సబ్ ఫీచర్

గ్రంథాలయ సేవలు విస్తరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రామీణ పేద యువతకు వారి బ్రతుకు ప్రగతిబాట వేసేందుకు అపురూప సంపద గ్రంథాలయం. చదువు మనిషి జీవితానికీ... జీవనానికీ వెలుగునిస్తుంది. అయితే మనిషికి రెండు రకాల విద్యను నేర్పేది మాత్రం పుస్తకమే. జీవనోపాధిని ఎలా కల్పించుకోవాలో... రెండోది ఎలా జీవించాలో... విద్యార్థుల్లో మనో వికాసాన్ని పెంపొందిస్తూ మనోబలాన్ని కూడా అందించేవి గ్రంథాలయాలు. గ్రంథాలయాలు విద్యార్థుల విజ్ఞాన జాగృతి నేస్తాలు. నిరుద్యోగ యువతకు పోటీ పరీక్షలకు దోహదపడతాయి.
గ్రంథాలయాలు ప్రభుత్వపరంగా మండలానికి ఒకటి తప్పితే రెండుకు మించి ఉండటం లేదనేది వాస్తవం. కాబట్టి అవి పూర్తిస్థాయి సేవలు అందించలేకపోతున్నాయి. అలాగే మరోవైపు స్వచ్ఛంద సంస్థల ఆధ్వర్యంలో ప్రజల సహకారంతో చాలా గ్రామాల్లో గ్రంథాలయాలు ఏర్పాటుచేసినప్పటికీ వారికి పుస్తక సేకరణ కష్టసాధ్యవౌతోంది. అరకొర పుస్తకాలతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. శ్రీకాకుళం జిల్లా గ్రంథాలయాల విషయానికి వస్తే మొత్తం గ్రంథాలయాలు 161తోపాటు కేంద్ర గ్రంథాలయం ఒకటి, శాఖా గ్రంథాలయాలు 44, సొంత భవనాలు ఉన్నవి మాత్రం సుమారు 40 మాత్రమే. నిరుద్యోగ యువత విద్యార్థులకు పుస్తకాలు అందుబాటులో ఉండటం లేదు. ప్రభుత్వ గ్రంథాలయాల్లో దశాబ్దాల కాలం క్రితం సరఫరా చేసిన ఫర్నీచరే దర్శనమిస్తోంది అనడం అతిశయోక్తికాదు. కోటబొమ్మాళి, పలాస, వజ్రపు కొత్తూరు, గార, బలగ, కొత్తూరులోని గ్రంథాలయాలకు భవనాలు లేవు. అలాగే కవిటి, మందస, కోటబొమ్మాళి మండలాలకు గ్రంథాలయాధికారులే లేరు. ఇది ఒక్క శ్రీకాకుళం జిల్లా పరిస్థితి.
మన రాష్ట్రంలో మిగతా జిల్లాలలో కూడా ప్రభుత్వ గ్రంథాలయాల పరిస్థితి పూర్తిస్థాయిలో విద్యార్థులకు వినియోగపడని పరిస్థితే కొనసాగు తున్నది. అయితే గ్రంథాలయాల విషయంలో ప్రభుత్వాలు సత్వరమే స్పందించాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. జిల్లాల్లోని గ్రంథాలయాలతోపాటు అలాగే మండల కేంద్రాల్లోవున్న గ్రంథాలయాలతోపాటు ప్రతీ మండలంలోని మేజర్ పంచాయతీల్లో గ్రంథాలయాలకు ప్రభుత్వ సహకారం ఎంతైనా అవసరం. ముఖ్యంగా గ్రంథాలయాలకు కంప్యూటర్లతోపాటు ఉచిత అంతర్జాల సౌకర్యం కూడా కల్పించాల్సిన ఆవశ్యకత వుంది. అంతేకాకుండా మండలాల్లోని మేజర్ పంచాయతీ పరిధిలో కూడా భవనాలతో కూడిన ప్రభుత్వ గ్రంథాలయాలను ఏర్పాటుచేసి పోటీపరీక్షలకు ఉపయోగపడే విజ్ఞాన, జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, మనోవికాస స్ఫూర్తిదాయక పుస్తకాలు వీటితోపాటుగా బాలల్లో నీతిని పెంచే చేతన పుస్తకాలు వ్యవసాయదారులకు సూచనలు పొందే పాడిపంటల పుస్తకాలు ఆధ్యాత్మికతను పెంచే గ్రామీణాభివృద్ధి గల పుస్తకాలను అలాగే పుస్తక నిక్షిప్త కేంద్రాలను ప్రతి జిల్లాల్లో విరివిగా ఏర్పాటుకు కృషిచేసే దిశగా ప్రభుత్వం పావులు కదిపితే ప్రభుత్వ గ్రంథాలయాలు అంటే వికసించిన విజ్ఞాన కేంద్రాలు కావు.
గతంతో పోలిస్తే నేటి పోటీ పరీక్షల తీరుతెన్నులే మారిపోయాయ. ప్రైవేట్ రంగంలోనే అత్యధిక ఉద్యోగాలు లభిస్తున్నాయ. ఈ నేపథ్యంలో అభ్యర్థులు తమ విజ్ఞానాన్ని అవసరానికనుగుణంగా మలచుకొని, విస్తరిం పజేసుకోవాలి. అందుకు అన్ని రకాల విజ్ఞాన గ్రంథాలు అందుబాటులో ఉండవు. అటువంటి సదుపాయం కేవలం గ్రంథాలయంలో మాత్రమే సాధ్యం. ఈ నేపథ్యంలో విద్యార్థుల బంగారు భవితను వికసింపజేసే జ్ఞాన గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు అని నిరూపించే దిశగా రానున్న ఉగాదినుంచి గ్రంథాలయాల అభివృద్ధికి ప్రభుత్వం స్పందిస్తుందని విద్యార్థులకు ముఖ్యంగా పేద విద్యార్థుల పాలిట ఆశాదీపాలు వెలిగిస్తుందని ఆశిద్దాం!

- మహ్మద్ రఫీ