ఉత్తరాయణం

ఇష్టానుసారం చార్జీల వసూలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దీపం వుండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న సూక్తిని ఆర్టీసి తు.చ. తప్పకుండా పాటిస్తోంది. వివిధ పండుగల సందర్భంగా ప్రయాణీకుల రద్దీని దృష్టిలో పెట్టుకొని పండుగ స్పెషల్ పేరుతో పల్లెవెలుగు బస్సుల్లో సైతం ఎక్స్‌ప్రెస్ చార్జీలు వసూలు చేస్తోంది. దుమ్ము, ధూళి, చెత్తాచెదారంతో నిండివున్న బస్సులను కూడా నడుపుతున్నారు. స్వంత ఊళ్లకు తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వున్నందున ప్రయాణికులు ఆర్టీసి పెట్టే చిత్రహింసలను భరించాల్సి వస్తోంది. రైల్వేలో ప్రీమియం రైళ్ల మాదిరిగా ఆర్టీసి కూడ రూటును బట్టి రద్దీని బట్టి రేట్లను ఇష్టారాజ్యంగా మార్చేస్తూ పబ్బంగడుపుకుంటోంది.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ప్రజల సమస్యలు తీర్చండి
ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి ఆకాశంలో విహరిస్తూ పెద్ద పెద్ద మాటలు చెబుతూ సామాన్య ప్రజలను గురించి మరిచిపోయారు. కేంద్ర ప్రభుత్వం రైల్వేచార్జీలను ఏదో విధంగా పెంచడం, స్వచ్ఛ్భారత్, సేవా పన్నులు అని ప్రజలపైన భారం మోపడం మంచిది కాదు. వారు ఊహించిన ఆర్థిక ప్రయోజనాలు ప్రజలకు చేరడమే లేదు. క్రొత్త పథకాలు పెట్టి ప్రజల దగ్గర వున్న డబ్బును దోస్తున్నారు తప్ప, సామాన్య ప్రజలు బాధన పడుతూ వుంటే పన్నులు కొత్తవి విధిస్తున్నారు. పెట్రోలు, డీజిలుపై ఎక్సైజు సుంకం వారం తేడాతో రెండుసార్లు పెంచారు. ఇంకా ఏ పన్నులు పెరుగుతాయో తెలియటం లేదు. ప్రధానమంత్రి స్వదేశీ, విదేశాలలో గంభీర ఉపన్యాసాలివ్వడం తప్ప ప్రజలకేమి లాభం జరగడం లేదు. మన ముఖ్యమంత్రి జన్మభూమి అని జాతరలు చేసి, డబ్బు వృధా చేయడం తప్ప ప్రజల సమస్యలు ఒక్కటి జన్మభూమిలో తీర్చటం లేదు. ప్రజలేమైనా అడిగితే పోలీసులచేత బలవంతంగా అణగద్రొక్కుతున్నారు. కాబట్టి ప్రధానమంత్రి, మన ముఖ్యమంత్రి గాలిలో తిరుగుతూ డబ్బు వృధా చేయడం మాని భూమి మీద ప్రజల సమస్యలను తీర్చితే బాగుంటుంది.
- ఈశ్వర్, ప్రొద్దుటూరు
మంచికి చేయూత
కేవలం చంద్రబాబుమీద అక్కసుకొద్దీ లొల్లిచెయ్యటం, కోర్టుకెక్కడం కాకపోతే పది రూపాయలు పెద్ద మొత్తమా? ప్రతినెలా యిమ్మంటే అనుకోవచ్చు. రాజధాని పునర్నిర్మాణం అంటే మాటలా? కోట్లాది రూపాయలు ఖర్చు అవుతాయి. మిషనరీ స్కూళ్ళు వాళ్ళ టైలర్ దగ్గరే కుట్టించుకోవాలి, నోటు పుస్తకాలు వాళ్ళదగ్గరే కొనాలని చెప్తే ఎవ్వరూ నోరెత్తరు. స్థానికంగా వున్న ఒక మిషనరీ స్కూలు ఎక్స్‌టెన్షన్‌కు బిల్డింగ్ ఫండ్ క్రింద మూడొందలు ఇమ్మని పేరెంట్స్‌కి ఉత్తరాలు రాసింది. ఒకళ్ళకు కడితే చాలదా అంటే వీల్లేదన్నారు. ఇవ్వకపోతే కోపం పెట్టుకుని పిల్లల్ని ఎక్కడ వేధిస్తారోనని నోరుమూసుకుని కట్టాం. ఒక కార్పొరేట్ కాలేజి ఎమ్‌సెట్ కోచింగ్‌తో ఇంటర్ ఫీజు కట్టించుకుని టీసి యిచ్చే సమయంలో అది కాకుండా స్పెషల్ క్లాసులు పెట్టాం అంటూ 750 రూపాయలు వసూలుచేసింది. ఎదిరించిన వాళ్ళే లేరు. ఒకళ్ళు ఒక ప్రతిపాదన చేస్తే అందులో సదుద్దేశ్యం వుందా దురుద్దేశ్యం వుందా అని చూడాలి. బాబు పార్టీ ఫండ్‌కోసం అడగలేదు కదా. ఏదో దేవుడు నోరిచ్చాడని, చేతిలో పేపరుందని అదే పనిగా విమర్శించడం బాగాలేదు. ఏం చంద్రబాబు జనాలకు అపకారం తప్ప ఉపకారం చెయ్యలేదా? ఇంటి ముం దు కిలో బెండకాయలు అరవై అక్షరాల. రైతు బజార్లో 20 కాస్త నడుచుకుంటూ వెళ్ళి తెచ్చుకుందాం రైతుబజార్ కానె్సప్ట్ ఆద్యుడెవరు? చంద్రబాబేకదా.. మరి?
- బి.ఆర్.సి.మూర్తి, విజయవాడ
సమర్థులను ఎంపిక చేయాలి
సమర్ధత నైపుణ్యత అభిరుచి మొదలైన ప్రామాణికంగా తీసుకొని ఉపాధ్యాయులను ఎంపిక చేయాలి. ప్రభుత్వ ఉపాధ్యాయులను అన్ని సబ్జెక్టుల్లోను భర్తీచేసేందుకు టీచర్స్‌రిక్రూట్‌మెంట్ బోర్డ్‌ని నెలకొల్పాలి. సమాజంలో ఉత్తమ ఉపాధ్యాయులు రావడానికి టీచర్స్ సర్వీస్ కమీషన్‌ను ఏర్పరచాలని తెలంగాణా స్టేట్ సర్వీస్ కమీషన్‌వారిని విద్యాశాఖామాత్యులని, ముఖ్యమంత్రిని కోరుతున్నాం.
- కూర్మాచలం వేంకటేశ్వర్లు, కరీంనగర్
తల్లిదండ్రుల వైఖరి మారాలి
పాఠశాలల్లో చిన్న పిల్లలను ఉపాధ్యాయులు చావబాదుతున్నారంటూ తరచూ వింటుంటాం. ఇది ప్రభుత్వ పాఠశాలల్లో కంటే ప్రైవేటు పాఠశాలల్లో కొంచెం ఎక్కువగా వుంది. పసిపిల్లలను పాఠశాలలకు పంపిస్తున్న ప్రస్తుత వ్యవస్థలో ముందుగా తప్పుపట్టాల్సింది ఉపాధ్యాయులను కాదు, తల్లిదండ్రుల వైఖరినే. బుడిబుడి నడకల వయసునుంచే పిల్లలను తల్లిదండ్రులు పాఠశాలలకు అప్పగిస్తున్నారు. దుస్తులు, ఫీజులు, బస్సు, పుస్తకాలు వంటి సౌకర్యాలను కల్పిస్తున్నామని గొప్పగా ఆలోచిస్తున్నారే తప్ప చిన్నారి హృదయాల అమ్మఒడి కమ్మదనానికి దూరమై ఎంత దుర్భరవేదనను అనుభవిస్తున్నాయో వారు అర్థం చేసుకోలేకపోతున్నారు. మార్కులు ముఖ్యంకాదు, అవగాహన, ఆలోచన తదితర సామర్థ్యాలు రావాలని అనుకోవటం లేదు.
- గోదూరు అశోక్, కరీంనగర్