ఉత్తరాయణం

సెక్యులరిజం పేరిట వివక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీలో ఎన్‌సిఈఆర్టీ మాదిరిగానే హైదరాబాద్‌లో ఎస్‌సిఈఆర్టీ కార్యాలయం లాల్‌బహదూర్ స్టేడియం వద్ద ఉన్నది. హైదరాబాదు రామకృష్ణ మఠంలోని స్వామీ జీలతో కలిసి ఒకటవ తరగతి నుంచి పనె్నండవ తరగతి వరకు బోధనకు ఉపయోగపడేవి ఏరి వాటిని రాష్ట్ర సిలబస్‌లో ప్రవేశపెట్టే యోచనలో ఎస్‌సీఈఆర్టీ డైరెక్టరు ను కలిసి వారికి వాటి సెట్ ఇచ్చి సిలబస్‌లో చేర్చమని అభ్యర్థించాము. సుమారు పదేళ్ల క్రితం ఇది జరిగింది. అంతా చేస్తే మేము ఇచ్చిన పుస్తకాలలో ఏదీ ఎంపిక కాలేదు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి మన సంస్కృతిని ప్రతిబింబించనీయక పోవడం ఎవరి బాధ్యత? సెక్యులరిజం పేరున ఈ రకమైన వివక్షకు ఎవరు బాధ్యులు? ఇప్పుడు భాజపా ప్రభుత్వం ఏమైనా మార్పులకు ప్రయత్నిస్తే కాషాయాకరణ పేరుతో గంతులు వేసే వారికి లోటులేదు. ఇంతకీ ఆ ప్రయత్నం చేసే సూచనలు కనిపించడం లేదు. ఫలితంగా మన పిల్లలకు మన సంస్కృతిని గురించి తెలుసుకునే అవ కాశం లేకపోవడం దురదృష్టకరం.
- కె.వి. నాగేశ్వరరావు, హైదరాబాదు
తజకిస్థాన్ విధానమే శ్రేయస్కరం
మధ్య ఆసియా ముస్లిం ప్రాబల్య దేశమైన తజకిస్థా న్‌లో ఇస్లామిక్ అతివాద భావనల ప్రభావాన్ని నిరోధిం చేందుకు తజకిస్తాన్ పోలీసులు 13వేల మంది పురుషులకు గడ్డాలు తొలగించారు. సాంప్రదాయ ముస్లిం వస్త్రాలు అమ్మే దుకాణాల్ని మూసివేయంచారు. 1700 కు పైగా తలవస్త్రాలను కట్టుకోకుండా స్ర్తీలకు నచ్చజెప్పి తీసివేయంచారు. ఇక ఆ దేశంలో స్ర్తీలు ముసుగులు వేసి తిరగరాదు. అరబిక్ తరహా పేర్లను నిషేధించారు. తజకిస్థాన్ సుప్రీం కోర్టు ఇస్లామిక్ రాజకీయ పార్టీని పూర్తిగా నిషేధించింది. ఇది నిజంగా హర్షించదగ్గ పరిణామంగా ప్రపంచ దేశాలు గుర్తించాలి. గడ్డాలు పెంచి, ముసుగులు ధరించి తిరగే వాళ్లలో ఎవరు ఇస్లామిక్ తీవ్రవాదులోనన్న భయాన్ని ప్రజల్లో లేకుండా చేయాలన్న ఉద్దేశంతో తజకిస్థాన్ దేశం ఆపని చేసిందట. ఇండియా, బంగ్లాదేశ్, పాకిస్తాన్, శ్రీలంకలతో సహా ప్రపంచ దేశాలన్నీ తజకిస్థాన్ పద్ధతి పాటించాలి. ఇది కేవలం ప్రజల భద్రతకోసం మాత్రమే.
- జి. శ్రీనివాసులు, అనంతపురం
రిజర్వేషన్లు ఎంతవరకు సమంజసం?
కాపులను వెనుకబడిన వర్గాల జాబితాలో చేర్చాలంటూ కాపు సంఘాల వారు తలపెట్టిన ఉద్యమం చివరకు హింసాత్మకంగా మారడం దురదృష్టకరం. గత మూడేళ్లుగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌ను కాంగ్రెస్, టిడిపి ప్రభుత్వాలు పరిష్కరించకపోవడం వల్లనే నేడు సమస్య మరింత జటిలమైంది. అయతే కులాలపేరుతో రిజర్వేషన్లు ఎంతవరకు సమంజసమన్న వాదన కూడా దేశంలో ప్రబలం కావడం గమనార్హం. కేవలం ఆర్థిక అసమానతలను దృష్టిలో పెట్టుకొని మాత్రమే రిజర్వేషన్లు అమలు జరపాలన్న డిమాండ్ కూడా పెరుగుతూ వస్తోంది. ఇన్ని రిజర్వేషన్లు పెట్టినా స్వాతంత్య్రం తర్వాత ఇనే్నళ్లు గడిచినా దేశంలో 40 శాతం ప్రజలు దారిద్య్రంలో మగ్గుతున్నారంటే వాటివల్ల ఫలితం లేదనేకదా అర్థం. కేవలం ఓట్ల రాజకీయం కోసం మాత్రమే రిజర్వేషన్లు కొనసాగిస్తు న్నారండంలో ఏమాత్రం సందేహం లేదు.
-కొలుసు శోభనాచలం, గరికపర్రు
రైలును తగలపెట్టడం ఘోరం
అధికారం, పనీపాటా లేని నేతలు, ప్రజలు తమని మరచిపోతారేమోనన్న నిస్పృహతో ఏదో ఒక సమస్య నెత్తిన వేసుకొని సభలు, గర్జనలు, ర్యాలీలు, నిర్వహి స్తారు. వీరికి అనుచరులపై పట్టుండదు. అసాంఘిక శక్తులు దూరి విధ్వంసం సృష్టిస్తే ఆపడానికి కనీసం ప్రయత్నం చేయరు. ముద్రగడ కాపుగర్జనలో సరీగ్గా ఇదే జరిగింది. రైలు తగలబడుతున్న క్లిప్పింగులు చూసి ఆం ధ్రుల గుండెలు మండిపోయాయ. అసలు రైలు తగలబెట్టడం ద్వార వీరేం సాధించారు. దాదాపు వారం పైచిలుకు రైలు రద్దయంది. ఇంత జరిగినా ముద్ర గడ ప్రజలకు క్షమాపణ చెప్పలేదు సరికదా, ఇదంతా ప్రభుత్వమే చేయంచిందని ఎదురుదాడికి దిగడం శోచ నీయం.
- సాహిత్య దీప్తి, రమణయ్యపేట, తూ.గో.జిల్లా
ఓట్లకోసమే రిజర్వేషన్లు
కాపులను బీసీల జాబితాలో చేర్చాలని తునిలో ఉధృత ఉద్యమం చేపట్టిన నాయకులు ఏ అవాంఛనీయ సంఘట నలు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వారిపైనే ఉంది. కాని రత్నాచల్ రైలును తగులబెట్టి దాదాపు మూడువేల మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బంది, భయ భ్రాంతులకు గురిచేశారు. పోలీసు వాహనాలకు నిప్పు పెట్టారు. హింసతో కూడిన స్వాతంత్య్రం వద్దన్నాడు మహాత్మాగాంధీ. మనం గాంధీ వారసత్వాన్ని స్వాతం త్య్రం సిద్ధించిన తర్వాత కోల్పోయాం. ఉద్యమాలు చేయడం తప్పు కాదు. హింస రగిలించడమే బాధాకరం. అన్నికులాల్లో పేదవారున్నారన్న సంగతిని ఉద్యమకార్లు గుర్తించాలి. అసలీ రిజర్వేషన్లను కేవలం పదేళ్లకే పరిమితం చేయగా, ఓట్లకోసం నిరవధికంగా పొడిగిస్తూ పోవడం వల్ల అనర్ధాలు సంభవిస్తున్నాయ.
-ఎన్. రామలక్ష్మి, సికిందరాబాద్
కాపు నేతలదే బాధ్యత
తునిలో జరిగిన దుర్ఘటనకు కాపు గర్జన నేతలే బాధ్యత వహించాలి. నేతల రెచ్చగొట్టే ప్రసంగాలే రైలు దగ్ధానికి, పోలీసు స్టేషన్‌పై దాడికి దారితీశాయ. అందరికంటే బాధపడింది రైలు ప్రయాణికులు. వారిని ఎంతో వేదనకు గురిచేయడం బాధ్యతా రాహత్యమే.
- వేదుల జనార్ధన్‌రావు, వంకాయలగూడెం