండటానికే కాంగ్రెస్ శాసనసభా పక్షం నాయకుడు జానారెడ్డి ముచ్చటపడుతున్నట్టు అనిపిస్తుంది. ప్రభుత్వం చేపట్టే పనుల్లో నాణ్యతా ప్రమాణాలను పరిశీలించడానికి థర్డ్‌పార్టీతో తనఖీలు చేయించడం అనవాయితీ. అయితే జానారెడ్డి తనకు తానుగా క్యాలిటీ కంట్రోల్ తనఖీలు నిర్వహించడానికి థర్డ్‌పార్టీ అవతారమెత్తారు. గ్రేటర్ పరిధిలో జిహెచ్‌ఎంసి పేదలకు పెడుతున్న రూ. 5 భోజనం నాణ్యత ఎలా ఉందో పరిశీలించడానికి ఆయన స్వయంగా ఆ భోజనం తెప్పించుకుని భేష్ అని ధ్రువీకరించారు. ఒకవైపు జిహెచ్‌ఎంసికి ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అది పెడుతున్న భోజనం బాగుందని ప్రతిపక్ష నాయకుడు థర్డ్ పార్టీ రిపోర్టు ఇవ్వడం పట్ల ప్రభుత్వం సంతృప్తి చెందగా, ప్రతిపక్ష నేతకు క్వాలిటీ కంట్రోల్ అవతారం ఎందుకని కొందరు కాంగ్రెస్ నేతలు సోనియాగాంధీకి ఫిర్యాదు చేయడానికి సన్నద్ధం అవుతున్నారు.
- వెల్జాల చంద్రశేఖర్

ఇంతకీ ఎవరికి పని?
చంద్రబాబు, కెసిఆర్ పరస్పర విమర్శలతో హైదరాబాద్‌తో ఎవరికి సంబంధం అన్న చర్చ మొదలైంది. ఏపీ సీఎం చంద్రబాబుకు హైదరాబాద్‌తో పనేంటని టిఆర్‌ఎస్ నేతలు ప్రశ్నిస్తుంటే, మెదక్ జిల్లాకు చెందిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు హైదరాబాద్‌తో పనేంటి అంటూ టిడిపి నేతలు విమర్శల బాణాలు సంధించారు..తాగునీరు, మురుగునీటిపారుదల, రోడ్ల నిర్వహణ సక్రమంగా ఉండేలా చేస్తూ, విద్యుత్తు సక్రమంగా ఇస్తూ, నిత్యావసర సరకులు సరసమైన ధరలకు ఇవ్వగలిగితే ఏ చంద్రుడైనా (సైకిల్ చంద్రుడైనా-చంద్రబాబు, కారు చంద్రుడైనా-కెసిఆర్) మాకేం ఇబ్బంది లేదంటూ హైదరాబాదీలు పేర్కొంటున్నారు.
- పి.వి. రమణారావు