ఉత్తరాయణం

పివి బాధ్యుడు కాదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాష్టప్రతి ప్రణబ్‌ముఖర్జీ... ఆయన వ్రాసిన పుస్తకంలో కొన్ని వ్యాఖ్యలను ఉటంకిస్తూ బాబ్రీమసీదు అనే ప్రస్తావన తెస్తూ దానికి దివంగత ప్రధానమంత్రి రాజీవ్‌గాంధీ- దివంగత ప్రధానమంత్రి శ్రీ పి.వి.నరసింహారావు లను బాధ్యులను చేస్తూ వ్యాఖ్యానించారు- అవి వాస్తవాలకు చారిత్రక సంఘనలకు భిన్నంగా ఉన్నాయనిపిస్తోంది-
1. బాబ్రీ తలుపులు తెరవటం రాజీవ్‌గాంధీ పొరపాటు అన్నారు- కాని అప్పటికే అలహాబాద్ హైకోర్టు బాబ్రీ తలుపులు తెరచి హిందువుల రామ దర్శనానికి ఆటంకం కలిగించవద్దని న్యాయ నిర్ణయం చేసిన కారణంగా రాజీవ్‌గాంధీ తలుపులు తెరిపించారు. ఈ విషయాన్ని ప్రణబ్‌అసలు ప్రస్తావించలేదు.
2) బాబ్రీ నిర్మాణం కూల్చివేతకు కారణం పి.వి.నరసింహారావు కాదు- అప్పటి యు.పి. ప్రభుత్వం, అప్పటి ముఖ్యమంత్రి బాధ్యులు- ‘‘శాంతి భద్రతల’’ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిది- అంతేకాక బాబ్రీ నిర్మాణానికి హాని కలుగకుండా చూస్తానని అప్పటి ముఖ్యమంత్రిపి.వి.కి గట్టి హామీయిచ్చి మాట తప్పారు- దానికి పి.వి.ని బాధ్యుణ్ణి చేయటం అసంగతం.
3) బాబ్రీ నిర్మాణం మసీదు రూపంలో ఉంది కాని అది మసీదు కాదు- అంతేకాక అక్కడ పురాతన రామాలయాన్ని కూల్చి మసీదు నిర్మాణం చేసారని ముస్లిం చారిత్రక పరిశోధకులే నిర్ణయించారు- అంతేకాదు అయోధ్య వాసులు దాన్ని ‘జన్మస్థలి’అని పిలిచేవారే కాని మసీదుగా కాదు- అందులో ‘‘రామ్‌లాలా’’ బాలరాముని విగ్రహాలకు పూజ జరుగుతూ ఉండేది- ఒక చిన్న కిటికీగుండా హిందువులు అయోధ్యా రాముని దర్శించుకునేవారు- అది హిందువుల పవిత్ర యాత్రాస్థలి- దాన్ని వివాదాస్పదంగా మసీదుగా ప్రచారం చేసింది షహబుద్దీన్ వంటి రాజకీయ నేతలు- విదేశీ మీడియాలో ఆనాడు ఈనాడు కూడా ‘‘బాబ్రీ స్ట్రక్చర్’’అని మాత్రమే వ్యవహరిస్తున్నారనేది వాస్తవిక సత్యం- వీటన్నిటినీ పట్టించుకోకుండా ప్రణబ్ ముఖర్జీ వ్యాఖ్యలు చేయటం, పుస్తకంలో వ్రాయటం వెనుక కేవలం రాజకీయమైన ఉద్దేశమే కనిపిస్తున్నది. కాని యదార్థంకాదు- ఇక ఆయన ప్రధానమంత్రి కాకపోవటానికి కారణం కాంగ్రెస్ రాజకీయాలు- శరత్‌పవార్ కూడా ఇలాంటి ఆవేదననే వెలిబుచ్చారు. దేశభక్తి కాకుండా స్వామి భక్తిని ప్రదర్శించే వారికి ఇటువంటి అనుభవాలు తప్పవు.
- ఉమాపతి బి.శర్మ, హైదరాబాద్
ఉదయం బస్సులు నడపాలి
వడ్డేపల్లి మండల కేంద్రమైన శాంతినగర్ నుంచి ఉద యం బస్సులు లేవు. తెల్లవారు జామున బస్సులుంటే హైదరాబాద్, మహబూబ్‌నగర్, కర్నూల్ మరిన్ని దూర ప్రాంతాలకు వెళ్లే వారికి ప్రయాణం సౌకర్యంగా ఉంటుం ది. అంతేకాక తెల్లవారుజామునే బస్సులు నడపడం వల్ల పలు రైళ్లను సైతం అందుకోవచ్చు. దీనివల్ల ప్రజలకు ప్రయాణభారం అస్సలు ఉండదు. గద్వాల డిపోవారు తెల్లవారుజాము బస్సులు నడిపితే చాలా బాగుంటుంది.
- షేక్ అస్లాం షరీఫ్, శాంతినగర్
ఉద్యోగార్థుల ఇబ్బందులు
ఎలాంటి విద్యార్హతలు లేకుండా నేరుగా సార్వత్రిక విశ్వవిద్యాలయాలనుండి డిగ్రీ పొంది, రాష్ట్ర ప్రభుత్వ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా భర్తీ చేసే ఉద్యోగాలకు దరఖాస్తు చేయడం ఇబ్బంది అవుతోంది. పదవ తరగతి సర్టిఫికెట్ లేకపోవడంతో కంప్యూటర్లు ఈ దరఖా స్తులను స్వీకరించడం లేదు. ప్రభుత్వం ఈ విషయంలో సరైన న్యాయం చేయాలి.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్
ఉద్యోగుల్లో పెరిగిన నిర్లక్ష్యం
తేడాలొస్తే బాదుషా చంపేస్తాడన్న భయంతో ఒళ్లు దగ్గ ర పెట్టుకొని శిల్పులూ, కూలీలు తాజ్‌మహల్ నిర్మించారు. ఇప్పుడు మనకు స్వాతంత్య్రం వచ్చింది. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరన్న ధోరణి ఉద్యోగుల్లో పెరిగిపోయంది. అందుకే మనవాళ్లు వేసిన రోడ్లు ఒక్క ఏడాదిలోనే గుంతలు పడిపోతున్నాయ. కడుతున్న భవనాలు ఇరవై ఏళ్లకే పగుళ్లు ఏర్పడి లీకులు అవుతున్నాయ. బ్రిటిష్ వారు వందేళ్ల జీవితకాలం అంచనాతో నిర్మించిన ధవళేశ్వరం ఆనకట్ట, గోదావరి వంతెన నూటపాతికేళ్ల తర్వాతనే రిపేర్ల కు వచ్చాయ. మనవాళ్లు అదే గోదావరి నదిపై నిర్మించిన రైల్-కం-రోడ్ వంతెన పాతికేళ్లలో మూడుసార్లు రిపేర్లకు వచ్చింది. ఇది మన నాణ్యతా ప్రమాణాలకు నిదర్శనం కాదా? అంతేకాదు మనవాళ్లు నిర్మించే చిన్నా పెద్దా వంతెనలు, భవనాల జీవితకాలం ఎంతో మన ఇంజినీర్లకే తెలియదు. నిర్మాణల్లో చోటు చేసుకుంటున్న నాణ్యతాలే మి అనర్ధాలకు కారణమవుతోంది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలి. మన వాళ్లు నిర్మించబోయే రాజధాని ఎంత కాలం నిలిచి