సబ్ ఫీచర్

యూనివర్సిటీల్లో కుల రాజకీయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థి వేముల రోహిత్ ఆత్మహత్య సంచలనం సృష్టించింది. ఈ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మహత్యల్లో ఇది తొమ్మిదవది. అయితే విశ్వవిద్యాలయాల్లో పదుల సంఖ్యలో ఆత్మహత్యలు జరిగినా ఎవరూ స్పందించలేదు. కానీ రోహిత్ మృతి మాత్రం ప్రాధాన్యత సంతరించుకుంది. దీని వెనుక వాస్తవాలను పరిశీలిద్దాం.
హెచ్‌సియులో జాతీయ భావాలు కలిగిన సంస్థ ఎబివిపి, వామపక్ష భావాలు కలిగిన విద్యార్థి సంఘాలు పని చేస్తున్నాయి. విద్యార్థి సంఘాల మధ్య సైద్ధాంతిక వైరుధ్యాలు సహజం. అయితే హెచ్‌సియులో అంబేద్కర్ స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఎస్‌ఎ) పేరుతో కొందరు విద్యార్థులు నిర్వహించిన కార్యక్రమాలు వివాదాలకు కారణమయ్యాయి. ముంబయి పేలుళ్ల కేసులో యాకూబ్ మెమెన్‌కు ఉరిశిక్ష అమలు పరచిన తర్వాత దానికి ఎఎస్‌ఎ స్పందించి మెమెన్ ఉరిని నిరసిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించి, ఒక మెమెన్ మరణిస్తే ప్రతి ఇంటి నుండి ఒక మెమెన్ పుట్టుకొస్తాడంటూ నినాదాలు చేసింది. ఈ కార్యక్రమాన్ని నిరసిస్తూ ఏబీవీపీ నాయకుడు సుశీల్ కుమార్ సోషల్ మీడియాలో చేసిన కామెంట్ల నేపథ్యంలో అతనిని తీవ్రంగా కొట్టారు. దీనిపై అతని తల్లి కోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆదేశాల ప్రకారం హెచ్‌సియు వారిపై చర్యలు తీసుకున్నది. విశ్వవిద్యాలయ వ్యవహారాల్లో రాజకీయ నాయకులు కలుగజేసుకోవడం వల్ల రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడంటూ ఏఎస్‌ఏ, మీడియా అసత్య ప్రచారం చేశాయి. ఇదే విషయంలో కేంద్ర మానవ వనరుల మంత్రికి లేఖ రాశారన్న నెపంతో బండారు దత్తాత్రేయను బాధ్యులను చేయాలంటూ కాంగ్రెస్, వామపక్షాలు, ఏఏపీ, టీఆర్‌ఎస్‌లు ప్రయత్నించడం ద్వారా, హెచ్‌సియులో రాజకీయాలకు తెరలేపాయి. న్యాయ వ్యవస్థకు, దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించారని సూచించడమే దత్తాత్రేయ చేసిన పాపమా?
ఇదే విశ్వవిద్యాలయంలో గతంలో పది మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నప్పుడు పదేళ్లపాటు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ఏం చేసింది? మరి అదే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ విశ్వవిద్యాలయంలో ఇప్పుడు కుల రాజకీయాలకు జీవం పోశారు. తెలంగాణ ఉద్యమం కోసం వందలమంది ఆత్మహత్యలు, బలిదానాలు చేసినప్పుడు అవి ఆత్మహత్యలుగా కనిపించలేదా? ఎంఐఎం నేత అసదుద్దీన్ ఒవైసీ కూడా హెసియుకు వెళ్లి యధాశక్తి రెచ్చగొట్టడాన్ని బట్టి అతని నిజ స్వరూపం బయటపడింది. బీఫ్ ఫెస్టివల్ పేరుతో విశ్వవిద్యాలయాలలో జరిగే సంఘటనలకు కూడా తెరవెనుక వీరిదే ప్రధాన భూమిక ఉన్నదనిపిస్తున్నది. డిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కూడా తన అవకాశవాద రాజకీయ వైఖరిని మరోసారి చాటుకున్నాడు. ఇక వామపక్షాలు తమ అస్తిత్వ రాజకీయాలకు విశ్వవిద్యాలయాలను వేదికలుగా చేసుకుంటున్నాయి. విశ్వవిద్యాలయాలలో విద్యార్థి, కుల సంఘాలు తమ భావజాలాన్ని వ్యాప్తి చేసుకునే భావ ప్రకటన స్వేచ్ఛ ఉన్నది. కానీ తమ భావజాల వ్యాప్తి పేరుతో ఇతరుల మనోభావాలను అగౌరవ పరచినప్పుడు వివాదాలు ఏర్పడుతున్నాయి. ఒకప్పుడు నక్సలైట్ ఉద్యమానికి కేంద్ర స్థానంగా ఉన్న హెచ్‌సియు, ఇప్పుడు మావోయిస్టు ఉద్యమం పతనమైన దశలో కులం పేరుతో విద్యార్థుల మధ్య అసమానతలను పెంచి పబ్బం గడుపుకుంటున్నారు. భావ ప్రకటనపేరుతో చేస్తున్న విశృంఖలపైన, నీతి బాహ్యమైన, అసాంఘిక కార్యకలాపాలకు రూపకల్పన చేసి మెజారిటీ విద్యార్థుల మనోభావాలను దెబ్బతీస్తున్నారు. ఈ విచ్ఛినకర శక్తులే నిజమైన పౌర స్వేచ్ఛావాదులట! కేరళలో 1921లో ఖలీఫాకు మద్దతుగా మోప్లా/మలబారు తిరుగుబాటు పేరుతో మోప్లా ముస్లింలు స్థానిక హిందువులపై మారణకాండ సాగించారు. వీరికి కుంజహమ్మద్ హాజి నాయకుడు. అతగాడి సంస్మరణ సభను నిర్వహించి విద్యార్థుల మధ్య వైషమ్యాలను పెంచడం వీరి దృష్టిలో అంబేద్కర్ చెప్పిన సామాజిక న్యాయమా? కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదని, భారత సైన్యం కాశ్మీర్‌లో అక్రమంగా ఉంటున్నదని చెప్పడం దేశద్రోహం కాదా? అంబేద్కర్ చెప్పినట్టు సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమానత్వం సాధించే విధంగా విశ్వవిద్యాలయాలు ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్ని రకాల వైషమ్యాలను విడనాడి భవిష్యత్తు తరాలకు మార్గదర్శకులుగా నిలవడమే అంబేద్కర్‌కు విద్యార్థులు ఇచ్చే నిజమైన గౌరవం.

- కొండి లింగస్వామి పరిశోధక విద్యార్థి, ఉస్మానియా విశ్వవిద్యాలయం