మెయన్ ఫీచర్

ఐసిస్ నుంచి భారత్ ఎంతవరకు సురక్షితం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పానిష్ అంతర్యుద్ధం అప్పట్లో మెడిటరన్ యూరోపియన్ దేశ సరిహద్దు ప్రాంతాలకు పరిమితమైంది. 1936-39 సంవత్సరాల మధ్య చోటు చేసుకున్న ఈ అంతర్గత పోరాటం తర్వాతికాలంలో అంతర్జాతీయ సంఘర్షణగా మారిపోయింది. ఈ యుద్ధంలో మాడ్రిడ్‌లోని వామపక్ష ‘రిపబ్లికన్’ ప్రభుత్వాన్ని, జనరల్ ఫ్రాన్సిస్‌స్కో నేతృత్వంలోని ‘నేషనలిస్ట్’లు సవాలు చేయడమే కాదు అధికారం నుంచి తప్పించారు కూడా. నాటి సోవియట్ యూనియన్ రిపబ్లికన్లకు మద్దతునివ్వగా, నాజీ జర్మనీ నేషనలిస్టులకు వెన్నుదన్నుగా నిలబడింది. బ్రిటన్ వంటి దేశాలు అధికారికంగా తటస్థంగా ఉన్నప్పటికీ, మాస్కోలోని కమ్యూనిస్టులు లేదా జర్మనీలోని నాజీలు..వీరిలో ఎవరూ విజయం సాధించడం వాటికి సుతరామూ ఇష్టంలేదు. కానీ బ్రిటన్,ఫ్రాన్స్ దేశాలకు చెందిన అనేకమంది యువకులు రిపబ్లికన్‌ల పట్ల ఆకర్షితులు కావడం విశేషం. ఇవే దేశాలకు చెందిన వివిధ రాజకీయ పక్షాల వారు కమ్యూనిజం విస్తరిస్తుండటంపై ఆందోళన చెంది, నేషనలిస్ట్‌ల పక్షానే నిలిచారు. భారత్‌తో సహా ఇతర ప్రపంచ దేశాల్లోని యువత రెండో ప్రపంచ యుద్ధం తప్పదన్న అంచనాకు వచ్చేశారు. చివరకు ఈ యుద్ధంలో ఫ్రాంకో విజయం సాధించి అధికారాన్ని చేజిక్కించుకొని నిరంకుశ పాలనను సదీర్ఘకాలం పాటు కొనసాగించాడు. ఎంతో అండగా నిలబడినప్పటికీ ఆయన నాజీల పట్ల సానుకూల వైఖరిని ప్రదర్శించలేదు. ఆయన లక్ష్యం ఒక్కటే. స్పెయిన్‌లో అధికారంలోకి రావడం. అంతేకాని హిట్లర్ ‘యుద్ధ యంత్రం’గా మారడానికి ఏమాత్రం సుముఖంగా లేడు. చాలా కాలం పాటు ఆయన స్పెయిన్‌ను రెండో ప్రపంచ యుద్ధంలో భాగస్వామిని చేయలేదు. దేశీయంగా ఉన్న శత్రువులను ఒడించడంలోనే ఆయన సంతృప్తి పడ్డాడు. జర్మనీ లేదా మరే ఇతర దేశాలతో ఆయన స్నేహం నెరపినా అది కేవలం ‘వ్యవహారానికే’ పరిమితం.
నిజానికి ఈ వ్యాసం స్పెయిన్ అంతర్యుద్ధం గురించి కాదు. కేవలం ఇరాక్, సిరియాల్లో యుద్ధంలో ముఖ్య భాగస్వామిగా ఉన్న ఇస్లామిక్ స్టేట్ (ఐసిస్) గురించి. నాటి స్పెయిన్ అంతర్యుద్ధం మాదిరిగానే, నేటి పోరాటం కూడా కొద్ది భౌగోళిక ప్రాంతానికే పరిమితమైంది. నాటి ‘ఇబెరియన్ పెనెన్సులా’ అంత చిన్నది కాకపోయినా విస్తీర్ణంలో పశ్చిమాసియా కొంచెం పెద్దది. నాటి స్పెయిన్ అంతర్యుద్ధం మాదిరిగానే నేటి ఇరాక్, సిరియాల్లో కొనసాగుతున్న పోరాటం కూడా ప్రపంచ దేశాల ఆవేశాలకు, దురభిమానాలకు, విశ్వాసాలకు నెలవుగా మారిపోయింది. 1930 ప్రాంతంలో సుదూర ప్రాంతాల నుంచి యువకులు స్పెయిన్‌కు ప్రయాణం కట్టారు. మరి నేడు కూడా పెద్ద సంఖ్యలో యూరోపియన్ పోరాట వీరులు, యూరోపియన్ పాస్‌పోర్టులు కలిగిన అరబ్ ప్రాంత ముస్లింలు, ఐఎస్‌ఐఎస్‌లో చేరిపోయేందుకు సిరియాకు వెళుతున్నారు.
ఐతే నాటి స్పానిష్ అంతుర్యుద్ధానికి, సవాలు విసురుతున్న నేటి ఐసిస్‌కు మధ్య సాదృశ్యం ఒక ప్రత్యేక స్థాయి వరకే పరిమితం. నిజానికి ఈ రెండింటి మధ్య పోరాట స్ఫూర్తి, సైద్ధాంతికత విషయంలో అసలు సంబంధమే కనిపించదు. కాకపోతే తమ పూర్వీకుల మాదిరిగానే ఐఎస్‌ఐఎస్ కొనసాగిస్తున్న యుద్ధం దాదాపు అనుకోకుండా మొదలైనదే. ప్రపంచ భవిష్యత్తు ఏవిధంగా ఉండబోతున్నదన్న దానిపై సుదూర ప్రాంతాల ప్రజల అంచనా, అదేవిధంగా ఇరుగుపొరుగు, సుదూర ప్రాంత దేశాల ప్రభుత్వాల అభిప్రాయం ఇక్కడ కేంద్ర స్థానం వహిస్తోంది. అనంతమైన పోరాట చరిత్రలో ప్రస్తుతం జరుగుతున్న సంఘర్షణ ఒక సూక్ష్మ అంశం. అసలు ఐఎస్‌ఐఎస్ ఏవిధంగా ప్రారంభమైంది? కేవలం అగ్రరాజ్యాల రాజకీయాల పర్యవసానంగానే ఐఎస్‌ఐఎస్‌ఐ ఆవిర్భావం జరిగింది. సద్దాం హుస్సేన్‌ను ఉరితీసిన తర్వాత, అధికారాలను కోల్పోయిన వారు లేదా 2003 నాటి గల్ఫ్ యుద్ధంలో ఇరాకీ సైన్యం పరాజయం పొందిన తర్వాత కకావికలమైన సున్నీ మిలిషియా సృష్టే ఈ ఐఎస్‌ఐఎస్. అమెరికా నిఘా సంస్థల ప్రణాళిక, సౌదీ అరేబియా, ఖతార్ వంటి సున్నీ దేశాల మద్దతుతో ఐఎస్‌ఐఎస్ ప్రస్తుతం ఇరాన్ మద్దతున్న సిరియా అధ్యక్షుడు బషర్-అల్-అసాద్‌కు వ్యతిరేకంగా పోరా టం సలుపుతున్నాయి. ఇరాక్ అధ్యక్షుడు బషర్ అల్ అసాద్ షియా మిలిటెంట్లను రెచ్చగొట్టి, ఇరాక్‌లోని తమ సదుపాయాలపై దాడులు చేయించాడని అమెరికా భావిస్తోంది. వీటితో పాటు అరబ్ స్ప్రింగ్ ప్రభావం కూడా కొంతమేర ఉన్నది.
అగ్రరాజ్యాల వ్యూహాలు, ప్రతివ్యూహాల మధ్య నెలకొన్న గందరగోళ, అస్తవ్యస్త పరిస్థితుల మధ్య ఐఎస్‌ఐఎస్ ఆవిర్భావం జరిగింది. నెలకొన్న సందిగ్ధ పరిస్థితిని తనకు అనుకూలంగా మార్చుకొని ఐఎస్‌ఐఎస్ చివరకు తన సృష్టికర్తలనే ఖాతరు చేయని స్థితికి చేరుకుంది. నేడు అది ఏకంగా యుఎస్, యూరప్, సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, వంటి దేశాలను బెదిరించే స్థాయికి ఎదిగింది. ఇక షియాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఇరాన్..ఐఎస్‌ఐఎస్‌కు ఆగర్భ శత్రువని వేరే చెప్పాల్సిన పనిలేదు. ఒకపక్క యూరప్ దేశాల ఆర్థిక వ్యవస్థ గాడితప్పుతోంది. మరోపక్క దారుణంగా పడిపోతున్న చమురు ధరల కారణంగా అరబ్ దేశాల ప్రభుత్వాలపై వత్తిడి తీవ్రతరమవుతోంది. సరీగ్గా ఈ తరుణంలో ఆయా దేశాల్లో అసంతృప్తితో రగిలిపోతున్న వర్గాలకు కావలసిన వేదికను ఐఎస్‌ఐఎస్ కల్పిస్తోంది. మతానికి, ఏకేశ్వరోపాసనకు ఇచ్చిన తప్పుడు నిర్వచనం ద్వారా అసంతృప్త వర్గాలను యుద్ధానికి పురికొల్పుతూ, ఖలీఫా రాజ్య స్థాపన తుది లక్ష్యంగా ఐఎస్‌ఐఎస్ అడుగులు ముందుకు వేస్తోంది.
గత నవంబర్‌లో ప్యారిస్‌పై ఉగ్రవాదుల దాడుల అనంతరం, అంతకు ముందు ఏడాది సిరియాకు వెళ్లిన 1500 మంది ఫ్రాన్స్ ప్రజల్లో మూడోవంతు మంది తిరిగి స్వదేశానికి చేరుకున్నారు. మిగిలిన యూరప్ దేశాల్లో కూడా పెద్ద సంఖ్యలో కాకపోయినా స్వదేశాలకు తిరిగివచ్చే జనప్రవాహం సుస్థిరంగా కొనసాగుతోంది. ఇక యుఎస్ నుంచి సిరియా-ఇరాక్ దేశాలకు వెళ్లేవారి సంఖ్య వేళ్లపై లెక్కపెట్టే స్థాయికి పడిపోయింది. పశ్చిమాసియాకు తరలివెళ్లిన వారిలో అధిక సంఖ్యాకులు ముస్లింలే. వీరిలో చాలా మంది క్రైస్తవ కుటుంబాలకు చెందిన శే్వజాతీయులు. ముఖ్యంగా ఇటీవలికాలంలో ఇస్లాంలోకి చేరి మతోన్మాదంతో పశ్చిమాసియాకు చేరుకుంటున్నారు. అయి తే మత్తుమందులకు బానిసకావడం వల్ల కూడ ఈ వలసలు కొనసాగుతుండటం గమనార్హం.
ఐఎస్‌ఐఎస్ ఆవిర్భావం, అల్-ఖైదా ఎదుగుదలకు ముఖ్యంగా 9/11 దాడుల అనంతరం పెను సవాలుగా చాలామంది పరిగణిస్తున్నారు. అయితే ఈ రెండు ఉగ్రవాద సంస్థల మధ్య కొన్ని ముఖ్యమైన తేడాలున్నాయి. ప్రపంచంలోని ఏ ప్రాంతం కూడ అల్-ఖైదా ఆధీనంలో లేదు. కాకపోతే ఆఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లకు ఈ సంస్థ ఒక అతిథి మాత్రమే! కొద్దోగొప్పో తనకంటూ ఒక దేశాన్ని ఏర్పరచుకుంది ఐఎస్‌ఐఎస్ మాత్రమే. పాడుబడిన ఆఫ్ఘనిస్తాన్ మాదిరి కాకుండా, సమృద్ధిగా చమురు నిక్షేపాలున్న ప్రాంతం ఐఎస్‌ఐఎస్ ఆధీనంలో ఉంది. అందువల్ల సుస్థిరంగా మనుగడ సాగించే సామర్ధ్యం ఐఎస్‌ఐఎస్‌కు అధికం. అది తనకింద పోరాటం చేస్తున్నవారు, అనుబంధంగా పనిచేసేవారు, డబ్బుకోసమే పనిచేసేవారికి అవసరమైన చెల్లింపులు జరుపుతోంది. ఇక సాంకేతిక పరిజ్ఞానం కూడ ఐఎస్‌ఐఎస్ స్వంతం. సోషల్ మీడియాను, ఇంటర్నెట్‌ను నైపుణ్యంగా ఉపయోగించుకోగలదు. మరే ఇతర ఉగ్రవాద సంస్థలతో సంబంధం లేనివారు తమకు తామే ఐఎస్‌ఐఎస్‌లో చేరుతుండటాన్ని గమనిస్తున్నాం. కేవలం నాలుగు గోడల మధ్యన కూర్చొని ఇంటర్నెట్ కనెక్షన్ ఉన్న ల్యాప్‌టాప్ సహాయంతోఎంతో మంది ఈ ఉగ్రవాద సంస్థ పట్ల ఆకర్షితులు కావడం విచిత్రమే కాదు విశేషమే. ప్రత్యక్ష నియామకం కంటె, ఇంటర్నెట్ రాడికలైజేషన్ ద్వారా ఐఎస్‌ఐఎస్‌లో రిక్రూట్ అయిన వారే అధికమన్న సంగతి భారత్‌కు అనుభవంలోకి వచ్చింది.
మరి అటువంటప్పుడు ఐఎస్‌ఐఎస్ ‘వైరస్’ నుంచి భారత్ ఎంతవరకు సురక్షితంగా ఉండగలదు? పశ్చిమాసియాలో సమాంతరంగా కొనసాగుతున్న సంఘర్షణలు అవే ప్రాంతాలకు పరిమితం కాగలవా? ఐఎస్‌ఐఎస్‌ను ‘రాడ్‌క్లిఫ్’ లైన్‌ను దాటకుండా నిరోధించడం సాధ్యమేనా? పాకిస్తాన్ సమాజంలో కొనసాగుతున్న షియా-సున్నీ తెగల మధ్య సంఘర్షణలు భారత్ సరిహద్దులను తాకుతున్నాయి మరి. అయితే ఒక ఆశ మిణుకుమిణుకు మంటోంది. అందేంటంటే బ్రిటన్, ఫ్రాన్స్‌లతో పోల్చినప్పుడు ఎన్ని లోపాలున్నప్పటికీ భారత వ్యవస్థలో ముస్లిం మైనారిటీల విలీనత చాలా శ్రేష్ఠమైనది. అదే ఫ్రాన్స్, బ్రిటన్‌లు ఈ విషయంలో రెండు నమూనాలను అనుసరిస్తున్నాయి. భారత ముస్లింలు ఏదో కొన్ని దశాబ్దాల క్రితం దేశంలోకి వచ్చిన ‘‘ఇతర ప్రాంతాలకు’’ చెందిన జాతులవారు కాదని వీరు జ్ఞప్తిలో ఉన్నంత కాలం నుంచి మనదేశంలో అంతర్భాగంగా కొనసాగుతున్నారన్న భానవ నెలకొని ఉండటం భారత్‌కు ఉపకరించే అంశం.
అయితే ఇప్పటివరకు చర్చించిన అంశం, ప్రధానంగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎంత వేగంగా కోలుకుంటుంది అనే దానిపై ఆధారపడి ఉంటుంది. అత్యధిక సంఖ్యలో యువతను కలిగిన భారత్, ఒక విధంగా ప్రపంచ ఆర్థిక మాంద్యాన్ని సమతుల్యం చేస్తున్నదనే చెప్పాలి. 2011 జనాభా లెక్కల ప్రకారం దేశంలో 41 శాతం మంది 20 ఏళ్ల కంటే తక్కువ వయసున్నవారే. దేశంలో కేవలం ముస్లిం జనాభానే తీసుకుంటే యువత 47 శాతం వరకు ఉన్నారు. ఈ యువజనాభాయే భారత్‌కు బలమూ, బలహీనత కూడా! ఐఎస్‌ఐఎస్, ఇతర రాడికల్ ఉద్యమాలకు ఇదొక అవకాశంగా రూపొం దే ప్రమాదం లేకపోలేదు.

- అశోక్ మాలిక్