ఉత్తరాయణం

వివక్ష తగదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇటీవల డిఎస్సీ పరీక్షా విధానంలో వికలాంగులకు వారికి కొన్ని స్థానాలను కేటాయించటంలో పక్షపాత వైఖరి కనిపిస్తున్నది. వికలాంగులకు నిర్ణీత సంక్షేమ పథకాల నిర్వహణ మరి ఉద్యోగ నియామక విధానాలు కేవలం చట్టాలకే పరిమితమైనాయ తప్ప, అమలుకు నోచడం లేదని స్పష్టవౌతోంది. ఇప్పటికైనా ఏ కులం వారైనప్పటికీ రిజర్వేషన్ సదుపాయమున్న వికలాంగులకు న్యాయం చేకూరుతుందా?
- కోవూరు వెంకటేశ్వరప్రసాదరావు, కందుకూరు
వౌలిక సదుపాయాల కొరత
నవ్యాంధ్ర రాష్ట్ర తలసరి ఆదాయంలో అతి తక్కువ కలిగిన ఉత్తరాంధ్రకు చెందిన శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో పారిశ్రామికీకరణకు వౌలిక సదుపాయాలు లేమి ఒక శాపంగా కనిపిస్తుంది. వెనుకబాటుతనంతోపాటు జరుగుబాటుతనం లేక వలసల అడ్డాగా ముద్రపడ్డ ఉత్తరాంధ్ర ప్రగతి సాధనకు, పెట్టుబడి వాతావరణ కల్పన, మార్కెట్ అభివృద్ధిలో లక్ష్యతీరాలు చేరాలంటే వౌలిక సదుపాయాభివృద్ధి విరివిగా అవసరం. పరిశ్రమలు, సేవారంగాలను మెరుగుపరచే విషయంలో వౌ లిక సదుపాయాలు గట్టి ప్రభావం చూపుతాయి. వ్యవసాయ పరిశ్రమలకు ప్రణాళికాబద్ధమైన వృద్ధికి రవాణా ప్రధాన సాధనం. ఉత్తరాంధ్రలో ఇంకా రైలుమార్గాలు మెరుగుపడవలసి వుంది. రహదారులు గ్రామీణ ప్రాం తాల్లో విస్తరించాలి. జలమార్గాలు లేవు. భువనపాడు, బారువా, కళింగపట్నం ఓడరేవుల నిర్మాణ విషయంలో ప్రకటనలకే పరిమితం కారాదు. సమాచార కమ్యూనికేషన్ ఇంకా గ్రామీణ ప్రాంతాలకు కొరతగా వుంది. చంద్రబాబు సర్కార్‌కు ఉత్తరాంధ్ర సమగ్రాభివృద్ధిపై చిత్తశుద్ధివుంటే వౌలిక సౌకర్యాలు మెరుగుపరచాలని మనవి.
- సనపల చంద్రశేఖర్, సంతబొమ్మాళి
రాజధాని మార్పిడికి తొందరేల?
రాజధాని మార్పిడికంత తొందరెందుకు? దుర్మార్గమైన రాష్ట్ర విభజన ఒప్పందం ప్రకారం హైదరాబాద్ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాజధానిగా వుండవచ్చు కదా? మొగ్గలోనే ఆంధ్ర రాష్ట్ర ప్రజలను దుఃఖసాగరంలో ముంచివేయాలా? ఆంధ్ర ప్రజలు పెంచి పెద్దచేసిన హైదరాబాద్‌ను కనీసం ఇంకా పది సంవత్సరాలైనా వారు రాజధానిగా భావిస్తూ సంతోషంగా వుండకూడదా? అతి త్వరలో హైదరాబాద్‌ను వదిలి వేయించాలనే ప్రయత్నం స్వార్థరాజకీయ నాయకుల కుట్ర..
- గోపాలుని శ్రీరామమూర్తి, వినుకొండ
మూడ్నాళ్ల ముచ్చట
సమాజ్‌వాది పార్టీ వారు బీదవానికి పది లక్షలు రూపాయలు, ఒక బంగారు కిరీటం ఇవ్వాలి. బిజెపికి దమ్ముంటే అయోధ్యలో మందిర నిర్మాణం చేపట్టాలని సమాజ్ వాది పార్టీ సవాలు విసిరింది. అందుకే అదు బదులుగా 10 లక్షలు, ఒక బంగారు కిరీటం యిస్తామని ఆశ చూపింది. అటువంటి తుచ్చమైన వాటికి బిజెపి ఆశించదు. రాబోవు కాలంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు బిజెపి ఆధీనంలోనికి వస్తాయి. అప్పుడు మందిర నిర్మాణం వాటంతట అవే జరుగుతాయి. సామ్రాజ్యాలు గతించాయ. సమాజ్‌వాది పార్టీ లెక్కలోనిది కాదు. ఇది మూడునాళ్ళ ముచ్చట మాత్రమే.
- అందా వెంకట సుబ్బన్న, మైదుకూరు
కల్యాణ మండపాలు ఏర్పాటుచేయాలి
అన్ని పూర్వ తాలూకా కేంద్రాల్లో కళ్యాణ మండపాలను ఏర్పాటుచేసేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం(టి.టి.డి) తగు చర్యలు తీసుకోవాలి. ప్రైవేటు కళ్యాణ మండపాల్లో పెళ్లిళ్లు తదితర శుభకార్యాలు నిర్వహించాలంటే పేదలకు, మధ్యతరగతి ప్రజలకు ఎంతో ఇబ్బందిగా ఉంది. రూ.10 వేల నుంచి రూ.80వేల వరకు 24గంటలకు గాను చెల్లించాల్సి వస్తోంది. టి.టి.డికి సమకూరుతున్నది ప్రజాధనమే. అలాంటప్పుడు వారి సంక్షేమంకోసం ఇలాంటి జనహిత కార్యక్రమాలను చేపట్టాలి. వీటిని నిర్మించడంవల్ల ఆదాయం కూడా సమకూరుతుంది. ప్రజలకు ఎంతోకొంత సేవ చేసినట్టవుతుంది. టి.టి.డి. ఈ దశలో అడుగులువేయాలి. కళ్యాణ మండపాల్లో ధార్మిక కార్యక్రమాలను నిర్వహించవచ్చు.
- వి.కొండలరావు, పొందూరు
ఆదరణ తగ్గిన ‘సనాతనం’
సనాతన ధర్మానికి నేడు ఆదరణ తగ్గింది. స్వాములు, బాబాలు అందరూ చెడ్డవారు కాదు. కానీ కొన్ని పేపర్లు, టీవీల్లో స్వాములు, బాబాలు, అవధూతలు విలాస పురుషుల్లా, వ్యసన పురుషుల్లా చూపిస్తున్నారు. ప్రతి మంచిలో చెడు వుంటుంది. అలాగే చెడులో మంచి వుంటుంది. ప్రతి హిందువు ఇంటిముందు తులసి మొక్క ఉండాలి. ఇంట్లో కనీసం వారానికి ఒకసారైనా ఇష్టదేవతాపూజ, కట్టుబొట్టు హిందు ధర్మం నిలబడడానికి దోహదం చేస్తాయి. ఈ సంప్రదాయాన్ని తల్లిదండ్రులు తమ పిల్లలకి చేరవేయాలి.
-వివేకానంద, విశాఖపట్నం