సబ్ ఫీచర్

విశ్వవిద్యాలయాల్లో విద్రోహ కలాపాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలో మంచి చెడు అన్న అంశాలపై విచక్షణతో పరిశీలించకుండా మీడియా, దేశ వ్యతిరేక శక్తులు అడ్డు పడుతున్నాయ. వాస్తవాలను అవాస్తవాలుగా ప్రచారం చేయటం నిరంతరం దేశంలో అలజడి సృష్టించటం వల్ల పలు వివాదాలు చోటు చేసుకుంటు న్నాయ. జరగాల్సిన చెడు పూర్తిగా జరిగిన తర్వాత అసలు సంగతులు బయటకు వస్తాయ. దీనిపై ఎవరికి వారు వౌనం వహించడం పరిపాటైపోయంది. నరేంద్రమోదీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే అటు కాంగ్రెస్‌వారూ కమ్యూనిస్టు వారూ ఏదో ఒక వివాదం లేవనెత్తటం దానికి బాగా ప్రచారం కల్పించి, పెద్ద ఘోరం జరిగిపోతు న్నట్టు పరిస్థితులు సృష్టిస్తారు. తీరా అంతా అయ్యాక చివరికి వాస్తవాలు బయటికి వచ్చి నాలుక కరుచుకొని నోరు మూసుకుపోవటం తరచూ జరుగుతున్న ఆనవాయితీ.
జరిగింది ఒకటైతే వీరు చెప్పేదొకటి. ప్రతి విషయాన్నీ పెద్దది చేసి యాగీచేయటం వివాదం చేయటం మీడియాలో బాగా ప్రచారం చేయటం దానికి మోదీ బాధ్యు డు అంటూ స్టేట్‌మెంటు ఇవ్వటం పరిపాటి అయ్యంది. బాధ్యతారాహిత్యంగా వ్యవహరించటం వల్ల ప్రజలు తమని అసహ్యించుకుంటారన్న కనీసం జ్ఞానం ప్రతిపక్షా లకు ఉండటం లేదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేసి లాభం పొందాలని చూస్తున్నారు. ప్రజాసమస్యలు వాటి పరిష్కారానికి సూచనలు ఇస్తూ నిర్మాణాత్మక పాత్ర పోషించాల్సిన ప్రతిపక్షాలు విషయ విశే్లషణ చేయకుండా విషప్రచారం చేయటం ప్రస్తుత వైపరీత్యం. రాజకీయ ప్రయోజనాలకోసం కనీస స్థాయికి దిగజారి పోవటం వీరి నైతిక దివాళాకోరుతనానికి పరాకాష్ట. కేంద్రీయ విశ్వవిద్యాలయంలో సంఘటన దురదృష్టకరమే. విద్యార్థి ఆత్మహత్య అనేది అతని మానసిక దౌర్బల్యం. ఆత్మహత్య అనేది ఎవరైనా చేసుకోవటం బాధాకరం. ఈమధ్య చాలామంది ప్రతి కారణానికీ ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు చాలా ఉన్నాయి. తెలంగాణ సాధనకోసరం అంటూ చాలామంది ఆత్మహత్యలు చేసుకున్నారని వార్తలు వచ్చాయి. ఎందుకు చేసుకున్నట్లు? వారందరూ ఆత్మహత్యలు చేసుకున్నంత మాత్రానే తెలంగాణ వచ్చిం దా అనేది ప్రశ్నార్థకమే.
ఆత్మహత్యలు చేసుకున్నవారి తల్లిదండ్రుల కడుపుకోత అంతా ఇంతా కాదు. వీరి బాధ వర్ణనాతీతం. తెలంగాణ వచ్చాక వీరి పిల్లలు వీరికి తిరిగి వస్తారా? వారి బాధ ఎవ రు తీరుస్తారు. వీరి బాధ తీర్చే తీరిక ఎవరికి ఉంది? పిల్లలు క్షణికావేశంలో ఇటువంటి తప్పు పని చేయటంవల్ల నష్టపోయేది ఎవరన్న సంగతి ముందుగా ఆలోచించాలి. ఎవరైనా ఇటువంటి సంస్కృతిని ఖండించాలి. వీటిని తమ ప్రచార అంశాలుగా వాడుకోవటం నీచరాజకీయాలకి పరాకాష్ఠ. దివాళాకోరు తనానికి ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి. వివాదాన్ని న్యాయస్థానం ముందుంచినపుడు పరిష్కారం కోసం కనీసం వేచి వుండే ఓర్పు లేకపోయింది. ఇది చాలా బాధాకరం.
కుహనా సెక్యులర్ వాదులు దేశం సార్వభౌమత్వానికి సవాలుగా తయారయ్యారు. ఉగ్రవాదిని శిక్షిస్తే అది తప్పంటూ ర్యాలీలు నిర్వహించడం, ఎంత ఘోరం? ఆ దుర్మార్గుడిని శిక్షించాలని భారత సుప్రీంకోర్టు అర్ధరాత్రి దాకా విచారించి న్యాయాన్యాయాలు పరిశీలించాకే తీర్పులిచ్చిన సంగతి అందరికీ తెల్సిందే. దుర్మార్గులకి సంఘీభావం ప్రకటించటం కోర్టు తీర్పులని ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని ధిక్కరించటం, తృణీకరించటం కాదా? అది తప్పని చెప్పిన వ్యక్తిని కొట్టటం నేరం దేశ ద్రోహం కాదా?
విశ్వవిద్యాలయాలు రాజకీయాలతో పూర్తిగా భ్రష్ఠుపట్టిపోయాయ. ఇందులో కుల, మత సంఘాలు రాజకీయ నాయకులకి పాత్ర ఏమిటని ఎవరూ ప్రశ్నించటం లేదు. వీరందరికీ ఇక్కడ ఏం పని? వీరు చదువుకునే విద్యార్థుల మధ్యకి రావటం అనవసరం. ఒక సంఘటన జరిగితే దానికి సంబంధించిన విషయాలపై బాధ్యతగల వారు వెంటనే సకాలంలో స్పందించి వుండి నిష్పాక్షికంగా విషయంపై చర్యలు తీసుకుంటే విషయం ఇంత దూరం రాదు. ఉభయపక్షాలనీ పిలిపించి కూచోపెట్టి మాట్లాడే తీరిక ఓపిక విశ్వవిద్యాలయ యాజమాన్యానికి ఉండాలి. చిలికి చిలికి గాలివానయి పెద్దపెద్ద ఉత్పాతంగా మారే వరకు ఉపేక్షించటం తప్పు. పరిశోధనా స్థాయిలో పరిపక్వత ఉంటుంది వారికి కూడా ఆలోచన ఉండాలి.
తల్లిదండ్రులు కూడా పిల్లలు ఎలా ఉంటున్నారు ఏం చేస్తున్నారు అనే ధ్యాస ఉండాలి. ఇదంతా ఒక విష వలయం వలె తయారైంది. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరిగిపోయాక అందరూ మేల్కొనటం ఎంత పొరపాటు? కానీ ఈ పొరపాటుకు చెల్లించే మూల్యం భయంకరంగా ఉంటోంది. దిద్దుబాటు వల్ల మరణించిన వారు తిరిగి రారు కాదా. ఆ తల్లిదం డ్రుల కడుపుకోతను ఎవరు తీరుస్తారు? నిజం చెప్పాలం టే విశ్వవిద్యాలయాలు అసాంఘిక శక్తులకు, అరాచక శక్తులకు నిలయంగా మారుతున్నాయ. ఈ కారణంగానే ఉగ్రవాదులకు మద్దతుగా, దేశానికి వ్యతిరేకంగా వ్యవహ రించే వారి ఆగడాలు ఎక్కువవుతున్నాయ. వీటిని మొగ్గ లోనే తుంచేసే అధికారం విశ్వవిద్యాలయ పాలక వర్గాల కు కల్పించాలి. ఇప్పుడున్న అధికారాలు ఇటువంటి అరాచ క సంఘటనలను నియంత్రించడానికి సరిపోవడం లేదని జరుగుతున్న సంఘటనలు నిరూపిస్తున్నాయ.
విద్యార్థులు విద్య నేర్వడానికి పరిమితం కావాలి కాని, అసలు లక్ష్యం వదిలేసి కుహనా లౌకిక వాదులతో చేతులు కలపాల్సిన అవసరం ఏమిటి. తమ భవిష్యత్తు ఆగమ యతే ఈ పార్టీలు ఆదుకుంటాయా? తమ అభివృద్ధి దేశ పురోగతికి దారితీస్తుందన్న సత్యాన్ని విద్యార్థులు గుర్తుం చుకోవాలి.

- పిడుగు రామలింగయ్య