సంపాదకీయం

అధికార అవినీతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఉన్నత విద్యా సంస్కార స్వభావం అనైతిక భావ వికృతులతో సంకరమై పోతుండడం వివిధ రంగాలలో పెచ్చు పెరుగుతున్న అవినీతి కలాపాలకు ప్రధాన కారణం. 2015లో అవినీతి గ్రస్తులైన రెండువేల రెండువందల ఉన్నత ప్రభుత్వ అధికారులకు వ్యతిరేకంగా దర్యాప్తులు ప్రారంభించినట్టు కేంద్ర నేర పరిశోధక విభాగం సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్-సిబిఐ-వారు బుధవారం దేశ రాజధానిలో ప్రకటిండం సమాజ హిత చింతకులకు ఆందోళన కలిగిస్తోంది. ఎందుకంటె 2014లో కంటె 2015లో అవినీతి కార్యకలాపాలకు పాల్పడిన ఉన్నత అధికారుల సంఖ్య పెరిగింది. అధికార అవినీతిని నిర్మూలించడానికి, రాజకీయ అవినీతిని తుదముట్టించడానికి వీలుగా వివిధ ప్రయత్నాలు జరగుతుండడం నడుస్తున్న చరిత్ర. లోక్‌పాల్, లోకాయుక్త వంటి వ్యవస్థలు బలపడుతున్నాయి. అవినీతి వ్యతిరేక మండలి-యాంటీ కరప్షన్ బ్యూరో- వంటి రక్షక యంత్రాంగం ప్రతి రాష్ట్రంలోను అహర్నిశలు అనైతిక అధికారులపై నిఘా నేత్రాలను సారించి ఉన్నది. సర్వోన్నత, ఉన్నత న్యాయస్థానాలు పదేపదే అవినీతి వ్యతిరేక అంకుశాలను ప్రయోగిస్తున్నాయి. సామాజిక చైతన్య ఉద్యమకారులు, సమాచారపు హక్కుల కార్యకర్తలు నిరంతరం అవినీతి అధికార యంత్రాంగాన్ని, రాజకీయ అవినీతిని వెల్లడి చేయడానికి కృషి చేస్తున్నారు. ప్రచార మాధ్యమాల ప్రతినిధులు సైతం స్టింగ్ ఆపరేషన్‌లతో అవినీతి పరులను పట్టించడానికి యత్నిస్తున్నారు. దేశ విదేశాలలోని బ్యాంకులలోను ఇతర చోట్ల నల్లడబ్బును నిక్షేపించిన అధికారులను అనధికారులను పసికట్టి పట్టుకొనడానికి కేంద్ర ప్రభుత్వ పరిశోధక విభాగాలు, కార్యాచరణ దళాల వారు పాటుపడుతూనే ఉన్నారు. అయినప్పటికీ ఏడాదికేడాదికీ అవినీతి అధికారుల సంఖ్య పెరిగిపోతూనే ఉండడం ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థకు పెను ప్రమాదంగా పరిణమించిన వైపరీత్యం.
ఇదివరకే పట్టుబడిన అవినీతి కలాప నిందితులకు వ్యతిరేకంగా 2015లో ఒకవేయి నలబయి నాలుగు అభియోగ పత్రాలను న్యాయస్థానాలలో దాఖలు చేసినట్టు సిబిఐ సంచాలకుడు-డైరెక్టర్-అనిల్ సిన్హా వెల్లడి చేయడం ఈ కేంద్రీయ సంస్థవారి క్రియాశీలతకు నిదర్శనం. గత ఐదేళ్లలో, ఏ సంవత్సరంలో కూడ ఇంత భారీ సంఖ్యలో అభియోగ పత్రాలు-చార్జ్‌షీట్లు- దాఖలు కాలేదట! పట్టుబడిన అవినీతిగ్రస్త రాజకీయవేత్తలకు, ఉన్నత అధికారులకు, ఇతరులకు వ్యతిరేకంగా న్యాయ ప్రక్రియ వేగవంతం అవుతోందనడానికి ఇది నిదర్శనం. న్యాయస్థానాలలో తమకు వ్యతిరేకంగా అభియోగపత్రాలు దాఖలై ఉన్నవారిలో ఏ. రాజా, వీరభద్ర సింగ్, వంటి అప్రతిష్టిత రాజకీయ వేత్తలు కూడ ఉన్నారట. నేరాలకు పాల్పడినట్టు ఆరోపణలకు గురైన ఘరానాలు అభియోగాలనుండి న్యాయ విచారణ ప్రక్రియ నుండి తప్పించుకో జాలరన్నది సిబిఐ చెబుతున్న గుణపాఠం. ఈ ప్రక్రియను చూసిన తరువాత, దీని గురించి విన్న తరువాత నేరాలకు పాల్పడదలచుకున్న రాజకీయవేత్తలు, లంచాలను తీసుకోదలచిన ఉన్నత అధికారులు భయంతోనైనా ఈ అనైతిక కలాపాలకు స్వస్తి చెప్పాలి. సిబిఐ క్రియాశీలత అందువల్ల అవినీతికి నిరోధకం కావాలి. కానీ అలా కావడం లేదన్నది ఏటికేడు పట్టుబడిపోతున్న అవినీతి బాబుల సంఖ్య పెరగడం వల్ల ధ్రువపడిన వాస్తవం. రెండు వేల రెండువందల మంది అవినీతి గ్రస్తులైన ఉన్నతాధికారులు 2015లోనే బయటపడినారు. పట్టుబడిన వారి సంఖ్య కంటె పట్టుబడని గాదె కింది మహా మహిషాల సంఖ్య, వన వరాహాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటోందన్నది బహిరంగ రహస్యం. అవినీతి వ్యతిరేక చర్యలు 2014లో కంటె 2015లో తొంబయినాలుగు శాతం పెరిగాయన్నది జరిగిన నిర్ధారణ. 2014లో కొత్తగా యాబయి రెండు ప్రథమ ఆరోపణ పత్రాలు నమోదు చేశారట. 2015లో ఈ నూతన ఫిర్యాదు పత్రాల-ఎఫ్‌ఐఆర్-సంఖ్యం నూట ఒకటికి పెరిగింది. కానీ అవినీతి పరులైన అధికారుల సంఖ్య, లంచాలు తీసుకున్న అధికారుల సంఖ్య కూడ పెరిగిందన్నది ధ్రువపడిన కఠోర సత్యం. అందువల్లనే పట్టుబడిన వారి సంఖ్య, దర్యాప్తులకు గురి అవుతున్న వారి సంఖ్య ఇలా పెరిగింది. ఉన్నత విద్యావంతులైన అధికారులు సంస్కారవంతులుగా, విధులను నిర్వర్తించడం ఆదర్శం. ఈ సంస్కారాన్ని లంచాలు దిగమింగుతున్నాయి...
పౌర పాలనా యంత్రాంగలోని ఉన్నత అధికారులు, ఉద్యోగులు మాత్రమే కాదు దేశానికి భద్రతా కవచమైన రక్షణ రంగాన్ని సైతం అవినీతి చెదలు ఆవహించి ఉండడం దిగజారిపోతున్న ప్రమాణాలకు నిదర్శనం. నేరస్థులను శిక్షించవలసిన న్యాయమూర్తులు, సమాజపు నడవడిని దిద్దవలసిన అధ్యాపకులు, ఆచార్యులు అవినీతి కలాపాలకు పాల్పడుతున్నట్టు దేశవ్యాప్తంగా వెల్లువెత్తుతున్న ఆరోపణలు భయంకర ప్రమాద ఘంటికలు...! మేజర్ జనరల్ పదవి దళాలలో ఉన్నతమైనది. జనరల్, లెఫ్ట్‌నెంట్ జనరల్ పదవుల తరవాతది. ఇలాంటి మేజర్ జనరల్ పదవిని నిర్వహిస్తున్న వారు సైతం లంచాలను పుచ్చుకున్నారన్నది ఆరోపణల ప్రహసనంలో వర్తమాన ఘట్టం. తమ ఆదాయానికి మించిన రీతిలో ఆస్తులను కూడబెట్టినట్టు ఆరోపణలకు గురయిన ఇలాంటి ఇద్దరు ఉన్నత సైనిక అధికారులకు వ్యతిరేకంగా దర్యాప్తు జరపాలని రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఇటీవల సిబిఐని కోరారట! మనది ధర్మప్రాణ దేశమన్నది తరతరాల వాస్తవం. ధర్మానికి ప్రాణం వంటి ఉన్నత సైనికులు అధర్మానికి ఒడిగట్టడం వర్తమానం...నెలనెలా లక్షలాది రూపాయలు వేతనాల రూపం లో పొందుతున్న వారు కోట్లాది రూపాయలను అక్రమంగా ఆర్జించాలనుకోవడం పైశాచిక ప్రవృత్తికి ప్రమాణం. ఇలాంటి విబుధ దైత్యులు ఉన్నత న్యాయమూర్తులుగాను, జిల్లా న్యాయమూర్తులుగాను కూడ చెలామణి అవుతున్నారు. ఇలాంటి ఉన్నత న్యాయమూర్తులు వందలాది ఎకరాల భూమిని అక్రమంగా కాజేసినట్లు కోట్ల రూపాయల ప్రజాధనాన్ని హరించినట్టు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇలాంటివారు పార్లమెంటు అభిశంసనకు గురి కాకుండా తప్పించుకోవడానికై పదవీ త్యాగం చేయవలసి వచ్చింది. విశ్వవిద్యాలయాల నిర్వాహకులుగా పనిచేసిన వారు, ఆచార్య పీఠాలను అలంకరించినవారు సైతం లంచాలను బొక్కినట్టు ఆరోపణలు రావడం, నిందితులు నిర్బంధానికి గురికావడం ధర్మప్రాణ దేశానికి కళంకం తెచ్చిన ఘటనలు...విద్య, న్యాయం, రక్షణ వంటి రంగాలు సమాజ స్వభావాన్ని ప్రభావితం చేయగల వౌలిక వ్యవస్థలు! వేరునకు చెదలు పట్టినప్పుడు చెట్టు ఏమి కావాలి?
వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతమైన తరువాత జరిగిన ప్రధాన విపరిణామం కల్తీ విస్తరించడం. నూనెలు కల్తీ అయ్యా యి, పాలు కల్తీ అయ్యాయి, పండ్లు కల్తీ అయ్యాయి, పప్పులు సైతం కల్తీ అయ్యాయి. చివరికి ఆవాలు, మిరియాలు, మంచినీరు సైతం కల్తీ అయిపోయి ఉండడం, అత్యాధునిక నాగరికత చిహ్నం. ఇదంతా భౌతికమైన కల్తీ...కానీ దీనికంటె ఘోరమైనది మన సమాజ సమష్టి స్వభావం కల్తీ అయిపోయి ఉం డడం. జాతీయ సంస్కృతి క్రమంగా విదేశీయ వికృతులతో కల్తీ అయిపోయింది, అయిపోతోంది. సంస్కారాలన్నీ కల్తీ కావడం విద్యావంతులు అవినీతి పరులుగా మారిపోతుండడానికి వౌలిక కారణం...ఎవరు ఎవరిని సంస్కరించాలి??