ఉత్తరాయణం

గతి తప్పుతున్న విద్యాబోధన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పదవ తరగతి పరీక్షా ఫలితాలను గణనీయంగా పెంచడానికి జిల్లా విద్యాశాఖాధికారులు కొద్ది సంవత్సరాలుగా ఉపాధ్యాయులపై తీవ్ర ఒత్తిడి తీసుకువస్తున్నారు. ప్రస్తుత సంవత్సరంలో కూడా ఇది కొనసాగిస్తూ విద్యార్థులను రుద్దుతున్నారు. సాయంత్రం, రాత్రి తరగతులంటూ ఉపాధ్యాయుల్ని, విద్యార్థుల్ని ఇబ్బందికి గురిచేస్తున్నారు. పరీక్షా ఫలితాలు బాగా రావాలంటే ఇలా ఒకేసారి ఒత్తిడి తీసుకురావడానికి బదులు విద్యాసంవత్సరం ఆరంభం నుండే చర్యలు తీసుకుంటే బాగుండు. జూన్ నెల నుండే సిలబస్‌పై దృష్టి సారిస్తే ఇప్పుడీ అవస్థలు తప్పేవి. విద్యా సంవత్సరం ప్రారంభంలో టీచర్ల బదిలీలు చేపట్టారు. కౌనె్సలింగ్ కోసం కొన్ని రోజులు వ్యర్థమైనాయి. తర్వాత ఖాళీ అయిన స్థానాలను సెప్టెంబర్ చివరివారంలో విద్యా వలంటీర్లతో భర్తీచేస్తారు. ఇక నవంబర్, డిసెంబర్‌లో జనాభా లెక్కల సర్వే చేయించారు. దీంతో విద్యార్థులకు పాఠాలు బోధించే ఉపాధ్యాయులు కరవయ్యారు. ముఖ్యంగా పదవ తరగతి సిలబస్ భారీగా ఉంది. ఆ సిలబస్ అంతా చిత్తశుద్ధితో పూర్తిచేయాలంటే పాఠశాల పని దినాలను జూన్ నుంచే పూర్తిగా సద్వినియోగం చేసుకోవాలి.
సిలబస్ పూర్తిచేయకుండా విద్యార్థులచే పాఠాలన్నీ గైడ్లు, క్వశ్చన్ బ్యాంకులతో బట్టీపట్టిస్తే మార్కులు తప్ప విద్యాప్రమాణాలు రావు. ప్రశ్నించే మేధావుల్ని కాకుండా బట్టీపట్టే మెదళ్ళను తయారుచెయ్యడమే మన దేశ పరీక్షా విధానంలోని ప్రధాన లోపం. మన పరీక్షలు కేవలం జ్ఞాపకశక్తిని పరీక్షిస్తున్నాయి. తప్ప తరగతి గదిలో నేర్చుకున్నది నిజ జీవితంలో ఎలా ఉపయోగపడుతుందో పరీక్షించటం లేదు. అవగాహన, నైపుణ్యం, వినియోగం, తార్కిక ఆలోచన, విశే్లషణ, సృజనాత్మకత, విచక్షణా జ్ఞానము వంటి సామర్థ్యాలను విస్మరించి కేవలం రాత పరీక్షలు రాయిస్తే విద్యాశాఖాధికారుల, ఉపాధ్యాయుల బాధ్యత తీరినట్లేనా? పైగా ఉత్తమ ఫలితాలు రావాలని ఒత్తిడి తీసుకువస్తే ప్రజాప్రతినిధులు, ఉపాధ్యాయులు పరోక్షంగా కాపీ ప్రోత్సహించి పరీక్షల రాయిస్తారు. ఎలాగో అలాగ ఉత్తీర్ణులై డిగ్రీ సర్ట్ఫికెట్ కూడా తెచ్చుకుంటారు. ఆ తరువాత అసలు సమస్య ప్రారంభమవుతుంది. జనారణ్యంలోకి వచ్చి ఉద్యోగం సంపాదించాలంటే పోటీపరీక్షలను, ఇంటర్వ్యూలను ఎదుర్కోలేక చతికిలపడతారు. ఇలాంటి విషయాలపై విద్యాశాఖాధికారులు దృష్టిసారించాలి.
- గూరుడు అశోక్, కరీంనగర్
సత్యాన్ని కప్పిపుచ్చవద్దు
ఒక విద్యార్థి చనిపోతే అతడు ఎలా, ఎందుకు చనిపోయాడన్న సత్యాన్ని చూడాలి. సత్యాన్ని కప్పిపుచ్చి, దళితుడిని చంపేశారు, దళిత విద్యార్థికి అన్యాయం జరి గిందని గగ్గోలు పెట్టడం, ఒకటి రెండు గంటల వ్యవధి లోనే దేశమంతా ప్రచారం చేయడం చూస్తుంటే ఒక పద్ధతి ప్రకారం నడుపుతున్న రాజకీయమని అర్థమ వుతోంది. యూనివర్సిటీకి వచ్చిన రాజకీయ నాయ కులం తా రాజకీయం చేశారు తప్ప మరేంలేదు. హిందూ సమా జాన్ని ముక్కలు చేసి ఓటు బ్యాంకు రాజకీయాలు నెరపడానికి మాత్రమే వారు వచ్చారు. ‘దళిత’ అనే పదం మాటు ఏదైనా చేయవచ్చునని ఆలోచించే వారున్నారు. అందువల్ల దళితుల పేరుతో రాజకీయం చేసేవారిని దళితులు దూరంగా ఉంచాలి.
- గుడ్ల జగదీశ్వర్, హైదరాబాద్
అంతా రాజకీయమే
కేంద్రీయ విశ్వవిద్యాలయంలో రోహిత్ అనే విద్యార్థి ఆత్మహత్యపై కుహనా లౌకిక పార్టీలు రాజకీయం చేయ డం హాస్యాస్పదం. రోహిత్ ఆత్మహత్యకు కులం రంగు పులమడం, భాజపాపై దుష్ప్రచారం చేయడం వెనుక పెద్ద కుట్ర ఉన్నది. రాబోయే ఎన్నికల్లో భాజపాను దెబ్బతీ యడమే వీరి అసలు వ్యూహం. యూపీఏ హయాంలో కూడా ఎన్నో ఇటువంటి సంఘటనలు చోటు చేసుకు న్నాయ కదా. వాటిపై నోరెత్తని వారు ఇప్పుడు గగ్గోలు పెట్టడం రాజకీయం కాక మరేంటి?
- వేదుల జనార్ధన్ రావు, వంకావారి గూడెం
పర్యావరణ పరిరక్షణా ముఖ్యమే
నవ్యాంధ్ర ప్రభుత్వం అభివృద్ధిలో భాగంగా పరిశ్రమల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసే సమయంలో పర్యావరణ కాలుష్యాన్ని కూడా దృష్టిలో ఉంచుకోవాలి. ముఖ్యంగా ఉత్తరాంధ్ర సాగరతీరంలో పరిశ్రమలు స్థాపించి వెనుక బడిన ఈ ప్రాంతం నుంచి వలసలను నిరోధించాలన్న ప్రభుత్వ యోచన సమంజసమైనదే. ఇందులో భాగంగానే భువనపాడు ఓడరేవు, భోగాపురం వద్ద విమానాశ్రయం, పైడి భీమవరం వద్ద పారిశ్రామిక వాడ, సోంపేట పారిశ్రామిక మండలి తదితరాలను వరాలుగా ఏపీ ప్రభుత్వం ప్రకటించింది. అయతే ఈ ప్రాంతంలో పర్యావరణ సమస్య ఎక్కువగా ఉన్నది. ప్రభుత్వం దీన్ని దృష్టిలో పెట్టుకొని, పర్యావరణ సమతుల్యతకు కూడా చర్యలు తీసుకోవాలి.
- నౌగాపు నాగరాజు, కోట బొమ్మాళి
గ్యాస్ ఇబ్బందులు
గతంలో గ్యాస్ సిలిండర్‌కు రూ.419.26 చెల్లిస్తే నేరుగా ఇంటికి వచ్చేది. ఇప్పుడు గ్యాస్ బుక్ చేసుకోవాలంటే, మొదటి సిలిండర్ వచ్చిన తర్వాత 21 రోజులకు గాని బుక్ చేసుకోవడానికి వీల్లేదు. అప్పుడు బుక్ చేసుకున్న సిలిండర్ మరో పది రోజులకు గాని ఇంటికి చేరదు. ఇంటికి చేర్చిన సిలిండర్‌కు పూర్తి ధర చెల్లిస్తే అందులో చెల్లించాల్సిన రూ.419.26 పోను మిగిలిన సబ్సిడీ పైకాన్ని ఖాతాదారుల అకౌంట్‌లో తర్వాత ఎప్పుడో జమ చేస్తున్నారు. ఇదంతా ఇబ్బంది కరమైన విషయం. వినియోగదారులకు ఏమాత్రం సౌలభ్యంగా ఉండటం లేదు. అందువల్ల ఇచ్చే సబ్సిడీ ఏదో ఇంటిదగ్గరకు తెచ్చిన సిలిండర్‌కు మినహాయంచుకొని నేరు గా మిగిలిన పైకం చెల్లించిన విధానమే బాగుంది. ప్రభుత్వం దీనిపై స్పందించాలి.
- మునె్నల్లి కనకదుర్గ, కావలి