సబ్ ఫీచర్

జన చైతన్యంతోనే ఎయడ్స్ నివారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎయిడ్స్ రహిత సమాజ నిర్మాణంకోసం ప్రతి ఒక్కరు నడుం బిగించాలి. ఊరూరా వాడవాడలా ఎయిడ్స్ నివారణకోసం చైతన్య కార్యక్రమాలు నిర్వహించి భారతదేశం నుంచి పారద్రోలాలి. ఎయిడ్స్ అనేది ఆరోగ్య సమస్యకాదు, వ్యక్తిగత సమస్య కాదు, అదొక సామాజిక సమస్య, అదొక ఆర్థిక సమస్య, అదొక నైతిక సమస్య. ఎయిడ్స్ సోకి తల్లిదండ్రులు మరణిస్తే వారి పిల్లలు అనాధలై బజారులో పడుతున్నారు. ప్రపంచానికి ఈ సమస్య పెనుసవాలుగా మారింది. హెచ్.ఐ.వి.తో జీవిస్తున్న వారిలో మూడో వంతు మంది 15 నుంచి 24 సంవత్సరాల మధ్య వయసున్న యువతీ యువకులే కావడం భారతదేశ ఉత్పాదక రంగంపై తీవ్రమైన ప్రభావాన్ని కలుగజేస్తుంది. ప్రపంచంలో అధికంగా హెచ్.ఐ.వి. బాధితులు ఉన్న దేశం మన భారతదేశం కావడం, దేశంలో అధికంగా హెచ్.ఐ.వి. క్లైంట్లు ఉన్న రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్ ఒకటి కావడం బాధాకరం. జనచైతన్యంతో హెచ్.ఐ. వి. ఎయిడ్స్‌ను నివారించవచ్చు.
ఈ వ్యాధి 85% లైంగిక సంబంధాల ద్వారానే వ్యాప్తి చెందుతుంది. మరో 5% రక్తమార్పిడి ద్వారా వ్యాప్తి చెందుతుంది. మరో 10% ఇంజక్షన్‌లు, సిరంజీలు, పచ్చబొట్లు పొడిపించుకోవడాలు ద్వారా వ్యాప్తి చెందుతుంది. గర్భిణి స్ర్తికి హెచ్.ఐ.వి. ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా 30-40% వరకు వ్యాధి వ్యాపించే అవకాశాలు ఉన్నాయి. అయితే రాష్టవ్య్రాప్తంగా ఉన్న ఐ.సి.టి.సి. కేంద్రాలు, ఎ.ఆర్.టి. కేంద్రాలు ఇతర స్వచ్ఛంద సంస్థలు హెచ్.ఐ.వి. ఉన్న గర్భిణీ స్ర్తిలకు తగిన మాత్రలు ఇవ్వడంవల్ల శిశువుకు వ్యాధి లేకుండా చేయవచ్చును. హెచ్.ఐ.వి. ఉన్నంత మాత్రాన భయపడాల్సిన పని లేదు. పౌష్టికాహారం, యోగా, వ్యాయామం ద్వారా 20 సంవత్సరాల వరకు నిశ్చింతగా బ్రతుకవచ్చును.
హెచ్.ఐ.వి. అనేది ప్రాథమిక దశ మాత్రమే. చక్కని కౌన్సిలింగ్, వైద్యుల సలహాలు, కేర్ అండ్ సపోర్ట్ సెంటర్ల సహకారం తీసుకుంటే ఎయిడ్స్ రోగిగా మారకుండా ఉండవచ్చు. కానీ హెచ్.ఐ.వి. సోకినంత మాత్రాన మానసిక ఆందోళనకు గురై ఆహార పదార్థాలు తీసుకోవడం మానివేసి ఆత్మహత్యలకు ప్రయత్నించడం మంచిది కాదు. ప్రతి ఆరు సెకండ్లకు ఒకరు చొప్పున రోజుకు పధ్నాలుగు వేయిల మంది ఈ వ్యాధి బారిన పడుతున్నా రు. ఈ వ్యాధి సోకిన వారిలో 90% మంది 15-45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవారు. వీరిలో సగం మంది మహిళలు మూడింట ఒకటి వంతు అవివాహితులు కావడం ఆలోచించదగినది. పాఠశాల, కశాళాలల్లో కౌమార దశలో ఉన్న యువతీ యువకులను కాపాడి వారిని హెచ్.ఐ.వి. ఎయిడ్స్ బారిన పడకుండా ఉండడంకోసం రెడ్ రిబ్బన్ క్లబ్ ప్రోగ్రాంను ఏర్పాటుచేసింది. రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలలు, డిగ్రీ కళాశాలలు, పాలిటెక్నిక్ కళాశాలలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తేదీనాటికి రెడ్ రిబ్బన్ క్లబ్ కార్యక్రమాలు విరివిగా నిర్వహిస్తున్నారు. వ్యాధికి దూరంగా ఉండటానికి వివాహానికి పూర్వమే లైంగిక సంబంధాలకు దూరంగా ఉండటం లేదా నిగ్రహించుకోవడం, విశ్వాసపాత్రులైన జీవిత భాగస్వామినే లైంగిక భాగస్వామిగా ఎంచుకోవడం, తప్పని పరిస్థితిలో కండోమ్ వాడడంవల్ల ఎయిడ్స్ వ్యాధినుంచి సురక్షితంగా బయటపడే అవకాశాలున్నాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ 10 జీవన నైపుణ్యాలను సిఫారసు చేసింది.
సరైన నిర్ణయం తీసుకోవడం, సంప్రదింపుల నైపు ణ్యం, సహానుభూతి, ఒత్తిడిని, ఉద్వేగాలను తట్టుకోవడం, వ్యక్తుల మధ్య పరస్పర సంబంధాల నైపుణ్యం, సమస్యను సృజనాత్మకంగా ఆలోచించడం. సమర్ధవంతంగా కమ్యునికేట్ చేయటం ఆత్మపరిశీలన చేసుకోవడం, విమర్శనాత్మకంగా ఆలోచించడం, సమస్యకు పరిష్కారాన్ని కనుక్కోవటం. ఈ పది నైపుణ్యాలను యువతీ యువకులు మహిళలు సక్రమంగా అమలుపరిస్తే వారి జీవితం పై రిస్కు స్థాయినుంచి బయటపడగలదు. మన రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ఆంధ్రప్రదేశ్ ఎయిడ్స్ నియంత్రణ మండలి సహకారంతో 169 టార్గెట్ ఇంటర్‌వెన్షన్‌లను నిర్వహిస్తున్నారు.జాతీయ గ్రామీణ ఆరోగ్య పథకం క్రింద గర్భిణీ స్ర్తికి కావాల్సిన మందులను జననీ సురక్ష యోజన ద్వారా సరఫరా చేస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం, సామాజికవేత్తలు, వైద్య నిపుణులు వ్యాధి నివారణకోసం అవగాహన సమావేశాలు, సదస్సులు, ర్యాలీలు వాడవాడలా ఊరూరా నిర్వహిస్తున్నప్పటికీ చాపకింద నీరువలే ఈ వ్యాధి మరింత వ్యాపించడం సామాజిక వేత్తలను, పాలకులను కలవరపరుస్తున్నది. తెలిసీ తెలియక చేసిన పాపానికి కొన్ని కుటుంబాలు ఆత్మహత్యల పాలుకాగా వారి సంతానం రోడ్డునపడి అనాధలైపోతున్నారు. వేశ్యా వృత్తిని, కాల్‌గర్ల్స్, సెక్స్‌వర్కర్లు వ్యవస్థను నిర్మూలించడానికి పాలకులు, పోలీసులు, సమాజం చూచి చూడనట్లు ఉండటంతో యవ్వనంలో ఉండగా ఈ వ్యాధికి గురవుతున్నారు.
సమాజంలో వ్యాధిగ్రస్తుల పట్ల సానుభూతి, సహకారం, ప్రేమ లేకపోగా సూటిపోటి మాటలతో సమాజం వేలెత్తి చూపడంవల్ల చాలామంది ఆత్మన్యూనతా భావానికి లోనై మధ్యలోనే జీవితాన్ని ముగిస్తున్నారు. వివాహానికి ముందు ఎయిడ్స్ పరీక్షలు విధిగా గోవా ప్రభుత్వం శాసనం తెచ్చింది. పెళ్ళికిముందు వధూవరులకు విధిగా ఎయిడ్స్ పరీక్ష చేసుకోవాలనే నిబంధనను ప్రభుత్వాలు విధిస్తే కొంత లాభం జరిగే అవకాశం ఉంది. అలాగే ఎయిడ్స్ వ్యాధిగ్రస్తులకు పింఛన్లు ఇస్తామని, ఉచితంగా గృహాలు కట్టి ఇస్తామని, బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణానికి పాస్‌లు జారీచేస్తామని పాలకులు అరిగిపోయిన రికార్డులవలె ప్రకటిస్తున్నారు. కాని దశాబ్దాలు గడిచినా వారి బాధలను పట్టించుకునే ప్రభుత్వాధికారులు, ప్రజాప్రతినిధులు కరువయ్యారు. ప్రజా ప్రతినిధులు తమ హామీలను నెరవేర్చాలని బాధితులు కోరుతున్నారు.

- రావుల రాజేశం