ఉత్తరాయణం

ఏరులై పారుతున్న మద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గ్రామాలలోని బెల్టుషాపులు రద్దుచేస్తామని చేసిన వాగ్దానం నిలబెట్టుకోక పోగా ఇటీవలి కాలంలో బెల్టుషాపుల సంఖ్య ఎక్కువ చేయడంతో ఎక్కడ చూసినా మద్యం తాండవిస్తోంది. గ్రామాలు, నగరాలు, పట్టణాలు అన్న భేదం లేకుండా ప్రతీ సందు చివరా బెల్టుషాపులు వెలియడంతో మందుబాబులు గుడి, బడి అని చూడకుండా ప్రొద్దున్న, మధ్యాహ్నం, సాయంకాలం అన్న వ్యత్యాసం లేకుండా ఫుల్లుగా త్రాగి రోడ్లపై దొర్లుతున్నారు. వీరికి ఉపకరించేందుకు కబాబ్‌లు, మాంసం, నూడిల్స్ అమ్మే చిరు వ్యాపారులు అన్ని కూడళ్లవద్ద తమ దుకాణాలను తెరిచేసారు. ఉదయం ఆరుగంటల నుండి అర్ధరాత్రి పనె్నండు గంటల వరకు మద్యం ఏ ఆటంకం లేకుండా లభిస్తుండడంతో మందుబాబులు విజృంభిస్తున్నారు. లైసెన్స్ వున్న మద్యం షాపుల్లోకన్నా ఇరవై రూపాయలు అధికంగా అమ్ముతున్నా వీరికి సంకోచం వుండడం లేదు. పట్టపగలే తప్పత్రాగి బహిరంగ ప్రదేశాలలో న్యూసెన్స్ చెయ్యడం, పాదచారులకోసం నిర్దేశించిన ఫుట్‌పాత్‌లపై పడుకోవడం, ఇదేమిటని అడిగే వారిపై జులుం చెలాయించడం చేస్తున్నారు. మద్యం వలన లక్షలాది కుటుంబాలు ఆర్థికంగా, సాంఘికంగా చితికిపోతున్నారు.
- సి.సాయిమనస్విత, విజయవాడ
సేల్స్‌మెన్ వెతలు
నగరాలలోని షాపింగ్ మాల్స్‌లో పనిచేసే యువతీయువకుల పాట్లు చెప్పనలవి కానివి. వారానికి ఒక్కరోజు సెలవు పండుగ, రద్దీ సీజన్‌లలో రద్దుచేస్తున్నారు. రోజుకు పనె్నండు గంటల పని. రాత్రి పది దాటాక ముఖ్యంగా ఆడ పిల్లలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇళ్లకు షేర్ ఆటోలు, జీపుల్లో వెళ్లవల్సి వస్తోంది. సెలవులు, రద్దీ సీజన్‌లలో అలుపెరుగక, ముఖం మీద చిరునవ్వు చెదరక, చెమట కూడా కనబడనీయక కస్టమర్ల యక్ష ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ, వారడిగే డిజైన్లు చూపిస్తూ ముఖ్యంగా నిలబడి పనిచేయాల్సి వుంటుంది. సరిగ్గా మాట్లాడలేదని ఎవరైనా కస్టమర్ కంప్లయింట్ చేస్తే ఇక యజమానులు కల్లు త్రాగిన కోతుల్లా చిందులేస్తుంటారు. ఇంత కష్టపడినా వారికి అందేది గొర్రె తోక బెత్తెడు లాంటి జీతం. ఏ విధమైన అలవెన్సులు వుండవు. హాయిగా ఫ్యాన్ల క్రింద, ఏసి రూముల్లో జల్సాగా కాలక్షేపం చేస్తూ లక్షలకు లక్షలు జీతాలు తీసుకునే ప్రభుత్వోద్యోగులకు అందే ఏ సౌకర్యాలు కూడా వీరికి లభించవు. ఆఖరికి కార్మికశాఖ నిబంధనలనుగుణంగా మినిమమ్ వేజెస్ (కనీస వేతనాలు) చట్టం కూడా వీరికి వర్తించకపోవడం బాధాకరం. వెట్టిచాకిరి నుండి భారతావనికి విముక్తి కల్పించామన్న ప్రభుత్వాలు ఒక్కసారి వీరి జీవితాలను పరిశీలిస్తే నిజానిజాలు బయటపడతాయి.
- ఎం.కనకదుర్గ, తెనాలి
నిరుద్యోగుల సంఖ్య రెండు కోట్లు
రెండు తెలుగు రాష్ట్రాలలో దాదాపుగా రెండు కోట్ల మంది నిరుద్యోగులు ఉపాధి లేక విలవిల్లాడుతున్నట్లు ఫిక్కివారి వార్షిక నివేదిక తెలియజేస్తోంది. అధికారంలోకి వచ్చాక లక్షలాది ఉద్యోగాలు యిస్తామన్న ప్రభుత్వాల వాగ్దానాలు నీటిమీద రాతలుగా మిగిలిపోయాయి. క్రొత్త ఉద్యోగాలు రాలేదు సరికదా ఉన్న ఉద్యోగాలను తొలగిస్తున్నారు. నగర, పురపాలక సంస్థల్లో వేలాది ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగాలు ఊడిపోయాయి. ఉద్యోగాలు కల్పించని పక్షంలో నిరుద్యోగ భృతి కల్పిస్తామన్న వాగ్దానానికి అతీగతీ లేదు. టీచర్ల ఉద్యోగాలకోసం లక్షలు వెచ్చించి కోచింగ్ తీసుకొని డియస్సీ కోసం లక్షలాది అభ్యర్థులు చకోర పక్షుల్లా ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వాలు ప్రారంభించిన స్కిల్ డెవలప్‌మెంట్ కోర్సులు సత్ఫలితాలు యివ్వడం లేదు. పి.పి.పి. పాలసీ వలన వెనుకబడిన వర్గాల అభ్యర్థులు అత్యధికంగా నిరుద్యోగులుగా మారిపోతున్నారని ఫిక్కీ నివేదక తెలియజేస్తోంది. ఒక క్రొత్త పరిశ్రమ కూడా వచ్చి ఎవ్వరికీ ఉద్యోగాలు వచ్చిన దాఖలాలు లేవు.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
నేరాలు పెరిగాయ
బెజవాడ నవ్యాంధ్ర రాజధాని అయ్యాకా నేరాలు పెరిగాయి. బాబుగారు రాజధాని గోలలో పడి ఈ విషయాలేవీ పట్టించుకోవడం లేదు. స్థానిక నాయకులు ఈ విషయంలో కొద్దిగా శ్రద్ధచేసుకొని విజయవాడని ఒక రక్షణ గల నగరంగా, శాంతిగా నిర్భయంగా మనిషి బ్రతికేలా చేయాలి. మీరు సమర్ధులని ప్రజలు ఎన్నుకున్నారు. వారికి మీరు న్యాయం చెయ్యాలి. ఈ నగరంలో బాధితులు లేకుండా ప్రతి అన్యాయాన్ని రోజుల్లోనే పరిష్కరించి శభాష్ అనిపించుకోవాలి. ఇందులో అన్ని పార్టీలవారూ వున్నారు కాబట్టి.. ఈ కేసులో అందరూ ఆరంభశూరత్వంతో మాట్లాడి చివరికి కేసు నీరుకారుస్తారని ప్రజలు డౌటు పడుతున్నారు. పూర్వం ఒక పాత సినిమాలో పొలం గట్టుమీద ప్రత్యర్థి కొడుకు ఒక నేరం