సంపాదకీయం

నిలబడిన సంప్రదాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనదేశంతో తమ దేశపు మైత్రీ బంధం పునఃపటిష్టమైనట్టు నేపాల్ ప్రధానమంత్రి ఖడ్గప్రసాద్ శర్మ ఓలీ ప్రకటించడం ఉభయ దేశాల ప్రజలకు హర్షం కలిగిస్తున్న పరిణామం. గత అక్టోబర్ 11వ తేదీన ఖడ్గ ప్రసాద్ శర్మ ప్రధానమంత్రిగా ఎన్నికయ్యే నాటికి నేపాల్‌తో మన స్నేహసంబంధాలు కొడిగట్టిపోయాయి. నేపాల్ కొత్త రాజ్యాంగ వ్యవస్థను వ్యతిరేకించిన తరై తదితర ప్రాంతాలకు చెందిన మాధేశీ జనసముదాయాలు నిర్వహించిన నిరసన రక్తసిక్తం కావడం ఇలా కొడిగట్టడానికి నేపథ్యం. గత నవంబర్‌లో ఖడ్గప్రసాద్ మనదేశంపై నిప్పులు చెరగడం ద్వైపాక్షిక మైత్రిని మరింతగా భంగ పరచిన విపరిణామం. ఈ నేపథ్యంలో మనదేశంలో ఆరురోజుల పాటు పర్యటించి వెళ్లిన శర్మ ఫిబ్రవరి 27వ తేదీన మన ప్రభుత్వాన్ని ప్రశంసించడం విప్లవాత్మక పరివర్తనకు నిదర్శనం. ఖడ్గప్రసాద్ మనదేశంలో పర్యటిస్తుండిన సమయంలోనే నేపాల్ ప్రభుత్వం ఇంధనం వినియోగంపై పరిమితులను తొలగించింది. ఆగస్టులో కొత్త రాజ్యాంగం అమలులోకి వచ్చిన వెంటనే మాధేశీలు తమ ఆందోళనను ఉధృతం చేయడంలో మనదేశం నుంచి సరకు రవాణా ఆగిపోయింది. నేపాల్‌లో పెట్రోల్ తదితర ఇంధన పదార్థాల సరఫరాకు తీవ్రమైన కొరత ఏర్పడింది. ఫలితంగా వంటగ్యాస్ పెట్రోలు, డీజెల్, కిరోసిన్ వింటి ఇంథనాల వాడుకపై నేపాల్ ప్రభుత్వం పరిమితులను అమలు జరిపింది. ఐదు నెలలపాటు కొనసాగిన ఈ పరిమితులు తొలగిపోవడం ఓలీ భారత పర్యటన సందర్భంగా సంభవించిన సమాంతర పరిణామం. తమ అవసరాల మేరకు వంటగ్యాస్ లభించడం నేపాలీ గృహిణులకు ఆనందం కలిగిస్తున్న మహా విషయం. ఖడ్గప్రసాద్ మనదేశంలో పర్యటించిన సందర్భంగా తొమ్మిది ద్వైపాక్షిక అంగీకారాలు కుదిరాయి. నేపాల్ భూకంపం బాధితుల సహాయార్థం గత ఏడాది మన ప్రభుత్వ దాదాపు పదిహేడు వేలకోట్ల రూపాయల విలువైన నిధిని ఏర్పాటు చేసింది. అయితే భూకంపం ప్రకంపనాలు చల్లారకముందే మొదలైన రాజ్యాంగ వ్యతిరేక ప్రకంపనాలు నేపాల్ జనజీవనాన్ని మరింత కల్లోల గ్రస్తం చేశాయి. మాధేశీల రాజ్యాంగ వ్యతిరేక ఉద్యమం తాత్కాలికంగా ఆగిపోయినందున ఇప్పుడు ఈ నిధిని వినియోగించడానికి వీలైన ఒప్పందం కూడ ఉభయదేశాల మధ్య కుదిరింది. ఇలా ఒప్పందాలు కుదరడం ప్రధానమైన విషయం కాదు. నేపాల్ ప్రధాని మన దేశంలో పర్యటించి వెళ్లడమే మైత్రికి మారాకు వంటి పరిణామం. ప్రధానమంత్రి పదవీ బాధ్యతలను స్వీకరించిన తరువాత ఓలీ మొదటిసారి జరిపిన విదేశీయ పర్యటన ఇది. ప్రధానమంత్రి మొదట మనదేశానికి వచ్చి వెళ్లిన తరువాత మాత్రమే ఇతర దేశాలలో పర్యటించడం దశాబ్దులుగా నేపాల్ ప్రభుత్వం పాటిస్తున్న సంప్రదాయం!
ఈ సంప్రదాయం ఇదివరకే ఒకసారి భంగపడింది. ఓలీ మరోసారి ఈ సంప్రదాయానికి విఘాతం కలిగించగలడన్న ప్రచారం కూడ జరిగింది. 2008లో నేపాల్ ప్రధానిగా ఎన్నికైన పుష్పకమల్ దహల్ ప్రచండ మనదేశంలో పర్యటించకపూర్వమే చైనాకు వెళ్లి వచ్చాడు. చైనా కమ్యూనిస్టు పార్టీ పట్ల తనకుగల సైద్ధాంతిక మమకారాన్ని చాటుకున్నాడు. ఇలా మొదటిసారి చైనాలో పర్యటించడం ద్వారా పుష్పకమల్ దహల్ ప్రచండ మన దేశాన్ని వెక్కిరించాడు. చైనా ప్రభుత్వం వారి వ్యూహం ప్రకారమే మావోయిస్టులు 1996లో నేపాల్ కమ్యూనిస్టు పార్టీని చీల్చారు. ఈ చీలిక వర్గం వారు ఏకీకృత మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీగా ప్రస్తుతం చెలామణి అవుతున్నారు. ప్రచండ ఈ మావోయిస్టు పార్టీ మహానేత! మావోయిస్టులు ప్రచండ నాయకత్వంలో ఏళ్లతరబడి సాయుధ బీభత్సం సృష్టించారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియను నిరోధించారు. చీలిన తరువాత మిగిలిన కమ్యూనిస్టులు ప్రస్తుతం ఏకీకృత మార్క్సిస్టు లెనినిస్టు కమ్యూనిస్టు పార్టీగా కొనసాగుతున్నారు. ఖడ్గప్రసాద్ ఓలీ ఈ మార్క్సిస్టు లెనినిస్టు పార్టీకి చెందినవాడు. సాయుధ బీభత్సం కొనసాగించిన సమయంలో ప్రచండ నాయకత్వంలోని మావోయిస్టులు మనదేశానికి వ్యతిరేకంగా నిరంతరం విద్వేషపు విషం కక్కారు. 1950 నాటి భారత్-నేపాల్ ఒప్పందాన్ని రద్దు చేయాలని పదేపదే కోరారు. 1950 నాటి మైత్రీ అంగీకారం యుగయుగాలుగా మనదేశంతో నేపాల్‌కు గల సాంస్కృతిక ఏకాత్మకతకు, భౌగోళిక ఏకరూపతకు ధ్రువీకరణ మాత్రమే. అందువల్లనే ఈ ఒప్పందాన్ని రద్దు చేయించడం ద్వారా నేపాల్‌ను మనదేశం నుండి దూరం చేసి తమ ప్రాబల్య మండలంలో కలుపుకోవాలన్నది చైనా వ్యూహం. నేపాల్ మావోయిస్టు పార్టీ చైనా కమ్యూనిస్టు పార్టీ వారి ఈ వ్యూహానికి ప్రతిరూపం..
సాయుధ బీభత్సకాండకు పదమూడు వేల మందిని బలి చేసిన మావోయస్టులు 2004 నుంచి వ్యూహం మార్చారు. ప్రజాస్వామ్యం పట్ల నిబద్ధతను ప్రకటించారు. ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు కావడానికి 2005లో అంగీకరించారు. సాయుధ విప్లవం ద్వారా సాధించలేని లక్ష్యాన్ని ప్రజాస్వామ్య ప్రక్రియ ముసుగులో సాధించాలన్నది ప్రచండ నాయకత్వంలని మావోయిస్టుల వ్యూహం. నేపాల్‌ను భారత్ నుండి దూరంగా జరపడం, చైనా ఒడిలో చేర్చడం ఈ లక్ష్యం. అందువల్లనే 2008లో ప్రధానమంత్రి పదవిని చేపట్టిన తరువాత ప్రచండ 1950 నాటి భారత-నేపాల్ ఒప్పందాన్ని రద్దు చేయడానికి యత్నించాడు. విఫలమయ్యాడు. పశుపతినాథ మందిరంలోని దక్షిణ భారతీయ అర్చకులను తొలగించడానికి ప్రచండ ప్రభుత్వం చేసిన యత్నం కూడ బెడిసికొట్టింది. నేపాల్ సైనిక దళాల ప్రధాన అధికారి రుక్మాంగద కాటావల్‌ను తొలగించి, చైనా అనుకూలుడైన మరో ప్రధాన అధికారిని నియమించడానికి ప్రచండ చేసిన కుట్ర ఫలించలేదు...రుక్మాంగదను నేపాల్ అధ్యక్షుడు రామ్ భరణ్ యాదవ్ మళ్లీ సైనిక దళాల అధికారిగా నియమించాడు. ఇలాంటి భారత దేశ వ్యతిరేక చర్యలలో భాగంగానే ప్రచండ 2008లో మనదేశంలో పర్యటించక పూర్వమే చైనాకు వెళ్లివచ్చాడు...ప్రచండ తరువాత నేపాల్ ప్రధాన మంత్రి పదవిని నిర్వహించిన మాధవ్ కుమార్ నేపాల్, బాబూరామ్ భట్టారాయ్, ఝలానాథ్ కనల్, సుశీల్ కుమార్ కోయిరాలా వంటి వారు మళ్లీ సంప్రదాయాన్ని పునరుద్ధరించారు. పదవిని స్వీకరించిన తరువాత మనదేశంలోనే పర్యిటించి వెళ్లారు!
కానీ మాధేశీల ఉద్యమానికి మన ప్రభుత్వం మద్దతునిస్తోందన్న సాకుతో ఓలీ ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలపాటు చైనా వైపు మొగ్గు చూపింది. మనదేశాన్ని బెదిరించడానికై చైనాలో ఇంధనం సరఫరాలకోసం ఒప్పందాన్ని కుదుర్చుకొంది. చైనాలో వారంరోజుల పాటు పర్యటించి వచ్చిన నేపాల్ ఉపప్రధాని కమల్ థాపర్ ‘త్వరలో ఖడ్గప్రసాద్ చైనాలో పర్యటిస్తారు’ అని డిసెంబర్ 29న ఖాట్మండులో ప్రకటించారు. అందువల్ల ఖడ్గ ప్రసాద్ కూడ ‘మొదట భారత్‌లో పర్యటించే సంప్రదాయాన్ని’ ఉల్లంఘిస్తున్నట్టు ప్రచారమైంది. అయితే చివరికి నేపాల్ ప్రభుత్వ విధానంలో విజ్ఞత వికసించింది. మాధేశీల కోర్కెలలో చాలా వరకు అంగీకరించారు. ఖడ్గప్రసాద్ మొదట మనదేశంలోనే పర్యటించారు.