ఢిల్లీ కబుర్లు -కె.కైలాష్

ఇషత్ జెహాన్‌పై శే్వతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశ ప్రయోజనాల దృష్టా ఇస్రత్ జెహాన్ మొత్తం వ్యవహారాన్ని నిగ్గు తేల్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉన్నది. గత వారం, పది రోజుల నుండి ఇస్రత్ జెహాన్ ఎన్‌కౌంటర్ వ్యవహారంపై ఇస్లామిక్ ఉగ్రవాది డేవిత్ హాడ్లీ, హోం శాఖ మాజీ కార్యదర్శి పిళ్లై, హోం శాఖ మాజీ మంత్రి పి.చిదంబరం, ఐ.బి మాజీ సీనియర్ అధికారి రాజేంద్ర కుమార్, సి.బి.ఐ సీనియర్ అధికారులు ముఖ్యంగా యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ అధికారులు,సిట్ అధికారులపై ఇంటలిజెన్స్ బ్యూరోకు చెందిన చెందిన మాజీ అధికారులు చేసిన ఆరోపణలు, ప్రత్యారోపణలు చూస్తుంటే ఒక దశలో యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాల కోసం తమ రాజకీయ ప్రయోజనాల కోసం దేశ భద్రతను పణంగా పెట్టిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
రాజకీయ ప్రత్యర్థి, గుజరాత్ అప్పటి ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని రాజకీయంగా దెబ్బ తీసేందుకు ఇస్రత్ జెహాన్ ఎన్‌కౌంటర్‌ను యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం దుర్వినియోగం చేయటంతోపాటు తమ లక్ష్య సాధన కోసం సి.బి.ఐ చేత ఐ.బి సీనియర్ అధికారులను వేధింపులకు గురి చేసినట్లు వస్తున్న ఆరోపణలు ఎంతో తీవ్రమైనవి. చిదంబరం యు.పి.ఏ రాజకీయ ప్రయోజనాల కోసం ఇస్రత్ జెహన్‌కు లష్కరే తయ్యబాతో ఉన్న సంబంధాలను దాచేందుకు ప్రయత్నించటం, రెండవ అఫిడవిట్‌లో ఇస్రత్ జెహాన్‌కు ఎల్.ఇ.టితో ఉన్న సంబంధాలకు సంబంధించిన సమారాన్ని తొక్కిపెట్టటం అత్యంత తీవ్రమైన అంశం. ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా మహిళా విభాగం సభ్యురాలు అయినప్పటికీ ఈ అంశాన్ని తొక్కిపెట్టటం దేశ ద్రోహంతో సమానమైన నేరం. ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా సభ్యురాలు అవునా? కాదా? గుజరాత్ పోలీసులు అమెను నిజంగానే ఎన్‌కౌంటర్ చేశారా? లేక ఎన్‌కౌంటర్ బూటకమా? ఇస్రత్ జెహాన్ వ్యవహారంపై సుప్రీం కోర్టులో యు.పి.ఏ ప్రభుత్వం దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఇస్రత్ జెహాన్ లష్కరె తయ్యబా తీవ్రవాది అనే అంశాన్ని తొలగించటంలో అప్పటి హోం శాఖ మంత్రి పి.చిదంబరం పాత్ర ఏమిటి? అనేది తేల్చవలసిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిది.
లష్యరే తయ్యబా సభ్యులను కాపాడేందుకు యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వంలోని పెద్దలెవరైనా ప్రయత్నించారా అనేది తేల్చటం దేశ ప్రయోజనాల దృష్టా ఎంతో అవసరం. ఇస్రత్ జెహాన్‌తోపాటు ఇద్దరు పాకిస్తాన్ దేశస్తులు జేషాన్ జోహార్, ఆంజద్ అలీ, ఒక భారతీయుడు జావేద్ షేక్‌ను గుజరాత్ పోలీసులు అహమ్మదాబాద్ సమీపంలో ఎన్‌కౌంటర్ చేయటం తెలిసిందే. నరేంద్ర మోదీని హత్య చేసేందుకు లష్యరే తయ్యబా ఇద్దరు ఉగ్రవాదులను భారతదేశానికి పంపించటం, వారు ఇక్కడ ఇస్రత్ జెహాన్, జావేద్ షేక్‌తో కలిసి పథకం వేశారన్నది ఇంటిలిజెన్స్ బ్యూరో కథనం. ఐ.బి పంపించిన ఈ రహష్య సమాచారం మేరకే గుజరాత్ పోలీసులు ఈ నలుగురిని అహమ్మదాబాద్‌కు సమీపంలో ఎన్‌కౌంటర్ చేశారన్నది గుజరాత్ ప్రభుత్వం వాదన. ప్రస్తుతం అమెరికా జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఎల్.ఇ.టి ఉగ్రవాది డేవిడ్ హాడ్లీని జాతీయ దర్యాప్తుసంస్థ ఇటీవల జరిపిన విచారణలో ఇస్రత్ జెహాన్ ఎల్.ఇ.టి ఉగ్రవాది అని చెప్పటంతో ఈ వ్యవహారం మరో సారి వెలుగులోకి వచ్చింది. జాతీయ దర్యాప్తు సంస్థ యు.పి.ఏ హయాంలో డేవిడ్ హ్యాడ్లీని విచారించినప్పుడు కూడా ఆయన ఈ విషయాన్ని చెప్పినా తొక్కిపెట్టినట్లు ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. డేవిడ్ హ్యాడ్లీ చెప్పినదాని కంటే హోం శాఖ మాజీ కార్యదర్శి పిళ్లై చేసిన ప్రకటన ఇస్రత్ జెహాన్ వ్యవహారాన్ని కుదిపివేసింది. ఇస్రత్ జెహాన్ వ్యవహారంపై మొదటిసారి కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్‌లో ఆమెకు లష్కరే తయ్యబాతో సంబంధాలు ఉన్నాయని చెప్పిన అప్పటి యు.పి.ఏ ప్రభుత్వం తరువాత ఈ అఫిడవిట్ అసమగ్రంగా ఉందంటూ దాని స్థానంలో దాఖలు చేసిన రెండో అఫిడవిట్‌లో ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా సంబంధాల అంశాన్ని తొలగించింది.
అప్పటి హోం శాఖ మంత్రి పి.చిదంబరం ఆదేశాల మేరకే రెండో అఫిడ్‌విట్‌లో ఇస్రత్ జెహాన్‌కు లష్కరే తయ్యబాతో ఉన్న సంబంధాల వివరాలను తొలగించారంటూ హోం శాఖ మాజీ అధికారులు చేసిన ప్రకటనలు మొత్తం పరిస్థితిని తారుమారు చేశాయి. రెండో అఫిడ్‌విట్‌లో ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా సంబంధాలను ప్రస్తావించకుండా ఉండటానికి తనతోపాటు పిళ్లై కూడా సమంగా బాధ్యత వహించాలని చిదంబరం తాజాగా చేసిన ప్రకటన పరిస్థితిని మరింత జఠిలం చేసింది. అఫ్జల్ గురు ఉరి విషయంలో కూడా చిదంబరం వివాదాస్పద ప్రకటన చేశారు. ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా ఉగ్రవాది అనే నివేదికను ఇచ్చిన ఇంటలిజెన్స్ అధికారులను సి.బి.ఐ అధికారులు వేధించినట్లు వచ్చిన ఆరోపణలు ఈ కేసు రూపులేఖలను మార్చివేస్తున్నాయి. ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా ఉగ్రవాది అనే సమాచారాన్ని ఇంటలిజెన్స్ బ్యూరో గుజరాత్ ప్రభుత్వానికి అందజేసిన అధికారులను యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం వేధింపులకు గురి చేసిందన్నది ప్రధాన ఆరోపణ.
ఇస్రత్ జెహాన్ ఎన్‌కౌంటర్ వ్యవహారంపై అప్పటి యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం సి.బి.ఐ చేత దర్యాప్తు చేయించటం తెలిసిందే. యు.పి.ఏ సంకీర్ణ ప్రభుత్వం అధినేతల ఆదేశం మేరకు సి.బి.ఐ అధికారులు ఇస్రత్ జెహాన్ లష్కరే తయ్యబా ఉగ్రవాది అంటూ నివేదిక ఇచ్చిన ఇంటలిజెన్స్ అధికారులను వేధించారన్నది ప్రధాన ఆరోపణ. సి.బి.ఐ అధికారులు ఇస్రత్ జెహాన్ ఎన్‌కౌంటర్‌ను భూటకపు ఎన్‌కౌంటర్‌గా నిరూపించటం ద్వారా అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీని ఇరికించేందుకు ప్రయత్నించారన్నది మరో అభియోగం. ఇవన్నీ దేశ ప్రయోజనాలు దెబ్బ తీస్తాయి. ఇంటలిజెన్స్ బ్యూరోపై సి.బి.ఐ చేత దర్యాప్తు చేయించటం కూడా అత్యంత తీవ్రమైన అంశం. అందుకే దేశ భద్రత దృష్టా ఈ వ్యవహారంపై నిశ్పక్షపాత దర్యాప్తు జరిపింది నింధితులు ఎంత పెద్ద వారైనా శిక్షించాలి.