సబ్ ఫీచర్

పతనమైపోయిన విద్యాలయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విద్యాబోధన వైద్యం అనే రెండింటిని ఇంగ్లీషులో బుల్‌ప్రొఫెషన్సు అన్నారు అనగా అన్ని వృత్తులలోకి ఇవి తలమానికాల వంటివి. ఒకనాడు చదువు చెప్పడానికి వైద్యం చేయడానికి ధనం తీసుకునే వారు కాదు. ఔషధ విక్రయం కూడా పాపమని భావించేవారు. ఆరోజులు గతించాయి. వైద్యం సంగతి అలా ఉంచుదాం. విద్య విషయం ఇప్పుడు పూర్తిగా ధనంతో ముడిపడి ఉంది. ఉచితంగా చదువు చెప్పేవారివద్దకు ఎవరూ వెళ్లరు. దానికి కారణం వారు మార్కుల ర్యాంకులు తెప్పించలేరు. విద్యను అర్ధించేవాడు కనుక విద్యార్థి అను పేరు వచ్చింది. పూర్వం తగిన గురువును అనే్వషించి అవసరమైతే దూరప్రదేశానికి వెళ్లి కష్టాలకు ఓర్చి గురుశుశ్రూష చేసి విద్యాభ్యాసం చేసేవారు. నేడు ప్రభుత్వం బాహాటంగా విద్యను విక్రయిస్తుంది. చదువుకునే వారికి ప్రభుత్వం జీతాలు చెల్లించడం ఏమిటి? ఇది పూర్తిగా రాజకీయం అయిపోయింది.
స్వాతంత్య్రానంతరం గాంధీజీపై అభిమానంతో మన రాష్ట్రంలో బేసిక్ విద్యావిధానం ప్రవేశపెట్టబడింది. అందుకు తగిన విధంగా ఉపాధ్యాయులకు శిక్షణ కూడా ఇవ్వబడింది. క్రమంగా ఈ విధానాన్ని అమలుచేయవలసిన అధికారులకు తరువాత ప్రవేశించిన రాజకీయ నాయకులకు చిత్తశుద్ధి లోపించడం వలన ఈ విధానం అటకెక్కింది. ప్రస్తుతం మెకాలే విద్యావిధానానే్న మనం అనుసరిస్తున్నాం. ప్రాథమిక పాఠశాలలనుండి విశ్వవిద్యాలయాల వరకు అన్ని విషయాలలోను నేడు పతనమైపోయాయి. పిల్లలను దండించడం మితిమీరిపోయింది. అందువలన ఉపాధ్యాయులను తలిదండ్రులు నిలదీయడం అధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభమయింది. ఇక విద్యాప్రమాణాలు దిగజారిపోయినట్లు వివిధ సర్వేలు వెల్లడించాయి. ఒత్తులు ఎక్కడ పెట్టాలో దీర్ఘాలు హ్రస్వాలు ఎక్కడ ఉండాలో పిల్లలకు తెలియడం లేదు. సుబ్రహ్మణ్యం అను పేరును సుబ్రమణ్యం అని వ్రాస్తున్నారు. చూశాడు అని వ్రాయడానికి బదులు చూసాడు అని వ్రాస్తున్నారు. ఋణము ఋతువు అను పదాలలో లఘురేఫం అనగా ‘ర’వాడుతున్నారు. ఈ అక్షరానికి ఒత్తు ఉండదు. కర్ర అని వ్రాస్తున్నారు. కఱ్ఱ అని వ్రాయాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇందుకు బాధ్యులు ఎవరు? వారికి చదువు చెప్పిన ఉపాధ్యయులేకదా.
ఉన్నత పాఠశాలలో ఇప్పుడు చదువుకి ప్రాధాన్యత లేదు. పదవ తరగతి ఉత్తీర్ణతా శాతానికే ప్రధానం. ఇందుకు వివిధ జిల్లాలు పోటీపడుతున్నాయి. ఉపాధ్యాయులలో మద్యం సేవించేవారున్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆఫీసులో సిబ్బందిని కొట్టేవారున్నారు. కొందరు జిల్లా విద్యాశాఖ అధికారులు లంచాలు తీసుకుని పట్టుబడుతున్నారు. కొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. ఉన్నత పాఠశాలల సంఖ్య విపరీతంగా పెరిగింది. ప్రమాణాలు దిగజారిపోయాయి. కొందరు ఉపాధ్యాయులు నకిలీ యోగ్యతాపత్రాలతో ప్రమోషన్లు పొందుతున్నారు. ఈ విధంగా అనర్హులు మన పిల్లలకు పాఠాలు చెబుతున్నారు. కుమార్తెల వంటి తమవద్ద చదువుతున్న పిల్లల మానాలని చెరుస్తున్నారు. కళాశాలల సంఖ్య కూడా విపరీతంగా పెరిగింది. విద్యార్థుల అలజడులు పెరిగాయి. సమ్మెలు పెరిగిపోతున్నాయి. రాజకీయ నాయకులు స్వార్థ ప్రయోజనాలకి వీరిని వాడుకుంటున్నారు.
ఇక విశ్వవిద్యాలయాల సంగతి చూద్దాం. విశ్వవిద్యాలయం అనుపేరులోనే ఎంతో గొప్పతనం ఉంది. ఇప్పుడు అవి ఆ పేరుకు తగవు. 1926వ సంవత్సరానికి పూర్వం ఆంధ్ర ప్రాంతంలో విశ్వవిద్యాలయం లేదు. ఎం.ఏ., చదువుకోవాలంటే మద్రాసు వెళ్లవలసి వచ్చేది. ఇప్పుడు జిల్లాకు ఒక విశ్వవిద్యాలయం ఉంది. ప్రామాణ్యత విషయం అనవసరం. విశ్వవిద్యలయాలకి ఎన్నడూ లేని దుర్గతి ఇప్పుడు పట్టింది. సర్వేపల్లి రాధాకృష్ణన్ కట్టమంచి రామలింగారెడ్డి, కె.వి.గోపాలస్వామి వంటి విద్యావేత్తల ఆధ్వర్యంలో ఆంధ్రా విశ్వవిద్యాలయం ఎంతో ఘనత వహించింది. వివిధ శాఖల అధిపతులుగా నిష్ణాతులుండేవారు. ఇప్పుడు అట్టి సమర్ధులు లేరు. విశ్వవిద్యాలయాలకి పోలీసుస్టేషన్లకి సంబంధం ఏమిటి? రిజిస్ట్రార్ వంటి వారిపై కేసులు ఏమిటి? ఎస్, ఎస్‌టి అట్రాసిటీ వంటి కేసులు ఏమిటి? విద్యార్థులపై వేధింపులు ఏమిటి? కులం అంటే ఏమిటో అర్ధం చెప్పగల విశ్వవిద్యాలయాలలో కుల తగాదాలా? కాలవైపరీత్యం అంటే ఇదే కాబోలు. వీరిని కులపతులు, ఆచార్యులు అని సంబోధిస్తున్నారు. ఆ పేర్లకి వీరు తగరు.
ఒక పరిశోధన విద్యార్థిపై కక్షసాధింపు చర్యలు ప్రారంభించి తప్పుడు నివేదిక తయారుచేసినట్లు మరొక ప్రొఫెసరుపై కేసు నమోదు అయిందిట. తాజాగా హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయంలో ఒక విద్యార్థి ఆత్మహత్యతో తీవ్రమైన ఉద్రిక్తత మొదలయింది. వివిధ ప్రదేశాలలో అలజడులు మొదలయినాయి. విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ పైన కొందరు రాజకీయ నాయకులపైన మరికొందరు విద్యార్థి నాయకులపైన కేసులు నమోదయినాయి. దీనికి మీరంటే మీరని వివిధ రాజకీయ పార్టీలు పరస్పరం ఆరోపణలు గుప్పిస్తున్నాయి. దేశ రాజధానిలో అలజడులు ప్రారంభమయినాయి. చదువుకునే చోట ఈ దౌర్భాగ్యపు పరిస్థితి ఏమిటి? అని ఎవరూ ఆలోచించడం లేదు. పవిత్రమైన విద్యాలయాలకు పట్టిన ఈ దుర్గతిని నివారించడానికి మార్గాలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. మన పూర్వులు వినయ విధేయతలతో కూడిన విద్యనార్జించి మంచి గృహస్థులుగా అయినారు. ఆనాటి గురుకులాలలో విద్యాభ్యాసానికి ముందుగా ఈ దిగువ ప్రార్థన చేసేవారు.
‘‘ఓం సహనావతతు సహనే భునక్తు సహవీర్యం కరవావహై
తేజస్వినావధీత మస్తు మావిద్విషావహై॥
ఓం శాంతిః శాంతిః తిః
అనగా బ్రహ్మము మనలనిరువురను రక్షించుగాక. మనలనిరువురను పోషించుగాక. మన మిరువురము శక్తిసంపన్నులమై యుద్యమింతుముగాక. మన స్వాధ్యాయము చురుకుగ నుండి ఫలవంతమగుగాక. మనము పరస్పరము ద్వేషింపకుందుముగాక. అని ఈ మంత్రానికి అర్థం. ఇక్కడ బ్రహ్మము అంటే బ్రహ్మదేవుడు కాదు. భగవంతుడని అర్థం. దీనిని మించిన సెక్యులర్ ప్రార్థన ఏదీ లేదు. ప్రతి విద్యాలయంలోను గురుశిష్యులు ఈ ప్రార్థన నిత్యం జరపాలి. కుహనా సెక్యులరిస్టులు దీనిని విద్యాలయాలను కూడా కాషారుూకరణ చేయడమే అని గగ్గోలుపెట్టనవసరం లేదు.

- వేదుల సత్యనారాయణ