సబ్ ఫీచర్

ఉపాధి విస్తరణకు చిన్న పరిశ్రమలే మూలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశం సత్వరం అభివృద్ధి చెందాలనే కాంక్షతో విదేశీ కంపెనీలను విదేశీ వ్యాపార సంస్థలను విచ్చలవిడిగా ఆహ్వానించటం చాలా ప్రమాదకరం. ప్రభుత్వం ఇటువంటి విషయంలో చాలా జాగ్రత్తలు పాటించాలి. చాలామంది రాజకీయ నాయకులు తమ తమ విదేశీ పర్యటనల్లో భాగంగా పెట్టుబడులు పెట్టడానికి విదేశీ సంస్థలు కంపెనీలను ఆహ్వానిస్తున్నారు. వీరికి నీరు, భూమి, వసతి, సౌకర్యాలు అన్నీ ఇస్తాము అంటారు. అయితే ఎవరు ఏ దేశంనుండి ఎటువంటి పరిశ్రమని స్థాపించటానికి వచ్చినా అయ్యా వ్యాపారాల ద్వారా వచ్చే లాభాలు సంపదని వారి వారి దేశాలకి తరలించుకుపోయే పనిలోనే ఉంటారన్న సంగతి మనం నిరంతరం గుర్తుంచుకోవాలి.
దేశంలో వనరులు పుష్కలంగా ఉన్నట్లు అనిపించినప్పటికీ అవి ప్రజలందరికీ చెందిన సంపద అని ప్రభుత్వం మర్చిపోరాదు. అంతేకాదు వాటిపై హక్కుదారులు ఈ దేశ ప్రజలే. అయితే ప్రభుత్వంలో ఉంటున్న నాయకులు తాము ఓ ఐదు సంవత్సరాల నిమిత్తం వచ్చిన ట్రస్టుబోర్డు సభ్యుల వంటి వారే కానీ స్వంత జాగీరుదారులుకాదన్న సంగతి గుర్తించాలి. అనేక వందలసార్లు విదేశీ దోపిడీలకు గురై సంపద పరంగా సహజ వనరుల పరంగా ఇంకా అనేక రకాలుగా దేశం దోపిడీకి గురై ప్రస్తుతం గత 60 సంవత్సరాలుగా స్వావలంబన దిశగా పయనిస్తుండటం శుభపరిణా మం. అయితే మన రాజకీయ నాయకుల్లో బాధ్యతా రాహిత్యం బాగా పెరిగిపోయింది.
దేశంలో పరిశ్రమలు ఎటువంటివి కావాలి. ఎటువంటి ఆధునీకరణ కావాలి అన్నది ఇంతవరకు ఇతమిత్థంగా ఏప్రభుత్వమూ తగిన కార్యాచరణ ప్రణాళిక తయారుచేసుకోలేదు. దేశీయంగా ఉంటున్న పరిశ్రమలు విదేశీ పరిశ్రమలవల్ల మూతపడే స్థితికి రాకూడదు. దేశీయంగా మన పరిశ్రమలకి ఇప్పటికేవేల లక్షల కోట్లు ఖర్చుపెట్టి వేలాది మంద లక్షలాది మందికి ఉపాధి కల్పించాం. అయితే వీరికి విదేశీ కంపెనీల ద్వారా వచ్చే వ్యాపారాల ద్వారా నష్టాలు వచ్చి మూతపడే ప్రమాదం ఉంది. ప్రస్తుతం మన దేశంలో చక్కెర కర్మాగారాలు ప్రభుత్వం పాటిస్తున్న దుర్నీతివల్ల చాలా శాతం సంక్షోభంలో ఉన్నాయి. దేశం లో చెరకు పండించే రైతులకు ఈ పరిశ్రమలు చేయూతనిస్తాయి. ఈ పరిశ్రమలవల్ల వ్యవసాయదారులకు జీవనోపాధి కూడా కల్గుతుంది. చక్కెర ఉత్పత్తి తగ్గిందని కొంతకాలం విదేశాలనుండి దిగుమతి చేయటం మొదలెట్టిన ప్రభుత్వం విదేశాలనుండి అవసరం తీరగానే చక్కెర దిగుమతిపై నియంత్రణ విధించటం మర్చిపోయంది. తద్వారా దేశీయంగా ఈ రంగంలో పరిశ్రమలు చాలా శాతం మూతపడి చుట్టుప్రక్కల ఉంటున్న చెరకు వ్యయసాయాన్ని భ్రష్టుపట్టించాయి. ఇది సరాసరి రైతులను వారి వ్యవసాయ సంబంధ వృత్తి వ్యాపకాన్ని నిలువునా ముంచాయనటానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుంది. అదే విధంగా ప్రత్తిసాగు, పొగాకు వంటి వాణిజ్య పంటలే కాదు ఆహార పంటలు సైతం దేశవాళీ వ్యవసాయ వ్యవస్థల నిర్వీర్యం అయిపోయి ఉన్న ఉపాధి అవకాశాలు అడుగంటిపోయే ప్రమాదాలు ఉంటున్న వైనాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం వుంది.
విదేశాంగ విధానంలో శతృ దేశాలు మితృ దేశాలు ఉంటాయి. అయితే శతృ దేశాలు మన దేశ ఆర్థిక మూలాలని విధ్వంసం చేయాలనేది నూతన యుద్ధతంత్రంలో ప్రధా న పరోక్ష యుద్ధం. చైనా దేశం మన దేశాన్ని ఆర్థికంగా బాగా కుంగదీస్తోంది. ఈ నేపథ్యంలో చైనీయుల ఉత్పత్తులపై కూలంకష దర్యాప్తుచేసి వినాశకరమైన వస్తువులని నిషేధించాలి. మన దేశంలో ఇటువంటి వ్యవస్థల్ని మనం ఇప్పటివరకూ ఏర్పాటుచేసుకోనే లేదు. అదే విధంగా బ్రెజిల్ దేశం మన ఒంగోలు జాతి ఎద్దుల వీర్యాన్ని అక్రమంగా తమ దేశానికి తరలించుకునిపోయి లక్షల సంఖ్యల్లో వాటిని ఉత్పత్తిచేసి, పేటెంట్లు సైతం కాజేసిన దుర్మార్గపు వైఖరిని మనం నిరోధంచలేకపోయాం. ఇవన్నీ మన ప్రభుత్వ విధానాలు సక్రమమైన దిశలో పనిచేయడం లేదనటానికి నిదర్శనం. మన దేశంలో ఎటువంటి వస్తువునైనా అనాయాసంగా సునాయాసంగా అమ్ముకోవచ్చనే ప్రచారం ప్రపంచవ్యాప్తంగా బాగాప్రచారం అయింది. అందుకనే అనేక విదేశీ బ్రాండ్ల వస్తువులు అక్రమంగా అమ్మేస్తున్నారు. విదేశాల్లో ఇటువంటి దుర్మార్గపు వ్యాపారాలు అనుమతించరు.
మన దేశంలో టూత్‌పేస్టు దగ్గర్నుంచి ప్రాణాంతకమైన వ్యాధికి సంబంధించిన మందుల వరకూ ఒకటే నీతిని విదేశీ పెట్టుబడిదారులు అవలంబిస్తారు. అది వారి నైజం. అయితే వారికి ఎటువంటి రంగాల్లో అవకా శం ఇవ్వాలన్న విషయంలో స్పష్టమైన విధానాన్ని పాటించి దేశీయ పరిశ్రమలు, కర్మాగారాలు మూతపడకుండా రక్షించుకోవాలి. దేశంలో సంపద సృష్టించటం మంచి పరిణామం అయినప్పటికీ దాన్ని మన దేశ కోసం ఎంతవరకూ ఉపయోగిస్తారు అన్నది ప్రశ్న. యువతకి ఉపాధి అవసరం అని ఇల్లువాకిళ్లు అమ్ముకోవాల్సిన అగత్యం పట్టరాదు. దేశవ్యాప్తంగా అభివృద్ధి అంటే పెద్ద పెద్ద పరిశ్రమలు వందలాది ఎకరాల భూములు లక్షల మందికి దాహార్తి తీర్చే నదీనదాలు వాగులు వంకలు ఇవన్నీ విదేశీయులకి ధారాదత్తం చేయటం కాదు.
చైనీయులు ఒక ప్రక్క కాశ్మీరాన్ని ఆక్రమిస్తున్నారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో మనం చైనా వస్తువులు కొనుగోలు చేస్తూ సుమారు రెండు లక్షల కోట్ల వ్యాపారాన్ని అందించటంవల్ల మనకి అపరిమిత అపకారం చేయటానికి మరింత ప్రోత్సాహం ఇచ్చిన తెలివితక్కువతనం తెలుస్తోంది. అంతేకాకుండా ఎంతో ఖరీదైన విలువైన ఎర్రచందనం స్మగ్లింగ్, పులి చర్మాలు గోళ్ళు వంటి అటవీ జీవ వస్తుసామగ్రిని అక్రమంగా తరలించుకుపోవటం వంటి విషయాలు మనం నిరంతరం గుర్తుంచుకోవాలి.
దేశంలో సంపద సృష్టించటానికి దేశీయంగా నాణ్యమైన సరకులు ఉత్పత్తిచేయటానికి, అటు పర్యావరణ పరిరక్షణతోబాటు అభివృద్ధికి వేగవంతమైన బాటలు వేయాలి. వేసే అడుగులు తడబడకుండా దేశ హితాన్ని అటు ప్రపంచ పర్యావరణ హితాన్ని దృష్టిలో ఉంచుకోవాలి. కేవలం భౌతిక వాదాన్ని కాకుండా పారమార్ధికతని కూడా చూడాలి. జీవావరణం, పర్యావరణానికి హానికారక కార్యకలాపాలు అందరం ముక్తకంఠంతో ఖండించాలి. దేశ ఆర్థిక వ్యవస్థని గాడిలో పెట్టటానికి దేశీయంగా అన్ని రకాల అవసరాలు తీర్చటానికి ముఖ్యంగా చిన్న చిన్న పరిశ్రమలు బా అభివృద్ధిచేయాలి. రీసైక్లింగ్ చేయటానికి అనువైన వస్తువులు తయారుచేయాలి. పిల్లల ఆటు వ్తువులు రీసైక్లింగ్ చేసే విధంగా ఏర్పాటుచేయాలి. దేశవ్యాప్తంగా అభివృద్ధి అంటే కేవలం పారిశ్రామికంగానే కాదన్న సంగతి అందరం అర్థం చేసుకోవాలి. చిన్న చిన్న వస్తువులు వివిధ ప్రాంతాల్లో తయారుచేసి ఒక చోట సమకూర్చే విధానంవల్ల ఉపాధి ఎక్కువ విస్తరిస్తుంది. అంతేకాకుండా పరిశ్రమలు లఘు పరిశ్రమలుగా ఉండటంవల్ల భూమి దుర్వినియోగంనుండి కాపాడవచ్చు. ఇవన్నీ అందరూ చర్చించాలి. అప్పుడే నిర్ణయాలు తీసుకోవాలి. ఇది అందరి బాధ్యత. కేంద్రం, రాష్ట్రం ఇటు వంటి వాటిపై పూర్తి అధ్యయనం చేయాలి.

- ఎన్.నాగగాయత్రి