ఉత్తరాయణం

సామాన్యులకు ఏంటి లాభం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ పరిశ్రమలకు పెద్దపీట వేస్తున్నారు. మనదేశం వ్యవసాయ దేశం అని మరిచిపోయారు. వ్యవసాయం అభివృద్ధి చెందకపోతే దేశం అభివృద్ధి, పరిశ్రమల అభివృద్ధి కుంటుపడుతుందనే విషయం మరిచారు. దేశ ప్రజల దైన్య స్థితిని మరిచిపోయారు. ఈ ప్రభుత్వాలు రెండు వచ్చిన తర్వాత ఎన్నికల హామీలు మరిచి ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇకనైనా వ్యవసాయ అభివృద్ధికి, రైతు సమస్యలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ముఖ్యంగా రైతుల రుణమాఫీ, డ్వాక్రా సంస్థల రుణ మాఫీ, నిరుద్యోగుల ఉద్యోగత, మధ్యతరగతి ప్రజలపై భారం మోపే పన్నులను పెంచకుండా చూడాలి. రెండు ప్రభుత్వాల వల్ల సామాన్య ప్రజలు, రైతులు ఇంతవరకు ఎటువంటి లాభం పొందలేదు. అరచేతిలో స్వర్గం చూపిస్తున్నారు. అందువల్లనే ప్రభుత్వాలు రైతులు, సామాన్యులకు అను గుణమైన చర్యలు తీసుకోవాలి. ఎన్నికల్లో ఇచ్చే హామీలు పేదలకు, సామాన్యులకు అనుకూలంగా ఉంటాయ. అధికారంలోకి వచ్చాక ఎవరూ పట్టించుకోరు.
-ఈశ్వర్, పొద్దుటూరు, కడప జిల్లా
భక్తి వ్యాపారం కాదు
నేడు చాలా హిందూ టీవీ చానల్స్ వ్యాపార ధోరణితో వున్నాయి. అగరబత్తులు, దీపం నూనె, పూజసామగ్రి లాంటి ప్రకటనలు ఇస్తు దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నాయి. ప్రేక్షకులకి భక్తి ఎలా కలుగుతుంది. భక్తి అంటే చాలా శక్తివంతమైంది. కనబడినవారిని నమ్మవచ్చు. చెప్పేవారు మంచివారైతే నమ్మవచ్చు. కానీ కంటికి కనపడని వారిని గట్టిగా నమ్మడం భక్తి. భక్తి వ్యాపారం కాదు. ధూప దీప నైవేద్యాలు సమర్పించడం అర్చనకిందకి వస్తుంది. అలాగే భక్తి చానల్స్ యంత్రాలు, తాయెత్తులపై యాడ్స్ ఇవ్వరాదు.
-కె.వి.కుమారి, విశాఖపట్నం
దెబ్బతింటున్న వివాహ వ్యవస్థ
ప్రపంచంలోకెల్లా అతి సనాతనమైంది ధర్మ సమ్మతమైంది అసంఖ్యాక మహర్షులు, దేవతలు ఆచరించి మనకు ఆదర్శప్రాయంగా నిలిచిన వివాహ వ్యవస్థ ప్రస్తుతం పాశ్చాత్య నాగరికతా వేలం వెర్రి కారణంగా భ్రష్టుపట్టిపోతోంది. సీతారాములు, శివపార్వతులు, రుక్మిణీ కృష్ణులు, అత్రి అనసూయలు ఆదర్శప్రాయమైన దాంపత్య జీవన విధానాన్ని భారతీయులకు అందించి ఎంతో మేలు చేసారు. భార్యాభర్తల అన్యోన్యత, ఒకరి కష్టసుఖాల్లో మరొకరు పాలు పంచుకుని కలిసి మెలసి వుండాలన్న సందేశం మనకు అర్ధనారీశ్వర తత్వం ద్వారా అవగతమవుతోంది. ఆ సనాతన సంప్రదాయాలన్నింటినీ నీళ్లొదలి స్వేచ్ఛ జీవితం స్వాతంత్య్రం పేరిట నేటి యువతరంలో అధిక శాతం విచ్చలవిడితనం ప్రదర్శిస్తున్నారు. పెళ్లి కాకుండానే సహజీవనం పేరిట వ్యభిచారానికి పాల్పడుతున్నారు. ఇక పెళ్లయ్యాక ప్రతి క్షణం ఆధిపత్యం కోసం ఆరాటం, హక్కులకోసం పోరాటం జరుపుతూ అన్యోన్యత అనురాగం, ప్రేమానురాగాలకు నీళ్లు వదిలి జీవితాలను నరకప్రాయం చేసుకుంటున్నారు. విడాకుల సంఖ్య దేశంలో గత అయిదేళ్లలో విపరీతంగా పెరిగిపోయాయన్న గణాంకాలు భారతదేశంలో బీటలు వారుతున్న వివాహ వ్యవస్థకు సాక్ష్యంగా నిలుస్తోంది. నేటి యువతరానికి మన భారతీయ వివాహ వ్యవస్థ పట్ల అవగాహన కల్పించాల్సిన బాధ్యత తల్లిదండ్రులు, మేధావులు, మీడియావారు విస్మరించడం వలనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అదేచిన్న తనం నుంచి పిల్లల్లో ధర్మాధర్మ విచక్షణా జ్ఞానాన్ని బోధించడం, నీతి నియమాలు, నైతిక నిష్ట వంటివి బోధిస్తే వ్యవస్థ ఇంతగా దెబ్బతినదు.
-ఎం.కనకదుర్గ, ఎం.ఎస్.పాలెం, తెనాలి
హిందూ మతాన్ని కాపాడుకోవాలి
మతం అనేది దేశ నాగరికతలో, చట్టాల్లో ప్రతిబింబిస్తుంది. ఏ దేశమైనా వారి చట్టాలు, శాసనాలు, మత గ్రంధాలపైనే ఆధారపడతాయి. అయితే భారతదేశంలో హిందూమతంపై నాగరికత ఆధారపడి ఉంది. అతిథిని పూలమాల వేసి ఆహ్వానించడం ఎందుకంటే అతిథి దేవునితో సమా నం. ప్రకృతిని పూజ చేయడం, నలుగురికీ సాయం చేయడం ఇవన్నీ హిందు ధర్మ గ్రంథాల్లో ఉన్నాయి. ఎవరి మతం వారు అనుసరించాలి. ప్రలోభాలకి లొంగి మతమార్పిడులు చోటుచేసుకోకూడదు. భారతదేశంలో వివిధ మతాలుండవచ్చు. అన్యమతస్తులు గౌరవిస్తూ హిందుమతాన్ని ఆచరించాలి. కొన్ని హిందు సంస్థలు హిందుమతాన్ని కాపాడలేకపోతున్నాయి. మన ధర్మం పట్ల నిర్లక్ష్య వైఖరి కూడదు. ధర్మ మార్గమే సర్వదా శ్రేయస్కరం.
-వి.వివేక్, కంచరపాలెం