మిర్చిమసాలా

అయ్యో రత్నాచల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రత్నాచల్ ఎక్స్‌ప్రెస్ అంటే కోస్తాంధ్ర ప్రజల జీవనాడి. ఈ ఎక్స్‌ప్రెస్ రైలులో ప్రయాణం చేయని వారు అరుదు. విజయవాడలో ఉదయం 6.05 గంటలకు బయలుదేరే ఈ రైలు విశాఖపట్నం, మార్గంలో నగరాలకు వెళ్లేవారికి ఎంతో హాయి. మధ్యాహ్నం 12.30 గంటలకు విశాఖకు చేరుతుంది. ఉదయం ఫలాహారం చేసి ఒక న్యూస్ పేపర్ కొనుక్కుని కిటీకి రిజర్వుడ్ సీటులో కూర్చుంటే చాలు. ఆంధ్రా ప్రకృతి అందాలన్నీ తనివి తీరా చూడవచ్చు. మంచి కంపెనీ దొరికితే చాలు కబుర్లకు లోటుండదు. రాజమండ్రి వద్ద గోదావరి సోయగాలు, వంతెనపై వెళుతున్నప్పుడు వచ్చే శబ్ధాలు మైమరిపిస్తాయి. ఆంధ్రరాష్ట్రం నలుమూలల ఉండే ప్రజలు విజయవాడకు వచ్చి అక్కడ నుంచి విశాఖపట్నం వైపు వెళ్లాలనుకుంటే, ఉదయం ఈ రైలులో ప్రయాణం చేసేందుకు ఇష్టపడుతారు. ఈ రైలు కోచ్‌లను తుని వద్ద ఆందోళనాకారులు దగ్ధం చేయడంతో ఈ రైలు తాత్కాలికంగా వారం రోజుల పాటు రద్దయింది. దీంతో ఆరుకోట్ల ఆంధ్రులు విలవిలలాడారు. మనుషులే కాదు, రైలుకు కూడా ప్రాణం ఉంటుంది. అందులో రైలు ప్రయాణం అంటే ప్రాణాలు ఇచ్చే ఆంధ్ర ప్రజల మనసు రత్నాచల్ కోచ్‌లు దగ్ధం కావడంతో వికలమైంది.
- శైలేంద్ర

మహా తెలివి
లెక్చరర్ల ఉద్యోగాలకు ఆ మధ్య ఉస్మానియా యూనివర్శిటీలో ఇంటర్వ్యూలు జరిగాయి...వేయిపడగలు రాసింది ఎవరు అంటే ఒక అభ్యర్ధి ఠక్కున గురజాడ అంటూ జవాబు ఇచ్చేశాడు. తెలుగులో పిహెచ్ డి చేసి, తెలుగు సాహిత్యాన్ని ఔపోసన పట్టిన ఆ మహానుభావుడ్ని చూసి ఇంటర్వ్యూలు చేసిన ‘పెద్దలు’ కాసేపు సిగ్గుపడాల్సి వచ్చింది. నోబెల్ ప్రైజ్ ఎవరికిస్తారు? అదీ తెలీదు, లారెట్ స్పెల్లింగ్ తెలుసా అదీ తెలీదు దాంతో చదువులు ఇంతలా ఎందుకు మారిపోయాయి అంటూ తలలుపట్టుకోవడం ‘పెద్దల’ వంతైంది. ఇంతకీ క్లైమాక్స్ ఏమంటారా? అలా చెప్పలేనివారు కూడా బోధకులుగా మారి కొన్నాళ్లకు వారే వీసీ పోస్టులకు రిజిస్ట్రార్ పోస్టులకూ పోటీపడటం అందులోనూ విజయం సాధించినట్టయితే ఆశ్చర్యం ఏముంది? అన్నట్టు కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ కుసుమకుమారి, ద్రావిడ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ రమణయ్య వంటి వారిపై వచ్చిన విమర్శలు మనం వినలేదా...చూడలేదా..
-బి.వి.ప్రసాద్

ఆ ఓట్లు ఎవరివి?
గ్రేటర్ ఎన్నికల్లో అధికార టిఆర్‌ఎస్ ప్రభంజనం వీచింది. ఫలితాలు వెలువడగానే దాదాపు అన్ని టీవీ ఛానల్స్‌లో శివారు ప్రాంతంలో సీమాంధ్ర ఓటర్లు కూడా టిఆర్‌ఎస్‌కే పట్టం కట్టారని బ్రేకింగ్ స్క్రోలింగ్‌లను ప్రముఖంగా వేశారు. శివారు ప్రాంతంలో స్థిరపడిన సెటిలర్ల ఓట్లు టిడిపికి పడతాయని అంచనా వేస్తే అక్కడ కూడా టిఆర్‌ఎస్ గెలుపొందింది. ఛానల్స్ చేసిన విశే్లషణ ఇది. అంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడో విషయాన్ని మాత్రం ఛానల్స్ మరచిపోయాయి. శివారు ప్రాంతంలో టిఆర్‌ఎస్ పార్టీకి పడిన ఓట్లు సీమాంధ్ర ఓటర్లవే అయితే, మరి ఆ ప్రాంతాల్లో గెలుపొందిన టిఆర్‌ఎస్ అభ్యర్థుల సమీప ప్రత్యర్థులకు (టిడిపి) పడిన ఓట్లు ఎవరివి? అన్నది మిలియన్ డాలర్ ప్రశ్న. శివారు ప్రాంతంలో సీమాంధ్ర ఓటర్లంతా టిఆర్‌ఎస్‌కు ఓటు వేసినట్టు అయితే అక్కడ ఓడిపోయిన అభ్యర్థులకు పడిన ఓట్లు తెలంగాణ ఓటర్లు వేసినట్టా? మరి ఈ ప్రశ్నకు చానల్స్ కానీ, వాటిలో కూర్చోని ఫలితాలను విశే్లషించిన విశే్లషకులకు కానీ ఎ ఒక్కరు సమాధానం చెప్పలేకపోయారు.
- వెల్జాల చంద్రశేఖర్

చెవిలో మాట
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ సొంతంగా మేయర్ స్థానం కైవసం చేసుకుంటే చెవి కోసుకుంటాను అని సిపిఐ నాయకులు నారాయణ విసిరిన సవాలు చర్చనియాంశంగా మారింది. చివరకు ఎవరూ ఊహించని స్థాయిలో గ్రేటర్‌లో టిఆర్‌ఎస్ కొత్త చరిత్ర సృష్టించి ఘన విజయం సాధించింది. ఇలా జరుగుతుంది అని మేం చెబితే తొలుత ఎవరైనా అబ్బురపడతారు. చివరకు అదే నిజం అవుతుంది కెసిఆర్ పదే పదే చెబుతూనే ఉన్నారు. కానీ విపక్షాలకు అర్ధం కాలేదు. తీరా టిఆర్‌ఎస్ కనీసం కో ఆప్షన్ సభ్యుల ఓటు కూడా అవసరం లేకుండా ఏకపక్షంగా విజయం సాధించింది. ఫలితాలు వెలువడాగానే అందరూ కాబోయే మేయర్ ఎవరూ అనే అంశంపై కన్నా నారాయణ చెవి కోసుకుంటారా? మాట నిలబెట్టుకుంటారా? అనే దానిపైనే దృష్టిసారించారు. విషయం గ్రహించిన కెసిఆర్ విలేఖరుల సమావేశంలో నారాయణ నాకు మంచి మిత్రుడు పార్టీ కార్యకర్తలు తొందర పడి చెవి కోయకండి అని సలహా ఇచ్చారు. ఒక చెవి నారాయణను చూడలేం రెండు చెవుల నారాయణను చూడాలని నవ్వారు.
- మురళి

రేవంత్ రెడ్డి సవాలు
టిఆర్‌ఎస్ వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం స్వీకరిస్తానని పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, షబ్బీర్ అలీ సవాల్ చేశారు. వార్తల్లో నిలిచేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి మరో అడుగు ముందుకు వేసి వంద సీట్లు గెలిస్తే రాజకీయ సన్యాసం స్వీకరించడమే కాదు తెలంగాణలో ఉండను అని సవాల్ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో టిఆర్‌ఎస్ 107 స్థానాల్లో లీడ్‌లో ఉండగా, ఈ విషయాన్ని మీడియా అడిగితే నా సవాల్‌ను టిఆర్‌ఎస్ స్వీకరించలేదు కదా అని సమాధానం చెప్పారు. తీరా తుది ఫలితాలు వెలువడ్డాక చూస్తే టిఆర్‌ఎస్ 99 సీట్లకు పరిమితం అయింది. సవాల్ చేయడం తొందర పాటు చర్య కాగా, సవాల్‌ను టిఆర్‌ఎస్ స్వీకరించలేదు కదా? అంటూ దొరికిపోయారు. ఒట్ల లెక్కింపు పూర్తయ్యేవరకు వేచి చూసి ఉంటే 99 వద్ద ఆగిపోయింది కాబట్టి సన్యాసం స్వీకరించడం లేదు. వంద వచ్చి ఉంటే మాట మీద నిలబడేవాడిని అని చెప్పుకోవడానికి ఉన్న అవకాశం కోల్పోయారు.
- బుద్ధ