ఉత్తరాయణం

అతడి త్యాగం నిరుపమానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచం మొత్తం అతను జీవించాలని ఎంతో ఆశగా ఎదురు చూసింది. తాను నమ్మిన దేవుడినల్లా ప్రార్థించింది. మంచు చరియల కింద కూరుకుపోయిన మన జవాన్లను కాపాడటం కోసం సైన్యం ఎంతగానో కృషి చేసింది. ఆరురోజుల తర్వాత జవాన్ల మృతదేహాలను కనుగొన్న సైన్యానికి లాన్స్ నాయక్ హనుమంతప్ప మాత్రం జీవించి ఉండటం ఉత్సాహాన్ని నింపింది. అప్పటికే కోమాలోకి వెళ్లిపోయిన హనుమంతప్పను ఢిల్లీలోని ఆర్‌ఆర్ ఆసుపత్రికి తరలించారు. అతడికి ప్రాణం పోయడానికి డాక్టర్లు అహరహరం శ్రమించారు. దేశవ్యాప్తంగా, దేవాలయాలు, చర్చిలు, మసీదుల్లో హనుమంతప్ప కోసం ప్రార్థనలు జరిగాయి. ఎంతో మంది అతగాడికి కిడ్నీలు ఇతర శరీర అవయవాలు దానం చేయడానికి ముందుకు వచ్చారు. సోషల్ మీడియాలో హనుమంతప్ప జీవించాలన్న సందేశాలు వెల్లువెత్తాయి. కానీ విధి బలీయం. హనుమంతప్పను మృత్యువు తన ఒడిలోకి తీసుకుంది.
సైన్యంలో చేరడానికి మూడు సార్లు విఫలయత్నం చేశాడు. ఎట్టకేలకు తాననుకున్న లక్ష్యాన్ని సాధించి సైన్యంలో చేరిపోయాడు. మంచి పోరాట యోధుడిగా హనుమంతప్పను సైన్యం ప్రశంసించింది. తన 13 ఏళ్ల సర్వీసులో హనుమంతప్ప ప్రదర్శించిన ధైర్యసాహసాల సంఘటనలు చాలా ఉన్నాయని సైన్యం వెల్లడించింది. ముఖ్యంగా జమ్ముకశ్మీర్, దేశ ఈశాన్య ప్రాంతంలో అతను అద్భుతమైన సేవలందించాడని ప్రశసించింది. ప్రపంచంలోనే ఎతె్తైన యుద్ధ క్షేత్రం సియాచిన్. 1999లో పాకిస్తాన్ చేసిన దుస్సాహసమే సియాచిన్ రక్షణ కోసం మన ప్రభుత్వం చర్యలు తీసుకోవడానికి ప్రధాన కారణణ. ఇక్కడి ప్రతికూల ప్రకృతే జవాన్ల ప్రాణాలు కోల్పోవడానకి కారణమవుతోంది. ఏమాత్రం సహకరించని వాతావరణం లో నెలల పాటు సియాచిన్‌లో గడిపిన సైనికుల్లో మానసిక ఇబ్బందులు తలెత్తుతున్నాయట. ఇందుకు అక్కడ నిరంతరం పడే దట్టమైన మంచే కారణం. ఈ గ్లేసియర్‌లో ఇప్పటి వరకు 850 మంది సైనికులు మృత్యువాత పడ్డారు. భారత్-పాక్‌ల మధ్య దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న సియాచిన్ వివాదం ఇంతమంది ప్రాణాలు కోల్పోతున్నా కొలిక్కి వచ్చేటట్టు లేదు. సియాచిన్ మంచు చరియ దుర్ఘటనలో ఆరు రోజులు మృత్యువుతో పోరాడి చివరకు అలసిన ఈ పోరాట యోధుడి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిద్దాం. మనం గర్వించేలా చేసిన వీర సైనికుడు హనుమంతప్ప సాహసాలను తరతరాల వారు గుర్తుంచుకుంటారు.
- జవ్వాది లక్ష్మణరావు, విశాఖపట్టణం
ప్రభుత్వ స్థలాలను పరిరక్షించాలి
పలు ప్రభుత్వ పథకాలకు భూములు దొరక్క ప్రభు త్వం ప్రైవేటు భూములను కొనుగోలు చేస్తుంటే ఉన్న భూములను కాపాడే ప్రయత్నం చేయకపోవడం విచారకర పరిణామం. రానురాను ప్రభుత్వ భూములు తెలంగాణ రాష్ట్రంలో దొరికే పరిస్థితి లేదు. ప్రభుత్వ భూములను గుర్తించి కంచెలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిధులు లేవంటున్నారు. దీంతో అక్రమా ర్కులు ప్రభుత్వ భూములను దర్జాగా ఆక్రమిస్తూ లేఅవుట్ చేయడం, ప్లాట్లుగా అమ్మడం, అమ్మజూపడం, భవనాలు నిర్మించడం, తదితర అక్రమాలకు పాల్పడు తున్నా నియంత్రించేందుకు చర్యలు కానరావడం లేదు. భూ ఆక్రమణల చట్టం 1905, భూకబ్జా నిషేధ చట్టం 1982 ప్రకారం ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశాలున్నా స్థానిక నేతల ఒత్తిడి లోపాయకారి ఒప్పందాల వల్ల, రాజకీయ ఒత్తిడుల వల్ల నిక్కచ్చి అధికారులు కూడా స్వాధీనంలోకి తీసుకోవడానికి జంకుతున్నారు. అధికార్లు కూడా స్వాధీనంలోకి తీసుకోవడానికి జంకుతున్నారు. అంతేకాక రాష్ట్రంలో ప్రముఖ ఆలయాలకు చెందిన విలువైన భూములు అన్యాక్రాంతమైనా అధికార్లు స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపట్టడం లేదు. ఆలయాల కార్యనిర్వహణాధికార్లు ఫిర్యాదు చేస్తున్నా పట్టించు కోవడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్పందించి ప్రభుత్వ భూముల పరిరక్షణకు చట్టూ కంచెలు వేయడానికి ప్రతి జిల్లాకు నిధులు మంజూరు చేయాలి. ఆక్రమణ దారుపై కఠిన చర్యలు తీసుకోవాలి.
- హరి అశోక్‌కుమార్, హైదరాబాద్
ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాలి
ప్రభుత్వాసుపత్రులను బలోపేతం చేయాల్సిన అవ సరం ఎంతైనా ఉంది. ప్రైవేటు డాక్టరు దగ్గరికి వెళ్ళినా గాని కన్సల్టింగ్ పీజు ఐదొందల వరకు వసూలు చేస్తున్నారు. ఆ చీటీ కూడా ఒక్కసారికే పనికివస్తుందట. ప్రిస్క్రిప్షన్ క్యాపిటల్ లెటర్స్‌లో రాయాలని మెడికల్ కౌన్సిల్ ఆదేశాలు బేఖాతరు అవుతున్నాయ. కొన్ని ఫార్మసీ వారు మాత్రమే బిల్లులిస్తున్నారు. మిగతా వాళ్లు కాలిక్యులేటర్ మీద మొత్తం వేసి ఇంత అని నోటి మాటగా చెబుతు న్నారు. మాదగ్గర హెల్త్ కార్డు ఉన్నదంటే, ఆ సిస్టం తమ వద్ద లేదని చెబుతున్నారు. మందు చీటీల్లో జెనరిక్ పేర్లు రాసే విదంగా ప్రభుత్వం కట్టడి చేయాలి.
- బి.ఆర్.సి. మూర్తి, విజయవాడ
ఆ ఇద్దరూ ఉంటే...?
మనం ఇద్దరు నాయకుల్ని స్వతంత్ర భారత రంగం నుంచి కోల్పోయాం. ఒకరు సుభాష్ చంద్రబోసు, ఇం కొకరు సర్దార్ వల్లభాయ్ పటేల్. పటేల్ కేంద్ర హోమ్ మంత్రిగా ఉన్నది కేవలం 4,5 సంవత్సరాలు మాత్రమే. వాస్తవానికి సర్దార్ పటేల్ ప్రధాని అయ ఉన్నట్లయతే భారత్ రూపు రేఖలు మరింతగా మారిపోయేవి. సుభాష్ చంద్రబోసు ఈ దేశంలో స్థానమే లేకుండా పోయంది. ఇది మన దురదృష్టం. సుభాష్ బోసు సేనలు అండమాన్ దీవులకు బ్రిటిష్ వారినుంచి విముక్తి కలిగించాయ. ఆ ఇద్దరు నేతలకు సముచిత స్థానం లభించినట్లయతే దేశం నేడు ఈ దుస్థితిలో ఉండేది కాదనేది నగ్న సత్యం. కశ్మీర్‌ను పాక్ ఆక్రమించేది కాదు. చైనా దుస్సాహసం చేసేది కాదు.
- కె.వి. రమణమూర్తి, కాకినాడ