మెయన్ ఫీచర్
భావ స్వాతంత్య్రానికి నిర్వచనం ఏమిటి?
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
భారత రాజ్యాంగం దేశ ప్రజలకు భావ స్వాతంత్య్రం, వాక్‌స్వాతం త్య్రం, పత్రికా స్వాతంత్య్రం ప్రకటించింది. రాజ్యాంగ అధికరణ 19-ఎ-2 ద్వారా దేశ పౌరుడు నిర్భయంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేయవచ్చు. ఇదొక గొప్పవరం. దేశ ద్రోహులు ఈ అధికరణను దుర్వినియోగం చేయడం మన దేశానికి శాపంగా పరిణమించింది. ఇలాంటి దుర్గతి భవిష్యత్తలో రావచ్చునని రాజ్యాంగ నిర్మాతలు ముందే ఊహించి నెహ్రూ జీవించి ఉన్నప్పుడే అంటే 1951లోనే ఈ భావ ప్రకటనా స్వేచ్ఛకు కొన్ని పరిమితులు విధించారు. రాజ్యాంగంలోని 124వ నిబంధన ప్రకారం దేశ అఖండతకు విఘాతం కలిగిస్తే ఆ వ్యక్తిని దేశద్రోహిగా ప్రకించవలసి ఉంటుంది. అంతే కాదు, ప్రాథమిక సూత్రాల్లో భారతదేశ సర్వసత్తాక సార్వభౌమాధికారాన్ని రక్షిస్తామని ప్రతి పౌరుడు ప్రతిన పూనాలి. ఈ సూత్రాన్ని దేశద్రోహులు చాలా సౌకర్యంగా మరచిపోయారు.
2016, ఫిబ్రవరి 9న ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఒక సాంస్కృతిక కార్యక్రమం జరిగింది. అందులో పాల్గొనే నిమిత్తం కాశ్మీర్ నుండి వేర్పాటు వాదులను ఆహ్వానించారు. వారు ఒక ఊరేగింపు తీశారు.‘అఫ్జల్ గురు అమర్ హై-్భరత దేశాన్ని ముక్కలు చేయండి. కాశ్మీర్ భారత్‌లో అంతర్భాగం కాదు, యాకూబ్ మెమెన్ అమర్ హై, యాసిన్ మాలిక్ అమరడు, మక్బుల్ భట్ అమరుడు’ ఇలా నినాదాలు ఇచ్చిన విద్యార్థి సంఘాల్లో ఆలిండియా స్టూడెంట్స్ ఫెడరేషన్, స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వంటి సంస్థలు ఉన్నాయి. ఈ దుర్మార్గంపై దేశవ్యాప్తంగా చర్చ జరిగితే అందులో షబ్‌నం లోని, షబనా ఆజ్మీ వంటి వారు పాల్గొన్నారు. ఇదంతా భావప్రకటనా స్వేచ్ఛ. ఈ దేశద్రోహానికి మద్దతు పలికారు. అంతేకాదు రాహుల్ గాంధీ, సీతారామ్ ఏచూరి, ఎ. రాజా వంటి రాజకీయ నాయకులు ఢిల్లీలోని విశ్వవిద్యాలయంలోకి వెళ్లి విద్యార్థులకు మద్దతు తెలిపి వచ్చారు. రాహుల్ గాం ధీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు. కాంగ్రెస్ పార్టీ దేశద్రోహాన్ని సమర్థించడమేంటి?
యాకుబ్ మెమెన్ ముంబయి పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు. హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో ఆయన వర్థంతి మహోత్సవాన్ని జరిపారు. భారత పార్లమెంటు మీద దాడి చేసినవాడు అఫ్జల్ గురు. అతని వర్థంతి మహోత్సవాన్ని జెఎన్‌టియు న్యూఢిల్లీలో జరిపారు. దీని వీడియో బయటకు వచ్చింది. ఆ వీడియోలో ఉన్నది మేము కాదు,దేశద్రోహులు అని బుకాయించడానికి విద్యార్థి నాయకు లు ప్రయత్నిస్తున్నారు. అందులో స్పష్టంగా కన్హయ్య కుమార్ ముఖం కనిపించింది. ఇతడు ఎఐఎస్‌ఎఫ్ విద్యార్థి సంఘం అధ్యక్షుడు. అతడిని ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. కాశ్మీరు వేర్పాటు వాద నాయకుడు జిలానీని అరెస్ట్ చేశారు.
దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాల్లో ఇలాంటి సంఘటనలు కోకొల్లలుగా జరుగుతూనే ఉన్నాయి. ‘స్వామి వివేకానంద దొంగ మేధావి’ అని హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయ విద్యార్థి ఒకరు, ఫేస్‌బుక్‌లో వ్యాఖ్యానించాడు. 2011లో చత్తీస్‌గఢ్‌లో 74 మంది సిఆర్‌పిఎఫ్ జవాన్లను ఉగ్రవాదులు కాల్చి చంపితే ఈ ఉగ్రవాద చర్య వీరోచితమైనదిగా ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో ఉత్సవం జరుపుకున్నారు. అప్పుడు ధృతరాష్ట్రుడైన మన్మోహన్ సింగ్, తన అధికారం కాపాడుకోవడానికి ఇటువంటివి పట్టించుకోలేదు. 2016 ఫిబ్రవరిలో కేంద్రంలోనరేంద్ర మోదీ ప్రభుత్వం అధికారంలో ఉండటం వల్ల ఈ అఫ్జల్ గురు సమర్ధకుల వీడియో బయటకు వచ్చింది.
షబనాఆజ్మీ, అరుంధతీ రాయ్‌లు విదేశీ ఏజెంట్లు అని చెప్పుకోవడం చర్విత చరణమే అవుతుంది. ఇండియా హిందువులది అని అశోక్ సింఘాలో, ప్రవీణ్ తొగాడియా, సాక్షీ మహరాజ్ వంటివారు ప్రకటిస్తే వారికి వ్యతిరేకంగా షబనా ఆజ్మీ ఉద్యమం నడిపి ఇండియా హిందువులది కాదని ప్రకటించింది. మరి ఇండియా ఎవరిది? చైనాదా? పాకిస్తాన్‌దా? ఇండియా హిందువుల ఆస్తి కాదా? మొఘలుల వారసులకు, ఈస్టిండియా కంపెనీ వారసులకు చెందుతుందా?
స్వదేశంలోనే కాశ్మీరీ పండిట్లు కట్టుబట్టలతో శరణార్థులై ఢిల్లీకి కాందిశీకులై పారిపోయి వచ్చారు. రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్, షబ్నం లోనీ (కాశ్మీరీ న్యాయవాదిని), షబనా ఆజ్మీ ఈ కాశ్మీరు గురించి చీటికీ మాటికీ ఎందుకు మాట్లాడటం? అంటే కాశ్మీర్‌కేనా పౌరహక్కులు, మానవహక్కులు? రేపు ఈ హక్కులన్నీ ఉగ్రవాదులకు, వారికి మద్దతిచ్చే కళాకారులకు, రచయితలకు మాత్రమే ఉంటాయా? రాహుల్ గాంధీ ఒక సువర్ణావకాశాన్ని కోల్పోయాడు. జెఎన్‌యులోని ఉగ్రవాదులకు వ్యతిరేకంగా పోరాడి ఉంటే కాంగ్రెస్ పార్టీ పునరుజ్జీవనానికి తోడ్పడేవాడు. ఈ చర్యవల్ల దేశ ప్రజల మద్దతును కాంగ్రెస్ పూర్తిగా కోల్పోయింది. ఇందిరాగాంధీ మరణం తర్వాత రాజీవ్ గాంధీకి 400 సీట్లు వచ్చాయి. ఇప్పుడు 40 సీట్లకు పడిపోయాయి. రాహుల్ గాంధీ తప్పిదం వల్ల ఇక నాలుగు సీట్లు కూడా రాని పరిస్థితి ఏర్పడింది.
త్యాగధనులైన కమ్యూనిస్టు నాయకుల పరంపరను 1940 దశకాల్లోనే నేను చూశాను. ‘్భరతదేశాన్ని ముక్కలు చేయండి’ అన్నవారికి సీతారాం ఏచూరి, రాజాలు మద్దతివ్వడం ఏం రాజకీయం? భారత దేశం ఇప్పటికే రెండు ముక్కలైంది. అటానమి, ఫెడరలిజం పేరుతో వివిధ రాష్ట్రాలు స్వయం ప్రతిపత్తిని కోరుకుంటున్నాయి. 1980లో స్వతంత్ర ద్రవిడ దేశం, స్వతంత్ర పంజామీ దేశం (ఖలీస్థాన్) ఉద్యమాలు ఊపందుకున్నాయి. ‘మాకు ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలి. లేకపోతే ప్రత్యేక దేశం కోరుకుంటాం’ అన్న నినాదం 2014లో హైదరాబాద్‌లో వినిపించింది. ఇది దేశభక్తులు ఇచ్చే నినాదమేనా?
మనం అంబేద్కర్‌ను గౌరవిస్తున్నామంటే, ఆయన అధ్యక్షతన ఏర్పడిన భార త రాజ్యాంగాన్ని గౌరవించడమే. మాకు భారత రాజ్యాంగంతో పనిలేదు, అని బహిరంగంగానే ఉగ్రవాదులు ప్రకటిస్తున్నారు. పాక్,చైనాలు భారత్‌పై యుద్ధం ప్రకటిస్తే ఈ వర్గీయులంతా అంతర్గత విప్లవాన్ని తీసుకువస్తారు. ఇదీ నేటి భారత పరిస్థితి. దీనికోసమేనా భగత్‌సింగ్, సుబేదార్ రాజ్‌గురు, నేతాజీ, అల్లూరి ప్రాణత్యాగాలు చేసింది?
సియాచిన్ భూమికి 20వేల అడుగుల ఎత్తులో ఉన్న మంచు ప్రాంతం. అక్కడ మైనస్ 50 డిగ్రీల టెంపరేచర్ ఉంటుంది. ఈ సియాచిన్‌లో ఫిబ్రవరి 9న మంచు చరియలు విరిగిపడి పదిమంది వీర జనవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరణించిన వీర జవానుల మృతదేహాలను ఫిబ్రవరి 15న న్యూఢిల్లీకి చేర్చారు. సరిగ్గా ఆసమయంలోనే కన్హయ్య కుమార్ అన్న ఉగ్రవాద విద్యార్థి నాయకునికి అనుకూలంగా, సీతారామ్ ఏచూరి, రాజా, రాహుల్‌లు ఢిల్లీలో అల్లరి చేస్తున్నారు. దీనే్నమనుకోవాలి? వీరు దేశభక్తులు కాకపోయినా, కనీసం మానవత్వం కలిగినవారేనా? ఆలోచించండి.
కన్హయ్య కుమార్ యువకుడు-ఉద్రేకంలో నినాదాలు చేసినంత మాత్రాన అతనిపై దేశద్రోహం కేసు మోపాలా అని టివి ఛానల్స్‌లో మహానుభావులు ప్రశ్నించారు. అయితే జెఎన్‌యులో సంఘటన జరగడానికి దాదాపు 15 రోజులు ముందుగా కాశ్మీ రు ఉగ్రవాదులు, ఢిల్లీ వచ్చి కన్హయ కుమార్‌ను కలిసి జెఎన్‌యులో భారత వ్యతిరేక కార్యక్రమాన్ని ఏవిధంగా నిర్వహించాలనేది రూపకల్పన చేశారు. ఫిబ్రవరి 9న కాశ్మీరునుంచి వచ్చిన కొందరు ఉగ్రవాదులు, మావోయిస్టులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. 2016, ఫిబ్రవరి 16వ తేదీన కలకత్తాలోని యాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో ఇదే మావోయస్టు విద్యార్థులు అల్లర్లు చేశారు. 2016, ఫిబ్రవరి 17వ తేదిన హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీలో భారత ప్రధాని దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. 2016 జనవరిలో హైదరాబాద్ కేంద్రీయ విద్యాలయంలో యాకుబ్ మెమెన్‌కు మద్దతు ఉత్సవం జరిపారు. ఈ సంఘటనలన్నింటి వెనుక సారాంశం ఒక్కటే, భారత్‌ను విచ్ఛిన్నం చేసి ఇక్కడ చైనా సామ్రాజ్యాన్ని నెలకొల్పడం. కాశ్మీరును స్వతంత్ర దేశంగా ప్రకటించటం.
భారత రాజ్యాంగం 124వ అధికరణంలో దేశద్రోహానికి ఈ విధంగా నిర్వచనం ఇవ్వబడింది. ‘‘్భరత జాతి సమైక్యతకు భంగం కలిగించేవిధంగా మాట్లాడినా, రాసినా, ప్రదర్శనలు చేసినా దాన్ని దేశద్రోహం అంటారు.’’ జెఎన్‌యులో ఈ మూడూ జరిగాయి. భారతదేశాన్ని ముక్క లు చేయండి, కాశ్మీర్ భారతదేశంలో భా గం కాదు. ఇంటింటా ఒక అఫ్జల్‌గురు, ఒక యాకుబ్ మెమెన్‌లు పుడతారంటూ నినాదాలు చేస్తే వారికి వాక్‌స్వాతంత్య్రం, భావస్వాతంత్య్రం ఉన్నది కదా అని ఈ నితీశ్ కుమార్, రాహుల్ గాంధీ, కేజ్రీవాలాలు సమర్థిస్తున్నారు. ఒకొక్కకరు యాభై లక్షల రూపాయల ఫీజు తీసుకొనే ప్రశాంత భూషణ్ వంటి సుప్రీంకోర్టు లాయర్లు కన్హయ కుమార్‌కు బెయిల్ ఇప్పించడం కో సం వాదించడం భారతదేశంలోనే సాధ్యం.
తమిళనాడులో కుడంకుళంలో అణువిద్యుత్ ప్రాజెక్టును నిర్మిస్తుంటే మావోయిస్టులు అడ్డుకున్నారు. సర్దార్ సరోవర్ ప్రాజెక్టు నిర్మిస్తుంటే నర్మదా బచావో ఆందోళన్ పేరుతో మేథాపాట్కర్‌ను అడ్డం పెట్టుకొని అడ్డుకున్నారు. భాను జ్యోత్స్న, లాహిరి, ఉమర్ ఖలీద్‌లు న్యూఢిల్లీ అంబేద్కర్ విశ్వవిద్యాలయానికి చెందిన రీసెర్చి స్కాలర్లు. వీరంతా డిఎస్‌యు అనే మావోయిస్టు విద్యార్థి సంస్థ సభ్యులు. లాహిరి, శిఖండి పాత్ర పోషించింది. వీరు జెఎన్‌యులోకి ప్రవేశించి ఇక్కడి విద్యార్థులను రెచ్చగొట్టారు. ఇదే భావజాలం గల వ్యక్తులు హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో, మాల్దాలో, యాదవపూర్ యూనివర్సిటీలో విద్యార్థులను రెచ్చగొట్టారు. ఉస్మానియా యూనివర్సిటీలో కేంద్ర ప్రభుత్వం దిష్టి బొమ్మను తగులబెట్టించారు. ‘వందేమాతరం’, ‘్భరత మాతాకీ జై’ అంటే అవి బూతు పదాలుగా చిత్రించారు. భారతదేశాన్ని పరిపాలిస్తున్నది ఎవరు? నరేంద్ర మోదీనా? నవాజ్ షరీఫ్‌నా?
ఫిబ్రవరి 18న, జిలానీ ఇట్లా అన్నాడు. ‘్భరత దేశాన్ని ముక్కలు చేయండి’ అంటూ నేను 2014లో కూడా సెమినార్ నిర్వహించాను. అప్పుడు నన్ను ఎవరూ కూడా తప్పుపట్టలేదు. అప్పుడు లేని తప్పు ఇప్పుడెలా వచ్చింది? బెంగాల్‌లోని మాల్దాలో యాదవపూర్ విశ్వవిద్యాలయంలో ఐసిస్ ఉగ్రవాదులకు సిపిఎం కార్యకర్తలు మద్దతివ్వడమేంటి? ‘మణిపూర్ స్వతంత్ర రాజ్యంగా మారే వరకు పోరాటం సాగిస్తాం’..ఈ నినాదాన్ని ఇచ్చిన విద్యార్థులను రాహుల్ గాంధీ, ఏచూరి సీతారాం ఎలా సమర్ధిస్తారో పత్రికాముఖంగా సమాధానం చెప్పాలి.
ఒక ఇంగ్లీషు టీవీ ఛానల్‌లో యాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలోని ఫిబ్రవరి 18న ఒక విద్యార్థిని వేధించడం దేశ ప్రజలంతా చూశారు. 1905లో బెంగాల్‌లో వందేమాతరం అనే నినాదంతో- బెంగాల్ విభజన చేసినప్పుడూ ఉద్యమం వచ్చింది. 2016లో ఈ వందేమాతరం అనే నినాదం నలబై ఏళ్ల కమ్యూనిస్టు పాలనలో బెంగాల్‌లో బూతు మాటగా, ఫాసిజంగా మారిపోయింది. జెఎన్‌యు ఉదంతంపై తొమ్మిది వీడియోలు మనకు లభిస్తున్నాయ. అన్నింటినీ నకిలీ (డాక్టర్డ్) అని కొట్టివేయడం సాధ్యమా?