సంపాదకీయం

వివక్ష కాదు...వ్యవస్థ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శబరిమల అయ్యప్ప స్వామి ఆలయ సంప్రదాయాల పరిరక్షణ పట్ల కేరళ ప్రభుత్వం కటిబద్ధతను ప్రకటించడం మత స్వేచ్ఛా పరిరక్షణకు దోహదం చేయగల పరిణామం. ఈ దేశపు వౌలిక జాతీయ తత్వమైన హిందుత్వం అనాదిగా మత వైవిధ్యాల భాషా వైవిధ్యాల సంపుటం...అందువల్ల మత స్వేచ్ఛ మనదేశ జనజీవన స్వభావమై ఉంది. క్రీస్తుశకం 1950లో అమలు లోకి వచ్చిన రాజ్యాంగం ఈ సమష్టి జన జీవన స్వభావానికి మరో ధ్రువీకరణ. శబరిమల ఆలయ సంప్రదాయాల పరిరక్షణ రాజ్యాంగంలోని నిబంధనలకు అనుగుణమని కేరళ ప్రభుత్వం శుక్రవారం సర్వోన్నత న్యాయస్థానానికి తెలియజేయడం అందువల్ల హర్షణీయ పరిణామం. శబరిమల దేవాలయంలోకి పది, యాబయి ఏళ్ల మధ్య వయసున్న బాలికలు, యువతులు, మహిళలు ప్రవేశించకపోవడం తరతరాల సంప్రదాయం. అంటే పదేళ్లలోపు బాలికలు, యాబయి ఏళ్లు నిండిన మహిళలు మాత్రమే ఆలయంలోకి వెళ్లి అయ్యప్ప దేవుడిని దర్శించుకొనడం ఆచారమైంది. పురుషులకు ఇలాంటి నిబంధన లేదు కాబట్టి మహిళలకు ఇలా వయోనిబంధన విధించడం రాజ్యాంగ విరుద్ధమన్న బుద్ధి వైపరీత్యం ఎవరికో కొందరికి అంకురించింది. స్వదేశీయ మతాలకు సంబంధించిన ఆచారాలను, సంప్రదాయాలను వ్ఢ్యౌంగాను, వివక్షగాను ప్రచారం చేస్తున్న ఈ కొందరు దుర్బుద్ధిమంతులు దేశమంతటా ఉన్నారు. కానీ ఈ కొందరికి విదేశాలలోని మతాలవారి దురాచారాలు కూడ సదాచారాలుగానే కనిపిస్తుండడం దశాబ్దుల, శతాబ్దుల స్వజాతీయతా వ్యతిరేక దుస్తంత్రంలో భాగం. విదేశాలనుండి మనదేశంలోకి విస్తరించిన మతాలలోని వ్ఢ్యౌన్ని, ఉన్మాదాన్ని సైతం ఈ కొందరు దుర్బుద్ధిమంతులు తమస్వేచ్ఛగానే ప్రచారం చేస్తున్నారు. ఇలాం టి దుర్బుద్ధిమంతులకు నిజానికి ఏ మతంలోను విశ్వాసం లేదు. దేవుడు వారి దృష్టిలో లేడు. కాని, లేని దేవుడికి సంబంధించిన వాటినన్నింటినీ వ్యతిరేకిచడం మాత్రం ఈ కొందరికి జీవన రీతిగా మారింది. ఫలితంగా మత సంప్రదాయాలను విమర్శించడం వ్యతిరేకించడం నిరోధించడానికి యత్నించడం, వ్యతిరేక ప్రచారం చేయడం మత సంప్రదాయాలను ఆలయ ఆచారాలను రద్దు చేయాలని న్యాయస్థానాలను అభ్యర్థించడం ఈ కొందరి నిరంతర కార్యక్రమమైంది. అలాంటి కొందరు శబరిమల దేవాలయం లోనికి పది, యాబయి ఏళ్ల మధ్య వయసు కల మహిళలు సైతం ప్రవేశించడానికి అనుమతి కావాలని కోరుతున్నారు. అనుమతిని ప్రసాదించవలసిందిగా కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో వివాదాన్ని దాఖలు చేశారు.
ఆలయం సంప్రదాయాలు ఇలా వివాదగ్రస్తం కావడం ఇది మొదటిసారి కాదు. ఈ దేశపు సాంస్కృతిక అస్తిత్వానికి సంబంధించిన ప్రతి అంశాన్ని వ్యతిరేకించే కొందరు దశాబ్దుల తరబడి ఈ దేశంలోనే వికృత విన్యాసాలు ప్రదర్శిస్తున్నారు. అయ్యప్ప స్వామి ఆలయంలోకి తాము చొరబడిపోవాలన్నది దైవబక్తికల సంప్రదాయ నిష్ఠకల మహిళలు ఎవ్వరూ కోరుకొనడం లేదు. ఋతుమతులైన సమయంలో మహిళలు దేవాలయంలో నాలుగైదు రోజులపాటు ప్రవేశించడం లేదు. సంప్రదాయ నిష్ఠగల హైందవ మహిళలు ప్రతినెలలో ఇలా నాలుగైదు రోజుల పాటు దేవాలయ ప్రవేశానికి, పూజాగృహానికి దూరంగా ఉండడం స్వచ్ఛందంగా వారు పాటిస్తున్న ఆచారం. ఈ ఆచారాన్ని మహిళలు పాటించరాదని కోరుతూ ఎవరైనా ఉన్నత సర్వోన్నత న్యాయస్థానంలో వివాదం దాఖలు చేసినట్టయితే ఏమవుతుంది? అయ్యప్ప స్వామి దేవాలయం లోకి తరుణులు ప్రవేశించరాదన్న సంప్రదాయం తరతరాలుగా స్వచ్ఛందమైనది. ఇది మాతృమూర్తుల శారీరక ప్రాకృతిక స్వభావానికి సంబంధించిన వ్యవహారం. ప్రతి ఇంటా మహిళలు పాటిస్తున్న దేవాలయ ప్రవేశ నియమానికి అయ్యప్పస్వామి ఆలయ సంప్రదాయం విస్తృతి మాత్రమే. సంప్రదాయాన్ని చెడగొట్టితీరాలని, సమాజంలో వైరుధ్య భావాలను వ్యాప్తి చేయాలని భావిస్తున్న వారు మహిళలకు మేలు చేయడంలేదు. మహారాష్టల్రోని శని సింగణపూర్ లోని ఆలయంలో మహిళలు ప్రవేశించి తీరాలని ఉద్యమం చేసినవారు కూడ దైవ భక్తులు మాత్రం కాదు, సమాజంలో విభజన విషవహ్నిజ్వాలలను రగిలించడానికి యత్నిస్తున్న వారు మాత్రమే. అస్సాంలోని కామాఖ్య క్షేత్రంలో శక్తిపీఠం దేవాలయాన్ని నెలకు మూడు రోజులపాటు మూసివేసే సంప్రదాయం కొనసాగుతోంది. పూరీ క్షేత్రంలో బలభద్రునికి జగన్నాథునికి వారి చెల్లెలు సుభద్రాదేవికి జ్వరం వచ్చినప్పుడు చికిత్స చేసే ఆచారం ఉంది. ఇలా ఆసేతు శీతనగం విస్తరించి ఉన్న అసంఖ్యాక హైందవ సాంస్కృతిక క్షేత్రాలలోని ఆలయాలలో వైవిధ్యం సంప్రదాయాలు ఉండడం మత స్వేచ్ఛ, ధార్మిక స్వాతంత్య్రం. సంప్రదాయాన్ని కృత్రిమ విచక్షణ, కృతక నికషంపై పరీక్షించాలనుకోవడం జాతీయ జీవన తత్వాన్ని అవమానించడమే కాగలదు. అయ్యప్ప స్వామి ఆలయ సంప్రదాయాలను పరిరక్షించాలని స్ర్తిపురుష భేదం లేకుండా దైవ నిష్ఠ ధర్మ నిష్ఠ కలవారంతా కోరుకుంటున్నారు.
ఈ కోరికకు అనుగుణంగానే కేరళ ప్రభుత్వం శుక్రవారం సుప్రీంకోర్టులో తమ వాదం వినిపించింది. అయ్యప్ప గుడిలోకి ప్రవేశించడానికి మహిళలను-పదేళ్ల పైబడిన 50 ఏళ్ల లోపు వారిని- కూడ అనుమతించ వలసిందేనని కోరుతూ 2007లో కేరళ ప్రభుత్వం ప్రమాణ పత్రిక-అఫిడవిట్-ను దాఖలు చేసిందట. అప్పుడు వామపక్షాల నాయకత్వంలోని కూటమి వారు ప్రభుత్వ నిర్వాహకులు. ఆ ప్రమాణ పత్రాన్ని తొమ్మిదేళ్ల తరువాత కేరళ ప్రభుత్వం ఇప్పుడు ఉపసంహరించుకొందట. ఇప్పుడు కాంగ్రెస్ నాయకత్వంలోని ఐక్య ప్రజాస్వామ్య సంఘటన కేరళ ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది. రాజకీయ పక్షాలు మారవచ్చు గాక, కానీ రాజ్యాంగ నిబంధనలు మారవు. రాజకీయ విభేదాల ప్రాతిపదికగా కాక, రాజ్యాంగ నిష్ఠ ప్రాతిపదికన మాత్రమే వివిధ సమస్యలపై రాజకీయ పక్షాలు తమ విధానాన్ని రూపొందించుకోవడం ప్రజాస్వామ్యం. కానీ అనాదిగా ఉన్న అయ్యప్ప స్వామి ఆలయ సంప్రదాయం రాజకీయ వైరుధ్య విధానాలకు గురికావడం మిక్కిలి దురదృష్టకరం. అనాదిగా ఉన్న అచారాన్ని పాటించవలసిందేనని ప్రస్తుత రాజకీయ నిర్వాహకులు సుప్రీంకోర్టుకు చెప్పారు. ఒకవేళ మళ్లీ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారిపోయినట్టయితే మళ్లీ సంప్రదాయం మారిపోవాలా? అందువల్ల రాజకీయ పక్షాల, ఆ పక్షాలు నిర్వహించే ప్రభుత్వాల తత్కాల విధానాలతో సంబంధం లేకుండా అనాది సంస్కృతిని నిలబెట్టుకోవడం ప్రధానం. ఇప్పుడు వివాదం సర్వోన్నత న్యాస్థానం పరిధిలో ఉంది కాబట్టి తుది నిర్ణయం ఇలా సంస్కృతి పరిరక్షణకు దోహదం చేయగలదన్నది ఆకాంక్ష.
దేవాలయ గర్భగృహంలోకి వెళ్లే ధార్మిక అధికారం అర్చకులకు మాత్రమే ఉంది. ఈ అధికారం, అర్హత, అర్చకులకు మాత్రమే ఉండడం ఆయా ఆలయాల ఆగమశాస్త్ర విహితం. అందువల్ల ఇలా అర్చకులకు ఈ విశిష్ట అధికారం ఉండడం ఇతరుల హక్కులకు భంగకరం కాదని సర్వోన్నత న్యాయస్థానం గత డిసెంబర్ 16న తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని 17వ అధికరణం స్ఫూర్తిని కాని, 1955వ సంవత్సరంనాటి పౌర అధికార పరిరక్షణ చట్టం స్ఫూర్తిని కాని అర్చకులకున్న గర్భాలయ ప్రవేశ అధికారం భంగకరం కాదన్నది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. గర్బగుడిలోకి అర్చకులు మాత్రమే వెళ్లగలగడం భక్తులందరికీ ఆ అధికారం లేకపోవడం వివక్ష కాదు..‘వ్యవస్థ’ మాత్రమే.