ఉత్తరాయణం

కవిత్వపు వనె్న

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నా తెలంగాణా
కోటి రతనాల
వీణ గర్జించిన
శ్రీ దాశరధి అ
మృత సుధాధా
రలు కురిసిన
సాహిత్యం
భువియందు
కాంతి పుంజము
ప్రకాశితమై తెలుగు
కవిత్వంబునకు వనె్నదెచ్చె
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు

ఏటా కొత్తవాళ్లేకదా!
కాంట్రాక్టు ఉద్యోగాలు ప్రతి ఏడాది కొత్తవారికివ్వాలి. ఒకసారి చేసిన వారికి మరో ఏడాది పొడిగించవద్దు. ఆవిధంగా పొడిగించడం వల్ల కొత్తవారికి అవకాశాలు దక్కవు. మరుసటి సంవత్సరం మళ్ళీ కొత్తవారిని పిలిచి ఉద్యోగం చేసే అవకాశం ఇస్తే అందరికీ ప్రభుత్వ ఉద్యోగం చేశామన్న తృప్తిమిగులుతుంది. క్రమబద్ధీకరణకోసం ఎలాంటి పోరాటాలుండవు కదా! ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని మనవి.
- కె.వెంకటేశ్వర్లు, కరీంనగర్
చట్టబద్ధంగా వేతనాలు
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే వంట కార్మికులకు చట్టబద్ధంగా వేతనాలు అందించాలని వంట కార్మికులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. వంటకు సరిపడే సరుకులను, కోడిగ్రుడ్లు, పిల్లల మెస్ బిల్లు పెంచాలని వంట పాత్రలు ప్రభుత్వమే అందించాలని కార్మిక సం ఘాల నాయకులు కోరుతున్నారు.
- గుండు రమణయ్య, పెద్దాపూర్
నాస్తికత్వం కూడా మతమే
నాస్తికత్వం కూడ ఓ మతం. దేవుడు అసలులేడనీ, సుఖమే పరమధర్మమనీ, సేవ సమానత్వానికి మించిన ధర్మంలేదనీ నమ్మే నాస్తికత్వం ఈరోజుల్లో కానరావడం లేదు. సంప్రదాయాల పేరుతో అసమానత, దోపిడీలు జరుగుతున్నాయని నాస్తికవాదులు ఎప్పటినుండో వాదిస్తున్నారు. ఎవరి నమ్మకం వారిది. నాస్తికునికి భక్తునిగా మార్చడం కష్టం. అలాగే భక్తుని నాస్తికునిగా చెయ్యడం కష్టం. ఎవరి మతాలని వారు గౌరవించుకోవాలి. అభద్రతాభావం వల్ల భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. కొందరు భక్తిముసుగులో చెడు పనులు చేస్తున్నారు.
- కుమార్, కంచరపాలెం
విద్యా వ్యాపారం
విద్య మహావ్యాపారం అయిపోయింది. విద్యార్థులకు ఆటపాటల్లేకుండా కేవలం చదువుపైనే వారి దృష్టి కేంద్రీకృతమైనట్లు చేస్తున్నారు. ప్రతి పాఠశాలలో కనీసం నెలకొక సారైనా విద్యార్థులకు ఆటలు, పాటల పోటీలు నిర్వహించాలి. దేశ సంస్కృతి, కష్టపడి పైకి వచ్చిన వ్యక్తుల గూర్చి వివరించాలి. వివిధ మతాలు, ఆచారాలు గురించి క్షుణ్ణం గా వివరించాలి. క్రమశిక్షణ లేని విద్య వ్యర్థం అని అం దరూ గమనించాలి. టీచర్లుకూడా చాలా శ్రద్ధతీసుకోవాలి. అధిక సెలవులు పెట్టకూడదు. అధిక సెలవులు పెడితే విద్యార్థుల చదువులు దెబ్బతీనే ప్రమాదం వుంది.
- కె.వి.సురేశ్, దొండపర్తి
ఉపాధిలేని చదువులు
నేడు నిరుద్యోగం ప్రళయ తాండవం చేస్తోంది. కులవృత్తులు ఎవ్వరూ చెయ్యడం లేదు. డిగ్రీలు, డిప్లొమాలు కేవలం కాగితంముక్కలే గాని దారి చూపించే వెలుగు కాదు. అందరూ చదువుతున్నారు. చదువుకోవడం తప్పుకాదుకాని ఉపాధి దొరకడంలేదు. ఉన్నతమైన డిగ్రీలు చదివినవారికి ఉపాధి దొరకడం చాలా కష్టతరంగా మారింది. ఉపాధి లేకపోతే ఆ దేశ అభివృద్ధి నాశనమైపోతుంది. నేరాలు, ఆత్మహత్యలు, నిరుద్యోగం ఫలితాలే. పాలకులు ఈ సమస్యపై దృష్టిపెట్టకపోతే ఆ దేశ అభివృద్ధి ఆగిపోతుంది. స్వయం ఉపాధి మార్గాలు కూడా ఉపకరిస్తాయి. యువతకు వడ్డీలేని ఋణాలిచ్చి వారిని ఆదుకోవాలి. ప్రకటించిన పథకాలను వీరికి అందుబాటులోకి తీసుకొని రావాలి. పథకాలపై యువతలో చైతన్యం కలిగించాలి. వీరిలో చైతన్యం కలిగించకుండా ఎన్ని పథకాలు ప్రవేశపెట్టినా వృధా.
- వి.శశిధర్, విశాఖపట్నం
పోలీసుల ప్రతిభ
రాష్ట్రంలో విశాఖ, విజయవాడ, గుంటూరు నగరాల్లో కొనసాగుతున్న హైటెక్ వ్యభిచారం బట్టబయలు చేయడంలో పోలీసుల పనితీరు అద్వితీయం. సోషల్ మాధ్యమాలు, వాట్సప్, ప్రత్యేక వెబ్‌సైట్ల సహాయంతో వ్యభిచారం నడిపే ముఠా గుట్టురట్టు చేయడంలో పోలీసులు చక్కని ప్రతిభ కనబరిచారు. గృహ సముదాయాలు, అపార్ట్‌మెంట్లు, హైటెక్ హోటళ్లలో గత పదేళ్లుగా జరుగుతున్న ఇటువంటి వ్యభిచారాలపట్ల పోలీసులు అప్రమత్తంగా వుండాలి. అంతేకాకుండా అనైతిక కార్యకలాపాలు, అసభ్య, అశ్లీల వ్యవహారాలకు వేదికగా మారుతున్న ఇంటర్నెట్, ఇతర సాంకేతిక పరిజ్ఞానం వినియోగం పట్ల నియంత్రణ చర్యలను ప్రభుత్వం ఐ.టి చట్టాల ద్వారా చేపట్టాలి. ఇటువంటి హైటెక్ వ్యభిచారాల రొంపిలోనికి పేద, మధ్యతరగతివారే కాక కాలేజి విద్యార్థినుల్ని కూడా దింపుతున్నారన్న వార్తల పట్ల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, కళాశాల యాజమాన్యం అప్రమత్తంగా వుండాలి. నిఘాను మరింత పెంచాలి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం