సంపాదకీయం

మాయవౌతున్న మట్టి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశంలోని మొత్తం భూమిలో మూడవ వంతు నిస్సారమైపోయినట్టు వెల్లడి కావడం ఫ్రాన్స్ రాజధాని పారిస్ నగరంలో జరుగుతున్న పర్యావరణ పరిరక్షణ సదస్సునకు విచిత్రమైన నేపథ్యం. ఇలా మన భూమి ‘సారం’ కోల్పోయి ‘క్షారం’గా మారడానికి సమీప కారణం కృత్రిమ రసాయనపు ఎరువులు, సంకర జాతి విత్తనాలు, క్రిమిసంహారక ఔషధాలు... ఇప్పుడు ‘జన్యు పరివర్తన’-జిఎమ్-పరిజ్ఞానం ద్వారా రూపొందుతున్న మహా సంకర జాతుల విత్తనాలలో బాసిలస్ తురంజెన్సిస్-బిటి- అన్న ‘విష జీవ రసాయన ధాతువులు’ నిహితమై ఉన్నాయి. ఈ ‘బిటి’ విత్తనాలు, పంటలు భూమి పనికి రాకుండా పోవడానికి దోహదం చేస్తున్న మరో కారణం! ఆవులు, అడవులు దశాబ్దులపాటు హత్యలకు గురి కావడం భూమి ఇలా పంటలకు పనికిరాకుండా పోవడానికి దీర్ఘకాల కారణం. ఆవుపేడ, అడవులలో దొరికే పచ్చి ఆకులు, భూమిని నిరంతరం పరిపుష్టం చేశాయి, వానపాముల వంటి జీవ జాలాన్ని విస్తరింప చేసి భూ సారాన్ని సజీవంగా ఉంచాయి! ఆవులు అడవులు అంతరించిపోయిన పల్లెలలో భూమి నిర్జీవం అయిపోయింది, వానపాముల-ఎర్రలు-వంటి భూసార పరిరక్షక జీవజాలం కృత్రిమ రసాయనాల విషపు వాసనలు భరించలేక పాతాళానికి దిగబడిపోయాయి! రోగం పెంచే చికిత్సలాగ భూసారాన్ని మరింతగా క్షీణింప చేసే విధానాలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొనసాగిస్తుండడం వర్తమాన కాలుష్య కారణం! ఎండో సల్ఫాన్ వంటి క్రిమినాశకాలు భూసారాన్ని కూడ నశింపచేసాయి! పాశ్చాత్య సంపన్నదేశాలు నూట యాబ యి ఏళ్లకు పైగా అత్యాశతో కొనసాగించిన ‘పారిశ్రామిక ప్రగతి’ కాలుష్యాన్ని పెంచిందని మన పర్యావరణ శాఖ మంత్రి ప్రకాశ్ జవదేకర్ చెప్ప డం చారిత్రక వాస్తవాలకు అనురూపం! ఈ కాలుష్యం ప్రపంచ ఉపరితల ఉష్ణోగ్రత ను పెంచింది, సముద్రాల నీటి మట్టాన్ని పెంచింది, హరిత శోభలను అంతం చేసింది, భూమిని నిర్జీవం చేసింది. మదరాసును బీభత్స వర్షం ముంచెత్తడానికి శతాబ్దికి పైగా సాగిన ఈ పారిశ్రామిక కాలుష్యం కారణమన్నది జవదేకర్ అభిప్రాయం! అలాంటప్పుడు ‘ప్రపంచీకరణ’ పేరుతో సంపన్నదేశాల ‘కాలుష్య కారక’ విధానాలను మన ప్రభుత్వాలు ఎందుకని అనుసరిస్తున్నట్టు? పారిస్‌లో జరుగుతున్న పర్యావరణ సదస్సుకు వెడుతున్న ప్రకాశ్ జవదేకర్ ఈ ప్రశ్నకు మాత్రం సమాధానం చెప్పడంలేదు! కానీ మనదేశంలో కూడ కాలుష్యం పెరుగుతోందని, దీనికి మన ప్రభుత్వాలు కూడ బాధ్యత వహించవలసి ఉందని మరో కేంద్ర మంత్రి మేనకాగాంధీ ‘కుండ బద్దలు కొట్టడం’ వాస్తవానికి మరింత దగ్గరగా ఉంది...‘స్వీయ దోషంబులెరుగుట పెద్ద విద్య..’ అని అన్నాడు మీర్జా గాలిబ్ అన్న ఉర్దూ కవి!
మనదేశంలోని మూడవ వంతు భూమి నిస్సారమై నిర్జీవంగా మారిందన్న శాస్తజ్ఞ్రుల ఆందోళన ఆవిష్కృతవౌతున్న సమయంలోనే భూమికి ఊపిరాడని కాలుష్య పరిసరాలను మరింతగా విస్తరింపచేయడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘హరిత నిబంధనల’ను నీరు కార్చడానికి యత్నిస్తోంది! ఈ సమాంతర వైపరీత్యం మాజీ ప్రధాని మన్‌మోహన్‌సింగ్ నాయకత్వంలోని ‘ఐక్య ప్రగతి కూటమి’ ప్రభుత్వం నుండి సంక్రమించిన వారసత్వం! అటవీ సంపదను, పంట పొలాల పచ్చదనాన్ని అతిగా పరిరక్షించాలన్న హరిత నియమావళి కారణంగా పారిశ్రామిక ప్రగతి కుంటుపడుతోందని, అందువల్ల హరిత నియమావళిని నీరుకార్చివేయాలని మన్‌మోహన్‌సింగ్ 2011 ఫిబ్రవరి మూడవ తేదీ కొత్త ఢిల్లీలో జరిగిన ఒక సదస్సులో ప్రకటించి ఉన్నాడు! ఈ చారిత్రక ప్రకటన తరువాతనే హరిత నియమావళిని కేంద్ర పర్యావరణ పరిరక్షణ మంత్రిత్వ శాఖవారు పట్టించుకోవడం మానివేశారు! ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’-స్పెషల్ ఎకనమిక్స్ జోన్స్-కోసం అడవులను నరికివేయడం, కొండలను తవ్వేయడం, పడమటి కనుమలకు తూర్పు కనుమలకు కన్నాలు పెట్టడం, నియాంగిరి, సహ్యాద్రి వంటి వన సీమలలోని నీటి ప్రవాహాలను ఎండగట్టడం, వరిపొలాలను తమలపాకుల తోటలను రైతుల కళ్ల ముందే ధ్వంసం చేయడం వంటివి ‘ఐక్య ప్రగతి కూటమి’ పరిపాలనలో జరిగిన హరిత హనన కలాపాలలో కొన్ని మాత్రమే! ఈ పారిశ్రామిక ప్రగతి వారసత్వాన్ని మన్‌మోహన్‌సింగ్ ప్రభుత్వం వారు ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని భారతీయ జనతాపార్టీ ప్రభుత్వం వారి ‘నెత్తికెత్తి’ నిష్క్రమించారు! ఈ వారసత్వాన్ని వదిలించుకుని, నరేంద్రమోదీ ప్రభుత్వం అడవులను పంట భూములను ఆకుపచ్చదనాన్ని పరిరక్షించాలన్న ఆకాంక్షలు సాకారం కావడం లేదు. ప్రభుత్వ ప్రభుత్వేతర భాగస్వామ్యం-పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్-పిపిపి- పేరుతో ఏర్పడుతున్న ‘ఉమ్మడి వ్యవస్థ’ మరింత లోతుగా విస్తృతంగా భూములను తవ్వివేయడానికి పథకాలను సిద్ధం చేస్తున్నారట! హరిత నిబంధనలను గాలికి వదిలివేయాలన్న సిఫార్సులను కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తోందట! భూమికి ఇంక దిక్కెవరు? పచ్చిగడ్డిని తినవలసిన పశువులు ప్లాస్టిక్‌ను భోం చేస్తున్నాయి. పాలరుచి మరచిన మానవులు విష రసాయనభరితమైన శీతల పానీయాలను మరిగారు... ఈ ‘ప్రగతి’ భూమిని పనికిరాకుండా చేసింది, చేస్తోంది!
దేశంలో దాదాపు ముప్పయి మూడు కోట్ల హెక్టారుల భూమి ఉందని ఇందులో పనె్నండు కోట్ల హెక్టారుల భూమి వివిధ స్థాయిలలో చెడిపోయి ఉం దని భారత వ్యవసాయ పరిశోధన మండలి-ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్-వారు 2010లో నిగ్గు తేల్చారట! అంతర్జాతీయ భూసార పరిరక్షణ దినోత్సవం సందర్భంగా కొత్త ఢిల్లీలో డిసెంబర్ నాలుగవ తేదీన జరిగిన ఒక సదస్సులో ఈ వివరాలు ఇప్పుడు వెల్లడయ్యాయి. ఐక్యరాజ్య సమితి ‘ఆహార వ్యవసాయ వ్యవహారాల సంస్థ’-్ఫడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్-ఎఫ్‌ఏఓ-ఆధ్వర్యవంలో ఈ సదస్సు జరిగింది! ప్రతి ఏటా ఐదు వందల ముప్పయి కోట్ల టన్నుల భూసారం కొట్టుకుని పోతోందట! ఇలా కొట్టుకుని పోతున్న ‘ఒండ్రుమట్టి’లో దాదాపు మూడవ వంతు సముద్రం పాలవుతోంది, పదిశాతం చెరువులలోను జలాశయాలలోను చేరి అవి పూడిపోవడానికి దోహదం చేస్తోంది. చె రువులు పూడిపోవడం వల్ల దిగువప్రాంతాలను వరదలు ముంచెత్తుతున్నాయి. భూసారం కొట్టుకొనిపోవడానికి, నశించిపోవడానికి ప్రధాన కారణాలు అటవీ విధ్వంసం, క్రమపద్ధతిలో లేని నిర్మాణాలు, నిలువున పెరుగుతున్న నగరాలు, కాలుష్యాన్ని కేంద్రీకరించే విధంగా జరిగిపోతున్న పట్టణీకరణ, రసాయనపు ఎరువులు ప్రధాన కారణాలు! క్రిమిసంహారక ఔషధాల వాడకాన్ని తగ్గించాలని, ఏడాదిలో మూడు నాలుగు పంటలు పెట్టే విధానాన్ని విడనాడాలని, జీవ వైవిధ్య రక్షణకు, ప్రాకృతిక భూసార పోషకాల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని సదస్సులో ప్రసంగించిన శాస్తవ్రేత్తలు సూచించారట!
విపరీతంగా పెరిగిన మాంసం ఎగుమతులవల్ల పశుసంపద అంతరించిపోతోంది! ‘అనే్వషణలు’, ‘తవ్వకాలు’ పెరగడం వల్ల అడవులు, పరిసరాల జీవ వైవిధ్యం నష్టభ్రష్టమైంది. పశువులు అడవులు లేని దేశంలో సేంద్రియమైన ప్రాకృతికమైన ఎరువులు లేవు! అందువల్ల విదేశాలనుండి ‘రసాయన విషాల’ను ‘ఎరువుల’ రూపంలో దిగుమతి చేసుకుంటున్నాము! యంత్రాలతో సామూహికంగా పశువులను వధించి మాంసాన్ని ఎగుమతి చేస్తున్నది ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’...విదేశాలనుండి ఎరువులను తెచ్చి అమ్ముతున్నది కూడ బహుళ జాతీయ సంస్థలే! ఇదంతా ‘ప్రపంచీకరణ’లో భాగం...