ఉత్తరాయణం

మేధస్సును వెలికి తీయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలగని తోడేలు పేరిట ప్రచురితమైన సంపాదకీయం ఎంతో ఆలోచనాత్మకంగా ఉంది. జమ్మూకశ్మీర్ సరిహద్దు ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్రవాదుల దాడులకు ఆస్తినష్టం ప్రాణనష్టం బాగా జరుగుతోంది. కేవలం ఊకదంపుడు ఉపన్యాసాలతో తీవ్రవాదుల దాడులను అరికట్టడం సాధ్యం కాదు. కార్యశీలత కావాలి. ఇటీవల చోటు చేసుకున్న వేముల రోహిత్ ఆత్మహత్య, దేశద్రోహానికి పాల్పడ్డాడన్న కారణంగా అరెస్టయిన కన్హయ్య కుమార్‌లపై దేశ ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. బతికుండగా రోహిత్ మేధస్సును గుర్తించని మేధావులు, ఆత్మహత్య చేసుకున్న తర్వాత అతడిని కీర్తిస్తున్నారు. రోహిత్ భావాలకు తగిన గుర్తింపు లభిస్తే అతను ఆత్మహత్య చేసుకునేవాడు కాదుకదా! రోహిత్‌లా గుర్తింపునకు నోచని మేధావులు లక్షల్లో ఉంటారు. ప్రతిభావంతులను గుర్తించి మీడియా ప్రజలకు తెలపాలి.
- ఇ.ఎస్. జగదీశ్వర్, నెల్లూరు
కుహనా లౌకికవాదులు స్పందించరేం?
కేరళలో ఆర్‌ఎస్‌ఎస్ కార్యకర్త సుజిత్‌పై సిపిఎం కార్యకర్తలు దాడి చేసి, దారుణంగా హత్య చేయడమే కాకుండా, సంఘ్ కార్యాలయంపై బాంబు దాడులకు పాల్పడడాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలి. మరి ఈ దారుణ సంఘటనపై కాంగ్రెస్, వామపక్షాలు, కుహనా లౌకిక సంస్థలు, జాతీయ మానవహక్కుల కమిషన్ ఇంతవరకు ఎందుకు స్పందించలేదో? దేశభక్తి, క్రమశిక్షణకు ప్రతీక ఆర్‌ఎస్‌ఎస్ అన్న సంగతి ప్రతి ఒక్కరికీ తెలిసిందే. దేశం పట్ల భక్తి భావంతో ఉండటమే సుజిత్ చేసిన నేరమా? దేశంలో లౌకికవాదం కేవలం కొందరికి మాత్రమే పరిమితమా? హింస అనేది ఎవరినైనా బాధించేదే కదా.
- వేదుల జనార్థన్ రావు, వంకావారి గూడెం
స్ర్తిల బోగీలకు ప్రత్యేక రంగు వేయాలి
ఇటీవల రైల్వేవారు ప్రవేశపెట్టిన మాతృభూమి లోకల్ రైలు లింగంపల్లి- నుండి ఫలక్‌నామా వరకు సదుపాయంగానే ఉంది. కాని అందులో రెండు బోగీలు మినహాయించి అన్నీ స్ర్తిలకే కేటాయించారు. హడావుడిగా పనుల మీద వెళ్లేవారు తెలియక రోజూవెళ్లే ఎంఎంటిఎస్ అనుకుని చూసుకోకుండా మహిళల బోగీల్లోకి ఎక్కి, హడావుడిగా దిగే సమయంలో పడిపోయి గాయాలపాలవుతున్నారు. స్ర్తిల బోగీలకు ప్రత్యేక రంగు వేస్తే, ఈ ఇబ్బంది ఉండదు కదా! అంతేకాదు ఈ రైలు ఎక్కడినుంచి ఎక్కడికి ప్రయాణిస్తున్నదో తెలిపే బోర్డులను స్పష్టంగా కనిపించేలా అమర్చాలి. దీనివల్ల ప్రయాణికులకు సౌకర్యంగా ఉండగలదు.
- చోడవరపు హనుమంతరావు, హైదరాబాద్
ఏ రాయి అయితేనేం...
ఏ రాయైతేనేం తల పగలకొట్టుకోవడానికి..అన్న చందంగా ఉంది నేటి యువత ధోరణి. భూమికలో, ‘యువత..ఇ-సిగరెట్‌కు బానిస’ పేరిట ప్రచురితమైన వ్యాసంలో యువత ధోరణులను చక్కగా వివరించారు. మనిషి ఆధునికత వైపునకు వెళుతున్నాడంటే అదేదో అభివృద్ధి సాధిస్తున్నాడని అనుకోకుండా అథఃపాతాళానికి వెళుతున్నాడని అనుకోవలసి వస్తున్నది. నిజమే కదా! తనకు తాను మనిషి మంచిగా నడచుకుంటే ప్రభుత్వం మాత్రం చెడగొడుతుందా?..ఆలోచించండి.
-ఎస్. మెహబూబ్, కర్నూలు
కాపుల్లో అధికులు పేదలే
ఆంధ్రప్రదేశ్ జనాభాలో కాపుల శాతం 38. వీరిలో మరి ధనికులు కేవలం ఒక్కశాతం మాత్రమే. ఈ సత్యాన్ని ‘కులచిచ్చు రూపుమాపేదెన్నడో’ పేరిట లేఖ రాసిన పాఠకుడు గుర్తించాలి. నిజానికి కాపులు ఏనాడూ ఎవరికీ హాని తలపెట్టిన వారు కాదు. వ్యవసాయంపై ఆధారపడి జీవనం వెళ్లబుచ్చుతున్నారు. ఒకనాటి నాయుడుగార్లు నేడు లేరు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టలేని నిజాయతీ అయిన వారు కాపులు. కృష్ణదేవరాయలు వారసులైనంత మాత్రాన వీరేం ధనికులు కాదు. కావాలంటే సర్వే చేయం డి. ఎంతమంది ధనవంతులో తేలుతుంది.
- బండి సరోజిని, అత్తిలి
కనువిప్పు కలిగించిన వ్యాసం
‘ఎవరి అజెండా వారిది’ శీర్షికన గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు రచించిన వ్యాసం ఉన్నత ఆశయాలతో అలరారుతోంది. ఇలాంటి కనువిప్పు కలిగించే వ్యాసాలు ప్రచురించడం శుభకరం. ఇవి ప్రజల్లో చైతన్యాన్ని తీసుకువస్తాయి. ఇంత చక్కగా విశే్లషించిన సుబ్రహ్మణ్య దీక్షితులు అభినందనీయులు.
- పి. ఆంజనేయ ప్రభు, నెల్లూరు
అడిగే నాథుడు లేడు
విశాఖ సిటీనుంచి శివారు పారిశ్రామిక గ్రామాలు, కాలనీలను కలుపుతూ ఇరుకు రోడ్లను భారీగా 80 అడుగుల మేర విస్తరిస్తూ నిర్మాణ పనులు జోరుగా సాగుతున్నాయి. ఇదివరలో ఒక పక్క ఒక బస్సు కదలాలన్నా ఇబ్బందిగా వుండేది. ఇవాళ రెండు భారీ వాహనాలు ఒకే వరసగా పోగల విస్తీర్ణం కనబడుతున్నది. కానీ ఏడాదిలోగా దాని రూపురేఖలు ఏవిధంగా మారనున్నాయో తల్చుకుంటే గుబులు కలుగుతుంది. ఏటా జరిగే అన్ని పండగలు, ఉత్సవాలు నవరాత్రి సంబరాలు స్టేజిషోలకి ప్రధమంగా కనిపించేవి ఈ రహదార్లే. ఇవే కాకుండా పెళ్లిళ్లకి, పుట్టినరోజుల పండుగలకి పార్టీ మీటింగులకు చావులకి బలయ్యేవి ఈ రోడ్లే. ఎన్ని ఎక్కువ గుంతలు తవ్వితే ఎంత భారీ స్టేజి, షామియానాలు కడితే అంత గొప్ప. అడిగే నాధుడు లేడు.
-తాళాబత్తుల సత్యనారాయణమూర్తి, మల్కాపురం