సంపాదకీయం

పాతబస్తీ హింస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలోని ఎనిమిదవ సెక్షన్ గురించి మళ్లీ చర్చ మొదలు కావడానికి ప్రధాన కారణం హైదరాబాద్ పాతబస్తీలో మంగళవారం చెలరేగిన హింసాకాండ. మజ్లిస్ ఇత్తెహాదుల్ ముస్లిమీ-ఎమ్‌ఐఎమ్-కు చెందిన పార్లమెంటు సభ్యుడు, శాసన సభ్యులు స్వయంగా ప్రత్యర్థి రాజకీయ పక్షాలపై దాడులు చేయడానికి తెగబడడం ప్రజాస్వామ్య రాజ్యాంగ సూత్రాలను అపహాస్యం చేసిన విపరిణామం. మంగళవారం ముగిసిన హైదరాబాద్ మహా నగరపాలిక-జిహెచ్‌ఎంసి-పోలింగ్ సందర్భంగా ఎమ్‌ఐఎమ్ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ, అతని అనుచరులు కాంగ్రెస్ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డిని, షబ్బీర్ అలీని కొట్టి గాయపరచడం సాగిన చోటల్లా ప్రత్యర్థులను మట్టుపెట్టే ప్రవృత్తికి నిదర్శనం. దృశ్య మాధ్యమాలలో తమ బీభత్స స్వరూపాలు వికృతంగా ఆవిష్కృతమవుతున్నాయన్న జంకులేని ఎమ్‌ఐఎమ్ వారు తమ రాజ్యాంగ వ్యతిరేక స్వభావాన్ని మరోసారి చాటుకున్నారు. అసదుద్దీన్ సోదరుడు అక్బరుద్దీన్ ఒవైసీ అనుచరులు వెంటరాగా పోలింగ్ కేంద్రాలలోనే దౌర్జన్యకాండ జరపడం ప్రజాస్వామ్య ప్రక్రియ పట్ల ఎమ్‌ఐఎమ్ వారి విరోధానికి మరో సాక్ష్యం. మహేందర్ అనే భారతీయ జనతాపార్టీ అభ్యర్థిని ఈ సోదరులు కొట్టి గాయపరిచారన్నది ప్రచారమైన సమాచారం. మహమ్మద్ గౌస్ అనే కాంగ్రెస్ అభ్యర్థి కూడా ఎమ్‌ఐఎమ్ వారి దాడులకు గురయ్యాడు. జాతీయ ప్రాంతీయ రాజకీయ పక్షాలు ఈ పాతబస్తీస్థాయి పార్టీ దౌర్జన్యకాండను ముక్తకంఠంతో తిరస్కరిస్తుండడానికి దారితీసిన ఘటనాక్రమానికి మూలకారణం పోలీసు యంత్రాంగం చతికిలపడి ఉండడం. ఇలా చతికిలపడి ఉన్నందునే తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ ఇంటిపైన, ఆయన కుమారుడు అజం అలీ ఇంటిపైన జరిగిన దాడులను పోలీసులు సకాలంలో నిరోధించలేకపోయారు. బలాలా అన్న శాసనసభ్యుడి నేతృత్వంలో ఉపముఖ్యమంత్రి ఇంటిపై సైతం దాడులు జరగడం ముందు జాగ్రత్తలేని పోలీసుల మందకొడి తనానికి నిదర్శనం. దౌర్జన్యకాండకు, విధ్వంసకాండకు పాల్పడిన ఎమ్‌ఐఎమ్ వారిపై ఆరోపణలను నమోదు చేయడానకి దోషులను అరెస్ట్ చేయడానికి మహానగర పోలీసు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది. కానీ హింసాకాండను నిరోధించడానికి వీలుగా ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్నది మాత్రం స్పష్టం. ‘‘ఆవు మాంసం తినాలనుకున్న వారు’’ తమ పార్టీకి మాత్రమే ఓటు వేయాలని ఎన్నికల సందర్భంగా ప్రచారం చేసినవారిని ఎందుకని అరెస్ట్ చేయలేదు? ఇలా పిలుపునివ్వడం రెచ్చగొట్టడం! ఆవును పవిత్రమైన దేవతగా భావించి పూజించే అత్యధిక సంఖ్యాకులైన వోటర్ల మనోభావాలను అలా గాయపరచిన వారు చట్టాలను రాజ్యాంగ స్ఫూర్తిని సైతం వెక్కిరించారు. రెచ్చగొట్టిన వారిని జంట నగరాల పోలీసులు అదుపు చేయలేకపోవడానకి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. అందువల్ల జాతీయ ప్రాంతీయ రాజకీయ వర్గాలకు ఇప్పుడు ఎనిమిదవ సెక్షన్ ప్రాధాన్యం మరోసారి స్ఫురించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని ఎనిమిదవ సెక్షన్ ప్రకారం ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిగా ఉన్నంతకాలం హైదరాబాద్ మహానగరంలో శాంతి భద్రతలను రక్షించవలసిన అధికారం, గవర్నర్‌ది. అందువల్ల ఈ సెక్షన్ కింద గవర్నర్‌కు సలహాలనిచ్చి అమలు జరుపవలసిన వారి వైఫల్యం.
వివిధ దేశాలకు వెళ్లి వస్తున్న, విదేశాలనుంచి వచ్చి పడుతున్న జిహాదీ ఉగ్రవాద మతోన్మాదులకు ఉభయ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధాని అడ్డాగా మారి ఉండడం సమాంతర వైపరీత్యం! ఎఱ్ఱచందనం దొంగరవాణా చేస్తున్నవారు, విదేశాలనుంచి మాదక ద్రవ్యాలను దొంగతనంగా తరలిస్తున్నవారు ఇతరేతర అసాంఘిక విద్రోహులు హైదరాబాద్ పరిసరాల్లో పట్టుబడుతూనే ఉన్నారు! అషఫ్,్ర గిడ్డా అన్న మారుపేర్లు గల అబ్దుల్ అజీజ్ అనే హైదరాబాద్ నివాసి లక్నోలో పట్టుబడడం విస్తరిస్తున్న జిహాదీ బీభత్స వ్యూహానికి సరికొత్త నిదర్శనం. నకిలీ ప్రయాణ అనుమతి పత్రాల- ఫేక్ పాస్‌పోర్టులు తయారుచేసి జిహాదీలకు సరఫరా చేసిన ముఠాకు చెందిన ఇతగాడు దాదాపు పదేళ్ల కిందట సౌదీ అరేబియా తదితర విదేశాలకు పారిపోయాడట! 2001లో అరెస్టయిన ఈ జిహాదీ ఉగ్రవాది పాకిస్తానీ లష్కర్ ఎ తయ్యబా వంటి ముఠాలతో కలిసి మనదేశంలో బీభత్స కలాపాలను సాగించడానికి యత్నించాడు. 2001లో బెయిల్‌పై విడుదలైన తరువాత ఇతగాడు బోస్నియా, రష్యాలోని చెచెన్యా వంటి ప్రాంతాలకు పారిపోయాడు. 1994లో సౌదీ అరేబియాలో ఉండిన సమయంలో ఇతగాడు టెర్రరిస్టుగా మారాడు. రెండు మూడు రోజుల క్రితం సౌదీ అరేబియా నుంచి ఉత్తరప్రదేశ్ రాజధానికి చేరిన ఇతగాడు పోలీసులకు పట్టుబడ్డాడు. హైదరాబాద్ అంతర్జాతీయ జిహాదీ హంతకుల కలాపాలకు ప్రధాన కేంద్రంగా మారిన విపరిణామంలో అజీజ్ అరెస్టు తాజా ఘట్టం. హైదరాబాద్‌నుంచి సిరియాకు, ఆఫ్ఘనిస్తాన్‌కు, ఇరాక్‌కు, పాకిస్తాన్‌కు రాకపోకలు జరిపిన జిహాదీలు పట్టుబడుతూనే ఉన్నారు. కెన్యా దేశానికి చెందిన అమీనా అన్న బీభత్సకారిణిని ఇటీవల హైదరాబాద్‌లో పోలీసులు పసికట్టారు. పట్టుబడని విదేశీయులు ఎందరున్నారన్నది ప్రశ్న.
ఈ నేపథ్యంలో హైదరాబాద్ పరిధిలో సెక్షన్ ఎనిమిదిని అమలు జరపడంపై ఇప్పుడైనా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఏకాభిప్రాయం వ్యక్తం చేయవలసి ఉంది. పునర్విభజన చట్టంలో ఉన్న ఈ శాంతి భద్రతల బాధ్యతను, అధికారాన్ని గవర్నర్ నిర్వహిస్తున్న జాడ ఇంతవరకు గోచరించడంలేదు. ఎనిమిదవ సెక్షన్ ఉపయోగించుకొని తాను శాంతి భద్రతల వ్యవహారంలో తలదూర్చే ప్రయత్నం చేయనని కూడ గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ సెలవిచ్చి ఉన్నారు! తల దూర్చడం వేరు, విధిని నిర్వహించడం వేరు! చట్టంలో ఉన్న నిబంధనకు అనుగుణంగా చర్యలు తీసుకోవడం తలదూర్చడం కాజాలదు! ప్రస్తుతం ఎనిమిదవ సెక్షన్ పరిస్థితి ఏమిటన్నది గవర్నర్ స్పష్టం చేయవలసి ఉంది. ఎందుకంటే గతంలో పట్టించుకోని తెలంగాణ ప్రతిపక్షాలు సైతం ఎనిమిదవ సెక్షన్‌ను అమలుజరపాలని ఇప్పుడు గవర్నర్‌ను కోరుతున్నాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణను, అవశేష ఆంధ్రప్రదేశ్‌గాను ఏర్పడడానికి వీలు కల్పించిన చట్టంలోని కొన్ని నిబంధనలను మాత్రం పాటించడం, మరికొన్నింటిని పాటించకపోవడం చట్టవ్యతిరేకం! కానీ తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎనిమిదవ సెక్షన్‌పై పరస్పరం విరుద్ధ భాష్యాలను చెబుతుండడం గవర్నర్‌కు బహుశా తలబొప్పి కట్టించిన పరిణామం..
ఎనిమిదవ సెక్షన్‌ను అమలు జరపడానికి అవసరమైన మార్గదర్శక సూత్రాలను గవర్నర్ సలహాదారులు ఏపివిఎన్ శర్మ, ఎకెమహంతి గత ఏడాది జూన్‌లో రూపొందించినట్టు అప్పుడు ప్రచారమైంది. కేంద్ర ప్రభుత్వం వారి ఆదేశం మేరకు ఈ మార్గదర్శక నియమావళి రూపొందిందట! ఇందుకు అనుగుణంగా తెలంగాణ ప్రభుత్వానికి జారీ చేయవలసిన నోటిఫికేషన్ ముసాయిదాను గవర్నర్ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించినట్టు కూడ అప్పుడు ప్రచారమైంది! ఈ విషయమై తెలంగాణ ప్రభుత్వం తీవ్రమైన అభ్యంతరాలను వ్యక్తం చేయడం చరిత్ర...ఎనిమిదవ సెక్షన్‌ను ఇప్పుడైనా యథాతథంగా అమలు జరపడం వల్ల ఎమ్‌ఐఎమ్ వంటి సంస్థల దౌర్జన్యాలను, విదేశీయ ప్రేరిత ఉగ్ర కలాపాలను తుదముట్టించడానికి మరింత వీలు కలుగుతుందా? అన్నది వేచి చూడదగిన పరిణామం.