ఉత్తరాయణం

వడ్డీ వ్యాపారాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వ ఉద్యోగస్థులు చాలామంది వడ్డీ వ్యాపారాలు చేస్తున్నారు. ఇటువంటి వారిని ఉద్యోగాలనుండి డిస్మిస్ చేయాలి. వడ్డీ వ్యాపార ప్రభుత్వ ఉద్యోగులవల్ల సామా న్య ప్రజలు బాధలు పడుతున్నారు. బాండ్ల మీద తెల్ల కాగితాల మీద, ఎప్పుడో కొంత అప్పు ఇచ్చి, ఇప్పటివరకు వడ్డీల మీద వడ్డీలు తింటున్నారు ప్రభుత్వ ఉద్యోగులు. ఇలాంటి వారిని గుర్తించి, ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలి.
- రావేటి మునేంద్ర, అనంతపురం
క్రీమీలేయర్ తప్పనిసరి
బి.సి. కులాల బి.సి.కమిషన్ నేతలు క్రీమీలేయర్‌ను రద్దుచేయాలనడం సరైంది కాదు. క్రిమిలేయర్ పెట్టింది కేవలం ధనికులకు రిజర్వేషన్ సౌకర్యాన్ని నిలుపుదల చేసి, బి.సి.కులాల్లోని బీదలకు రిజర్వేషన్ సౌకర్యాన్ని కలుగజేయాలని. క్రీమీలేయర్ వుండి తీరవలసిందే! రిజర్వేషన్లు బి.సిలందరు బాగుపడాలనే ప్రవేశపెట్టారు తప్ప నిరంతరం ధనికులే, బాగుపడిన వారే నిరంతరం బాగుపడాలని గాదు. క్రీమీలేయర్ నిబంధనలవల్ల బి.సిలలోనే వెనుకబడిన ఇతర కులాలకు ప్రయోజనం లభిస్తుంది. అగ్ర కులాలవల్ల, ధనికులవల్ల బిసిలకు అన్యాయం జరుగుతున్నదని వాదించి రిజర్వేషన్లు పొందిన తర్వాత బిసిలలోని బలహీనులను అణగద్రొక్కాలని ప్రయత్నించటం సహింపరానిది. అగ్రవర్ణాల అణచివేత గురించి మాట్లాడే హక్కును బిసి కమిషన్ కోల్పోతుంది! ఇతరులు తమను అణగద్రొక్కరాదు, దోపిడీ చేయరాదు గాని, తమ వారిని తామే అణగద్రొక్కవచ్చా? ఇది న్యాయంగా గాదు. క్రిమిలేయర్ వుండవలసిందే! దానివల్ల బీద కుటుంబాల పిల్లలకు ఉద్యోగాలు వచ్చే అవకాశం వుంది. క్రీమీలేయర్‌లో నిర్ణయించిన ఆదాయాన్ని కూడ ఇంకా తగ్గించాలని మనవి.
- జి.శ్రీనివాసులు, అనంతపురం
ప్రధాన శత్రువు నిరుద్యోగం
హిందూ సమాజాన్ని పీడిస్తున్న ప్రధాన శత్రువులు ని రుద్యోగం, పేదరికం. ఈ రెండు ఆసరాగా తీసుకుని కొన్ని విదేశీ శక్తులు తమ గుడారాలు వేసుకుని మత మార్పిడు లు చేసి హిందూ ధర్మానే్న కాలరాయాలని చూస్తున్నాయి. వారి ప్రయత్నాలకు రాజకీయ అండ కూడ ఉంటోంది. ఇదో వ్యాపారంగా మారి వెర్రితలలు వేస్తోంది. అన్యమతాలను హిందూ సమాజం గౌరవిస్తోంది. కాని హిందూ సమాజం ప్రలోభాలకు లొంగి మతం మారడం సబబుకాదు. ప్రలోభాలకు గురి చేసి మతమార్పిడులకు పాల్పడటం ఎంతమాత్రం సరైంది కాదు.
- ఆర్.విరూపాక్ష, కంచరపాలెం
దేవాదాయశాఖ తీరు అథ్వానం
రెండు తెలుగు రాష్ట్రాలలో దేవాదాయశాఖ పనితీరు అధ్వాన్నంగా వుంటోంది. ఆలయాలను బిజినెస్ సెంటర్లుగా మార్చివేశారు. భగవంతునికి నిత్య నైవేద్య కార్యక్రమాలను ఆగమశాస్త్రానుబద్ధంగా కాకుండా తూతూ మంత్రం చందాన కానిచ్చేస్తున్నారు. ప్రతీ సేవకు టిక్కెట్లు పెట్టి ధనవంతులు, విఐపిల సేవలో తరిస్తూ సామాన్యులను పట్టించుకోవడం మానేశారు. వేలాది ఆలయ భూములను కబ్జాచేసినా పట్టించుకునే వారే లేరు. రెండు రాష్ట్రాలలో వేలాది ఆలయాలు జీర్ణస్థితికి చేరుకున్నా ఆలనాపాలనా లేక మూతబడినా వాటికి అతీగతీ లేదు. పైగా అనాధ బాలలను దత్తతకు తీసుకున్నట్లు ఆలయాలను కూడా దత్తతకు తీసుకోమని ప్రభుత్వాలు అభ్యర్థిస్తున్నాయి. అనేక దేవాలయాలలో దొంగతనాలు, ఆశ్రీతపక్షపాతం, అక్రమాలు అనేకం జరుగుతున్నాయి. పీఠాధిపతులను సంప్రదించకుండా అర్చనా పద్ధతులను కూడా మార్చేస్తున్నారు. మరొకప్రక్క అన్యమనస్థుల ప్రార్థనా మందిరాలను అభివృద్ధి చేసేందుకు వెంటనే నిధులను మంజూరుచేసి వారి ప్రాపకానకి ఆరాటపడుతున్నాయి.
- సి.ప్రతాప్, శ్రీకాకుళం
ఆగని వేధింపులు
రోజురోజుకీ బాలికల, మహిళల పట్ల వేధింపులు అధికమవుతున్నాయి. ఎక్కడికి వెళ్ళినా ఆకాయిల వేధింపులతో మహిళలు, బాలికలు తలెత్తుకొని తిరగలేకపోతున్నారు. కొన్నిచోట్ల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయి. ప్రేమ పేరుతో వేధించడం, లైంగిక వేధింపులకు అంతేలేకుండాపోవడం సిగ్గుచేటు. మహిళల రక్షణ చర్యలు పటిష్టంగా అమలుచేయాలి. వేధింపులకు గురిచేసే వారిని అతి కఠినంగా శిక్షించాలి. టి.వి సీరియళ్ళలోనూ, సినిమాల్లోనూ మహిళలను కించపరిచే సన్నివేశాలు ఉంటే తొలగించాలి. పాఠశాలల్లో వారికి వ్యాయామం నేర్పాలి. పాఠ్యాంశాల్లో విద్యార్థుల్లో నైతిక విలువలను పెంపొందించేలా పాఠ్యాంశాలు పెంచాలి. తోటి స్ర్తిల పట్ల ఎలా ప్రవర్తించాలో తెలియజెప్పే పాఠాలు పెంచాలి. ముఖ్యంగా కళాశాలల్లో ఎక్కువగా ఈ నైతిక విలువలను విద్యార్థుల్లో పెంపొందింపజేయాలి.
- సరికొండ శ్రీనివాసరాజు, హైదరాబాద్
మహిళలకేవీ గ్రంథాలయాలు?
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మహిళా గ్రంథాలయాలను ఏర్పాటుచేయాలి.