మెయన్ ఫీచర్

అసమ్మతి వెనుక పాపిష్టి వ్యూహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్పష్టమైన విభజన రేఖ ఏర్పడింది. దేశభక్తులెవరో, దేశ వ్యతిరేకులెవరో ఇప్పుడు ప్రస్ఫుటమైంది. భారత్‌ను ముక్కలు చెక్కలుగా చేయాలని కోరుకునేవారు, ఉగ్రవాదిగా నేరం రుజువై మూడేళ్ల క్రితం ఉరిశిక్షకు గురైన అఫ్జల్ గురును హీరోగా పొగిడినవారు, ప్రతి ఇంట్లో అఫ్జల్ గురు జన్మించాలన్న 3‘పవిత్ర’2మైన కోర్కె కలిగిన జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీకి చెందిన కొందరు విద్యార్థులతో కాంగ్రెస్, వామపక్షాలు, జెడి(యు) నేతలు భుజం భుజం రాసుకుంటూ తిరుగుతున్నారు. ఇటువంటి దేశ వ్యతిరేక శక్తులతో కలిసి తిరగడానికి ఈ నేతలకు ఏవిధమైన సంకోచం కలగడం లేదా? లేక మోదీ పై విద్వేషం పొరలు వీరి కళ్లను కమ్మేశాయా?
యాకుబ్ మెమెన్ ఇంటింటా జన్మించాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు గతంలో చేసిన నినాదాల సంఘటనను ఇది తలపుకు తీసుకొని రావడం లేదూ? అఫ్జల్ గురు ఉరికి మాదిరిగానే యాకుబ్ మెమెన్‌ను ఉరితీసినప్పుడు హెచ్‌సియులో అతని ఆత్మశాంతికి ప్రార్థనలు జరిగాయి. ఈ రెండు సంఘటనల్లో దేశ వ్యతిరేక ముఠాలకు, రైట్ వింగ్ విద్యార్థులకు మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయి.
విద్యార్థులకు భావ ప్రకటనా స్వేచ్ఛ అనేది రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కు అంటూ మన ఘనత వహించిన 3అతి ఉదారవాదుల (లిబరల్స్)2 వాదన. ‘అసమ్మతి అనేది ప్రజాస్వామ్యంలో చట్టబద్ధమైన కార్యకలాపం. కేవలం ఫాసిస్టు ప్రభుత్వం మాత్రమే అటువంటి విద్యార్థులపై కొరడా ఝళిపిస్తుంది...’ ఇలా సాగుతుంది వీరి వాదన. ఇదే సమయంలో అమెరికా పౌరుడెవరైనా తన నిరసనను వ్యక్తం చేయడానికి తమ దేశ జాతీయ పతాకాన్ని దగ్ధం చేయడం చట్టబద్ధమేనంటూ ఇక్కడ ఉదహరిస్తుంటారు. ఈ అకృత్యాల సమర్ధకులు ఒక విషయాన్ని మాత్రం ఇక్కడ బయటపెట్టరు. అదేమంటే..ఎవరైనా బయటివారు అమెరికా పౌరసత్వం తీసుకోవాలనుకుంటే, తాము కమ్యూనిస్టు పార్టీలో సభ్యులుగా ఎన్నడూ చేరబోమని ప్రకటించాలి. మరి అదే చట్టం భారత్‌కూ వర్తిస్తే, సోనియా ఎట్టిపరిస్థితుల్లో భారత సహజ పౌరురాలు కాలేదు. ఎందుకంటే ఆమె తండ్రి నాజీ ఉద్యమంలో పనిచేశాడు కనుక!
విశ్వవిద్యాలయాలు.. చర్చలు, వాదనలు, భిన్నాభిప్రాయాలకు నెలవులని వారు వాదిస్తారు. నిజమే..ఇది మంచి వాదనే. మరి దేశంలోని అనేకమంది అమాయక పౌరులను పొట్టన పెట్టుకున్న జిహాదిస్టులను కీర్తిస్తూ తమ అసమ్మతిని వెళ్లగక్కవచ్చా? దేశాన్ని విధ్వంసంతో ముక్కలు చేయాలని, భారత్‌లో అంతర్భాగమైన కాశ్మీర్‌కు స్వాతంత్య్రం ప్రకటించాలంటూ తమ అసమ్మతిని ప్రకటించవచ్చా? ఇది రాజద్రోహం కాక మరేంటి? హింసకు పిలుపునివ్వనంత వరకు, దాన్ని రాజద్రోహంగా దాన్ని పరిగణించజాలమని ఈ 3ఉదారవాదుల2 అభిప్రాయం. బాగుంది..కానీ వందమందికి పైగా ఒక్కచోట గుమికూడి ‘‘్భరత్‌కీ బర్‌బాదీ తక్ జంగ్హ్రేగీ, జంగ్హ్రేగీ,’’అంటూ పెద్ద ఎత్తున నినాదాలిచ్చారు కదా! ఇది హింసాత్మక కార్యకలాపాలను ప్రోత్సహించడమే కాదు, కచ్చితంగా జాతి వ్యతిరేక చర్య కూడా!
వారి అభిప్రాయమేదో వారికున్నదనుకుంటే.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్న సత్యాన్ని ఎందుకు అంగీకరించరు? ఏఐఎస్‌ఎఫ్ నాయకుడిని అరెస్టు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. అటువంటప్పుడు, అతను రాజద్రోహానికి పాల్పడ్డాడా? లేదా? అన్న విషయాన్ని కోర్టులు తేల్చేవరకు ఎందుకు సహనం వహించరు? అట్లాకాదు...విద్యార్ధులపై పెట్టిన కేసులన్నింటిని ఉపసంహరించుకోవాలి..అందరినీ వదిలెయ్యాలి! ఇదీ వారి కోరిక! ఇదిలావుండగా సంఘటపై విచారణ జరిపేందుకు విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసిన కమిటీ, ఈ వ్యవహారంతో సంబంధమున్న మరో ఎనిమిది మంది విద్యార్థులను సస్పెండ్ చేసింది. ఈ ఎనిమిది మంది విద్యార్థులు కమిటీ ముందు విచారణకు హాజరు కావడానికి అంగీకరించలేదు. అంటే జెఎన్‌యు విద్యార్థులు చట్టానికి అతీతులు..చట్టం వారి దరి చేరజాలదనా అర్థం?
మరి ఈ కమ్యూనిస్టు పార్టీలు, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఈ విద్యార్థులకోసం పోరాటం సలిపేది ఎందుకు? దీనికి అసలు కారణం వేరు! ఇప్పటికే అసంగతులుగా ఉన్న వామపక్షాలకు, మిగిలిన ఆధారం కేవలం జెఎన్‌యు మాత్రమే. దివంగత మానవ వనరుల శాఖ మంత్రి నూరుల్ హసన్ అప్పట్లో వామపక్ష భావజాల శక్తులను విశ్వవిద్యాలయ విద్యా విభాగాల్లో ఎడాపెడా నియమించేశాడు. ఆవిధంగా నిర్మితమైన లెఫ్ట్ బురుజు ఇప్పుడు కుప్పకూలిపోతున్నది. ఇప్పటికే దాని ప్రతిష్ట చాలా వరకు దిగజారింది.
విపరీత భావజాలాన్ని అనుసరించే కొందరు విద్యార్థులు, ఆచార్యగణం ఇప్పటికీ జెఎన్‌యులో ఉన్నారు. ఉదాహరణకు దుర్గాపూజను వీరు తీవ్రంగా నిరసించారు. దుర్గను వీరొక సెక్క్‌వర్కర్‌గా చిత్రీకరించారు. మహిషాసురుడిని హతమార్చడానికే ఆమెను ప్రయోగించగా, అతడిలో మరులను రేకెత్తించి దుర్గ హతమార్చిందనేది వీరు చెప్పే కథ! వీరి దృష్టిలో నరకుడు గొప్ప రాజు. అతగాడిని హతమార్చినందుకే దీపావళి పండుగ జరుపుకుంటున్నారని విమర్శిస్తారు. మరి ఇటువంటి సంఘటనలను సెక్యులర్ మీడియా బయటపెట్టదు. కనీసం ఇటువంటి కథనాలపై తీవ్రస్థాయి అధిక్షేపణలు కూడా తెలపదు. సంప్రదాయంగా వచ్చే నమ్మకాన్ని ఎవరూ ఆమోదించాల్సిన పనిలేదు. ఇదే అసమ్మతి అని వారు వాదిస్తే సమస్యలే ఉండవు. కానీ భారత్‌ను ముక్కలు చేయాలన్న డిమాండ్ ఏమాత్రం సహించరానిది. ఇది ఎట్టిపరిస్థితుల్లో అసమ్మతి కాదు, దేశ ద్రోహం మాత్రమే! దంతెవాడలో 76 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లు మరణించినప్పుడు, జెఎన్‌యు విద్యార్థులు పండుగ చేసుకోవడానికి ఇదే భావజాలం కారణం! ఇదొక వ్యూహం!
నిజంగా అది అసమ్మతి కాదు. మనకు పైకి కనిపించేదానికి అంతర్లీనంగా జరిగేది పూర్తి భిన్నం. ఇది కేవలం అఫ్జల్ గురును శ్లాఘించడానికి మాత్రమే పరిమితం కాదు. దేశంలో మొట్టమొదటి హైజాక్‌కు బాధ్యుడైన జమ్ముకశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్ నేత మక్బూల్ భట్‌ను పొగడటానికి పరిమితం కాదు. ఇతగాడికి 1984లో ఉరిశిక్ష అమలు చేశారు. మరి ఇతడిని అఫ్జల్ గురుతో ఎందుకు పోలుస్తున్నారు? అఫ్జల్ గురు ఉరికి కాశ్మీర్‌లో వచ్చిన స్పందన, మక్బూల్ భట్‌ను ఉరి తీసినప్పుడు రాలేదు. ఈ రెండు సమస్యలను వెలికి తీసి, ఇప్పటికే సమస్యాత్మకంగా ఉన్న కాశ్మీర్‌లో మరింత కల్లోలం రేకెత్తించాలని, పాక్‌లో ఉన్న జిహాదిస్టుల పన్నాగం. ఈ పాపిష్టి వ్యూహానికి మద్దతుగా, పార్లమెంట్‌పై దాడి కేసులో కొన్ని సాంకేతిక కారణాలవల్ల విడుదలైన గిలానీ, ఢిల్లీ ప్రెస్ క్లబ్‌లో అఫ్జల్‌పై ఒక సెమినార్‌ను ఏర్పాటు చేశాడు. పాకిస్తాన్ జిహాదిస్టుల దుష్ట ప్రేరణ ఈవిధంగా ఉంటే.. విద్యాలయాల్లో నిరంతరం అశాంతిని రగిల్చి, యువతకు వ్యతిరేకిగా మోదీపై ముద్రవేసి, ప్రభుత్వంపై విద్యార్థి ఉద్యమం లేవనెత్తాలని దేశీయ రాజకీయ జిహాదిస్టుల యత్నం!
జెఎన్‌యులో మారువేషాల్లో ఉన్న జిహాదిస్టులు మాత్రమే కాదు, వామపక్ష భావజాల సమర్థకులైన ప్రముఖ రచయితలు, జర్నలిస్టులు, కార్యకర్తలు కూడా ఇదే దృక్కోణంతో ఉండటం గమనార్హం. జెఎన్‌యులో నినాదాలను వీరు వ్యతిరేకిస్తారు.. కానీ ఇదే సమయంలో వాటిపై తీసుకుంటున్న చర్యలను ఖండిస్తారు. మరి నినాదాలు ఖండనార్హమైతే, తదనంతరం తీసుకునే చర్యలు తప్పెలా అవుతాయి? తీసుకున్న చర్యలపై గట్టిగా విమర్శిస్తారు. ఎప్పుడైతే జెఎన్‌యులో జాతివ్యతిరేక శక్తుల వ్యవహారంపై తీసిన వీడియో బయటపడిందో వీరి నోట మాట పడిపోయంది. వెంటనే తమ లక్ష్యాన్ని మార్చుకున్నారు. ఎవరో బయటి శక్తులు నినాదాలు చేసే వారి మధ్యలో చొరబడ్డారంటూ ప్లేటు ఫిరాయించారు. మరి అటువంటి శక్తులను గుర్తించడంలో ప్రస్తుతం జైల్లో ఉన్న యూనియన్ అధ్యక్షుకి వచ్చిన అవరోధం ఏంటో?
ఇక్కడ మోదీ అదృష్టమేమంటే, తప్పుడు మార్గంలో ఉన్న విద్యార్థులు, రాజకీయ పార్టీల పట్ల దేశంలోని మధ్యతరగతి వర్గాల్లో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమవుతుండటం. జెఎన్‌యులో తీసుకుంటున్న చర్యలకు మాజీ సైనిక ఉద్యోగులు తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అన్నింటికంటే గొప్ప పరిణామమేంటంటే..తమ సంస్థల నియామికాల్లో జెఎన్‌యు విద్యార్థులకు అవకాశం కల్పించ బోమంటూ ప్రముఖ పారిశ్రామిక వేత్త రతన్‌టాటా ప్రకటించడం. ఈ ట్వీట్ నిజమైతే, దీని పర్యవసాన ప్రభావం ఇతర పరిశ్రమలపై కూడా ఉండి తీరుతుంది. వామపక్ష తీవ్రవాద విద్యార్థులకు తమ స్థానమేంటో తెలియజెప్పే సంఘటనగా ఇది మిగిలిపోతుంది.

జెఎన్‌యు సంఘటనకు వ్యతిరేకంగా ఎబివిపి ఆధ్వర్యంలో ర్యాలీ (ఫైల్ పోటో)