మెయన్ ఫీచర్

స్పెక్ట్రమ్ కేటాయంపుల్లో విప్లవాత్మక మార్పులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టెలికాం ఆపరేటర్ల మధ్య స్పెక్ట్రమ్ షేరింగ్, ట్రేడింగ్ నిర్వహించుకోవచ్చునని రెండు నెలల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించడంతో టెలికమ్యూనికేషన్ల రంగంలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికినట్లయింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం టెలికాం ఆపరేటర్లలో ఎంతో ఉత్సాహాన్ని, స్ఫూర్తిని నింపిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. కాగా వచ్చే జూన్ నెలలో టెలికమ్యూనికేషన్ల శాఖ (డాట్) పెద్ద ఎత్తున స్పెక్ట్రమ్‌ను వేలం వేయడానికి సిద్ధమవుతోంది. మరో అడుగు ముందుకేసి 3జి, 4జి సేవలకోసం అదనంగా ఉపయోగించుకునే స్పెక్ట్రమ్‌ను గుర్తించాలంటూ ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటియు)ను కోరింది కూడా. మొత్తంమీద చెప్పాలంటే ఇప్పటి వరకు ఎదుర్కొంటున్న స్పెక్ట్రమ్ కొరత సమస్యను పూర్తిగా తీర్చేందుకు కేంద్రం కృతనిశ్చయంతో ముందుకెళుతున్నది.
మొబైల్ సర్వీసుల్లో కాల్‌డ్రాప్, ఇంటర్నెట్ సేవలు సక్రమంగా లేకపోవడం వంటి సమస్యలకు టెలికాం ఆపరేటర్లు స్పెక్ట్రమ్ కొరతను సాకుగా చూపిస్తున్నారు. ఇక ముందు ఇటువంటి సమస్యలు ఉత్పన్నం కావు. ఎందుకంటే ఈసారి వేలంలో అదనపుస్పెక్ట్రమ్ చేరబోతున్నది. దీనికి తోడు స్పెక్ట్రమ్‌ను షేర్/ట్రేడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఆపరేటర్లకు లభించబోతున్నది. వీటివల్ల గరిష్టస్థాయిలో స్పెక్ట్రమ్ వినియోగంలోకి రావడమే కాకుండా, మొబైల్ సర్వీసులకు ఆపరేటర్లు అందించే సేవలు మరింత నాణ్యతను సంతరించుకుంటాయి. అయితే వౌలిక సదుపాయాలు తగినంతగా లేకపోవడం అనే మరో సమస్య ఉన్నప్పటికీ, అదంతా వేరే కథ!
స్పెక్ట్రమ్‌కు కృత్రిమ కొరత సృష్టించడం, స్పెక్ట్రమ్‌ను చేతులు మారకుండా నిబంధనలు విధించడం వంటి విధానాల నుంచి, అదనపు స్పెక్ట్రమ్‌ను కేటాయించే స్థాయకి చేరుకోవడం ద్వారా డాట్ మరో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. కొన్ని ప్రభుత్వ సంస్థలు పెద్ద మొత్తంలో స్పెక్ట్రమ్‌ను తమ ఆధీనంలో ఉంచుకున్నాయి. కాని దాన్ని ఉపయోగించడం లేదు. మరోపక్క స్పెక్ట్రమ్ అందుబాటులో లేక ప్రైవేటు సంస్థలు తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈవిధంగా నిరుపయోగంగా ఉన్న స్పెక్ట్రమ్‌ను వెలికి తీసి ఇతరులకు కేటాయించడం ద్వారా ప్రస్తుతం నెలకొన్న స్పెక్ట్రమ్ కొరతను నివారించాలని డాట్ కృతనిశ్చయంతో ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర రక్ష ణ మంత్రిత్వ శాఖ 2016 రెండో త్రైమాసికంలో 150 మెగాహెడ్జ్‌ల స్పెక్ట్రమ్‌ను విడుదల చేయబోతున్నది.
ఈసారి స్పెక్ట్రమ్ వేలం సందర్భంగా షేరింగ్/ట్రేడింగ్‌కు అనుమతించడమే కాకుండా అందుకు అవసరమైన విధివిధానాలను కూడా రూపొందిస్తుండటం వల్ల, వివిధ సంస్థల మధ్య ఒప్పందాలు, పరస్పర సహకారానికి మార్గం సుగమం కాగలదు. ఇందుకు కొన్ని ఉదాహరణలను పేర్కొనవచ్చు: రిలయన్స్ కమ్యూనికేషన్ లిమిటెడ్ (ఆర్‌కామ్), సిస్టెమా శ్యామ్ టెలిసర్వీసెస్ లిమిటెడ్ (ఎస్‌ఎస్‌టిఎల్)ను కొనుగోలు చేయడమే కాకుండా, ఎయిర్‌సెల్‌తో విలీన ఒప్పందం కుదుర్చుకోబోతున్నది. ఇక విడియోకాన్ రెండు సర్కిళ్లలోని స్పెక్ట్రమ్‌ను ఐడియాకు అమ్మబోతున్నది. భారతీ ఎయిర్‌టెల్, ఆగిర్ వైర్‌లెస్‌లో వాటాలను కొనుగోలు చేయనున్నది. ఇక ఆర్‌కామ్, రిలయన్స్ జియోతో వ్యూహాత్మక సంబంధాన్ని నెలకొల్పుకుంది. త్వరలోనే ఇవి భారత్‌లో 4జి సేవలను ప్రారంభించనున్నాయి. ఈ కలయకల వల్ల పెద్దమొత్తంలో స్పెక్ట్రమ్ వీటికి అందుబాటులోకి వస్తుంది. ఇవన్నీ పరిశీలించిన తర్వాత ఉత్పన్నమయ్యే ప్రశ్న ఒకటి ఉంది. వీటి ద్వారా దేశంలోమొబైల్ అనుసంధానంలో పరిణామం ఏవిధంగా సాధ్యమవుతుందనేదే ఆ ప్రశ్న.
డాట్ రూపొందిస్తున్న మార్గదర్శకాలు కొందరు ఆపరేటర్లకు సావధానతను కలిగిస్తాయనడంలో సందేహం లేదు. కొంతమంది ఆపరేటర్లు తమకు కేటాయించిన స్పెక్ట్రమ్‌ను అమ్ముకోవడం ద్వారా గౌరవంగా తప్పుకుంటారు. వేలంలో పెద్దమొత్తంలో పాటపాడి స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేసిన కొందరు ఆపరేటర్లు వ్యాపారంలో తీవ్ర నష్టాలు వస్తున్నా భరించాల్సి వస్తున్నది. వేలంలో కొనుగోలు చేసిన స్పెక్ట్రమ్‌ను తిరిగి అమ్మడానికి వీల్లేదన్న నిబంధన పెద్ద గుదిబండగా మారడమే ఇందుకు కారణం. స్వాధీనం చేసుకోమని ఇతరులను అర్థించడం తప్ప వీరు చేయగలిగిందేమీ లేదు! ఇదే సమయంలో స్వాధీనం లేదా విలీనం కోసం డాట్ రూపొందించిన మా ర్గదర్శ కాల వల్ల ఆపరేటర్లకు పెద్దగా ఒరిగే ప్రయోజనం కూడా లేదు. ప్రస్తుతం డాట్ సంబంధిత సమస్యలపై కేసుల వారీగా మార్గదర్శకాలను రూపొందిస్తున్నది. ఏమైనప్పటికీ ఈ విషయంలో మరింత పారదర్శకతను వ్యవస్థీకృతం చేయడమే ప్రయోజనకరం.
మనదేశంలో మొత్తం పది మొబైల్ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. స్వేచ్ఛాయుత పోటీ వల్ల వినియోగదార్లకు లాభం చేకూరుతుందనేది వ్యక్తమయ్యే సాధారణ అభిప్రా యం. కానీ మొబైల్ సర్వీసుల విషయంలో దీనికి మినహాయింపు. మొత్తం 11 మంది ఆపరేటర్లు, అందుబాటులో ఉన్న పరిమిత వనరులకోసం పోటీ పడాల్సి వస్తోంది. ఫలితంగా ఏ ఒక్కరికీ తగినంత స్పెక్ట్రమ్ సమకూరడం లేదు. ఫలితంగా వీరి సేవల్లో నాణ్యత కొరవడుతోంది. దీనికితోడు మార్కెట్‌నుంచి నిష్క్రమించడానికి నిబంధనలు అంగీకరించవు. దీన్నంతా చూస్తుంటే ట్రాయ్, డాట్‌లు విన్‌స్టన్ చర్చిల్ ఎప్పుడూ ఉటంకించే ‘‘ఎప్పుడూ నిరాశపడవద్దు’’ అనే మాటలను పట్టుకొని వేలాడుతున్నట్టుంది!
మరో నాలుగు నెలల్లో పెద్ద ఎత్తున మళ్లీ వేలంపాట నిర్వహించనున్న తరుణంలో టెలికాం ఆపరేటర్లు మరో డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. షేర్/ట్రేడ్ స్పెక్ట్రమ్‌ను ఎంచుకోవాలా? లేక వేలంలో పూర్తిగా కొనేయాలా అనే విషయంలో ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు. మరి వేలం వేసే స్పెక్ట్రమ్ విలువ రూ.5లక్షల కోట్ల వరకు ఉంటుంది. ఇంత పెద్ద మొత్తాన్ని చెల్లించి వేలంలో స్పెక్ట్రమ్‌లో కొనుగోలు చేయడమంటే, అసలే నష్టాల్లో మునిగితేలుతున్న ఆపరేటర్లకు మూలిగే నక్కపై తాటిపండు పడిన చందమే. మరి ఈ విచిత్ర పరిస్థితిని టెలికాం ఆపరేటర్లు ఏవిధంగా అధిగమిస్తారనేది వేచి చూడాల్సిందే.
షేరింగ్/ట్రేడింగ్‌కు సంబంధించిన మార్గదర్శకాలు మరింత వెసులుబాటు కలిగిస్తున్నప్పటికీ, అవి నిర్దేశించిన లక్ష్యాలు మాత్రం పెద్ద అడ్డంకిగా మారనున్నాయి. టెలికాం ఆపరేటర్ల మధ్య స్పెక్ట్రమ్ షేరింగ్‌కు పరిమితులు విధించడం, వేలం జరిగిన రెండేళ్ల తర్వాత మాత్రమే స్పెక్ట్రమ్ ట్రేడింగ్‌ను అనుమతించడం అనేవి ఆ అడ్డంకులు. స్పెక్ట్రమ్‌ను లీజుకు ఇవ్వడానికి కూడా మార్గదర్శకాలు పరిమితులు విధిస్తున్నాయి. దీనివల్ల స్పెక్ట్రమ్‌ను కొనుగోలు చేయడమా లేదా ట్రేడింగా అనే ఏదో ఒక ఆఫ్షన్‌ను మాత్రమే ఎంచుకునే పరిస్థితిని కల్పిస్తున్నది.
ప్రతి షేరింగ్/ట్రేడింగ్ లావాదేవీ మొత్తం విలువలో ఒక శాతం ప్రభుత్వానికి చెందుతుంది. ఇందులో మొత్తం బాధ్యత కొనుగోలుదారుడిదే. ఇక ప్రభుత్వానికి రెండు రకాలుగా ఆదాయం. ఒక లావాదేవీ జరపడానికి 45 రోజుల ముందు కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందించాలి. ఒక సర్కిల్‌కు సంబంధించినంతవరకు ప్రైవేటు ఆపరేటర్లకు కేటాయించే స్పెక్ట్రమ్ పరిమితి 25 శాతం, ఒక ప్రత్యేక బ్యాండ్‌లో పరిమితి 50 శాతం విధించడం కూడా సమంజసమైన నియంత్రణ కాబోదు. మాజీ ట్రాయ్ ఛైర్మన్ రాహుల్ ఖుల్లర్ ఒక సందర్భంలో మాట్లాడుతూ, ఈ పరిమితులను 10-15 శాతం వరకు పెంచాలన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 2001, 2013 సంవత్సరాల్లో నిర్వహించిన స్పెక్ట్రమ్ వేలంలో కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం గణనీయంగా వచ్చినమాట నిజం. అయినప్పటికీ ప్రభుత్వానికి ఆదాయంకోసం వెంపర్లాట తగ్గలేదనడానికి పెంచిన 0.5 శాతం స్పెక్ట్రమ్ యూసేజ్ చార్జీలే నిదర్శనం. దీనికి తోడు తిరిగి చెల్లించబడని ప్రాసెసింగ్ ఫీజు కింద ఒక్కొక్క లైసెన్సీ రూ.50,000 చొప్పున చెల్లించాలి. దీన్నిబట్టి తేలేదేమంటే ట్రేడింగ్/షేరింగ్ పెరిగే కొద్దీ డాట్ ఆదాయం కూడా మరింత పెరుగుతుంది.
సరే లోపాలెన్ని ఉన్నప్పటికీ షేరింగ్/్ర టేడింగ్, వివిధ ప్రభుత్వ సంస్థల వద్ద ఉపయోగించకుండా ఉన్న స్పెక్ట్రాన్ని విడుదల చేసి, మిగిలిన స్పెక్ట్రమ్‌తో కలిపి వేలం వేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ముందుకు రావడం నిజంగా హర్షించదగ్గ పరిణామమే. ఏకీకరణకు, మార్కెట్ అస్తిత్వానికి ఈ చర్య దోహదకారి కాగలదు. పరిమిత సంఖ్యలో ఆపరేటర్లు తమ వినియోగదారుల అవసరాలను తీర్చడానికి తగినంత స్పెక్ట్రమ్‌ను అందుబాటులో ఉంచుకోవడానికి ఈ విధానం వీలు కల్పిస్తుంది. అయితే రాబోయే స్పెక్ట్రమ్ వేలం మాత్రం గతంలో మాదిరిగా మరింత దుర్మార్గంగా ఉండకూడదు. ఎందుకంటే స్పెక్ట్రమ్ మార్కెట్ విలువను...స్పెక్ట్రమ్ మాత్రమే నిర్ణయించాలి.
ప్రపంచ వ్యాప్తంగా టెలికాం రంగం సుసంఘటితమవుతోంది. 2015లో లైబ్రరీ గ్లోబల్ అక్వైర్డ్ కేబుల్..లాటిన్ అమెరికాలోని వైర్‌లెస్ కమ్యూనికేషన్స్, వంటివి విలీనాలను ప్రకటించాయి. ఎటి అండ్ టి, మెక్సికోకు చెందిన ల్యూసాసెల్‌లు.. నెక్స్‌టెల్‌లను విలీనం చేసుకోగా, రోజర్స్ కెనడాకు చెందిన మొబిలిసిటీలో వీలినమైంది. ఫ్రాన్స్, ఇటలీల్లోని ఆరంజ్.. బుయోగ్యూస్, హట్‌ఛిసన్, విమ్‌పెల్కమ్‌లతో విలీనమయ్యే అవకాశాలున్నాయి. ఇక్కడ మరో అంశం కూడా ప్రస్తావనకు వస్తోంది. ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్.. రేడియో ఫ్రీక్వెన్సీని కేవలం ఒక దేశానికో, ఒక ప్రాంతానికో పరిమితం చేయకుండా అన్ని ప్రాంతాల వారికి సమాన ప్రాతిపదికన కేటాయించాలని కోరుతోంది. దీనివల్ల అంతర్జాతీయ రోమింగ్‌కు అవకాశం కలగడమే కాకుండా, మొబైల్ పరికరాల ధరలు కూడా తగ్గుతాయి. 1800 మెగాహెడ్జ్ బ్యాండ్‌ను అందరికీ సమానంగా కేటాయించాలని మొబైల్ ఆపరేర్లు ఇప్పటికే ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కాల్‌డ్రాప్‌లకు స్పెక్ట్రమ్, ఇతర వౌలిక సదుపాయాలు తగినంత లేకపోవడమే కారణమని ఇకనుంచి ఆపరేటర్లు సాకులు చెప్పడానికి వీలుండదు.

- ప్రదీప్ ఎస్. మెహతా రోహిత్ సింగ్