సబ్ ఫీచర్

వనరుల వాడకంలో పొదుపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచ వ్యాప్తంగా భూవిస్తీర్ణం ఏనాటికి పెరగబోదు. అంతేకాదు దేశంలో నా నాటికీ తగ్గిపోతున్న సహజ, ఖనిజ వనరుల్ని, ఇంధనానికి నెలవైన ఖనిజాన్ని, గనుల్ని త్రవ్వుకుపోతుంటే అవి తరిగిపోయి భవిష్యత్ తరాలకు మిగలకుండాపోయే ప్ర మాదం పొంచి ఉంది. అందుకే 2015 సంవత్సరంలో ప్రజాప్రయోజనాల్ని పరిరక్షించాలనే లక్ష్యంతో గనులు, ఖనిజాల చట్టసవరణ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం అమలులోకి తెచ్చింది. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం జిల్లా ఖనిజ ఫౌండేషన్ల ఏర్పాటుకు శ్రీకారంచుట్టి ఉత్తర్వులు జారీచేసింది. సహజ వనరులను ఆదాయార్జన దృష్టితో కాకుండా ప్రకృతి సమతౌల్య సాధనాలుగా పరిగణిస్తుంటారు. ప్రజాప్రయోజనాల పరిరక్షణ ఎంత ముఖ్యమో, ఖనిజ వనరుల సంరక్షణ అంతే ముఖ్యం. అందుకే కేంద్ర ప్రభుత్వం సైతం అడవులను, ఖనిజ వనరుల పరిరక్షణను దృష్టిలో ఉంచుకొని చట్టాలు తేవడంతోపాటు వాటి అమలుకు పలు చర్యలు చేపట్టింది.
నదీ గర్భాలలోనే కాకుండా వాగుల్లో, వం కల్లో, చెరువుల్లో జల పరివాహక ప్రాంతాలన్నింటిలోను ఇసుక మేటలను తరలిస్తూ ప్రభుత్వాల కళ్ళుగప్పి అక్రమార్కులు యధేచ్ఛగా ఏమాత్రమూ ప్రభుత్వ అనుమతులు లేకుండా కోటానుకోట్ల రూపాయలకు పడగలెత్తుతున్నారు. సంబంధిత అధికారులు ఎవరైనా ప్రశ్నిస్తే అంతోఇంతో ముట్టజెప్పి వారి నోరును మూయిస్తున్నారు. ఇసుక రవాణా ఇలా స్వేచ్ఛగా సాగుతుండగా, భారీ విధ్వంసక పేలుడు పదార్థాలను వినియోగించి, కొండల్ని సైతం పిండిచేస్తున్న ఘటనలపై ఇటీవల జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆగ్రహం వ్యక్తంచేయడం సమస్య తీవ్రతకు అద్దంపడుతోంది. పచ్చని చెట్లతో వన్యప్రాణులతో నిండి ఉండాల్సిన గుట్టలు, కొండలు కరిగిపోతూ, పర్యావరణ సమతుల్యాన్ని దెబ్బతీసి ప్రకృతిపరమైన విపత్తులకు దారితీసే విధంగా పరిస్థితులు హెచ్చురీతిలో పరిణమిస్తున్నాయని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు.
భారతదేశ భూ అంతర్భాగంలో రత్నాలు, బంగారం , సహజవాయువు , మరెన్నో ఖనిజ సంపదలు లభ్యమవుతున్నాయి. ఇలాంటి సహజ వనరుల్ని వెలికితీసి వినియోగించుకొంటూ వెళితే భావితరాలకు మనం ఇచ్చే ఖనిజ సంపద శూన్యంగా మారుతుంది. ఖనిజ వనరులను ముఖ్యంగా బొగ్గు, ఇతర కర్బన సంబంధ ఖనిజ వనరులను కొత్తగా ఏర్పాటుచేసుకోవాలంటే లక్షల సంవత్సరాలు పడుతోంది. గ్రానైట్ సంబంధ అగ్నిశిలలు ఏర్పడాలంటే అగ్నిపర్వతాలు బద్దలై ఎగిసిపడిన లావా క్రమంగా చల్లారి ఘనీభవించిన తర్వాతకానీ అవి మానవాళికి అందుబాటులోకి రావు. అంతేకాదు పాలరాయి, సున్నపురాయికి కూడా ఇదే వ్యవస్థ అవసరమవుతుంది. భూగర్భంలో నిక్షిప్తమైన సహజ వనరులను ఆదాచేసి వాడుకోవాల్సిన పరిస్థితి దేశంలో కానీ, ఆయా రాష్ట్రాలలో కానీ ఉంది. భూనిక్షేపాలు ఉన్నాయకదా అని విచక్షణ లేకుండా వినియోగిస్తే చివరకు ఆ నిక్షేపాలు మొత్తం అడుగంటిపోయే ప్రమాదం దాపురిస్తుంది.
భారత ప్రభుత్వం 1988లోనే ఖనిజ వనరుల సంరక్షణ, అభివృద్ధి నిబంధనల్ని రూపొందించినా పలు రాష్ట్రప్రభుత్వాలు వాటిని ఖా తరు చేయలేదు. విచక్షణారహితంగా సహజ వనరులను వెలికితీయడంలో పోటీ పడు తున్నాయ. అంతేకా కాదు ఈ కార్యకలా పాల్లో సమన్వయం కూడా సాధించడం లేదు. ఆదాయార్జనే పరమావధిగా వ్యవహరిస్తుండడంవల్ల ఖనిజ వనరులు విచ్చలవిడిగా దోపిడీకి గురవుతున్నాయి. ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధి కార్యక్రమాలను ముందుకు తీసుకువెళ్ళాలంటే ఆదాయవనరులు తప్పనిసరి. ప్రభుత్వ విభాగాలలో ఆదాయార్జనే లక్ష్యంగా పనిచేసే విభాగాలున్నాయి. అబ్కారీ, రవాణా, వాణిజ్య పన్ను లు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, ఇత్యాది శాఖల శాఖలనుంచి సమకూరే ఆదాయం ప్రభుత్వ మొత్తం రాబడిలో సింహభాగం ఆక్రమిస్తు న్నది.
గనులు, భూగర్భ వనరులశాఖ ఆదాయార్జనకు ఉద్దేశించిన గనులు భూగర్భ వనరులను ఖనిజ వనరుల సంరక్షణ నిబంధనలకు వ్యతిరేకంగా సాక్షాత్తు రాష్ట్ర ప్రభుత్వాలే దోపిడీని ప్రోత్సహించాయ. ఫలితంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గడచిన ప్రభుత్వాల హయాంలో ఖనిజ వనరుల దోపిడి అడ్డు అదుపులేకుండా పో యింది. అందుకు ఉదాహరణగా గాలి జనార్ధనరెడ్డి గనుల కుంభకోణమే ప్రబల నిదర్శనం. ఖనిజాభివృద్ధి సంస్థలు సైతం ఆదాయార్జన మీదే తప్ప ఖనిజ వనరుల సంరక్షణపై దృష్టిసారించక పోవడం దురదృష్టకరం. రెండు తెలుగు రాష్ట్రాల ఖనిజాభివృద్ధి సంస్థలు అప్ప టి ప్రభుత్వాదేశాలకు తలొగ్గి ఇష్టానుసారం అనుమతుల్ని జారీచేయడం, ఆ ఖనిజాల పరిధి ఉమ్మడి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానివా? లేక కర్ణాటక సానువులలో కూడా సాగుతాయా? అనే విషయంలో కూడ స్పష్టత కొరవడి లేడికి లేచిందే పరుగుగా.. ఖనిజ నిధులను స్వార్థపరులకు అప్పగించాయ. మరి కేంద్ర ప్రభుత్వం ఇటుంవంటి అవినీతి కార్యకలాపాలను పట్టించుకోక పోవడంతో అవినీతి పరాకాష్ఠకు చేరింది.
ఖనిజ సంపదను అలా కొల్లగొడుతుంటే తెల్లబంగారమైన ఇసుక రీచ్‌లపై ప్రభుత్వం సక్రమ విధానాలు అనుసరించలేదు. ఇసుక రీచ్‌లను డ్వాక్రా సంఘాలకు కట్టబెడతామని ప్రకటించిన ఆంధ్ర ప్రభుత్వం అది విఫలంకావడంతో స్వీయ రక్షణలోపడి ఇసుక రీచ్‌లను ఎవరికి అప్పగించాలో, ఎవరు సక్రమంగా ని ర్వహిస్తారో తెలియని సందిగ్ధస్థితిలో పడింది.
భూ వనరులు అక్షయపాత్ర మాత్రంకాదు. తోడుకొని పోతుంటే భూనిక్షేపాలు మిగలవు. ఈ పరిస్థితిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తించాలి. భూమిలో నిక్షిప్తమైన ఇంధన వనరులు పరిమితమైనవని, నిత్యం తోడుకొంటూ వెళితే మిగిలేది శూన్యమనే విషయాన్ని ప్రభుత్వాలు ఎంత తొందరగా గ్రహిస్తే అంత మం చిది. భూవనరుల నిక్షేపాలను దుర్వి నియోగం చేయకుండా అరికట్టాలి.
సందు దొరికితే చాలన్నట్టు అక్రమార్కులు భూమిని కొల్లగొట్టడానికి ఎల్లవేళలా సంసి ద్ధులై ఉంటారు. ప్రభుత్వం ఇటువంటి వారి విషయంలో కఠినంగా వ్యవహరించకపోతే, వారి అవినీతి ఆగడాలకు అడ్డే లేకుండా పో తుంది. ప్రభుత్వంలో అవినీతిపరులు ఉండ టం వల్లనే అక్రమార్కుల ఆటలు సాగుతు న్నాయ.

- దాసరి కృష్ణారెడ్డి