సంపాదకీయం

చిదంబర ‘విద్రోహం..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరుడు కట్టిన జిహాదీ బీభత్సకారిణి ఇస్రాత్ జహాను నిర్దోషిగా నిరూపించడానకి మాజీ దేశ వ్యవహారాల మంత్రి పళనియప్పన్ చిదంబరం కుట్ర చేయడం జాతీయ వైపరీత్యం. నేరస్థులు పాలకులుగా నిర్దోషులుగా ఏళ్ల తరబడి ‘చెలామణి కావడం’ వాస్తవానికి జరిగిన ఘోరమైన వక్రీకరణ. ఈ వక్రీకరణకు సూత్రధారి చిదంబరమన్నది ఇప్పుడు బయటపడిన నిజం! చిదంబరం జరిపిన దుశ్చర్యలో వివిధ నేరాలు ఇమిడి ఉన్నాయి. 2004లో ఇస్రాత్ జహాను ఎదురు కాల్పులలో గుజరాత్ పోలీసులు వధించారు. అప్పటినుంచి ఇప్పటి వరకు ఇస్రాత్‌ను అమాయకురాలైన నిర్దోషిగాను, ఆమెను వధించిన పోలీసులను హంతకులుగాను చిత్రీకరించడానికి జరిగిన మొత్తం కుట్రకు రూపకర్త చిదంబరం అన్నది ఇప్పుడు రట్టయిపోయిన గుట్టు! రెండవ శ్రేణి దూరవాణి తరంగాల కేటాయింపుల అవినీతిలో చిందంబరం గొంతు వరకు కూరుకుపోయి ఉన్నాడు. తన కుమారుడు కార్తి చిదంబరానికి అక్రమ ప్రయోజనం సాధించి పెట్టడానికి చిదంబరం అమలు జరిపిన వ్యూహం ఇప్పుడు బట్టబయలైపోయింది. ఇదంతా ఆర్థికపరమైన అవినీతి! కానీ ఇస్రాత్ వ్యవహారంలో చిదంబరం నిర్వహించిన దుష్టపాత్ర ముందు ఈ అవినీతి రూపం మరుగుజ్జు. ఇస్రాత్ వ్యవహారంలో చిదంబరం భారత రాజ్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు. సర్వోన్నత న్యాయస్థానానికి బుద్ధిపూర్వకంగా అబద్ధం చెప్పాడు. పాకిస్తాన్ తొత్తు అయిన ఇస్రాత్‌ను నిర్దోషిగా నిరూపించడానికి యత్నించడం ద్వారా దేశద్రోహానికి సైతం పాలుపడ్డాడు. ఇస్రాత్‌ను గుజరాత్ పోలీసులు అక్రమంగా చంపేశారన్న ఆరోపణ ప్రాతిపదికగా దాదాపు దశాబ్దిపాటు కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నాయకత్వంలోని అప్పటి గుజరాత్ ప్రభుత్వాన్ని దేశ విదేశాలలో అప్రతిష్ఠ పాలు చేయడానికి యత్నించింది. గుజరాత్‌లో ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని ఎన్నికలలో ఓడించడానికి రెండు దశాబ్దులుగా కాంగ్రెస్ విఫలయత్నం చేస్తోంది. కానీ రాజకీయ లబ్దికోసం సమష్టి జాతీయ హితాన్ని దేశ భద్రతను భగ్నం చేయడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వమే దశాబ్ది పాటు యత్నించిందన్నది ఇప్పుడు వెల్లడైపోయింది. ఈ ఇస్రాత్ జహా వ్యవహారంలో మొత్తం పదకొండు మంది అబద్ధాలు చెప్పినట్టు గురువారం మాధ్యమాలలో ప్రచారమైంది. ‘ఇస్రాత్ నిర్దోషి’ అన్న పచ్చి అబద్ధాన్ని నిజంగా నిలబెట్టడానికై జరిగిన ప్రక్రియ గత నెల 11న డేవిడ్ సి. హెడ్లీ ముంబయి ప్రత్యేక న్యాయస్థానానికి నివేదించిన సమాచారంతో వమ్మయిపోయింది. ఇస్రాత్ పాకిస్తానీ జిహాదీ ముఠా లష్కర్ ఏ తయ్యబా-ఎల్‌ఇటి-సభ్యురాలన్నది హెడ్లీ చేసిన ధ్రువీకరణ. కరడు కట్టిన జిహాదీ ఉగ్రవాది హెడ్లీ ఇప్పుడు అమెరికాలో కారాగార వాసం అనుభవిస్తున్నాడు. హెడ్లీ వెల్లడించిన సమాచారం ప్రకారం ఇస్రాత్ భయంకరమైన నిజ స్వరూపాన్ని బయటపెట్టింది. అలా బయటపడకుండా దాచినవాడు 2004వ 2014వ సంవత్సరాల నుండి కేంద్ర మంత్రిత్వం వెలగబెట్టిన చిదంబరం...
ఇస్రాత్‌ను మరో ముగ్గురు పాకిస్తాన్ తొత్తులను 2004 జూన్ 15న గుజరాత్ నేర పరిశోధక విభాగం పోలీసులు మట్టుబెట్టారు. అయితే కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ఉత్తరువుల మేరకు సిబిఐ వారు మొత్తం వ్యవహారాన్ని తల్లక్రిందులు చేశారు. హతులు నలుగురూ అమాయకులన్న ప్రచారం జరిగింది. మరోదశలో మిగిలిన ముగ్గురు టెర్రిస్టులనీ, ఇస్రాత్ మాత్రం అమాయకురాలని సిబిఐ వారు ఇతరులు ప్రచారం చేశారు. ఏమయినప్పటికీ అప్పటి గుజరాత్ ప్రభుత్వం ఇంటెలిజెన్స్ బ్యూరో-నిఘా విభాగం-ఐబి- పోలీసులు కలిసికట్టుగా ఇస్రాత్ బృందాన్ని హత్య చేశారన్నది సిబిఐ 2013 జూలైలో దాఖలు చేసిన అభియోగ పత్రంలోని సారాంశం. ఈలోగా అనేక నకిలీ ఎదురుకాల్పులను గుజరాత్ ప్రభుత్వం నిర్వహిచిందన్న దుష్ట ప్రచారం జరిగింది. 2002వ సంవత్సరం నుండి 2006వ సంవత్సరం వరకు జరిగిన నకిలీ ఎదురుకాల్పున్నింటిపై దర్యాపు జరుపవలసిందిగా సర్వోన్నత న్యాయస్థానం 2012, జనవరిలో ఆదేశించింది కూడ. దీని కంతటికీ కారణం ఇస్రాత్‌ను నిర్దోషిగా చిత్రీకరించడానికి కాంగ్రెస్ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు జరిపిన వ్యూహం. చిదంబరం ఈ వ్యూహకర్త. ఇస్రాత్‌ను చంపిన అభియోగం ప్రాతిపదికగా గుజరాత్‌కు చెందిన అనేక మంది పోలీసులపై సిబిఐ కేసులు నమోదు చేసింది, నిర్బంధించింది. గుజరాత్ పోలీసు అధికారి డిజి వంజారాను, మరికొందరిని గత ఏడాది ఫిబ్రవరి వరకు ఎనిమిదేళ్లపాటు నిర్బంధంలో ఉంచారు. ఇదంతా చిదంబరం జరిపించిన దురాగతమన్నది ఇప్పుడు ధ్రువపడింది.
ఈ ధ్రువీకరణకు ప్రాతిపదిక చిదంబరం 2009లో దేశ వ్యవహారాల మంత్రిగా ఉండిన సమయంలో ఆ మంత్రిత్వశాఖ కార్యదర్శిగా పనిచేసిన జి.కె. పిళ్లయి ఫిబ్రవరి 25న వెల్లడించిన వాస్తవాలు. హెడ్లీ చెప్పిన సాక్ష్యం తరువాత వాస్తవాలను ధ్రువీకరించడానికి జరుగుతున్న ప్రక్రియలో పిళ్లయి చెప్పిన సంగతులు భాగం. 2009లో కేంద్ర ప్రభుత్వం రెండు ప్రమాణ పత్రాలను దాఖలు చేసింది...2009 ఆగస్టులో దాఖలు చేసిన మొదటి ప్రమాణ పత్రం-అఫిడవిట్-లో ఇస్రాత్ జహా ‘లష్కర్’ ముఠా సభ్యురాలన్న వాస్తవాన్ని కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు నివేదించింది. అయితే నెలన్నర తరువాత 2009 సెప్టెంబర్ 23న దాఖలు చేసిన రెండవ అఫిడవిట్‌లో కేంద్ర ప్రభుత్వం మాట మార్చింది. ఇస్రాత్ లష్కర్ ఏ తయ్యబా ముఠా సభ్యురాలన్న వాస్తవాన్ని ఈ రెండవ ప్రమాణ పత్రం నుంచి తొలగించారు. ఈ రెండవ అఫిడవిట్‌ను చిదంబరం స్వయంగా రచించినట్టు జి.కె. పిళ్లయి ఇప్పుడు వెల్లడిస్తున్నాడు. ఈ రెండవ ప్రమాణ పత్రాన్ని రూపొందించడంలో తనను కాని, దేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ అధికారులను కాని చిదంబరం సంప్రదించలేదని పిళ్లయి వెల్లడించాడు. ఇలా సర్వోన్నత న్యాయస్థానానికి బుద్ధిపూర్వకంగా అబద్ధం చెప్పడం-పెర్జురీ- అన్న నేరానికి చిదంబరం ఒడిగట్టాడు. రాజ్యాంగ వ్యవస్థను పరిరక్షించగలమని ప్రమాణం చేసిన మంత్రి దేశ భద్రతకు విఘాతకరగా ప్రమాణ పత్రాన్ని రూపొందించి రాజ్యాంగాన్ని పదవీ ప్రమాణాన్ని ఉల్లంఘించాడు. ఇస్రాత్ దేశ ద్రోహి అన్న వాస్తవాన్ని కప్పిపుచ్చిన చిదంబరం ఆమె దుశ్చర్యను ఆమోదించాడు. ఇలా ఆమోదించడం దేశద్రోహం. ‘కర్తా కారయితా చైవ ప్రేరకాశ్చ అనుమోదకాః’...చేసిన వారు, చేయించినవారు, ప్రోత్సహించినవారు, ఆమోదించినవారు- వీరంతా సమాన నేరస్థులు. చిదంబరం దేశద్రోహ చర్యను ఆమోదించాడు. ప్రమాణ పత్రాన్ని మార్చడం ద్వారా!
చిదంబరంపై అభియోగాన్ని నమోదు చేసి నిర్బంధించి న్యాయ విచారణ జరిపే ప్రక్రియ తక్షణం ప్రారంభం కావాలి. ఇస్రాత్ వ్యవహారంతో నిందితులుగా న్యాయ విచారణ ప్రక్రియకు గురి అవుతున్న గుజరాత్ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగాలను రద్దు చేయాలన్న వినతి ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానంలో దాఖలై ఉంది. నిర్దోషులకు న్యాయ జరుగవచ్చు. దోషులను దండించడం కూడ అంతే ప్రధానం. ఇస్రాత్ ముఠా 2014లో అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని హత్య చేయడానికి విఫలయత్నం చేసిందన్నది హెడ్లీ సైతం వెల్లడించిన వాస్తవం. అలాంటి ముఠాను చిదంబరం సమర్థించాడు.