ఉత్తరాయణం

పాక్‌తో చర్చలు వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అనుక్షణం భారత్‌లో తాను పాలుపోసి పెంచిన ఉగ్రవాదుల చేత మారణకాండ ఎలా జరపాలా అని మంత్రాంగం చేసే పాకిస్థాన్‌తో చర్చలు జరిపేందుకు మన ప్రభుత్వం ఎందుకు అత్యుత్సాహం చూపుతోందో అర్ధం కావడం లేదు. ఆల్‌ఖైదా, ఇ.సి.ఇ.యస్., తాలిబన్ కూటమి, ఇండియన్ ముజాహిద్దీన్ వంటి భీకర ఉగ్రవాద కూటములను అనుసంధానం చేస్తూ డజన్లకొద్ది ఉగ్రవాదులను మన దేశంలోనికి పంపిస్తూ భారత్‌లో ఎప్పుడూ, ఎలా ఉగ్రవాద మారణకాండ ఎక్కడ జరిపించాలా అన్న ప్రణాళికలు రచించే పాకిస్తాన్ ప్రభుత్వంతో చర్చలు, సత్సంబంధాలు, వాణిజ్య, వ్యాపార సహకారాలను అసలు కలలో కూడా తలపెట్టకూడదన్న వివేకం మన పాలకులకు ఎప్పుడు కలుగుతుందో? మారణకాండ, జరిగిన తర్వాత తూతూ మంత్రం చందాన నిరసనలు, అంతా సద్దుమణిగిపోయాక తిరిగి నిస్సిగ్గుగా చర్చలు ప్రారంభించడం వంటి ప్రహసనం కారణంగానే మన ప్రభు త్వం పాకిస్తాన్ దృష్టిలో తేలిక అయిపోయిందనేది నిర్వివాదాంశం.
- ఎం.కనకదుర్గ, తెనాలి
కొండను తవ్వి...
కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుగా వుంది నేతాజీ అదృశ్యానికి సంబంధించిన దస్త్రాలను కేంద్రం విడుదల చేసిన వాటినిబట్టి అనిపిస్తుంది. విమాన ప్రమాదం ఇది తెలిసిందే. అయితే నేతాజీ భారత్‌కి ఇక ఇంఫాల్‌నుంచి సింగపూర్‌కి వెళ్ళిపోవడం వెనుక కారణాలు బయటకు రావాలి. నాడు నేతాజీ బ్రిటిష్‌వాళ్ళకి వ్యతిరేకంగా జరుపుతున్న సైనిక పోరాటానికి నాడు కాంగ్రెస్ నుంచి గాని, సంస్థానాధీశులనుంచి గాని, గాంధీ, నెహ్రూల నుంచి గాని సహకారం లేకపోగా- నేతాజీ భారత్‌లోకి ప్రవేశిస్తే గులాబీలతో గాదు తుపాకులతో సమాధానం చెబుతానని నెహ్రూ అనడం, వామపక్షాలు నేతాజీకి వ్యతిరేకంగా-చైనా, రష్యాలకుఅనుకూలంగా నాడు దేశంలో ప్రదర్శనలు జరపడం వంటి వాటిపట్ల నాడు నేతాజీ తీవ్ర మనస్థాపం చెందాడు. కాబట్టే సైనిక పోరాటం విఫలమయ్యాక భారత్‌లోకి అడుగుపెట్టలేదు. ఇది వాస్తవం. నాడు నేతాజీ అందరూ సహకరించి వుండి వుంటే 1945లోనే స్వాతంత్య్రం వచ్చేది. అంతే కాక నాడు నేతాజీని స్వాతం త్య్రం వచ్చినాక భారత్‌లోకి ప్రవేశిస్తే తిరిగి అప్పగిస్తామని నాటి నేతలు కొందరు బ్రిటిష్ వారికి హామిలివ్వడంపై నిజాలు బయటకు రావాలి.
- వేదుల జనార్ధనరావు, వంకావారిగూడెం
విశాఖలో చెత్త సేకరణ సమస్య
పేరుకు స్మార్ట్ గానీ విశాఖలో మెయిన్ రోడ్లు కాకుండా మిగిలిన ఏ సందు చూసినా డస్ట్‌సిటీ అనే బోధపడుతుంది. కమీషనర్‌గారు చెత్త రోడ్డుపై వేస్తే జరిమానా అంటున్నారు గానీ ఇంట్లో నివసించే వారి అగచాట్లు వారికి పట్టడం లేదు. పన్నులు పెంచేస్తున్నారు గానీ పారిశుభ్రత లోపించింది. డస్ట్ తీసుకెళ్ళే సిబ్బంది మేం ప్రవేటువాళ్ళం మాకు పూచీలేదు పొమ్మంటున్నారు. నెలకు 15 రోజులు చెత్త తీస్తాం అని పేరేగానీ నెలకు 5 నుంచి ఏడు రోజులు మాత్రమే చెత్త పట్టుకెళుతున్నారు. ఏమని అడిగితే చెత్త పట్టుకెళ్ళే కుర్రాళ్ళు దొరకడం లేదు, తీసుకెళ్ళే వ్యానుకు రిపేరు అని దబాయిస్తున్నారు. యూజర్ చార్జీలు నెలకు రూ.30/- మాత్రం ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. మెయిన్ రోడ్లు తప్ప స్మార్ట్ సిటీకి సందులు, గొందులు అర్హం కావా?
- పట్టిసపు శేషగిరిరావు, విశాఖపట్నం
‘ఓపెన్ డిగ్రీ’కి విలువ లేదా?
తెలంగాణా ప్రభుత్వం ఏర్పాటుచేసి వన్‌టైమ్ రిజిస్ట్రేషన్ ద్వారా నిరుద్యోగులు స్వీయ వివరాలను నమోదుచేసుకుంటేనే తప్ప టి.యస్. పి.యస్.సి. ఉద్యోగాలకు అప్లై చేయరాదు. కాని వచ్చిన కష్టమేమంటే పదవ తరగతిని తప్పనిసరి చేయడం ఆశ్చర్యమనిపిస్తుంది. పదవ తరగతి లేకుండా సార్వత్రిక విద్యావిధానం (ఓపెన్ సిస్టమ్) ద్వారా డైరెక్టుగా డిగ్రీ చేసిన వారి గతి ఏమి? వారు మళ్ళీ పదవ తరగతి రాయాలా? ఎలా మరి వారి దరఖాస్తు కంప్యూటర్ స్వీకరించడం లేదు ఎలా? దీనికి పరిష్కారం కను గొనాలి. లేకపోతే ఓపెన్ విధానంలో డిగ్రీ చేసినవారు ఇ బ్బందులు పడతారు. ప్రభుత్వం ఈ విషయాన్ని పరిశీలించాలని కోరుతున్నాం.
- కూర్మాచలం వెంకటేశ్వర్లు, కరీంనగర్
ఈ-చలాన్లతో ఇబ్బందులు
మన భాగ్యనగరంలో ఆటోడ్రైవర్ల జీవితాల గురించి వ్రాయాలంటే... ఓ మహాభారతమే అవుతుంది. విద్యావంతులైన నిరుద్యోగులు ఆటోడ్రైవర్లుగా జీవించడం జగమెరిగిన సత్యం. అనునిత్యం ప్రజాసేవ చేస్తూ.. తాము మాత్రం అనేక బాధలకు గురవుతున్నారు. ఒకవైపు ట్రాఫిక్.. మరోవైపు ఫైనాన్స్ వాళ్ళ వత్తిడులు.. ఆపై కుటుంబ బాధ్యతలతో ఊపిరాడక సతమతమవుతున్నారు. వీరి జీవితమే రోడ్డుపై ఆధారపడింది. అలాంటి వేళలో ఒక్క క్షణం రోడ్డుపై ఆపితే చాలు. ఫొటో తీసి నో పార్కింగ్ పేరిట రూ.1000/-లు చలాన్ విధిస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమో!? అధికారులు ఒక్క క్షణం ఆలోచించాలి. ఒక ఆటోడ్రైవర్ రోజంతా కష్టపడితే 200/- నుండి 300/- రూపాయలు సంపాదిస్తాడు. రూ.1000/- చలాన్ అంటే ఓ ఐదురోజులు సంపాదన పోతోంది. ఇలాగైతే అతని జీవితం ఎలా వుంటుందో ఊహించండి. దయచేసి రూ.1000/-లు చలాన్‌ల విషయం లో అధికారులు ఆలోచించి తగు చర్యలు తీసుకోవాలి.
- కురువ శ్రీనివాసులు, హైదరాబాద్
రైలు సౌకర్యం కల్పించాలి
ఇచ్ఛాపురం నుంచి విజయవాడకు నేరుగా ప్యాసింజెరు రైలు సర్వీసు నడపాలి. రాయగఢ-విజయవాడ రైలు ఉన్నా శ్రీకాకుళం జిల్లాకు ప్రయోజనం లేదు.దశాబ్ద కాలంగా కొనసాగుతున్న ఈ డిమాండ్‌ను పట్టించుకున్న నాధుడు లేడు. ఇప్పటికైనా అధికార్లు ఈ దిశగా చర్యలు చేపట్టాలి.
- వి. కొండలరావు,పొందూరు