ఉత్తరాయణం

భారతీయ సోదరా! బహుపరాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇది మినీ కవిత! కాదంటే వాస్తవికత
భారతీయ సోదరా! బహుపరాక్!
జాగో! జాగో! జగాతే రహో!
భారతీయ ప్రజాస్వామ్యం పరిహసించబడుతోంది. రాజ్యాంగం ప్రసాదించిన సేచ్ఛ రంకుతనం పాలవుతోంది.
‘‘వ్యక్తి స్వేచ్ఛ’’ అనే బంగారు జింకగా మారి
మారీచ రాక్షసులు మాయలు పన్నుతున్నారు
గాలి, వెలుతురు కోసం ఇంట్లో పెట్టిన వెంటిలేర్లు సక్య ముల పాములకూ వారసత్వపు తేళ్లకు దారిగా మారాయ
ఇంటిలోని హిత శత్రువులే ఇంటి దొంగలయ్యారు.
అలనాడు అసూయతో రగిలిపోయన అభిరాజూ, జయచంద్రుడూ, పునర్జన్మతో పుణ్యమూర్తులుగా చెలామణి అవుతున్నారు.
పురు షోత్తమునీ, పృథ్వీరాజునీ పూడ్చిపెట్టాలనుకుంటున్నారు.
మాతృదేశానికీ మరణ నినాదాలిస్తున్నారు.
పరాయ దేశాన్ని కలికి తురాయయని ప్రశంసిస్తూ రాజధాని లోనే రంకెలు వేస్తున్నారు.
ఔనుమరి, భారత ఉపఖండం స్వాతంత్య్రం పొందగానే జగమెరిగిన జాతీయ పార్టీనే హైజాక్ చేసిం దొక వంశం.
దేశభక్తులను దేశ ద్రిమ్మరులను చేసిన వంశం త్యాగ మూర్తులను తన్ని తరిమేసింది.
అన్ని రంగాలలో అస్మదీయులను నింపుకొని బానిస స్వామి భక్తులను పెంచి పోషించింది. భారత ప్రజల భావ జాలంలో బానిస భావాలనుపంచి పండించింది
భారతీయతను భ్రష్టు పట్టించి
రాటుతేలిన రాజవంశంగా చెలామణి అయ్యంది
బహునాళ్లకు ఒరుసు కంసుల వారసత్వానికి
గోరీ కట్టాడు నరేంద్ర మోదీ
అందుకే చెలరేగి పోతోంది వారసత్వపు వంశాంకురం
అధికారానికి దూరమై అలమటించిపోతున్నది
బానిస స్వామి భక్తులను పాకిస్తానుకు పంపింది
మోదీని దించమని మోరలెత్తి ప్రార్థించింది
అసూయాపరులైన తోకపార్టీలతో
తొండి మాటలు పలికిస్తోంది
అసహనం అసహనం అంటూ
సహనానికికే పరీక్ష పెట్టి సాధించాలనుకుంటోంది
దేశాన్ని మంచి ధరకు అమ్మగలిగే మాకంటే
దేశభక్తులెవరని ధూర్తంగా ప్రశ్నిస్తోంది
అసూయాపరులూ-అధికారానికి అలవాటుపడిన
స్వార్థ శక్తులూ
ఏమైనా చేయగలరని ఎంతకైనా తెగిస్తారని
చరిత్రలే చాటి చెబుతున్నాయ
అందుకే మరి-్భరతీయ సోదరా! బహుపరాక్!
జాగో! జాగో! జగాతే రహో!
- ఉమాపతి బి. శర్మ, హైదరాబాద్
సెల్ఫీలు మానెయ్యాలి
సెల్ఫీ మృత్యు ఘంటికగా మారిపోతున్న కాలమొ చ్చింది. రైలు పట్టాలు, నదీనదాలు, పర్వత శ్రేణులు మొదలైన వాటివద్ద నిలబడి సెల్ఫీ తీసుకుంటున్న సమయంలో విషాద సంఘటనలు చోటు చేసుకుం టున్నాయ. అతి సర్వత్రా వర్జయేత్ అనేది సూక్తి. యువత గమనించి అర్థం చేసుకొని అతిగా సెల్ఫీలు తీసుకోవడం మానివేయాలి.
- కాకుటూరి సుబ్రహ్మణ్యం, కావలి
ప్రత్యేక హోదా ఇవ్వాలి
రాష్ట్ర విభజన కారణంగా నష్టపోయన ఆంధ్ర ప్రదేశ్‌కు కేంద్రం ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీలను ప్రకటిం చడంలో అలసత్వం ప్రదర్శించడం దురదృష్టకరం. పై విషయాన్ని కేంద్ర ప్రభుత్వం సీరియస్‌గా తీసుకొని విభజన చట్టంలోని హామీలన్నింటిని అమలు జరపాలి. ఆర్థిక పరిస్థితులు అనుకూలించకపోవడం లేదన్న కుంటి సాగుతో ప్రభుత్వ ఉద్యోగులకు, పింఛను దారులకు కరువు భత్యం/్భృతులును సకాలంలో ప్రకటించకపో వడం విచారకరం.
- ఆశం సుధాకర్ రావు, గూడలి, నెల్లూరు జిల్లా
టిఆర్‌ఎస్ హవా సాగేనా?
ఖమ్మం కార్పొరేషన్‌లో టిఆర్‌ఎస్ హవా కొనసాగు తుందా? హైదరాబాద్‌కు భిన్నంగా ఇక్కడి రాజకీయాలుం టాయ. మొదట నుంచి సిపిఎం, కాంగ్రెస్‌ల ఆధిపత్యం కొనసాగుతున్నది. అయతే నేడు మారిన పరిణామాల నేపథ్యంలో టిఆర్‌ఎస్‌లో వలసలు బాగానే సాగాయ. ఇక్కడ వామపక్షాల ప్రభావం ఎక్కువ. కొత్తగా వైఎస్‌ఆర్ సిపి సైతం బరిలో దిగనుంది. అయతే జిల్లా రాజకీయల్లో టిఆర్‌ఎస్ కొత్తగా రంగంలోకి దిగినా ఆ పార్టీలోకి వల సలు ఎక్కువగా సాగడం వల్ల నాయకత్వ సమస్య ఉండ దు. మరి ఇతర ప్రాంతాల్లో సాగిన టిఆర్‌ఎస్ హవా ఇక్కడ ఎంత మేర ఉంటున్నది వేచి చూడాల్సిందే. అయతే తెలంగాణలోని మిగిలిన జిల్లాల్లో టిఆర్‌ఎస్ సాధించిన ఘనవిజయాల ప్రభావం సంప్రదాయ ఆలోచనా రీతులపై ఏవిధంగా ఉంటుందో మరి.
-అయనం రఘురామారావు, ఖమ్మం