సంపాదకీయం

‘నిలచిన’ న్యాయప్రకియ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి అభినందనీయుడు! దేశంలో అత్యంత ప్రాబల్యంకల కుటుంబానికి చెందిన తల్లీ కొడుకులను న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి ఆయన చేసిన ప్రయత్నం సఫలం కావడం అవినీతిపరులైన రాజకీయ వేత్తలకు మరో హెచ్చరిక! ‘నేషనల్ హెరాల్డ్’ ఆంగ్ల పత్రిక యాజమాన్యాన్ని స్వాధీనం చేసుకుని అవినీతి సామ్రాజ్యం నిర్మించినట్టు కాంగ్రెస్ అధ్యక్ష, ఉపాధ్యక్షులపై వచ్చిన ఆరోపణ! నిందితులు నేరస్థులు కావచ్చు, కాకపోవచ్చు... వాస్తవాలు నిగ్గు తేలేది న్యాయస్థానాలలో మాత్రమే! కానీ న్యాయస్థానానికి ముఖం చాటువేయడానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, వారి సహచరులు మరికొందరు చేసిన ప్రయత్నం మాత్రం గర్హనీయం! ఈ ప్రయత్నం విఫలం కావడానికి కారణభూతుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి! నేషనల్ హెరాల్డ్ పత్రిక యాజమాన్యాన్ని అక్రమంగా స్వాధీనం చేసుకొనడంలో దాదాపు రెండువేల కోట్ల రూపాయల ఆస్తులను సోనియాగాంధీ ఆమె తనయుడు రాహుల్‌గాంధీ అక్రమంగా వినియోగం చేయడానికి యత్నించారన్నది డాక్టర్ స్వామి ఆరోపణ! ఈ ఆరోపణ ప్రాతిపదికగా ఆయన ఢిల్లీలోని ఒక ‘మెట్రో పాలిటన్ మాజిస్ట్రేట్’ కోర్టులో 2014లో అభియోగం దాఖలు చేశాడు! కోర్టులో హాజరు కావలసిందిగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ తదితరులకు జూన్ 26న ‘సమన్లు’ - ఆదేశం - జారీఅయింది. ఇలా తమకు ‘న్యాయాదేశం’ జారీచేయడాన్ని రద్దు చేయాలని కోరుతూ ఢిల్లీ హైకోర్టుకెక్కిన సోనియా బృందానికి అక్కడ చుక్కెదురైంది. హైకోర్టు న్యాయమూర్తి సునీల్ గౌర్ సోమవారం సోనియా బృందం వారి అభ్యర్థనను తిరస్కరించడంతో ఆమె, ఆమె తనయుడు మెట్రోపాలిటన్ మాజిస్ట్రేట్ కోర్టులో హాజరుకాక తప్పని పరిస్థితి ఏర్పడింది! భారత రాజకీయాలలో దాదాపు పద్దెనిమిది ఏళ్లుగా బాధ్యత లేని అధికారం చేలాయిస్తున్న సోనియా గాంధీకి ఇప్పుడు ‘బాధ్యత’ను వహింపవలసి రావడం విచిత్రమైన పరిణామం! బాధ్యతారహితమైన ప్రకటనల ద్వారా ‘పలాయన’ ప్రవర్తన ద్వారా ప్రముఖుడుగా పేరు తెచ్చుకున్న రాహుల్‌గాంధీకి సైతం తొలిసారిగా బాధ్యత వహించడం అంటే ఏమిటో తెలిసి వచ్చింది! హైకోర్టు ఆదేశాన్ని సుప్రీంకోర్టులో సవాలు చేస్తున్నట్టు కాంగ్రెస్‌లోని సోనియా అభిమానులు, అంతేవాసులు ప్రకటిస్తుండడం మరో వైపరీత్యం... హైకోర్టు తీర్పును శిరసావహించి మెట్రోపాలిటన్ న్యాయస్థానంలో హాజరుకావడం విజ్ఞతకు వికసించడానికి చిహ్నం కాగలదు! కాదని మళ్లీ కోర్టుకెక్కినప్పటికీ సర్వోన్నత న్యాయ నిర్ణయం హైకోర్టు తీర్పునకు భిన్నంగా ఉండబోదన్నది నిపుణుల అభిప్రాయం! ఇది నేరనిర్ధారణకు సంబంధించిన విచారణ కాదు... న్యాయ ప్రక్రియ విధి విధానాలకు సంబంధించిన వ్యవహారం! అందువల్ల నిందితులు న్యాయప్రక్రియ నుండి తప్పించుకోలేరు! సామాన్యులైనా, ప్రసిద్ధులైనా ‘నిందితులు’ విచారణకు హాజరు కావలసిందేనన్న వౌలిక సహజ న్యాయసూత్రం హైకోర్టు తీర్పు ద్వారా ఇప్పుడు మరో మారు ధ్రువపడింది... ఈ ధ్రువీకరణకు కారణభూతుడు డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామి!!
డాక్టర్ స్వామి మేధావి, ఆచార్యుడు, న్యాయవాది, రాజకీయ వేత్త... కానీ వీటన్నింటికంటే ఆయన అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు! ఈ సామాజిక ఉద్యమమే స్వామి ప్రసిద్ధికి ప్రధాన కారణం! అనేక మంది రాజకీయ ప్రముఖుల అవినీతిని రచ్చకెక్కించిన ఘనత డాక్టర్ స్వామికి దక్కింది! అవినీతికి వ్యతిరేకంగా దశాబ్దాలుగా ఆయన సంఘర్షణ సాగిస్తున్నాడు! కేవలం ఉద్యమాలను జరిపి అవినీతిని విశే్లషించడంవల్ల అవినీతిమంతులైన ఉన్నతోన్నత రాజకీయ వేత్తలకు ‘‘చీమ కుట్టదు...’’ అందువల్ల అవినీతి దుర్గంధ గ్రంథాలను న్యాయస్థానాలకు నివేదించడమే అవినీతిపరుల కొమ్ములను కోరలను పెకలించడానికి సరైన మార్గం! ఈ సమంజసమైన చోటు వెంట అవిశ్రాంత పయనం సాగిస్తున్న సుబ్రహ్మణ్యం స్వామి ఇతరులకు సైతం మార్గదర్శకుడయ్యాడు! తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, అవినీతి ఆరోపణలపై రెండుసార్ల గద్దెనుండి తొలగిపోవలసి వచ్చింది! ఆమె అవినీతి నేరాలు న్యాయస్థానాలలో ధ్రువపడడం ఇందుకు కారణం! ఇలా ధ్రువీకరించడానికి నిర్విరామ శ్రమ చేసిన నిరంతర సంఘర్షణ శీలి డాక్టర్ స్వామి! జయలలిత హైకోర్టులో నిర్దోషిగా నిరూపితం కావడం, వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉండడం తరువాత కథ! కానీ మిగిలిన రాజకీయ వేత్తలవలె ప్రత్యర్థులపై ఆరోపణ చేయడానికి మాత్రమే పరిమితం కాకపోవడం సుబ్రహ్మణ్యం స్వామి విలక్షణ కృషికి నిదర్శనం! లక్షా డెబ్బయి ఆరువేల కోట్లు ‘దూరవాణి రెండువ శ్రేణి తరంగాల’ - టెలికామ్ 2జి స్పెక్టరమ్ - కేటాయింపుల అవినీతిపై దర్యాప్తు మొదలు కావడానికి కారణభూతుడు స్వామి! లక్షా ఎనబయి ఆరువేల కోట్ల రూపాయల ‘బొగ్గు’ దుర్వినియోగం గురించి విస్తృతంగా దర్యాప్తులు, న్యాయాదేశాలు వెలువడానికి సైతం స్వామి కృషి కారణం!! ఇప్పుడు తొలిసారిగా సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ న్యాయస్థానంలో నిందితులుగా నిలబడవలసి వస్తోంది...
పదవి ఉన్నప్పటికీ లేకపోయినప్పటికీ డాక్టర్ స్వామి రాజకీయాలను ఇలా ప్రభావితం చేస్తున్నాడు! ‘‘అవినీతిపరుల’’ను న్యాయస్థానాలలో నిలబెడుతున్నాడు! డాక్టర్ స్వామి భారతీయ జనతాపార్టీ నాయకుడు కాబట్టి రాజకీయ విద్వేషంతో తమపై ఆరోపణలు చేశాడన్న సోనియాగాంధీ బృందం వారి వాదాన్ని ఢిల్లీ ఉన్నత న్యాయస్థానం తిరస్కరించడం ఆయన చిత్తశుద్ధికి ప్రశంసాపత్రం వంటిది! సోనియాగాంధీ కాంగ్రెస్ వ్యవహారాలను 1977 నుంచి నిర్దేశిస్తోంది, ‘2004-2014 దశాబ్ది’లో కేంద్ర ప్రభుత్వాన్ని నిర్దేశించింది. ప్రధానమంత్రి మన్‌మోహన్‌సింగ్ లాంఛనప్రాయుడయ్యాడు. అసలు ‘ప్రధానమంత్రి’ సోనియాగాంధీ అన్నది అందరూ ఎరిగిన వాస్తవం! ప్రభుత్వం సాధించిన విజయాల ఘనత సోనియాగాంధీదేనన్న ప్రచారం భూనభోంతరాళాలు దద్ధరిల్లి పోయేలా జరిగింది! కానీ అపజయాలకు, అవినీతి కలాపాలకు మాత్రం సోనియాగాంధీ బాధ్యత వహించలేదు!! బొగ్గు కుంభకోణం కేసులో మన్‌మోహన్‌సింగ్‌కు న్యాయస్థానం నుండి సమన్లు జారీ అయ్యాయి. నిజానికి ‘ముద్దాయి’ స్థానంలో నిలబడవలసింది సోనియాగాంధీ, మన్‌మోహన్‌సింగ్ కాదు!! కానీ బాధ్యతలేని అధికారం విమర్శలు లేని ప్రశంసలు సోనియాగాంగధీకి ఇంతవరకూ హక్కు భూక్తమయ్యాయి. ఈ విచిత్ర ప్రహసనం ఇప్పుడు ముగిసిపోయింది!! ‘‘బొగ్గు’’ అవినీతి బాధ్యతను, ‘టెలికాం’ అవినీతి బాధ్యతను తప్పించుకున్న సోనియాగాంధీని ‘నేషనల్ హెరాల్డ్’ అవినీతి మాత్రం అలముకొంది! తాను ఇందిరాగాంధీ కోడలని సోనియాగాంధీ మంగళవారం చాటుకున్నారు! కాదని ఎవరన్నారు?? ఇందిరాగాంధీ కోడలు సైతం న్యాయప్రక్రియ బద్ధురాలన్నది ఆమె నేర్వతగిన ‘పాఠం’!
అసోసియేటెడ్ జర్నలిస్ట్ లిమిటెడ్ -ఏజెఎల్- సంస్థ 1937లో ‘నేషనల్ హెరాల్డ్’ పత్రికను ఆరంభించింది. స్వాతంత్ర సమరంలో ఇది ‘్భరత జాతీయ కాంగ్రెస్’ భావాలకు ప్రతిబింబం! 2008లో కాంగ్రెస్ పార్టీ వారు ఈ సంస్థకు తొంబయి కోట్ల రూపాయలు అప్పిచ్చి ఆదుకున్నారట! 2010లో సోనియాగాంధీ రాహుల్ గాంధీ 76 శాతం వాటాదారుడుగా ‘యంగ్ ఇండియన్’ వైఐ అన్న వాణిజ్య సంస్థ వెలసింది. 90 కోట్ల ఋణాన్ని కాంగ్రెస్‌కు తిరిగి చెల్లించడానికి ‘వైఐ’ అంగీకరించింది. ‘ఏజెఎల్’లో ప్రధాన వాటాదారుగా చేరింది!! చివరికి 2000 కోట్ల రూపాయల ఆస్తులున్న ‘ఏజెఎల్’ను మొత్తం ఈ ‘యంగ్ ఇండియన్’వారు స్వాధీనం చేసుకున్నారు. తొంబయి కోట్ల పెట్టుబడి... రెండువేలకోట్ల రాబడి... ఇదీ ఆరోపణ...